కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సరైనది ఎందుకు చేయాలి?

సరైనది ఎందుకు చేయాలి?

సరైనది ఎందుకు చేయాలి?

“మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను” అని ఒక విద్యావంతుడు అన్నాడు. ఆయన తాను చేయాలనుకున్న మేలును ఎందుకు చేయలేకపోతున్నాడు? “మేలు చేయ గోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగపురుషునిబట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది” అని ఆయన వివరించాడు.​—⁠రోమీయులు 7:​18, 19, 21-23.

సుమారు 2000 సంవత్సరాల క్రితం అపొస్తలుడైన పౌలు వ్రాసిన ఆ మాటలు, అపరిపూర్ణ మానవులకు సరైనది చేయడం ఎందుకు కష్టమో వివరిస్తున్నాయి. నీతియుక్తమైన సూత్రాలకు అంటిపెట్టుకుని ఉండడం కష్టం, ప్రత్యేకంగా కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు అలా అంటిపెట్టుకుని ఉండేందుకు నైతిక బలం అవసరం. కాబట్టి, ‘సరైనది చేయడానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఏమిటి?’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం మంచిది.

నైతికంగా నీతిమంతులుగా జీవించేవారికి భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయం గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయో గమనించండి. కీర్తన 37:​37, 38లో మనమిలా చదువుతాం: “నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును.” సామెతలు 2:​21, 22 ఇలా చెబుతోంది: “యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.”

దేవుణ్ణి సంతోషపరిచే విధంగా నడుచుకోవడానికి బైబిల్లోని ఈ వాగ్దానాలతోపాటు, మరితర వాగ్దానాలు మనకు ఒక కారణాన్ని ఇస్తున్నా, మనమలా నడుచుకునేందుకు అది ప్రధాన కారణం కాదు. ఆ కారణం తెలివిగల ప్రాణులన్నీ వ్యక్తిగతంగా ఇమిడివున్న వివాదాంశానికి సంబంధించినది. తర్వాతి ఆర్టికల్‌ ఆ వివాదాంశమేమిటో, అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో చర్చిస్తుంది.