సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని అనుభవించడానికి బైబిలు నాకు సహాయం చేస్తుందా?
బైబిలు ఇచ్చే జవాబు
అవును సహాయం చేస్తుంది. కుటుంబంలో సంతోషాన్ని అనుభవించడానికి లక్షలమంది స్త్రీపురుషులకు సహాయం చేసిన బైబిల్లోని జ్ఞానయుక్తమైన ఈ సలహాల్లో కొన్నిటిని గమనించండి:
మీ పెళ్లిని చట్టబద్ధం చేసుకోండి. పెళ్లిని చట్టబద్ధం చేసుకుని జీవితాంతం ఒకరితో ఒకరు కలిసి ఉండడం కుటుంబ సంతోషానికి కీలకమైన విషయం.—మత్తయి 19:4–6.
ప్రేమను, గౌరవాన్ని చూపించుకోండి. మీ భర్త/భార్య మీతో ఎలా ప్రవర్తించాలని మీరు ఇష్టపడతారో, మీ భర్త/భార్యతో మీరూ అలాగే ప్రవర్తించండి.—మత్తయి 7:12; ఎఫెసీయులు 5:25-27, 33.
కఠినంగా మాట్లాడకండి. మీ భర్త/భార్య మిమ్మల్ని నొప్పించేవిధంగా మాట్లాడినా, ప్రవర్తించినా మీరు దయగా మాట్లాడండి. (ఎఫెసీయులు 4:31, 32) సామెతలు 15:1 లో బైబిలు చెప్తున్నట్లుగా, “మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.”
ఒకరికొకరు నమ్మకంగా ఉండండి. మీ ప్రేమను, లైంగిక కోరికలను కేవలం మీ భర్త/భార్యకు మాత్రమే కేటాయించండి. (మత్తయి 5:28) బైబిలు ఇలా చెప్తుంది: “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను.”—హెబ్రీయులు 13:4.
మీ పిల్లలకు ప్రేమతో శిక్షణనివ్వండి. చూసీచూడనట్టుగా ప్రవర్తించకండి, కఠినంగా ప్రవర్తించకండి.—సామెతలు 29:15; కొలస్సయులు 3:21.