కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వ్యక్తిగత బైబిలు అధ్యయనం నుండి మరింత ప్రయోజనాన్ని, ఆనందాన్ని ఎలా పొందవచ్చు?

వ్యక్తిగత బైబిలు అధ్యయనం నుండి మరింత ప్రయోజనాన్ని, ఆనందాన్ని ఎలా పొందవచ్చు?

ఇశ్రాయేలు జనాంగాన్ని వాగ్దాన దేశంలోకి నడిపించే పెద్ద బాధ్యత యెహోషువపై ఉంది. అది చాలా కష్టంతో కూడిన పని. అందుకే యెహోవా యెహోషువను బలపర్చి, ఇలా ప్రోత్సహించాడు: ‘నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు.’ అంతేకాదు ధర్మశాస్త్రాన్ని చదివి, దాన్ని పాటిస్తే యెహోషువ తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతాడని, ఇచ్చిన నియామకంలో విజయం సాధిస్తాడని యెహోవా చెప్పాడు.—యెహో. 1:7, 8.

మనం ‘ప్రమాదకరమైన, కష్టమైన కాలాల్లో’ జీవిస్తున్నాం. కాబట్టి ఎన్నో పెద్దపెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాం. (2 తిమో. 3:1) అయితే యెహోషువలాగే మనం కూడా వాటిలో విజయం సాధించాలంటే యెహోవా ఇచ్చిన సలహాను పాటించాలి. అంటే ప్రతీరోజు బైబిలు చదవాలి, నేర్చుకున్న వాటిని పాటిస్తూ మంచి నిర్ణయాలు తీసుకోవాలి.

మనలో కొంతమందికి బైబిలు అధ్యయనం ఎలా చేయాలో తెలియకపోవచ్చు లేదా దాన్ని ఆనందించలేకపోవచ్చు. కానీ వ్యక్తిగత బైబిలు అధ్యయనం చాలా ప్రాముఖ్యం. అందుకే,  “ఈ సలహాల్ని ప్రయత్నించి చూడండి” అనే బాక్సును పరిశీలించండి. మీ వ్యక్తిగత బైబిలు అధ్యయనం నుండి మరింత ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందడానికి సహాయం చేసే సలహాలు అందులో ఉన్నాయి.

“నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దానియందు నన్ను నడువజేయుము” అని కీర్తనకర్త పాడాడు. (కీర్త. 119:35) మీరు కూడా దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు. అలా ప్రతీరోజు బైబిలు చదువుతూ ఉంటే ఎన్నో ఆధ్యాత్మిక రత్నాలను కనుగొంటారు.

యెహోషువలా మీరు ఒక జనాంగాన్ని నడిపించాల్సిన అవసరం రాకపోవచ్చు. కానీ జీవితంలో మీకు ఎన్నో సవాళ్లు ఎదురౌతుంటాయి. కాబట్టి యెహోషువలాగే దేవుని వాక్యాన్ని చదివి, దాన్ని పాటించండి. అప్పుడు తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు, విజయం సాధిస్తారు.