అధ్యయనం చేయడానికి ఐడియాలు
ఒత్తిడిలో కూడా ధైర్యం చూపించండి
యిర్మీయా ప్రవక్త అలాగే ఆస్థాన అధికారియైన ఎబెద్మెలెకు చూపించిన ధైర్యం నేర్పే పాఠాల కోసం యిర్మీయా 38:1-13 చదవండి.
సందర్భాన్ని లోతుగా తవ్వండి. యెహోవా చెప్పిన సందేశాన్ని ప్రజలకు చెప్పడానికి యిర్మీయాకు ధైర్యం ఎందుకు అవసరమైంది? (యిర్మీ. 27:12-14; 28:15-17; 37:6-10) ప్రజల స్పందన ఏంటి?—యిర్మీ. 37:15, 16.
వివరాల్ని లోతుగా తవ్వండి. యిర్మీయాకు వచ్చిన ఒత్తిడి ఏంటి? (mwbr17.4) బైబిలు కాలాల్లో గోతుల గురించి మీరేం తెలుసుకోవచ్చో ఆలోచించండి. (it-1-E 471) బురద గోతిలో ఉన్నప్పుడు యిర్మీయాకు ఎలా అనిపించి ఉంటుంది? ఎబెద్మెలెకు ఎలాంటి భయాలతో పోరాడాల్సి వచ్చింది?—w07 2/1 18 ¶6.
ఏం నేర్చుకున్నారో ఆలోచించండి. ఇలా ప్రశ్నించుకోండి:
-
‘యెహోవా తనకు నమ్మకంగా ఉన్నవాళ్లను కాపాడతాడని యిర్మీయా కథ ఎలా చూపిస్తుంది?’ (కీర్త. 97:10; యిర్మీ. 39:15-18)
-
‘నేను ధైర్యం చూపించాల్సిన పరిస్థితులు ఏంటి?’
-
‘నాకు ఒత్తిడి వచ్చినా, సరైనది చేయడానికి ధైర్యం ఎలా కూడగట్టుకోవచ్చు?’ (wp11 3/1 30) a
a ఇంకొన్ని ఐడియాల కోసం 2023, జూలై కావలికోట పత్రికలో వచ్చిన “అధ్యయనం కోసం చిట్కా” చూడండి.