కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఈ సంవత్సరపు కావలికోట పత్రికలను జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు జవాబు ఇవ్వగలరేమో చూడండి:

అభిషిక్త క్రైస్తవుల్ని మనమెలా చూడాలి?

మనం వాళ్ల విశ్వాసాన్ని ఆదర్శంగా తీసుకుంటాం; కానీ వాళ్లకు అనవసరమైన అవధానం ఇవ్వం, వాళ్లను అతిగా అభిమానించం. (యూదా 16) వాళ్ల నిరీక్షణకు సంబంధించిన విషయాలు చెప్పమని అడగం.—w20.01, 29వ పేజీ.

యెహోవా మిమ్మల్ని వ్యక్తిగతంగా గమనిస్తాడని మీరెందుకు నమ్మవచ్చు?

మీరు పుట్టకముందే యెహోవా మిమ్మల్ని గమనించాడని బైబిలు చెప్తుంది. ఆయన మీ ప్రార్థనలు వింటాడు. మీరేం ఆలోచిస్తున్నారో, మీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. మీ పనులు ఆయన్ని సంతోషపెట్టవచ్చు లేదా బాధపెట్టవచ్చు. (1 దిన. 28:9; సామె. 27:11) ఆయన మిమ్మల్ని తనవైపుకు ఆకర్షించుకున్నాడు.—w20.02, 12వ పేజీ.

మనం ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి?

మనం యెహోవా గురించి మాట్లాడడానికి ఇష్టపడతాం. ఎవరైనా తప్పు చేసే దిశగా వెళ్తున్నారని గమనించినప్పుడు మనం మాట్లాడతాం. ఎవరికైనా సలహా ఇవ్వాల్సి వచ్చినప్పుడు పెద్దలు మాట్లాడతారు. నిషేధం ఉన్న దేశాల్లో మన పని గురించిన వివరాలు అడగం (లేదా చెప్పం). రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని ఇతరులకు చెప్పం.—w20.03, 20-21 పేజీలు.

యోవేలు 2వ అధ్యాయంలోని మిడతలకు, ప్రకటన 9వ అధ్యాయంలోని మిడతలకు మధ్య తేడాలేంటి?

యోవేలు 2:20-29 ప్రకారం మిడతల్ని దూరంగా వెళ్లగొడతానని, వాటి వల్ల కోల్పోయిన పంటను ‘మళ్లీ ఇస్తానని,’ ఆ తర్వాత తన పవిత్రశక్తిని కుమ్మరిస్తానని యెహోవా మాటిచ్చాడు. బబులోను సైన్యం ఇశ్రాయేలు మీద దాడిచేసిన సమయంలో, అలాగే ఆ తర్వాతి కాలంలో ఆ మాటలు నెరవేరాయి. ప్రకటన 9:1-11 లోని మిడతలు మన కాలంలోని అభిషిక్త క్రైస్తవుల్ని సూచిస్తున్నాయి. వాళ్లు ఈ దుష్టలోకం మీద దేవుని తీర్పుల్ని ధైర్యంగా ప్రకటిస్తారు. ఆ తీర్పులు లోకానికి మద్దతిచ్చేవాళ్లను చాలా ఇబ్బంది పెడతాయి.—w20.04, 3-6 పేజీలు.

నేడు ఉత్తర రాజు ఎవరు?

రష్యా-దానికి మద్దతిచ్చే దేశాలు. ఆ దేశాలు ప్రకటనా పనిని నిషేధించడం ద్వారా, సాక్షుల్ని హింసించడం ద్వారా దేవుని పజల మీద దాడి చేస్తున్నాయి. అవి దక్షిణ రాజుతో పోటీ పడుతున్నాయి.—w20.05, 13వ పేజీ.

గలతీయులు 5:22, 23లో ఉన్న తొమ్మిది లక్షణాలు మాత్రమే పవిత్రశక్తి పుట్టించే లక్షణాలా?

కాదు. నీతి వంటి ఇతర మంచి లక్షణాల్ని అలవర్చుకోవడానికి కూడా పవిత్రశక్తి సహాయం చేస్తుంది. (ఎఫె. 5:8, 9)—w20.06, 17వ పేజీ.

సోషల్‌ మీడియాలో ఫోటోలు, కామెంట్లు పెట్టడం వల్ల వచ్చే ఒక ప్రమాదం ఏంటి?

మీరు పెట్టే ఫోటోలు, కామెంట్ల వల్ల అవతలి వాళ్లు మిమ్మల్ని వినయస్థులని అనుకోరు గానీ, మీరు గొప్పలు పోతున్నారని అనుకోవచ్చు.—w20.07, 6-7 పేజీలు.

నైపుణ్యంగల జాలర్ల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

వాళ్లు చేపలు ఎక్కువగా దొరికే సమయాల్లో, చోట్లలో చేపలు పడతారు; సరైన పనిముట్లను ఉపయోగిస్తారు; వాతావరణ పరిస్థితులు మారినా ధైర్యంగా పనిచేస్తారు. పరిచర్యలో మనం వాళ్లను అనుకరించవచ్చు.—w20.09, 5వ పేజీ.

యెహోవా మీద ప్రేమ పెంచుకునేలా బైబిలు విద్యార్థులకు సహాయం చేయడానికి మనం చేయగల కొన్ని పనులేంటి?

రోజూ బైబిలు చదవమని, చదివిన వాటిని ధ్యానించమని మనం ప్రోత్సహించవచ్చు. అంతేకాదు ఎలా ప్రార్థించాలో వాళ్లకు నేర్పించవచ్చు.—w20.11, 4వ పేజీ.

“క్రీస్తు వల్ల అందరూ బ్రతికించబడతారు” అన్నప్పుడు పౌలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు?—1 కొరిం. 15:22.

మనుషులందరూ పునరుత్థానం అవుతారని అపొస్తలుడైన పౌలు చెప్పట్లేదు. బదులుగా, ‘క్రీస్తుయేసు శిష్యులుగా పవిత్రపర్చబడిన’ అభిషిక్త క్రైస్తవుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. (1 కొరిం. 1:2; 15:18)—w20.12, 5-6 పేజీలు.

“రెప్పపాటున, చివరి బాకా ఊదబడుతుండగా” మార్పు చెందేవాళ్లు పరలోకానికి వెళ్లాక ఏం చేస్తారు?—1 కొరిం. 15:51-53.

వాళ్లు క్రీస్తుతో కలిసి ఇనుప దండంతో దేశాల్ని పరిపాలిస్తారు. (ప్రక. 2:26, 27)—w20.12, 12-13 పేజీలు.