దేవుడు అంటే ఎవరు?
చాలామంది దేవున్ని నమ్ముతామని చెప్తారు. కానీ దేవుడు అంటే ఎవరు అని అడిగితే మాత్రం, మీకు వేర్వేరు జవాబులు వస్తాయి. కొంతమంది దేవుడు అంటే ఒక కఠినమైన జడ్జి, తప్పులు చేసినవాళ్లకు శిక్షలు వేయడమే ఆయన పని అనుకుంటారు. ఇంకొంతమందికి దేవుడంటే, వాళ్లు ఏమి చేసినా ఎప్పుడూ ప్రేమ చూపిస్తూ, క్షమిస్తూ ఉండేవాడు. మరికొంతమంది దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనల్ని పట్టించుకోడు అనుకుంటారు. అలా ఒకదానికి ఒకటి పోలిక లేని అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి చాలామంది దేవుడు ఎవరో తెలుసుకోవడం అసాధ్యం అని అనుకుంటారు.
దేవుడు ఎవరో తెలుసుకోవడం అంత ముఖ్యమా? అవును, ముఖ్యం. దేవున్ని బాగా తెలుసుకుని ఉంటే మీ జీవితానికి ఒక ఉద్దేశం, ఒక అర్థం ఉంటుంది. (అపొస్తలుల కార్యాలు 17:26-28) మీరు దేవునికి ఎంత దగ్గరైతే ఆయన మిమ్మల్ని అంత ఎక్కువగా ప్రేమిస్తాడు, అంత ఎక్కువగా మీకు సహాయం చేస్తాడు. (యాకోబు 4:8) చివరికి, మీరు దేవుని గురించి బాగా తెలుసుకోవడం వల్ల అంతం లేని జీవితాన్ని పొందవచ్చు.—యోహాను 17:3.
మీరు దేవుని గురించి ఎలా తెలుసుకోవచ్చు? మీకు బాగా తెలిసిన వాళ్ల గురించి ఒకసారి ఆలోచించండి, బహుశా ఒక మంచి స్నేహితుని గురించి. మీ మధ్య స్నేహం ఎలా పెరిగింది? బహుశా మీరు వాళ్ల పేరు, వాళ్ల వ్యక్తిత్వం, వాళ్ల ఇష్టాయిష్టాలు, ఇంకా అతను లేదా ఆమె ఏమి చేశారు, ఏమి చేయాలనుకుంటున్నారు లాంటి ఎన్నో విషయాలు తెలుసుకుని ఉంటారు. కాబట్టి అతను లేదా ఆమె గురించి తెలుసుకోవడం వల్ల మీరు వాళ్లకు దగ్గర అయ్యారు.
అలానే మనం కూడా వీటి గురించి తెలుసుకోవడం వల్ల దేవునికి దగ్గర అవుతాం:
ఇలాంటి ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు ఈ పత్రికలో ఉన్నాయి. ఈ ఆర్టికళ్లు మీకు దేవుడు ఎవరో తెలుసుకోవడానికి మాత్రమే కాదు, ఆయనతో ఒక మంచి సంబంధం కలిగి ఉండడం వల్ల మీరు ఏ ప్రయోజనాలు పొందుతారో తెలుసుకోవడానికి కూడా సహాయం చేస్తాయి.