మనకు ఒక కొత్త లోకం అవసరం!
“మనం జీవిస్తున్న ఈ లోకం కష్టాలతో నిండిపోయింది” అని యునైటడ్ నేషన్స్ సెక్రటరీ జెనరల్ అయిన ఆన్టోన్యూ గీటారేష్ అన్నారు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా?
వార్తల్లో బాధ కలిగించే ఇలాంటి రిపోర్టులే ఉంటున్నాయి
వ్యాధులు, మహమ్మారులు
ప్రకృతి విపత్తులు
పేదరికం, ఆకలి
కాలుష్యం, భూమి ఉష్ణోగ్రత పెరగడం
నేరం, హింస, అవినీతి
యుద్ధాలు
కాబట్టి, ఒక కొత్త లోకం అవసరం. దానిలో మనందరికీ ఇలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి
మంచి ఆరోగ్యం
శాంతి, భద్రత
అందరికీ సరిపోయేంత ఆహారం
స్వచ్ఛమైన వాతావరణం
న్యాయం
ప్రపంచ శాంతి
కొత్త లోకం అంటే ఏంటి?
మరి ఈ లోకానికి ఏమవుతుంది?
మనం కొత్త లోకంలో జీవించాలంటే ఏం చేయాలి?
ఈ ప్రశ్నలకు, ఇలాంటి మరి కొన్ని ప్రశ్నలకు ఈ కావలికోట పత్రిక జవాబులను ఇస్తుంది. అవి మీకు ఓదార్పును ఇస్తాయి.