పత్రిక ముఖ్యాంశం | దయ్యాల వెనుక ఎవరు ఉన్నారు?
దయ్యాల మీద పెరుగుతున్న ఆసక్తి!
‘పురాణాల కథలతోపాటు, దయ్యాలు, పాములా మారే స్త్రీలు (నాగిణులు) ఈ మధ్యకాలంలో టీవీ కార్యక్రమాల్లో ఎక్కువగా ఉంటున్నారు.’—BBC హిందీ.
చిన్న మాంత్రికులు, ముసలి మాంత్రికులు, మాయచేసే మాంత్రికురాళ్లు, మోహినీలు, అందమైన రక్తపిశాచాలు పుస్తకాల్లో, సినిమాల్లో, వీడియో గేముల్లో ఎక్కువగా కనిపించే మానవాతీత పాత్రల్లో కొన్ని మాత్రమే. ఇవన్నీ ఇంత ఆసక్తికరంగా ఉండడానికి కారణం ఏంటి? a
ద హిందుస్తాన్ టైమ్స్ వార్తాపత్రిక ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సర్వేలో 46 శాతం భారతీయులు దయ్యాలను నమ్ముతారని తెలిసింది. ఇటీవల జరిపిన మరో సర్వే ప్రకారం ఇప్పుడు ఆ సంఖ్య 56 శాతానికి పెరిగింది. సమాజ శాస్త్ర (Sociology) ప్రొఫెసర్ క్లాడ్ ఫిషర్ ఇలా రాశారు: “అమెరికాలో పెద్దవాళ్లకన్నా దాదాపు రెండింతలుగా అమెరికన్ యువతీయువకులు భౌతిక శాస్త్రాన్ని సంప్రదిస్తామని, దయ్యాలను, భూత్‌బంగళాలను నమ్ముతామని చెప్పారు.”
మనుషుల్లో ప్రవేశించే దయ్యాల కథలు భయంకరంగా పెరగడం పెద్ద విషయం కాదు. “నేడున్న సంస్కృతిలో దయ్యాలు పట్టడం గురించిన కథలు విజయవంతం అవ్వడానికి కారణం, గత పదేళ్లుగా దూసుకుపోతున్న జాంబీల (కొరివి దయ్యాలు), వేర్‌వుల్ఫ్‌ల (తోడేళ్లుగా మారే మనుషులు), రక్తపిశాచాల కథలే” అని మైకల్ ఖలీ ద వాల్ స్ట్రీట్ జర్నల్‌లో రాశారు.
ఒక రిపోర్ట్ ప్రకారం “ప్రపంచంలో చాలా సంస్కృతుల్లో ఉన్న 25 నుండి 50 శాతం ప్రజలు దయ్యాలను, దయ్యాల గురించిన రచనలను ఎక్కువగా నమ్ముతున్నారు.” సోష్యోలజీ ప్రొఫెసర్లు క్రిస్టఫర్ బాడర్, కార్సన్ మెంకన్ అమెరికాలో చేసిన సర్వేలో ఇలా చెప్పారు, “అటుఇటుగా 70 నుండి 80 శాతం మంది అమెరికన్లు దయ్యాల సంబంధించిన ఏదో ఒక దాన్ని బలంగా నమ్ముతారు.”
దయ్యాలతో, భూతప్రేత శక్తులతో ఏదో విధంగా పొత్తు పెట్టుకోవడం సరదా మాత్రమేనా?
a మానవాతీత: “సైన్స్ లేదా ప్రకృతి నియమాలతో వివరించలేనిది” ఏదైనా.—మిరియమ్-వెబ్‌స్టర్స్ లర్నర్స్ డిక్షనరీ.