తేజరిల్లు! నం. 2 2018 | కుటుంబ విజయానికి 12 సలహాలు
కుటుంబ విజయానికి 12 సలహాలు
కుటుంబాలు ఎందుకు విజయవంతం కాలేకపోతున్నాయనే విషయం గురించి చాలా కారణాలు వింటూ ఉంటాం. కానీ కుటుంబాలు విజయవంతం అవ్వాలంటే ఏమి చేస్తే బాగుంటుంది?
1990 నుండి 2015 మధ్య సంవత్సరాల్లో అమెరికాలో విడాకులు తీసుకునే వాళ్ల సంఖ్య 50 ఏళ్లు పైనున్న వాళ్లలో రెండింతలు, 65 ఏళ్లు పైనున్న వాళ్లలో మూడింతలు పెరిగింది.
ఏమి చేయాలో తల్లిదండ్రులు తేల్చుకోలేకపోతున్నారు: కొంతమంది నిపుణులు పిల్లల్ని ఎప్పుడూ పొగుడుతూ ఉండాలి అని చెప్తారు, కాని ఇంకొంతమంది పిల్లలతో కఠినంగా ఉండాలి అని చెప్తారు.
పిల్లలు, వాళ్లకు కావాల్సిన సామర్థ్యాల్ని పెంచుకోకుండానే పెద్దవాళ్లు అవుతున్నారు.
కానీ నిజం చెప్పాలంటే,
భార్యాభర్తలు శాశ్వతంగా కలిసి ఉండవచ్చు, సంతోషంగా ఉండవచ్చు.
తల్లిదండ్రులు ప్రేమతో పిల్లలకు క్రమశిక్షణ ఇవ్వడం నేర్చుకోవచ్చు.
ఎదుగుతున్న వయసులో కావాల్సిన సామర్థ్యాల్ని పిల్లలు అభివృద్ధి చేసుకోవచ్చు.
ఎలా? కుటుంబ విజయానికి సహాయం చేసిన 12 సలహాల గురించి ఈ తేజరిల్లు! పత్రిక చర్చిస్తుంది.
1: వివాహానికి కట్టుబడి ఉండడం
భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండడానికి మూడు సలహాలు సహాయం చేస్తాయి.
2: కలిసి పనిచేయడం
మీ జీవిత భాగస్వామి కేవలం మీ రూమ్‌మేట్‌లా అనిపిస్తున్నారా?
3: గౌరవం చూపించడం
మీ భర్త లేదా భార్య తాము గౌరవించబడుతున్నామని అనుకోవాలంటే ఎలాంటి మాటలు, పనులు అవసరమో తెలుసుకోండి.
4: క్షమించడం
మీ భర్తలో లేదా భార్యలో ఉన్న లోపాలు మాత్రమే చూడకుండా ఉండడానికి మీకు ఏమి సహాయం చేస్తుంది?
5: ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి
మూడు ముఖ్యమైన అడుగులు మీరు మీ పిల్లలకు దగ్గర అవ్వడానికి సహాయం చేస్తాయి.
6: క్రమశిక్షణ
క్రమశిక్షణ పెడితే పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందా?
7: విలువలు
మీరు మీ పిల్లలకు ఏ నియమాలు నేర్పించాలి?
8: ఆదర్శం
మీరు చెప్పే మాటలు మీ పిల్లల హృదయాల్లోకి చేరాలంటే మీరు చెప్పేవాటి ప్రకారం మీ పనులు కూడా ఉండాలి.
9: గుర్తింపు
యౌవనులు వాళ్లు నమ్మినవాటి కోసం ఎలా నిలబడవచ్చు?
10: నమ్మకత్వం
మీరు పెద్దవాళ్లుగా అవుతున్నప్పుడు మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని సంపాదించుకోవడం చాలా ముఖ్యం.
11: కష్టపడి పనిచేసే లక్షణం
యౌవనస్థుడిగా ఉన్నప్పుడే కష్టపడడం నేర్చుకుంటే మీరు జీవితంలో ఏమి చేసినా విజయం సాధించవచ్చు.
12: లక్ష్యాలు
లక్ష్యాలు చేరుకోవడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ స్నేహాలు బలపడతాయి, మీ సంతోషం పెరుగుతుంది.
కుటుంబాలకు సహాయం
వివాహంలో విజయం సాధించడానికి, కుటుంబంలో సంతోషంగా ఉండడానికి బైబిలు సలహాలు మీకు సహాయం చేస్తాయి.