కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక విమానాన్ని నడపడానికి ఇద్దరు పైలట్‌లు కలిసి పనిచేస్తూ ఉంటారు. భార్యాభర్తలు కలిసి పనిచేయడం కూడా అలాంటిదే

భార్యాభర్తలకు

2: కలిసి పనిచేయడం

2: కలిసి పనిచేయడం

అంటే ఏంటి?

భార్యాభర్తలిద్దరూ కలిసి పనిచేస్తున్నప్పుడు వాళ్లు విమానాన్ని నడిపే ఇద్దరు పైలట్లలా ఉంటారు. సమస్యలు ఎదురైనప్పుడు కూడా ఇద్దరూ “నేను” అని ఆలోచించే బదులు “మేము” అని ఆలోచిస్తారు.

మంచి సూత్రాలు: “వాళ్లు ఇక ఇద్దరుగా కాదుగానీ ఒకే శరీరంగా ఉంటారు.”—మత్తయి 19:6.

“వివాహం ఒక్కరి చేతుల్లో ఉండేది కాదు. భర్త, భార్య ఇద్దరూ కలిసి దాన్ని విజయవంతం చేసుకోవాలి.”—క్రిస్టఫర్‌.

ఎందుకు ముఖ్యం?

గొడవలు వచ్చినప్పుడు, కలిసికట్టుగా లేని భార్యాభర్తలు సమస్యపై దాడి చేసే బదులు, ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటారు. చిన్నచిన్న విషయాలే పెద్దపెద్ద అడ్డంకులుగా మారతాయి.

“వివాహమంటేనే కలిసి పనిచేయడం. నేను నా భర్త ఒకే జట్టుగా కలిసి పనిచేయకపోతే, మేము రూమ్‌మేట్స్‌లానే ఉంటాం గానీ భార్యాభర్తలుగా కాదు. అంటే ఒకే చోట కలిసి ఉంటాం కానీ ఒకే అభిప్రాయానికి రావడం కష్టం అవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇది చాలా పెద్ద సమస్యగా ఉంటుంది.”—ఎలెగ్జాండ్రా.

మీరు ఏమి చేయవచ్చు

మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి

  • నేను సంపాదించే డబ్బు “నాదే” అన్నట్లుగా నేను చూస్తున్నానా?

  • సరదాగా ఉండాలంటే, భార్యకు లేదా భర్తకు దూరంగా ఉండాలి అని నేను అనుకుంటున్నానా?

  • నా భర్త లేదా భార్య వాళ్ల కుటుంబ సభ్యులతో చాలా సన్నిహితంగా ఉన్నప్పటికీ నేను మాత్రం వాళ్లకు దూరంగా ఉంటున్నానా?

మీ భర్తతో లేదా భార్యతో ఇలా మాట్లాడి చూడండి

  • మన వివాహానికి సంబంధించిన ఏ విషయాల్లో చక్కగా కలిసి పనిచేస్తాము?

  • మనం ఇంకా ఏయే విషయాల్లో కలిసి పని చేయాల్సి ఉంది?

  • మనం కలిసి జట్టుగా ఇంకా బాగా పనిచేయాలంటే ఏమి చేయవచ్చు?

ఇలా చేయండి

  • మీరిద్దరు ఎదురెదురుగా ఉండి టెన్నిస్‌ ఆట ఆడుతుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కానీ అలా కాకుండా మీరిద్దరు ఒకే వైపు ఆడాలంటే మీరు ఏమేమి చేయాల్సి ఉంటుంది?

  • ‘నేను ఎలా గెలవాలి?’ అని ఆలోచించే బదులు ‘మనమిద్దరం ఎలా గెలవవచ్చు?’ అని ఆలోచించండి.

“ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్‌ అనే విషయాన్ని మర్చిపోండి. అది భార్యాభర్తలిద్దరి మధ్య ఉండే శాంతి, ఐక్యత కన్నా ముఖ్యం కాదు.”—ఈతన్‌.

మంచి సూత్రాలు: “మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.”—ఫిలిప్పీయులు 2:3, 4.