కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మరీ ముందా లేక మరీ ఆలస్యమా?

మరీ ముందా లేక మరీ ఆలస్యమా?

మరీ ముందా లేక మరీ ఆలస్యమా?

21వ శతాబ్దం ప్రారంభం గురించీ, యేసుక్రీస్తు జన్మించిన తర్వాత మూడవ సహస్రాబ్ది ప్రారంభం కావడం గురించీ ప్రస్తుతం ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. “20వ శతాబ్దం సంపూర్ణ యుద్ధంతో ప్రారంభమై, అణు యుగంగా అభివృద్ధియై, చివరికి వినోదపు యుగంగా ముగిసేలా ఉంది” అని న్యూస్‌వీక్‌ పత్రిక చెబుతుంది. 1997, జనవరి 22వ సంచికలో అది, 1999, డిసెంబరు 31న నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికిగాను “భూవ్యాప్తంగా హోటళ్ళు ఇప్పటికే పూర్తిగా బుక్‌ అయిపోయాయి” అని నివేదించింది.

అయితే వేడుకలు అసలు సమయానికి చాలా ముందుగా ప్రారంభమయ్యాయని కొందరు ప్రజలు చెబుతున్నారు. చాలామంది నమ్ముతున్నదానికి విరుద్ధంగా 21వ శతాబ్దమూ, క్రొత్త సహస్రాబ్దీ ఈ రెండూ, 2000, జనవరి 1న ప్రారంభం కావనీ 2001, జనవరి 1న ప్రారంభమౌతాయనీ వారు చెబుతారు. సున్నా సంవత్సరం లేనందున మొదటి శతాబ్దం 1 వ సంవత్సరం నుంచి ప్రారంభమై 100 వ సంవత్సరం వరకు కొనసాగింది, అలాగే రెండవ శతాబ్దం 101 నుండి 200 వరకు కొనసాగింది. అందుకని 1901, జనవరి 1న ప్రారంభమైన 20వ శతాబ్దమూ, 1001, జనవరి 1న ప్రారంభమైన రెండవ సహస్రాబ్దీ ఈ రెండూ 2000, డిసెంబరు 31న గానీ సమాప్తి కావు అని వాదించడం జరుగుతుంది.

మరో విషయం పరిశీలించాల్సి ఉంది. మన క్యాలెండర్‌లు కాలాన్ని, క్రీస్తు జననానికి పూర్వపు సంవత్సరాలనీ, ఆయన జననం తర్వాతి సంవత్సరాలనీ విభజిస్తాయి. యేసు మునుపు అనుకున్న దానికన్నా ముందే జన్మించాడని పండితులు ఇప్పుడు గుర్తిస్తున్నారు, దీని మూలంగా క్యాలెండరులోని కీలకమైన ముల్లు అస్పష్టంగా మారింది. యేసు ఎప్పుడు పుట్టాడన్న దాని విషయంలో అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నాయి, కానీ బైబిలు కాలవృత్తాంతం సా.శ.పూ. 2వ సంవత్సరాన్ని సూచిస్తుంది. ఈ లెక్క ప్రకారం క్రీస్తు జననం తర్వాత మూడవ సహస్రాబ్ది నిజానికి గత సంవత్సరం శరదృతువులోనే ప్రారంభమైంది! తేజరిల్లు! (ఆంగ్లం) పత్రిక యొక్క మే 22, 1997, పేజీ 28, మరియు డిసెంబరు 22, 1975, పేజీ 27లో మరింత సమాచారం ఉంది. *

ఏదేమైనా, 21వ శతాబ్దమూ, క్రొత్త సహస్రాబ్దీ 2000, జనవరి 1న ప్రారంభమైందని గట్టిగా చెప్పడాన్ని నివారించడం జ్ఞానయుక్తం. అయినప్పటికీ, ప్రజాదరణ పొందిన అభిప్రాయాల దృష్ట్యా, “20వ శతాబ్దం కీలకమైన మార్పులు జరిగిన సంవత్సరాలు” అనే విషయాన్ని చర్చించడానికి ఇది యుక్తమైన సమయం అని తేజరిల్లు! భావిస్తుంది.

[అధస్సూచి]

^ కావలికోట 1999, నవంబరు 1వ సంచిక కూడా చూడండి.