“మా ప్రొఫెసర్లు ఎంతో సంతోషించారు”
“మా ప్రొఫెసర్లు ఎంతో సంతోషించారు”
జార్జియా దేశంలోని టిబిలిసి రాష్ట్ర వైద్య కళాశాలలో చదువుకుంటున్న మొదటి సంవత్సరపు వైద్య విద్యార్థి, తేజరిల్లు! పత్రిక ప్రకాశకులకు వ్రాసిన ఉత్తరంలో పైవిధంగా వ్రాశాడు. ఆ విద్యార్థి తేజరిల్లు!కు ఎందుకలా వ్రాశాడు?
“నేను 1998 నుండి మీ పత్రికలు చదువుతున్నాను. . . . అవి నా చదువులో నాకు ఎంతో సహాయం చేస్తాయి. ఆర్టికల్లు ఎప్పుడూ సమయోచితంగా ఉండడమే కాక, ఆధారపడదగిన సమాచారంతో కూడా నిండివుంటాయి. నేను ఈ మధ్యనే, తేజరిల్లు! నవంబరు 22 2002, (ఆంగ్లం)లో ప్రచురించబడిన ‘మూల కణాలు—విజ్ఞానశాస్త్రం మరీ ముందుకు వెళ్ళిందా?’ అనే శీర్షికల పరంపరలోని సమాచారాన్ని, ‘క్లోనింగ్ మరియు మూల కణాల రకాలు’ అనే విషయంపై వ్యాసం వ్రాయడానికి ఉపయోగించాను. మా ప్రొఫెసర్లు ఎంతో సంతోషించారు, నాకే అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చాయి.
“మీరు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలపై, ప్రత్యేకించి వైద్యశాస్త్రానికి సంబంధించిన విషయాలపై ఆర్టికల్లు ప్రచురిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను, నా కుటుంబ సభ్యులు యెహోవాసాక్షులు కాకపోయినా మేమందరం మీ పత్రికలు చదవడానికి ఎంతో ఇష్టపడతాము, ఎందుకంటే అవి మన చుట్టూ ఉన్న లోకం గురించి మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి సహాయం చేస్తాయి.”
శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు బైబిలు ఆచరణాత్మకమైన నడిపింపును ఇస్తుందని తెలుసుకొని మీరు ఆశ్చర్యపోవచ్చు. సర్వమానవాళి కొరకైన గ్రంథం అనే 32 పేజీల ఆసక్తికరమైన బ్రోషుర్లో ఆ వాస్తవం నొక్కి చెప్పబడింది. మీరు ఈ క్రింది కూపన్ పూరించి ఈ పత్రికలోని 5వ పేజీలో ఇవ్వబడ్డ చిరునామాల్లో తగినదానికి పంపించడం ద్వారా దాని గురించి మరింత సమాచారాన్ని తెప్పించుకోవచ్చు. (g05 1/22)
□ ఎలాంటి నిర్బంధం లేకుండా, సర్వమానవాళి కొరకైన గ్రంథం అనే బ్రోషుర్ గురించి మరింత సమాచారం పంపించమని కోరుతున్నాను.
□ ఉచిత గృహ బైబిలు అధ్యయనం గురించి దయచేసి నన్ను సంప్రదించండి.