“దీనిని అందరూ చదవగలిగితే ఎంత బాగుంటుందో కదా!”
“దీనిని అందరూ చదవగలిగితే ఎంత బాగుంటుందో కదా!”
పై మాటలు రాసిన స్త్రీ యెహోవాకు సన్నిహితమవండి అనే పుస్తకాన్ని గురించి అలా రాసింది. ఆమె ఇంకా ఇలా రాసింది, “నేను యెహోవా ప్రేమ గురించి మరింత స్పష్టంగా తెలుసుకోగలిగాను, అందుకే ఇతరుల పట్ల మరింత ప్రేమ చూపించాలని నిర్ణయించుకున్నాను.” మరో స్త్రీ కృతజ్ఞతతో ఇలా వివరించింది: “ఈ పుస్తకాన్ని చదవడం నాకెంత ఆనందాన్నిచ్చిందో, ఎన్ని ప్రయోజనాలనిచ్చిందో నేను మాటల్లో చెప్పలేను . . . నేను దాన్ని ఎంతగా చదివితే, అంతగా ప్రోత్సాహం పొందాను.”
యెహోవాకు సన్నిహితమవండి పుస్తకంలోని నాలుగు ప్రధాన భాగాల్లో దేవుని ప్రధాన లక్షణాలైన శక్తి, న్యాయం, జ్ఞానం, ప్రేమ గురించి చర్చించబడ్డాయి. “ఈ పుస్తకం నా పరలోక తండ్రిలోని అద్భుతమైన లక్షణాలను అర్థంచేసుకునేందుకు నాకు సహాయం చేసింది. ఆయన పరిశుద్ధాత్మ నా జీవితాన్ని ప్రభావితం చేసేందుకు అనుమతిస్తే, నేను ఆయన లక్షణాలను అనుకరించగలననే విషయాన్ని గ్రహించేందుకు అది నాకు సహాయం చేసింది” అని ఆ పుస్తకాన్ని చదివిన ఒక స్త్రీ వివరించింది.
“‘క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల’ దేవుడు” అనే 26వ అధ్యాయాన్ని చదివిన తర్వాత, పోలాండ్లోని యోయాన్నా అనే యౌవనస్థురాలు ఇలా అంది, “ఆ పుస్తకంలోని విషయాలను నేను విలువైన నిధిగా పరిగణిస్తున్నాను, దానిని కనుగొనడం నా జీవితానికి ఎంతో ప్రాముఖ్యమని తేలింది.”
మీరు కూడా ఈ 320 పేజీల పుస్తకం నుండి ఎంతో ప్రయోజనం పొందగలరని మేము నమ్ముతున్నాం. ఈ క్రింద ఇవ్వబడిన కూపన్ను నింపి, ఈ పత్రికలోని 5వ పేజీలో ఇవ్వబడిన చిరునామాల్లో తగినదానికి పంపించడం ద్వారా మీరు ఆ పుస్తకం గురించిన మరింత సమాచారాన్ని కోరవచ్చు. (g 9/07)
□ ఎలాంటి షరతులు విధించకుండా ఇక్కడ చూపించిన పుస్తకం గురించి మరింత సమాచారాన్ని పంపించమని కోరుతున్నాను.
□ ఉచిత గృహ బైబిలు అధ్యయనం గురించి దయచేసి నన్ను సంప్రదించండి.