ఆమె జీవితంలో లక్ష్యాన్ని కనుగొంది
రాజ్య ప్రచారకుల నివేదిక
ఆమె జీవితంలో లక్ష్యాన్ని కనుగొంది
యేసు తన గొర్రెలను ఎరుగునని చెబుతున్నాడు. (యోహాను 10:15) ఒక వ్యక్తి మంచి హృదయం కలిగి, నీతి సమాధానాలను ప్రేమిస్తే, ఆ వ్యక్తి యేసు అనుచరుల యొద్దకు తేబడతాడు. బెల్జియమ్లో ఒక స్త్రీ వలెనే, అలాంటి వ్యక్తి జీవితంలో ఉద్దేశాన్ని కనుగొంటాడు. ఆమె వృత్తాంతం ఇదే:
“యెహోవాసాక్షులు నా తలుపును తట్టినపుడు, నేను చాలా నిరుత్సాహంపొంది, నా జీవితాన్ని అంతమొందించాలని ఆలోచిస్తున్నాను. ఈ అవినీతికర ప్రపంచంలోని సమస్యల పరిష్కారానికి సాక్షులు చెప్పిన దానిని నేను చాలా యిష్టపడ్డాను, కాని దేవుడు కూడ దీనిలో జోక్యంకల్గియున్నాడనే భావనను నేనిష్టపడలేదు. నేను చర్చిలో చూసిన వేషధారణను అసహ్యించుకుని, ఎనిమిది సంవత్సరాల క్రితమే అక్కడకు వెళ్లడం మానుకున్నాను. సాక్షుల సహాయంతో, వారు చెప్పిన సత్యంలోని సారాన్ని గ్రహించగల్గినప్పటికి, దేవుడు లేకుండా జీవించడం కష్టమనేది తరువాతనే గుర్తించాను.
“దుఃఖకరంగా, కొన్ని సందర్శనాల తర్వాత, సాక్షులతో సంబంధం పోగొట్టుకున్నాను. నేను దుఃఖపూరితురాలయ్యాను. నేను రోజుకు పది పెట్టెల సిగరెట్లను కాల్చాను, మాదకద్రవ్యాలను కూడ వినియోగించడం ప్రారంభించాను. మరణించిన నా తాతగారితో మాట్లాడాలని కోరుకుంటూ, భూతవిద్యలో నిమగ్నమయ్యాను. దాని ఫలితంగా రాత్రివేళలో నేను ఏకాంతంగానున్నప్పుడు, దయ్యాలచే పీడింపబడి ఎంతగానో భీతిచెందాను! ఇది నెలలపాటు కొనసాగింది. ఒంటరిగా ఉండే ఆలోచనతో ప్రతి సాయంత్రం నేను భయపెట్టబడ్డాను.
“ఆతర్వాత, నేను ఒకరోజు సరదాగా బయటకు వెళ్లాను, సాధారణంగా వెళ్లేమార్గంలో కాకుండా వేరేమార్గంలో నడుస్తూ, ఒక అతిపెద్ద నిర్మాణ స్థలానికి వెళ్లాను. ఆశ్చర్యంతో, అక్కడ నేనొక గొప్పగుంపును చూశాను. దగ్గరకు సమీపిస్తూ, అది రాజ్యమందిరాన్ని నిర్మిస్తున్న యెహోవాసాక్షులని నేను చూశాను. సాక్షులు నా ఇంటివద్ద చేసిన సందర్శనాలను గుర్తుకు తెచ్చుకున్నాను, మొత్తం ప్రపంచమంతా ఈ ప్రజల వలెనే జీవిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అని ఆలోచించాను.
“సాక్షులు నా యింటికి తిరిగి రావాలని నిజంగా నేను కోరుకున్నాను, కాబట్టి మందిరపు పనిచేసే కొందరితో నేను మాట్లాడాను. నేను దేవునికి ప్రార్థించాను, పదిరోజుల తర్వాత నన్ను మొట్టమొదట సందర్శించిన వ్యక్తి నా తలుపు దగ్గరకొచ్చాడు. మనం బైబిలు అధ్యయనం కొనసాగిద్దామని ఆయన సలహా యిచ్చాడు, నేను ఆనందంగా ఒప్పుకున్నాను. వెనువెంటనే ఆయన నన్ను రాజ్యమందిరంలోని కూటాలకు ఆహ్వానించాడు. నేను అంగీకరించాను. అలాంటి దృశ్యం నేనెన్నడూ చూడలేదు! సంతోషంగావుండి, ఒకరినొకరు ప్రేమించే ప్రజల కొరకు నేను చాలాకాలంపాటు అన్వేషించాను. చివరకు యిక్కడే వారున్నారు!
“అప్పటినుండి నేను అన్ని కూటాలకు వెళ్లాను. దాదాపు మూడు వారాల తర్వాత, నేను పొగత్రాగే అలవాటును మానుకున్నాను. జ్యోతిష్యశాస్త్రానికి సంబంధించిన నా పుస్తకాలు, దయ్యాల సంగీత రికార్డులను బయటకు విసిరేశాను, దయ్యాలకు నాపైనున్న పట్టు కోల్పోతున్నట్లు నేను భావించగల్గాను. నేను నా జీవితాన్ని యెహోవా యొక్క బైబిలు ప్రమాణాలకు తగినట్లుగా ఉండేటట్లు చేశాను, మూడు నెలల తర్వాత నేను సువార్త ప్రకటన పనిని ప్రారంభించాను. ఆరు నెలల తర్వాత నేను బాప్తిస్మం పొందాను. నా బాప్తిస్మానికి రెండు రోజుల తర్వాత, నేను సహాయక పయినీరు చేయడం ప్రారంభించాను.
“నా కొరకు యెహోవా చేసిన అన్ని మంచి విషయాల నిమిత్తం ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చివరకు నా జీవితం ఒక లక్ష్యం కల్గివుంది. ఔను, యెహోవా నామమనేది నేను ఆశ్రయము, రక్షణను కనుగొన్న ఒక బలమైన దుర్గమైయుంది. (సామెతలు 18:10) కీర్తన 84:10 వ్రాసినపుడు కీర్తనల గ్రంథకర్త పొందిన అనుభూతినే నేను నిజంగా పొందాను: ‘నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నా కిష్టము.’”
దీనహృదయం గల్గిన ఈ స్త్రీ, జీవితంలో లక్ష్యాన్ని కనుగొంది. యెహోవాను మంచిహృదయంతో వెదకే వారెవరైనా అలాగే కనుగొనగలరు.