కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నూతన లోకము—మీరు అక్కడ ఉంటారా?

నూతన లోకము—మీరు అక్కడ ఉంటారా?

నూతన లోకము—మీరు అక్కడ ఉంటారా?

“సంతోషముగా నుండుటకంటెను తమ బ్రదుకును సుఖముగా వెళ్లబుచ్చుటకంటెను, శ్రేష్ఠమైనదేదియు నరులకు లే[దు]. . . . మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే.”ప్రసంగి 3:12, 13.

1. భవిష్యత్తు గురించి మనం ఎందుకని ఆశావాదంతో ఉండగలం?

స ర్వశక్తిమంతుడైన దేవుడు నియంత అనీ, నిర్దయుడనీ చాలామంది అనుకుంటారు. అయితే, పైనున్న వచనాన్ని ఆయన ప్రేరేపిత వాక్యంలో మీరు చూస్తారు. ఆయన “సంతోషము గల దేవుడు” అన్న విషయంతోనూ, మన మొదటి తల్లిదండ్రులను భూ పరదైసులో ఆయన ఉంచాడన్న విషయంతోనూ అది ఏకీభవిస్తోంది. (1 తిమోతి 1:11, NW; ఆదికాండము 2:7-9) దేవుడు తన ప్రజలకోసం వాగ్దానం చేసిన భవిష్యత్తులోకి అంతర్దృష్టితో చూసినప్పుడు, మనకు నిత్యానందాన్ని తీసుకువచ్చే పరిస్థితులను గూర్చి తెలుసుకుంటే, మనం దానికి ఆశ్చర్యపోకూడదు.

2. మీరు ఎదురు చూసే కొన్ని విషయాలు ఏమిటి?

2 ముందటి శీర్షికలో, “క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని” గూర్చి బైబిలు చెబుతున్న నాలుగు సందర్భాల్లో మూడింటిని మనం పరిశీలించాము. (యెషయా 65:17) విశ్వసనీయమైన ఆ ప్రవచనాల్లో ఒకటి ప్రకటన 21:1 లో నమోదు చేయబడి ఉంది. ఆ తర్వాతి వచనాలు సర్వోన్నతుడైన దేవుడు భూ పరిస్థితులను సంపూర్ణంగా సరిదిద్దే సమయాన్ని గూర్చి చెబుతున్నాయి. బాధాశ్రువుల్ని ఆయన తుడిచి వేస్తాడు. ప్రజలు ఇక ఎంతమాత్రం వృద్ధాప్యం, జబ్బు, లేక ప్రమాదాలవల్ల మరణించరు. దుఃఖము, ఏడ్పు, వేదన ఇక ఉండవు. ఎంత ఆహ్లాదకరమైన ఉత్తరాపేక్ష ! కానీ అది వస్తుందని మనం నమ్మకంతో ఉండగలమా, ఆ ఉత్తరాపేక్ష ఇప్పుడు మనపై ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉండగలదు?

నమ్మకానికి కారణాలు

3. భవిష్యత్తు గురించి బైబిలు చేస్తున్న వాగ్దానాలను మనం ఎందుకు నమ్మగలం?

3ప్రకటన 21:5 ఎలా కొనసాగిస్తుందో గమనించండి. దేవుడు తన పరలోకపు సింహాసనంపై కూర్చుని ఇలా ప్రకటిస్తున్నట్లు అది చెబుతుంది: “ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నా[ను].” ఆ దైవిక వాగ్దానం, ఏ దేశమైనా చేసే స్వాతంత్ర్య ప్రకటనకన్నా, నేటి ఏ హక్కుల ప్రకటనకన్నా, లేదా భవిష్యత్తు కోసమైన ఏ మానవుని అభిలాషకన్నా మిన్నయైనది. అది “అబద్ధమాడనేరని” వాడని బైబిలు చెప్పే ఒక వ్యక్తి చేసిన పూర్తిగా నమ్మదగ్గ ప్రకటన. (తీతు 1:2) మనం ఇక్కడే ఆగిపోయి మనోరంజకమైన ఈ ఉత్తరాపేక్షను గురించి తలపోస్తూ దేవునిమీద నమ్మకం పెట్టుకుని ఉండాలని మీరు భావిస్తున్నట్లైతే అది అర్థం చేసుకోదగినదే. అయితే మనం ఆగాల్సిన అవసరం లేదు. మన భవిష్యత్తు గురించి తెలుసుకోవలసింది ఎంతో ఉంది.

4, 5. ఇప్పటికే పరిశీలించిన, బైబిల్లోని ఏ ప్రవచనాలు ముందున్న దానిపై మన నమ్మకాన్ని పెంపొందింపజేస్తాయి?

4 క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని గురించి బైబిలు వాగ్దానం చేస్తున్నదాని విషయమై ముందటి శీర్షిక ఏమని స్థిరపర్చిందో చూడండి. అటువంటి నూతన విధానం గురించి యెషయా ప్రవచించాడు, ఆయన ప్రవచనం యూదులు తమ స్వదేశానికి తిరిగివచ్చి స్వచ్ఛారాధనను పునఃస్థాపించినప్పుడు నెరవేరింది. (ఎజ్రా 1:1-3; 2:1, 2; 3:12, 13) అయితే, యెషయా ప్రవచనం సూచించింది అంతేనా? ఖచ్చితంగా కాదు ! ఆయన ప్రవచించిన విషయాలు సుదూర భవిష్యత్తులో గొప్పగా నెరవేరనైవున్నాయి. మనం ఆ ముగింపుకు ఎలా వచ్చాము? 2 పేతురు 3:13వ వచనం, ప్రకటన 21:1-5 వచనాల్లో మనం చదివినదాన్ని బట్టి. ఆ వచనాలు భూవ్యాప్తంగా క్రైస్తవులకు ప్రయోజనాలు తెచ్చే క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని సూచిస్తున్నాయి.

5 మునుపు పేర్కొన్నట్లుగా బైబిలు ‘క్రొత్త ఆకాశము క్రొత్త భూమి’ అన్న పదబంధాన్ని నాలుగుసార్లు ఉపయోగిస్తుంది. వీటిలో మూడింటిని మనం పరిశీలించి ప్రోత్సాహాన్నిచ్చే ముగింపులకు చేరుకున్నాము. దేవుడు దుష్టత్వాన్నీ, బాధలకు కారణమయ్యే ప్రతిదాన్నీ నిర్మూలిస్తాడని, అటుతర్వాత తాను వాగ్దానం చేసిన నూతన విధానంలో మానవజాతిని ఆశీర్వదిస్తాడని బైబిలు ప్రవచిస్తుంది.

6. ‘క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి’ గురించి ప్రస్తావిస్తున్న నాల్గవ ప్రవచనం ఏమి తెలియజేస్తుంది?

6 ఇప్పుడు మనం యెషయా 66:22-24 లో ‘క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని’ గురించిన వ్యక్తీకరణ ఉన్న మిగిలిన సందర్భాన్ని పరిశీలిద్దాము. అక్కడిలా ఉంది: “నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయ నామీద తిరుగుబాటుచేసినవారి కళేబరములను తేరి చూచెదరు; వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును.”

7. రాబోయే దినాల్లో యెషయా 66:22-24 నెరవేరుతుందనే ముగింపుకు మనం ఎందుకు రావచ్చు?

7 తమ స్వదేశంలో పునరావాసం ఏర్పర్చుకున్న యూదుల విషయంలో ఈ ప్రవచనానికి అన్వయింపు ఉంది, కానీ దీనికి మరో నెరవేర్పు ఉంటుంది. పేతురు రెండవ ఉత్తరం, ప్రకటన పుస్తకం వ్రాయబడిన తర్వాతి సమయంలో అది నెరవేరాల్సి ఉంది, ఎందుకంటే ఆ రెండు వచనాలు/పుస్తకాలు ‘క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని’ సూచిస్తున్నాయి. మనం నూతన విధానంలో ఆ అసాధారణమైన పూర్తి నెరవేర్పు కోసం ఎదురుచూడవచ్చు. మనం ఆనందించాలని ఎదురుచూడగల కొన్ని పరిస్థితులను పరిశీలించండి.

8, 9. (ఎ) ఏ భావంలో దేవుని ప్రజలు ‘నిలిచి ఉంటారు’? (బి) యెహోవా సేవకులు “ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినమునను” ఆరాధిస్తారన్న ప్రవచన భావం ఏమైయుంది?

8 మరణం ఇక ఉండదని ప్రకటన 21:4 సూచిస్తోంది. యెషయా 66 లోని భాగం ఇందుకు అనుగుణ్యంగా ఉంది. ‘క్రొత్త ఆకాశము క్రొత్త భూమి’ తాత్కాలికంగా, పరిమిత కాలంపాటు ఉండేవి కావని యెహోవాకు తెలుసని మనం 22వ వచనంలో చూస్తాము. అంతేగాక, ఆయన ప్రజలు సహనాన్ని కనపరుస్తారు; వారు ఆయన ఎదుట ‘నిలిచివుంటారు.’ దేవుడు తాను ఎంపిక చేసుకున్న ప్రజల కోసం ఇప్పటికే చేసింది మనం నమ్మకం కల్గివుండటానికి కారణాన్నిస్తుంది. నిజ క్రైస్తవులు క్రూరమైన హింసల్ని ఎదుర్కొన్నారు, చివరికి వారిని తుడిచిపెట్టేయాలన్న ప్రయత్నాల్ని కూడా ఎదుర్కొన్నారు. (యోహాను 16:2; అపొస్తలుల కార్యములు 8:1) అయినా, దేవుని ప్రజల శత్రువులైన రోమ్‌ చక్రవర్తి నీరో, అడాల్ఫ్‌ హిట్లర్‌ వంటి శక్తిమంతమైన వారు కూడా ఆయన నామాన్ని ధరించిన దేవుని యథార్థపరులను నిర్మూలించలేకపోయారు. యెహోవా తన ప్రజల సంఘాన్ని భద్రంగా కాపాడాడు, అది నిరంతరం అలా నిలిచే ఉండేలా ఆయన చూడగలడని మనం నమ్మకంతో ఉండవచ్చు.

9 అదే విధంగా, క్రొత్త భూమిలో భాగంగా దేవునికి విశ్వసనీయంగా ఉండేవారు, అంటే నూతన లోకంలో సత్యారాధకుల సమాజపువారు, సమస్తానికీ సృష్టికర్త అయిన వానికి స్వచ్ఛారాధనను కొనసాగిస్తూ ఉంటారు గనుక వైయక్తికంగా నిలిచేవుంటారు. ఆ ఆరాధన అప్పుడప్పుడు చేసేదో లేదా అనాలోచనగా చేసేదో కాదు. ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో ప్రతి నెల అమావాస్య దినాన, ప్రతి వారం సబ్బాతు దినాన నిర్దిష్టమైన ఆరాధనా క్రియలను చేయాలని ఉంది. (లేవీయకాండము 24:5-9; సంఖ్యాకాండము 10:10; 28:9, 10; 2 దినవృత్తాంతములు 2:4) అందుకని, సత్యదేవుని ఆరాధన క్రమంగా నిరాటంకంగా వారం తర్వాత వారం నెల తర్వాత నెల కొనసాగుతూనే ఉంటుందని యెషయా 66:23వ వచనం చూపిస్తోంది. నాస్తికత్వం, మతవేషధారణ అప్పుడు ఉనికిలోనే ఉండవు. యెహోవా “సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు” వస్తారు.

10. నూతన లోకం భక్తిహీనులవల్ల శాశ్వతంగా నాశనం చేయబడదని ఎందుకు మీరు భరోసాతో ఉండగలరు?

10 క్రొత్త భూమిపై శాంతి, నీతులు ఎప్పటికీ చెక్కుచెదరవని యెషయా 66:24 మనకు అభయాన్నిస్తుంది. దుష్ట ప్రజలు దాన్ని నాశనం చేయరు. గుర్తు తెచ్చుకోండి మున్ముందు “భక్తిహీనుల తీర్పును నాశనమును” జరుగబోతున్నదని 2 పేతురు 3:7 చెబుతుంది. రానైయున్న నాశన దినాన అంతమయ్యేది భక్తిహీనులైన వారే. మానవుల యుద్ధాల్లో తరచూ జరుగుతున్నట్లుగా నిర్దోషులకు హానిజరుగదు, వారి యుద్ధాల్లో తరచుగా సైనికులకన్నా ఎక్కువగా ప్రజలే క్షతగాత్రులౌతారు. విశ్వన్యాయాధిపతి తన దినాన భక్తిహీనుల నాశనమే జరుగుతుందని మనకు హామీనిస్తున్నాడు.

11. దేవునిపై, ఆయన ఆరాధనపై తిరుగుబాటు చేసేవారి భవిష్యత్తు ఏమై ఉంటుందని యెషయా చూపిస్తున్నాడు?

11 తప్పించుకునే నీతిమంతులు దేవుని ప్రవచన వాక్యం వాస్తవమైనదని గ్రహిస్తారు. యెహోవా “మీద తిరుగుబాటుచేసినవారి కళేబరము[లు]” ఆయన తీర్పుకు రుజువుగా ఉంటాయని 24వ వచనం ప్రవచిస్తుంది. యెషయా వాడిన పదాలు దిగ్భ్రాంతికరంగా అనిపించవచ్చు. అయితే, ఇదొక చారిత్రక వాస్తవంతో పొందిక కల్గివుంది. ప్రాచీన యెరూషలేము గోడల వెలుపల చెత్తను పారేయటానికి చెత్తకుప్పలు ఉండేవి, మరణశిక్ష విధించబడిన గౌరవంగా సమాధి చేయదగని నేరస్థుల శవాల్ని కూడా తరచూ అందులో పారేసేవారు. * అక్కడున్న పురుగులు, అగ్ని త్వరలోనే చెత్తనూ ఆ శవాలనూ నిర్మూలించేవి. స్పష్టంగా, పాపులైన వారిపై యెహోవా తీర్పును దృష్టాంతపర్చటానికి యెషయా ఈ వాస్తవాల ఆధారంగా విషయాన్ని వివరిస్తున్నాడు.

ఆయన వాగ్దానం చేసినది

12. నూతన లోకంలో జీవితానికి సంబంధించి యెషయా ఏ ఇతర సూచనలను ఇస్తున్నాడు?

12 రానున్న నూతన విధానంలో ఉండని కొన్ని విషయాల గురించి ప్రకటన 21:4 మనకు చెబుతుంది. అయితే, ఉండేవి ఏమిటి? జీవితం ఎలా ఉంటుంది? ఏమైనా నమ్మదగ్గ సంకేతాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆయన చివరిగా ‘క్రొత్త ఆకాశములను క్రొత్త భూమిని’ సృష్టించినప్పుడు అందులో జీవించేందుకు మనం యెహోవా ఆమోదాన్ని పొందినట్లైతే మనం అనుభవించగల పరిస్థితులను ప్రవచనాత్మకంగా యెషయా 65వ అధ్యాయం వర్ణిస్తుంది. క్రొత్త భూమిలో నిరంతరం నిలిచే అవకాశాన్ని ఆశీర్వాదంగా పొందినవారికి వృద్ధాప్యం రాదు, నిశ్చయంగా వారు మరణించరు. యెషయా 65:20 మనకు ఇలా అభయం ఇస్తుంది: “అక్కడ ఇకను కొద్దిదినములే బ్రదుకు శిశువులుండరు; కాలమునిండని ముసలివారుండరు; బాలురు నూరు సంవత్సరముల వయస్సుగలవారై చనిపోవుదురు; పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము నూరు సంవత్సరములు బ్రదుకును.”

13. దేవుని ప్రజలు భద్రతను అనుభవిస్తారని యెషయా 65:20 ఎలా మనకు అభయాన్నిస్తుంది?

13 యెషయా ప్రజల్లో మొదటిసారి ఇది నెరవేరినప్పుడు, ఆ దేశంలోని శిశువులు భద్రంగా ఉన్నారని సూచించింది. ఒకప్పుడు బబులోనీయులు వచ్చినట్లుగా, శత్రువులు ఎవరూ పాలుత్రాగే పిల్లల్ని పట్టుకుపోవటానికి, లేదా జీవితపు మంచి వయసులో ఉన్నవారిని చంపటానికి రాలేదు. (2 దినవృత్తాంతములు 36:17, 20) రానున్న నూతన లోకంలో ప్రజలు భద్రతతో, సురక్షితంగా ఉండి తమ జీవితాల్ని పూర్తిగా అనుభవిస్తారు. ఒకవేళ ఎవరైనా దేవునిపై తిరుగుబాటు చేయాలనుకుంటే, అతడు ఇక ఎంతోకాలం జీవించడు. దేవుడు వాణ్ని తొలగిస్తాడు. తిరుగుబాటు చేసిన పాపి వందేళ్ళ వాడైతే అప్పుడేమిటి? అనంత జీవితానికి పోలిస్తే అతడు ‘బాలుడు’గా ఉన్నప్పుడే, చనిపోతాడు.—1 తిమోతి 1:19, 20; 2 తిమోతి 2:16-19.

14, 15. యెషయా 65:21, 22 ఆధారంగా మీరు ఏ ప్రతిఫలదాయకమైన కార్యకలాపాల కోసం ఎదురుచూడగలరు?

14 ఇచ్ఛాపూర్వక పాపి ఎలా తొలగించబడతాడనే దానిపై కేంద్రీకరించటానికి బదులుగా, నూతన లోకంలో ఉండబోయే జీవన పరిస్థితులను గురించి యెషయా వర్ణిస్తున్నాడు. ఆ దృశ్యంలో మీరు భాగంగా ఉన్నట్లు ఊహించుకోండి. మీ మనోనేత్రంతో మొట్టమొదట చూసేది బహుశ మీ ఇంటికి సంబంధించినవే కావచ్చు. యెషయా 21, 22 వచనాల్లో ఇలా చెప్తున్నాడు: “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు; ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారుకట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు; వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును. నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు.”

15 మీకు నిర్మాణపనిలో అనుభవం లేనట్లైతే లేదా మీరు తోటపని మునుపెన్నడూ చేయనట్లైతే, మీకోసం ఒక విద్యాకార్యక్రమం వేచివుందని యెషయా ప్రవచనం సూచిస్తోంది. అయినా, మీరు సామర్థ్యం ఉన్న, నిపుణులైన నిర్దేశకుల సహాయంతో, బహుశ దయగల పొరుగువారి చేయూతతో ఇవన్నీ నేర్చుకోవాలనుకోరా? మీ ఇంటికి పెద్ద కిటికీలు ఉంటాయా, చల్లని గాలి లోపలికి వచ్చేలా వాటికి రెక్కలు ఉంటాయా లేదా మారుతున్న ఋతువులను గమనించటానికి అద్దాల కిటికీలు ఉంటాయా అని యెషయా ఏమీ చెప్పటం లేదు. కురిసే వర్షమూ మంచు మీ ఇంటి పైకప్పు మీదనుంచి జారిపోయేలా ఏటవాలుగా కట్టుకుంటారా? లేదా స్థానిక వాతావరణం ప్రకారంగా చదునైన పైకప్పు—మధ్యప్రాచ్యంలోలా—మీ కుటుంబమంతా కలిసి సంతుష్టికరమైన భోజనానికీ, సంభాషణకూ ఇంటి కప్పు మీదికి వెళ్ళగలిగేలా కట్టుకుంటారా?—ద్వితీయోపదేశకాండము 22:8; నెహెమ్యా 8:16.

16. నూతనలోకం నిత్యమూ సంతృప్తికరంగా ఉండగలదని ఎందుకు మీరు ఎదురుచూడవచ్చు?

16 అలాంటి వివరాలు తెలుసుకోవటం కంటే మీకు మరింత ప్రాముఖ్యమైన విషయం, మీకు సొంత ఇల్లు ఉంటుందన్నదే. అది మీదై ఉంటుంది—ఇప్పట్లా కట్టేందుకు కష్టపడేది మీరు, దాన్నుండి ప్రయోజనం పొందేది మరొకరన్నట్లు ఉండదు. యెషయా 65:21వ వచనం మీరు తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవిస్తారని కూడా చెబుతుంది. స్పష్టంగా, అది సాధారణ పరిస్థితిని సంగ్రహంగా చెబుతుంది. మీరు మీ ప్రయత్నాల నుండి, మీ శ్రమకు దక్కే ఫలితాల నుండి సంపూర్ణ సంతృప్తిని పొందుతారు. అదీ సుదీర్ఘకాలంపాటు—“వృక్షాయుష్యమంత” కాలంపాటు పొందుతారు. నిశ్చయంగా ఇది “సమస్తము నూతన”మన్న వర్ణనకు సరిపోతుంది !—కీర్తన 92:12-15.

17. తల్లిదండ్రులకు ప్రత్యేకించి ఏ వాగ్దానం ప్రోత్సాహకరంగా ఉంటుంది?

17 మీరు తల్లిదండ్రులైనట్లైతే ఈ మాటలు మీ హృదయాల్ని తాకుతాయి: “వారు వృథాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు; వారు యెహోవాచేత ఆశీర్వదింపబడినవారగుదురు వారి సంతానపువారు వారియొద్దనే యుందురు. వారికీలాగున జరుగును వారు వేడుకొనకమునుపు నేను ఉత్తరమిచ్చెదను వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను.” (యెషయా 65:23, 24) ‘ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనటంలోని’ కడుపుకోత గురించి మీకు తెలుసా? తల్లిదండ్రులకూ, మరితరులకూ ఆందోళన కలిగించగల పిల్లలకు సంభవించే అపాయాల చిట్టా మనకు అవసరం లేదు. దానికి తోడు, పిల్లల కోసం ఏమాత్రం సమయం వెచ్చించలేనంతగా, వారిని ఏమాత్రం పట్టించుకోలేనంతగా తమ స్వంత వ్యాపకాల్లో, కార్యకలాపాల్లో, వినోదాల్లో మునిగిపోయే తల్లిదండ్రుల్ని కూడా మనందరం చూశాము. దానికి భిన్నంగా, యెహోవా తాను మన అవసరాల కోసం చేసే ప్రార్థనల్ని వింటాననీ, వాటికి ప్రతిస్పందిస్తాననీ మనకు అభయాన్నిస్తున్నాడు, చివరికి ఆయన మనం అడుగక ముందే చర్యతీసుకుంటాడు.

18. నూతన లోకంలో జంతువులతో ఆనందంగా గడపవచ్చని మీరు ఎందుకు ఎదురుచూడవచ్చు?

18 నూతన లోకంలో ఆనందించే వాటి గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు దేవుని ప్రవచన వాక్యం చిత్రిస్తున్న దృశ్యాన్ని ఊహించుకోండి: “తోడేళ్లును గొఱ్ఱెపిల్లలును కలిసి మేయును, సింహము ఎద్దువలె గడ్డి తినును; సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధపర్వతములో అవి హానియైనను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (యెషయా 65:25) చిత్రకారులు ఈ దృశ్యాన్ని చిత్రించటానికి ప్రయత్నించారు, కానీ మనమిక్కడ చదివేది కేవలం ఏదో గొప్ప చిత్రకారుడు చిత్రించిన కళాఖండాన్ని గురించి కాదు. ఇది వాస్తవం అవుతుంది. మానవుల మధ్య శాంతి నెలకొంటుంది, అలాగే మృగాలతోనూ శాంతి ఉంటుంది. అనేకమంది జీవశాస్త్రజ్ఞులు, జంతువుల్ని ఇష్టపడేవారు ఏదో కొన్ని రకాల జంతువులను గురించి, బహుశ ఏదో ఒక్క ఉపజాతి గురించి నేర్చుకోవటానికి తమ జీవితంలోని ఎంతో విలువైన కాలాన్ని వెచ్చిస్తుంటారు. దీనికి భిన్నంగా, జంతువులకు మానవ భయం లేనప్పుడు మీరు నేర్చుకోగల విషయాల గురించి ఆలోచించండి. అప్పుడు మీరు పక్షుల్నీ, చిన్న చిన్న ప్రాణుల్నీ దగ్గరగా—అది అరణ్యంలోనైనా చిట్టడవిలోనైనా వాటిని సమీపించి, వాటిని గమనించి, వాటి నుండి నేర్చుకుని, వాటితో ఆనందించగలుగుతారు. (యోబు 12:7-9) మానవులనుంచీ, మృగాలనుంచీ ఏమాత్రం ప్రమాదం లేకుండా, మీరలా చేయగల్గుతారు. యెహోవా ఇలా అంటున్నాడు: “నా పరిశుద్ధ పర్వతములో అవి హానియైనను నాశనమైనను చేయకుండును.” నేడు మనం చూసే, అనుభవించే వాటికి ఇది ఎంత భిన్నంగా ఉంది !

19, 20. ఈనాటి అనేకమంది ప్రజలకు దేవుని ప్రజలు ఎందుకు భిన్నంగా ఉంటారు?

19 ముందే ప్రస్తావించినట్లుగా, మానవులు భవిష్యత్తును కచ్చితంగా చెప్పలేరు, క్రొత్త సహస్రాబ్దిని గురించి సర్వవ్యాప్తమైన చింత ఉన్నప్పటికీ ఇది నిజం. అది అనేకమంది నిరాశానిస్పృహలకు గందరగోళానికి గురయ్యేలా చేస్తుంది. కెనడాలోని ఒక యూనివర్శిటీ డైరెక్టర్‌ పీటర్‌ ఎంబెర్లీ ఇలా వ్రాశాడు: “చివరికి తమ ఉనికికిగల ప్రాథమికమైన ప్రశ్నల్ని అనేకులు ఎదుర్కొంటున్నారు. నేనెవర్ని? నిజంగా నేనెందుకు బ్రతుకుతున్నాను? నేను తర్వాతి తరం కోసం ఎటువంటి వారసత్వాన్ని విడిచిపెడ్తున్నాను? వారు మధ్యవయస్సుకు చేరుకునే సరికి తమ జీవితాలకొక క్రమాన్నీ అర్థాన్నీ కనుక్కోవటానికి కృషిచేస్తున్నారు.”

20 అనేకులు ఎందుకు అలా చేస్తున్నారో మీరు అర్థంచేసుకోగలరు. వారు ఉత్తేజకరమైన వినోదాలతోను, వ్యాపకాలతోను జీవితాన్ని అనుభవించాలని చూస్తారు. కానీ వారికి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలీదు, కాబట్టి వారి జీవితానికి ప్రాముఖ్యము, క్రమము, నిజమైన అర్థము కొరవడింది. ఇప్పుడు మనం పరిశీలించిన దాని వెలుగులో జీవితంపై మీ దృక్కోణం ఎంత భిన్నంగా ఉందో చూడండి. యెహోవా వాగ్దానం చేసిన క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో మన చుట్టూ చూసి, ‘దేవుడు నిజంగానే సమస్తాన్నీ నూతనంగా చేశాడు !’ అని మనం హృదయపూర్వకంగా చెప్తామని మీకు తెలుసు. మనం దాన్ని ఎంతగా ఆనందిస్తామో గదా !

21. యెషయా 65:25 లోనూ, యెషయా 11:9 లోనూ ఏ సమాంతర విషయాన్ని మనం చూడవచ్చు?

21 దేవుని నూతన లోకంలో జీవిస్తున్నట్లు ఊహించుకోవటం అతివిశ్వాసంతో కూడినది కాదు. ‘నా పరిశుద్ధపర్వతములో హానియైనను నాశనమైనను చేయని’ కాలంలో జీవించటం కోసం అర్హతలను సంపాదించుకోమని తనను ఇప్పుడు సత్యంతో ఆరాధించమని ఆయన ఆహ్వానిస్తున్నాడు, ఉద్బోధిస్తున్నాడు. (యెషయా 65:25) అయితే, యెషయా మునుపు కూడా అలాంటి వర్ణననే ఉపయోగించాడని మీకు తెలుసా? ఆ వర్ణనలో ఆయన, నూతన లోకంలో నిజంగా ఆనందించటానికి కీలకమైన విషయాన్ని చేరుస్తున్నాడు. యెషయా 11:9 ఇలా చెప్తుంది: “నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.”

22. నాలుగు బైబిలు ప్రవచనాల పరిశీలన ఏమి చేసేలా మన నిర్ణయాన్ని బలపర్చాలి?

22 “యెహోవానుగూర్చిన జ్ఞానము.” దేవుడు సమస్తాన్నీ నూతనం చేసినప్పుడు భూనివాసులకు ఆయన్ను గూర్చిన, ఆయన చిత్తాన్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానము ఉంటుంది. అందులో జంతులోకం నుండి నేర్చుకోవటం కంటే ఎక్కువే ఇమిడివుంది. అందులో ఆయన ప్రేరేపిత వాక్యం ఇమిడివుంది. ఉదాహరణకు, ‘క్రొత్త ఆకాశము క్రొత్త భూమి’ అని ప్రస్తావిస్తున్న నాలుగు ప్రవచనాలను పరిశీలించి మనం ఎంత తెలుసుకున్నామో ఆలోచించండి. (యెషయా 65:17; 66:22; 2 పేతురు 3:13; ప్రకటన 21:1) బైబిలును ప్రతిదినమూ చదవటానికి మీకు మంచి కారణం ఉంది. మీ దినచర్యలో అది ఒక భాగమా? కానట్లైతే, ప్రతిదినమూ దేవుడు చెబుతున్నది చదవటానికి ఏ సర్దుబాట్లు మీరు చేసుకోగలరు? నూతన లోకంలో ఆనందించటానికి మించినదాన్ని మీరు కనుగొంటారు, కీర్తనకర్త చేసినట్లుగా ఉప్పొంగిన ఆనందాన్ని ఇప్పట్నుంచే మీరు అందుకుంటారు.—కీర్తన 1:1, 2.

[అధస్సూచీలు]

^ పేరా 11 వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన అంతర్దృష్టి (ఆంగ్లం) సంపుటి 1, పేజి 906 చూడండి.

మీరెలా జవాబిస్తారు?

యెషయా 66:22-24 రానున్నదాన్ని ప్రవచిస్తుందనే ముగింపుకు మనం ఎందుకు రాగలం?

యెషయా 66:22-24, 65:20-25లలో నమోదు చేయబడిన ప్రవచనాలలో ప్రస్తావించబడినట్లుగా ప్రత్యేకించి మీరు దేని కోసం ఎదురు చూస్తారు?

• మీ భవిష్యత్తు గురించి భరోసాతో ఉండటానికి మీకు ఏ కారణాలున్నాయి?

[అధ్యయన ప్రశ్నలు]

[అధ్యయన ప్రశ్నలు]

[15వ పేజీలోని చిత్రం]

‘క్రొత్త ఆకాశము క్రొత్తభూమిలను’ గూర్చిన అంశాలను యెషయా, పేతురు, యోహానులు ప్రవచించారు