మారుతున్న “క్రైస్తవ” వైఖరిని—దేవుడు అంగీకరిస్తాడా?
మారుతున్న “క్రైస్తవ” వైఖరిని—దేవుడు అంగీకరిస్తాడా?
మీచిత్రాన్ని గీయమని మీరు ఒక చిత్రకారుడ్ని నియమించారనే అనుకోండి. ఆయన మీ చిత్రాన్ని గీయడం పూర్తి చేసినప్పుడు ఆ చిత్రానికి సరిగ్గా మీ పోలికే ఉండడం చూసి మీరు చాలా సంతోషిస్తారు. మీ పిల్లలు, మనమళ్ళు, మనమరాళ్ళు, వాళ్ళ మనమళ్ళు, మనమరాళ్ళు మీ చిత్రాన్ని చూసి ఎంతో గర్వించడాన్ని గురించి మీరూహించుకుంటారు.
కానీ, కొన్ని తరాల తర్వాత, వాళ్ళలో ఒకరు మీ చిత్రంలో మీ జుట్టు వెనక్కి దువ్వినట్లుండడం బాగోలేదని భావించి ముందుకు ఇంక కొంచెం జుట్టు గీశారనే అనుకోండి. మరొకరికి, మీ ముక్కు ఆకృతి నచ్చక, దాని ఆకృతిని మార్చారనే అనుకోండి. అలా ఒక్కో తరం గడిచిపోతున్న కొలది, మరిన్ని “మెరుగులు” దిద్దడం జరిగితే, చివరికి మీ చిత్రానికి మీ పోలిక ఉండదు. అలా జరిగిందని మీకు తెలిస్తే మీకెలా అనిపిస్తుంది? నిస్సందేహంగా మీకు ఆగ్రహం కలుగుతుంది.
విచారకరంగా, మీ చిత్రాన్ని గురించిన ఈ కథ సారమూ, నామమాత్ర క్రైస్తవ చర్చి చరిత్ర సారమూ ఒకటే. బైబిలులో పేర్కొనబడినట్లు, క్రీస్తు అపొస్తలులు మరణించిన కొద్ది కాలానికే, “క్రైస్తవ” సహజ వైఖరి మారనారంభించిందని చరిత్ర చూపిస్తుంది.—మత్తయి 13:24-30, 37-43; అపొస్తలుల కార్యములు 20:30. *
ఏ సంస్కృతిలోనైనా, ఏ కాలంలోనైనా బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం సముచితమే. కానీ, ప్రజల ఆలోచనాసరళికి తగినట్లుగా బైబిలు బోధలను మార్చడం పూర్తిగా వేరే మాట. అయితే, నిజానికి జరిగిందదే. క్రైస్తవ వైఖరి యొక్క ప్రాముఖ్యమైన అనేక పార్శ్వాల్లో వచ్చిన మార్పులను పరిశీలించండి.
చర్చి ప్రభుత్వంతో చేతులు కలుపుతోంది
తన పరిపాలన లేదా రాజ్యం పరలోక సంబంధమైనదనీ, నియమిత కాలంలో, అది మానవ ప్రభుత్వాలనన్నింటినీ ధ్వంసం చేసి, భూమ్యంతటా పరిపాలిస్తుందనీ యేసు బోధించాడు. (దానియేలు 2:44; మత్తయి 6:9, 10) అయితే, ఆ పరిపాలన మానవ రాజకీయ వ్యవస్థల ద్వారా జరిగేది కాదు. “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు” అని యేసు అన్నాడు. (యోహాను 17:16; 18:36) కనుక, యేసు శిష్యులు చట్టాన్ని అనుసరించేవారు, కానీ రాజకీయాల్లో పాల్గొనేవారు కారు.
అయితే, నాలుగవ శతాబ్దంలో, రోమా చక్రవర్తియైన కాన్‌స్టంటైన్ కాలానికల్లా, క్రైస్తవులమని చెప్పుకున్న చాలా మంది, క్రీస్తు రాకడ కొరకూ దేవుని రాజ్య స్థాపన కొరకూ ఎదురు చూడడంలో సహనాన్ని కోల్పోయారు. క్రమేణా, రాజకీయాలను గురించిన వాళ్ళ దృక్పథం మారింది. “కాన్‌స్టంటైన్ పరిపాలనకు మునుపు ఎన్నడూ కూడా క్రైస్తవులు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు [రాజకీయ] అధికారాన్ని మాధ్యమంగా ఉపయోగించలేదు. కాన్‌స్టంటైన్ పరిపాలన తర్వాత, క్రైస్తవత్వమూ, రాజకీయాలూ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగాయి” అని యూరోప్—ఎ హిస్టరీ అనే పుస్తకం చెబుతుంది. రూపు మారిన క్రైస్తవత్వం, రోమా సామ్రాజ్యంలోని సాధికారిక, “సార్వత్రిక” మతంగా లేదా “క్యాథలిక్” మతంగా మారింది.
“క్రీ.శ. 385 నాటికి, క్రైస్తవులపై చివరిసారిగా తీవ్ర హింసాకాండ చెలరేగి కేవలం 80 సంవత్సరాలే గడిచాయి.” చర్చికీ, ప్రభుత్వానికీ మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడడం మత్తయి 23:9, 10; 28:19, 20) చరిత్రకారుడైన హెచ్. జి. వెల్స్, నాలుగవ శతాబ్దపు క్రైస్తవత్వానికీ, “నజరేయుడైన యేసు బోధలకూ మధ్య ఉన్న పెద్ద పెద్ద తేడాలను” గురించి వ్రాశాడు. ఈ “పెద్ద పెద్ద తేడాలు” దేవుని గురించిన క్రీస్తును గురించిన ప్రాథమిక బోధలపై సహితం గొప్ప ప్రభావాన్ని చూపాయి.
మూలంగా, “అప్పటి నుండి, అంటే, క్రీ.శ. 385 నుండి, చర్చి తన విరోధులను శిక్షించనారంభించింది. చర్చి పాదిరీలు చక్రవర్తుల అధికారానికి సమానమైన అధికారాన్ని చూపించడం మొదలుపెట్టారు” అని గ్రేట్ ఏజెస్ ఆఫ్ మ్యాన్ అనే విజ్ఞాన సర్వస్వము చెబుతుంది. అలా, మతం మార్చుకోవలసిన అవసరముందని ప్రజలను ఒప్పించే బదులు ఖడ్గాన్ని ఉపయోగించి బెదిరించి ప్రజలు మతం మార్చేలా చేసే యుగం ప్రారంభమైంది. వినమ్రులైన మొదటి శతాబ్దపు ప్రసంగీకుల స్థానంలో హోదాలో ఉండి అధికారాన్ని చెలాయించే పాదిరీలు వచ్చారు. (దేవుణ్ణి తప్పుగా చిత్రీకరించడం
‘దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి’ అని ఆయన యెహోవా అనే నామం చేత గుర్తించబడుతున్నాడు అని క్రీస్తూ, ఆయన శిష్యులూ బోధించారు. యెహోవా అనే నామం ఆదిమ బైబిలు వ్రాతప్రతుల్లో దాదాపు 7,000 సార్లు కనిపిస్తుంది. (1 కొరింథీయులు 8:6; కీర్తన 83:18) దేవుడు యేసును సృష్టించాడు; యేసు, “సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు” అని క్యాతలిక్ అనువాదం కొలొస్సీయులు 1:15 లో చెబుతోంది. కనుక, యేసు కూడా సృష్టించబడినవాడు కనుకనే, “తండ్రి నాకంటె గొప్పవాడు” అని నిర్మొహమాటంగా అన్నాడు.—యోహాను 14:28.
కానీ, గ్రీకు తత్త్వవేత్తా అన్యుడూ అయిన ప్లేటో బోధించిన త్రిత్వ సిద్ధాంతాన్ని పలుకుబడిగల కొందరు పాదిరీలు ఎంతగానో ఇష్టపడ్డారు. మూడవ శతాబ్దం నాటికి, వాళ్ళు దేవుణ్ణి త్రిత్వ సిద్ధాంతానికి అనురూపంగా చిత్రీకరించడం మొదలుపెట్టారు. తర్వాతి శతాబ్దాల్లో, లేఖనాధారం లేకుండానే ఈ సిద్ధాంతం, యేసును యెహోవాతో సమానం చేసింది, దేవుని పరిశుద్ధాత్మను లేదా చురుకైన శక్తిని ఒక వ్యక్తిగా మార్చింది.
త్రిత్వ సిద్ధాంతమనే అన్యుల భావనను చర్చి అవలంబించడాన్ని గురించి న్యూ క్యాతలిక్ ఎన్‌సైక్లోపీడియా ఇలా అంటోంది: “‘ముగ్గురు వ్యక్తులు కలిసిన ఏక దేవుడు’ అనే సూత్రం నాలుగవ శతాబ్దాంతం వరకూ, అది క్రైస్తవ జీవితంలోను, క్రైస్తవ విశ్వాసంలోను పూర్తిగా ఇమడలేకపోయింది, స్థిరపడలేకపోయింది. కానీ ఈ సూత్రమే తర్వాత ట్రినిటేరియన్ డాగ్మా (త్రిత్వ సిద్ధాంతం) అనే పేరున మొదటిసారిగా అంగీకరించబడింది. దేవుడు త్రిత్వంలో భాగమన్న తలంపు అపొస్తలులైన ఫాదర్‌ల మనస్సుల్లో ఎన్నడూ రాలేదు, వాళ్ళు ఆ విధంగా ఎన్నడూ దృష్టించలేదు కూడా.”
“నాలుగవ శతాబ్దపు త్రిత్వవాదం, దేవుని వ్యక్తిత్వాన్ని గురించి తొలి క్రైస్తవులు చేసిన బోధను ప్రతిబింబించే బదులు ప్రక్కదారి పట్టింది” అని ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా అంటోంది. “తర్వాత చేర్చబడిన” అనేక “సూత్రాల్లో” త్రిత్వసిద్ధాంతం ఒకటి అని ది ఆక్స్‌ఫార్డ్ కంపానియన్ టు ద బైబిల్ అంటోంది. అయితే, చర్చి బోధల్లో తర్వాత చేర్చబడినది త్రిత్వ బోధ మాత్రమే కాదు.
ఆత్మ అమర్త్యమైనదనే తప్పుడు బోధ
మానవుల్లో అమర్త్యమైన ఆత్మ ఉందనీ, శరీరం చనిపోయినా ఆత్మ బ్రతికే ఉంటుందనీ నేడు సాధారణంగా నమ్మబడుతుంది. ఆత్మ అమర్త్యమైనదనే బోధ కూడా చర్చి బోధల్లో తర్వాత చేర్చబడినదేనని మీకు తెలుసా? “చచ్చినవారు ఏమియు ఎరుగరు,” గాఢనిద్రలో ఉన్నట్లుగా ఉంటారు అని బైబిలు చెప్పే సత్యాన్ని యేసు నొక్కిచెప్పాడు. (ప్రసంగి 9:5; యోహాను 11:11-13) పునరుత్థానం ద్వారా మృతులకు జీవం తిరిగి ఇవ్వబడుతుంది, మృతులు మరణమనే నిద్ర నుండి లేచి, “బయటికి వచ్చెదరు.” (యోహాను 5:28, 29) ఆత్మ నిజంగానే అమర్త్యమైనదైతే, అది మరణాన్ని అధిగమిస్తుంది గనుక, ఇక పునరుత్థానం చేయాల్సిన అవసరం ఎందుకుంటుంది?
యేసు మృతులను జీవింపజేయడం ద్వారా, పునరుత్థానమనే బైబిలు బోధ వాస్తవమైనదని చూపించాడు. లాజరు ఉదాహరణనే తీసుకోండి. ఆయన చనిపోయి నాలుగు రోజులైంది. యేసు ఆయనను పునరుత్థానం చేసినప్పుడు, ఆయన జీవమూ ఊపిరీ ఉన్న మానవుడుగా సమాధి నుండి బయటికి వచ్చాడు. ఆయన మృత్యువు నుండి లేచి వచ్చినప్పుడు, ఆయన ఆత్మ పరలోక పరదైసు నుండి ఆయన శరీరంలోకి ప్రవేశించడం లాంటిదేమీ జరగలేదు. అలా జరిగి ఉంటే, యేసు ఆయనను పునరుత్థానం చేయడం ద్వారా ఆయనకు మేలు చేసినవాడు కాలేడు !—యోహాను 11:39, 43, 44.
అయితే, అమర్త్య ఆత్మను గురించిన సిద్ధాంతానికి మూలమేమిటి? ఈ భావన “బైబిలు నుండి వచ్చింది కాదు, గ్రీకు తత్త్వ చింతన నుండి వచ్చినదే” అని ద వెస్ట్‌మినిస్టర్ డిక్షనరీ ఆఫ్ క్రిస్టియన్ థియాలజీ చెబుతుంది. “ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత కూడా కొనసాగుతుందన్న నమ్మకం పూర్తిగా తత్త్వ చింతనకు లేదా వేదాంత శాస్త్ర సంబంధ ఊహలకు
సంబంధించినదే గానీ, స్వచ్ఛమైన విశ్వాసానికి సంబంధించినది కాదు. పవిత్ర లేఖనాల్లో ఎక్కడా అలాంటి బోధ వ్యక్తీకరించబడలేదు” అని ద జ్యూయిష్ ఎన్‌సైక్లోపీడియా వివరిస్తుంది.తరచూ, ఒక అబద్ధం మరో అబద్ధానికి దారితీస్తుంది. ఆత్మ అమర్త్యమైనదన్న బోధ విషయంలో కూడా అది నిజం. ఆత్మ అమర్త్యమైనదన్న బోధ, నరకాగ్నిలో శాశ్వత దండన అనే అన్యమత తలంపుకు కూడా దారితీసింది. * అయితే, బైబిలు, “పాపమువలన వచ్చు జీతము మరణము” అని చెబుతుందే గానీ, శాశ్వత దండన అని చెప్పడం లేదు. (రోమీయులు 6:23) కనుక బైబిలు, పునరుత్థానాన్ని గురించి వర్ణిస్తూ, “సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను” అని చెబుతుంది. “సముద్రం తనలో ఉన్న చనిపోయినవారిని అప్పగించింది. మృత్యువు, పాతాళం తమలో ఉన్న చనిపోయినవారిని అప్పగించాయి” అని పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం చెబుతుంది. అవును, సరళంగా చెప్పాలంటే, పాతాళంలో ఉన్న వారు మృతులని అర్థం. యేసు చెప్పినట్లు, ‘నిద్రలో ఉన్నవారు’ అని అర్థం.—ప్రకటన 20:13.
శాశ్వత నరక దండనను గురించిన బోధ ప్రజలను దేవుని వైపుకు ఆకర్షిస్తుందని మీరు నిజంగా అనుకుంటున్నారా? నిజానికి ఆ బోధవల్ల ప్రజలు దేవునికి మరింత దూరమౌతారు. నీతిమంతులైన, ప్రేమామయులైన ప్రజలకు అది చాలా జుగుప్సాకరమైన తలంపుగా అనిపిస్తుంది ! మరొకవైపు, “దేవుడు ప్రేమాస్వరూపి” అని, క్రూరంగా వ్యవహరించడాన్ని, జంతువులతో అయినా సరే క్రూరంగా వ్యవహరించడాన్ని ఆయన అసహ్యించుకుంటాడు అని బైబిలు బోధిస్తుంది.—1 యోహాను 4:8; సామెతలు 12:10; యిర్మీయా 7:31; యోనా 4:11.
అసలు “చిత్రము”ను ఆధునిక కాలాల్లో విరూపంగా మార్చడం
దేవుణ్ణీ, క్రైస్తవత్వాన్నీ విరూపంగా చిత్రీకరించడం ఇప్పటికీ కొనసాగుతోంది. మతసంబంధ ప్రొఫెసర్ ఒకరు, తమ ప్రొటెస్టెంట్ చర్చిలో జరుగుతున్న పోరాటాన్ని గురించి, “లేఖనానుసారమైన విశ్వాస సూత్రాల అధికారానికీ, అన్యుల మానవుల ఆదర్శవాదానికీ మధ్య జరుగుతున్న పోరాటమని, చర్చి క్రీస్తు అధికారానికి నమ్మకంగా ఉండాలన్న తలంపుకీ, చర్చి ఆయా కాలాలకు తగినట్లుగా మారాలి అన్న తలంపుకీ మధ్య జరుగుతున్న పోరాటం” అని వర్ణించాడు. “చర్చి ఎలా ముందుకు వెళ్ళాలన్నది ఏది నిర్ణయిస్తుంది? . . . పరిశుద్ధ లేఖనాలా లేక ఆయా కాలాల్లో ప్రాబల్యంలో ఉన్న తలంపులా? అన్నదే వివాదవిషయం” అని కూడా ఆయన అన్నాడు.
విచారకరంగా, ‘ఆయా కాలాల్లో ప్రాబల్యంలో ఉన్న తలంపులే’ ఇప్పటి వరకూ రాజ్యమేలుతున్నాయి. ఉదాహరణకు, తాము అంతకంతకూ అభివృద్ధిని సాధిస్తున్నట్లు, విశాల దృక్పథం చూపిస్తున్నట్లు ఇతరులకు అనిపించేందుకుగాను అనేక చర్చిలు అనేక వివాదాంశాలపై తమకున్న అభిప్రాయాన్ని మార్చుకున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. మొదటి శీర్షికలో పేర్కొన్నట్లు, ముఖ్యంగా నైతిక విషయాల్లో చర్చీలు చాలా స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నాయి. అయితే, జారత్వమూ వ్యభిచారమూ సలింగ సంపర్కమూ దేవుని దృష్టిలో చాలా పెద్ద పాపాలనీ, అలాంటి పాపాలను చేసేవారు “దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు” అనీ బైబిలు స్పష్టంగా చెబుతుంది.—1 కొరింథీయులు 6:9, 10; మత్తయి 5:27-32; రోమీయులు 1:26, 27.
అపొస్తలుడైన పౌలు పై మాటలు వ్రాసినప్పుడు, ఆయన చుట్టూ ఉన్న గ్రీసు, రోమా సామ్రాజ్యాలు అన్ని రకాల దుష్టత్వాలతో నిండి ఉన్నాయి. ‘సొదొమ గొమొర్రాలు భయంకరమైన లైంగిక పాపాలను చేసినందుకే దేవుడు వాటిని భస్మము చేశాడు. కానీ, అది 2,000 సంవత్సరాల క్రితం నాటి సంగతి ! జ్ఞానోదయం కలిగిన ఈ యుగంలో అది వర్తించదు’ అని పౌలు తర్కించగల్గేవాడే. కానీ ఆయన అలా తర్కించలేదు; బైబిలు సత్యాన్ని చెరపడానికి ఆయన నిరాకరించాడు.—గలతీయులు 5:19-23.
తొలి “చిత్రీకరణ”ను చూడండి
తన కాలం నాటి యూదా మత నాయకుల గురించి మాట్లాడుతూ, మీరు ‘మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తున్నారు’ గనుక మీ ఆరాధన “వ్యర్థము” అని యేసు చెప్పాడు. (మత్తయి 15:9) నేటి పాదిరీలు క్రైస్తవ బోధలను మార్చివేసినట్లే, ఇప్పటికీ మార్చివేస్తున్నట్లే, యేసు కాలం నాటి మత నాయకులు కూడా మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని మార్చివేశారు. వాళ్ళు దైవిక సత్యంపై సాంప్రదాయమనే “రంగు”ను చల్లారు. కానీ, యథార్థవంతులైన ప్రజల ప్రయోజనార్థం యేసు వాళ్ళ అబద్ధాలనన్నింటినీ బయటపెట్టాడు. (మార్కు 7:7-13) సత్యానికి ప్రజాదరణ ఉన్నా లేకున్నా, యేసు సత్యమే మాట్లాడాడు. ఆయన ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకునే మాట్లాడేవాడు.—యోహాను 17:17.
క్రైస్తవులమని చెప్పుకునే అనేకులకు యేసు ఎంత భిన్నంగా ఉన్నాడు ! “జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన 2 తిమోతి 4:3, 4) కాబట్టి, ఈ ‘కల్పనాకథలు’ ఆధ్యాత్మికతను నాశనం చేస్తే, దేవుని వాక్యపు సత్యం, ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కలుగజేసి నిత్యజీవానికి నడిపిస్తుంది. ఈ సత్యాన్ని గురించి పరిశీలించమనే యెహోవాసాక్షులు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు.—యోహాను 4:24; 8:32; 17:3.
బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవి నియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును” అని బైబిలు ముందే చెప్పింది. ([అధస్సూచీలు]
^ పేరా 4 గోధుమల గురుగుల ఉపమానంలోను, విశాలమైన ఇరుకైన మార్గాలను గురించిన ఉదాహరణలోను (మత్తయి 7:13, 14) యేసు ఈ విషయాన్ని సూచించినట్లు, నిజక్రైస్తవత్వాన్ని అవలంబించేవారి సంఖ్య కాలప్రవాహంలో తక్కువవుతూ ఉంటుంది. గురుగుల్లాంటివాళ్ళు అధికమౌతూ, తాము నిజ క్రైస్తవులమని తమ బోధలు నిజ క్రైస్తవ బోధలని ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ శీర్షిక మాట్లాడుతున్నది మారుతున్న ఈ వైఖరిని గురించే.
^ పేరా 19 షియోల్ అనే హెబ్రీ పదం యొక్క అర్థమూ, హేడీస్ అనే గ్రీకు పదము యొక్క అర్థమూ ఒక్కటే. ఈ పదాల అసలు అర్థము సమాధి. కానీ ఈ పదాలు తెలుగు బైబిళ్ళలో “నరకము,” “పాతాళము” అని అనువదించబడ్డాయి.
[7వ పేజీలోని బాక్సు/చిత్రం]
క్రైస్తవుడనే పేరు ఉద్భవం
యేసు మరణించిన తర్వాత, కనీసం పది సంవత్సరాల వరకూ, ఆయన అనుచరులు “క్రీస్తు మార్గము”లోని వాళ్ళు అనే పిలువబడేవారు. (అపొస్తలుల కార్యములు 9:2; 19:9, 23; 22:4) ఎందుకని? ఎందుకంటే, ‘మార్గము, సత్యము, జీవము’ అయిన యేసుక్రీస్తు నందలి విశ్వాసం చుట్టూ వారి జీవిత విధానం పరిభ్రమిస్తూ ఉండేది. (యోహాను 14:6) అయితే ఆ తర్వాత, సా.శ. 44 లో, సిరియా అంతియొకలో, యేసు శిష్యులు దైవేచ్ఛ మూలంగా, ‘క్రైస్తవులు’ అని పిలువబడ్డారు. (అపొస్తలుల కార్యములు 11:26) ఈ పేరు అధికారుల మధ్య సహితం చాలా త్వరగా చలామణి అయ్యింది. (అపొస్తలుల కార్యములు 26:28) క్రీస్తు శిష్యుల పేరు మారినప్పటికీ వాళ్ళ జీవిత విధానం మారలేదు. క్రీస్తు శిష్యులు ఆయన చూపించిన మాదిరిని అనుసరిస్తూనే ఉండాలి.—1 పేతురు 2:21.
[7వ పేజీలోని చిత్రం]
యెహోవాసాక్షులు బహిరంగ పరిచర్య ద్వారా ప్రజలను దేవుని వాక్యమైన బైబిలు వైపుకు నడిపిస్తారు
[4వ పేజీలోని చిత్రసౌజన్యం]
ఎడమ నుండి మూడవది: United Nations/Photo by Saw Lwin