అత్యంత ఉత్సాహంతో సువార్తను ప్రకటించండి
అత్యంత ఉత్సాహంతో సువార్తను ప్రకటించండి
“ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.”—రోమీయులు 12:11.
1, 2. సువార్త ప్రచారకులుగా క్రైస్తవులు ఏ దృక్పథాన్ని కాపాడుకోవటానికి కృషి చేస్తారు?
ఒక యౌవనస్థుడు తన క్రొత్త ఉద్యోగంలో చేరబోతున్నప్పుడు ఎంతో ఉత్తేజంతో ఉంటాడు. తన ఉద్యోగంలో మొదటి రోజు తన యజమాని ఇచ్చే సూచనల కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంటాడు. అతడు తనకు అప్పగించబడే మొట్టమొదటి పని కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూడడమే గాక దాన్ని ఎంతో గంభీరంగా తీసుకుంటాడు. అతడు తనకు సాధ్యమైనంత చక్కగా దాన్ని నిర్వర్తించాలనే అత్యుత్సాహంతో ఉంటాడు.
2 అదే విధంగా క్రైస్తవులముగా, మనల్ని మనం క్రొత్తపనివారిగా దృష్టించుకోవచ్చు. నిరంతరం జీవించాలన్నది మన నిరీక్షణ గనుక, మనం ఇప్పుడిప్పుడే యెహోవా కోసం పనిచేయటం మొదలు పెట్టామని చెప్పవచ్చు. మనల్ని నిరంతరం బిజీగా ఉంచేందుకు మన సృష్టికర్త మనస్సులో ఎన్నో పథకాలున్నాయని మనం నిశ్చయత కల్గివుండవచ్చు. అయితే మనం అందుకున్న మొట్టమొదటి నియామకం ఆయన రాజ్య సువార్తను ప్రకటించడమన్నదే. (1 థెస్సలొనీకయులు 2:4) దేవుడిచ్చిన ఈ నియామకం గురించి మనమెలా భావిస్తాము? ఆ యౌవనస్థునిలా, మనం కూడా దాన్ని ఆసక్తితోను, ఆనందంతోను, ఎంతో ఉత్సాహంతోనూ మనకు సాధ్యమైనంత చక్కగా నిర్వర్తించాలని కోరుకుంటాము !
3. సువార్త ప్రచారకులుగా మనం విజయం సాధించాలంటే ఏమి అవసరం?
3 నిజమే, అలాంటి అనుకూల దృక్పథాన్ని అలాగే కాపాడుకోవటం ఒక సవాలే. పరిచర్యనే గాక మనకు ఇంకా అనేక ఇతర బాధ్యతలున్నాయి, వాటిలో కొన్ని మనం శారీరకంగానూ, భావోద్రేకపరంగానూ అలసిపోయేలా చేయవచ్చు. అయినప్పటికీ ఈ ఇతర బాధ్యతల గురించి శ్రద్ధ తీసుకుంటూనే మనం చాలామేరకు మన పరిచర్యకు తగినంత అవధానాన్నిస్తాము. అయితే, అది ఎడతెగని పోరాటమే. (మార్కు 8:34) క్రైస్తవులముగా మనం విజయం సాధించటానికి ఎంతో తీవ్రమైన కృషి అవసరమని యేసు నొక్కి చెప్పాడు.—లూకా 13:24.
4. మన ఆధ్యాత్మిక దృక్కోణాన్ని అనుదిన చింతలు ఎలా ప్రభావితం చేయవచ్చు?
4 చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి కాబట్టి కొన్నిసార్లు మనం ఉక్కిరిబిక్కిరైపోవటం లేదా కృంగిపోవటం సులభమే. “ఐహిక విచారములు” ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్ల మనకున్న ఉత్సాహాన్నీ, మెప్పునూ అణిచివేయగలవు. (లూకా 21:34, 35; మార్కు 4:18, 19) మన అపరిపూర్ణ మానవ నైజాన్ని బట్టి, ‘మొదట మనకుండిన ప్రేమను’ మనం విడిచిపెట్టే అవకాశం ఉంది. (ప్రకటన 2:1-4) యెహోవాకు మనం చేసే సేవలోని కొన్ని అంశాలు ఒకవిధంగా యాంత్రికమైనవిగా అయిపోవచ్చు. పరిచర్య పట్ల మనకున్న ఉత్సాహాన్ని చైతన్యవంతంగానే ఉంచుకోవటానికి అవసరమైన ప్రోత్సాహాన్ని బైబిలు ఎలా అందజేస్తుంది?
మన హృదయాల్లో ‘మండుతున్న అగ్నిలా’
5, 6. తనకున్న ప్రకటించే ఆధిక్యతను అపొస్తలుడైన పౌలు ఎలా దృష్టించాడు?
5 యెహోవా మనకప్పగించిన పరిచర్య ఎంత అమూల్యమైనదంటే దాన్ని మనం మామూలుగా తీసుకోకూడదు. అపొస్తలుడైన పౌలు సువార్త ప్రకటించడాన్ని ఎంతో గొప్ప ఆధిక్యతగా ఎంచాడు, అది తనకు అప్పగించబడడానికి తాను అర్హుణ్ణి కానని ఆయన భావించాడు. అందుకే ఆయనిలా అన్నాడు: “శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగైయున్న ఆ మర్మమునుగూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.”—ఎఫెసీయులు 3:8-11.
6 పౌలుకు తన పరిచర్య పట్ల ఉన్న అనుకూల దృక్పథం మనకు అద్భుతమైన మాదిరిగా ఉంది. రోమీయులకు తాను వ్రాసిన పత్రికలో ఆయనిలా పేర్కొన్నాడు: “సువార్త ప్రకటించుటకు సిద్ధముగా [“అత్యంత ఉత్సాహంతో,” NW] ఉన్నాను.” ఆయన సువార్త గురించి సిగ్గుపడలేదు. (రోమీయులు 1:15, 16) కేవలం తనకు అప్పగించబడిన పరిచర్య పట్ల సరైన దృక్పథం కల్గివుండడమే గాక, దాన్ని నెరవేర్చాలని అత్యంత ఉత్సాహంతో కూడా ఉన్నాడు.
7. రోమీయులకు వ్రాసిన తన పత్రికలో పౌలు దేని గురించి హెచ్చరించాడు?
7 అలాంటి ఉత్సాహాన్ని అలాగే కాపాడుకోవలసిన అవసరం ఉందని అపొస్తలుడైన పౌలు గుర్తించాడు, అందుకే ఆయన రోములోని క్రైస్తవులకు ఇలా ఉద్భోదించాడు: “ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.” (రోమీయులు 12:11) “మాంద్యులు” అని అనువదించబడిన గ్రీకు పదం “సోమరిగా ఉండడం, బద్ధకంగా ఉండడం” అనే తలంపునిస్తుంది. మనం మన పరిచర్యలో నిజంగా మాంద్యులుగా ఉండకపోయినప్పటికీ, మనమందరం ఆధ్యాత్మిక సోమరితనపు తొలి లక్షణాలేవైనా ఒకవేళ మనలో కనిపిస్తున్నట్లైతే వాటిని త్వరగా గుర్తించి, వెంటనే మన దృక్కోణంలో తగిన మార్పులు చేసుకునేందుకు అప్రమత్తంగా ఉండాలి.—సామెతలు 22:3.
8. (ఎ) యిర్మీయా హృదయంలో ఏది “అగ్నివలె మండు”తున్నట్లు అయ్యింది, ఎందుకు? (బి) యిర్మీయా అనుభవం నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?
8 మనం నిరుత్సాహంగా ఉన్నప్పుడు కూడా దేవుని ఆత్మ మనకు సహాయం చేయగలదు. ఉదాహరణకు, ప్రవక్తయైన యిర్మీయా ఒక సందర్భంలో నిరుత్సాహపడి, తాను చేసే ప్రవచన పనిని నిలిపివేయాలని అనుకున్నాడు. యెహోవా గురించి ఆయనిలా కూడా అన్నాడు: “ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను.” ఇది యిర్మీయాలో ఉన్న గంభీరమైన ఆధ్యాత్మిక లక్షణాల లోటుకు నిదర్శనంగా ఉందా? లేదు. నిజానికి, యిర్మీయాకున్న బలమైన ఆధ్యాత్మికత, యెహోవాపట్ల ఆయనకున్న ప్రేమ, సత్యంపట్ల ఆయనకున్న ఆసక్తి ఆయన ప్రవచన పనిని కొనసాగించడానికి కావలసిన శక్తిని ఇచ్చాయి. యిర్మీయా 20:9) దేవుని నమ్మకమైన సేవకులు అప్పుడప్పుడు నిరుత్సాహపడటం సహజమే. కానీ వాళ్లు సహాయం కోసం యెహోవాకు ప్రార్థించినప్పుడు, ఆయన వారి హృదయాలను చదివి, యిర్మీయా హృదయంలో ఉన్నట్లుగా వారి హృదయాల్లో గనుక తన వాక్యం ఉంటే, వారికి తన పరిశుద్ధాత్మను ధారాళంగా అనుగ్రహిస్తాడు.—లూకా 11:9-13; అపొస్తలుల కార్యములు 15:8.
ఆయనిలా వివరిస్తున్నాడు: “[యెహోవా వాక్యము] నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడి యున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు.” (“ఆత్మను ఆర్పకుడి”
9. పరిశుద్ధాత్మ మన మీద పని చేయకుండా ఏది ఆటంకపర్చగలదు?
9 అపొస్తలుడైన పౌలు థెస్సలొనీకయులకు, “ఆత్మను ఆర్పకుడి” అని ఉద్బోధించాడు. (1 థెస్సలొనీకయులు 5:19) అవును, దైవిక సూత్రాలకు వ్యతిరేకమైన చర్యలు, దృక్పథాలు పరిశుద్ధాత్మ మన మీద పనిచేయకుండా ఆటంకపర్చగలవు. (ఎఫెసీయులు 4:30) క్రైస్తవులకు నేడు సువార్త ప్రకటించే పని ఉంది. ఈ ఆధిక్యతను మనం ప్రగాఢమైన గౌరవంతో చూస్తాము. దేవుని నెరుగని వారు మన ప్రకటనా పనిని నిరసనగా చూశారంటే అందులో ఆశ్చర్యపోవలసినదేమీ లేదు. కానీ ఒక క్రైస్తవుడు ఉద్దేశపూర్వకంగా తన పరిచర్యను నిర్లక్ష్యం చేస్తే, అది దేవుని ప్రేరణాత్మక ఆత్మను ఆర్పివేయడానికి దారి తీయవచ్చు.
10. (ఎ) బయటి వారి దృక్పథం మనల్నెలా ప్రభావితం చేయగలదు? (బి) రెండవ కొరింథీయులు 2:17 నందు మన పరిచర్యను గురించి ఏ ఉన్నతమైన దృక్కోణం వ్యక్తపర్చబడింది?
10 క్రైస్తవ సంఘం వెలుపల ఉన్న కొంతమంది మన పరిచర్యను కేవలం సాహిత్యాన్ని పంచిపెట్టడంగా దృష్టించవచ్చు. మనం కేవలం చందాల కోసం ఇంటింటికీ వెళతామని మరి కొంతమంది పొరబడవచ్చు. అలాంటి ప్రతికూల తలంపులు మన దృక్పథాన్ని ప్రభావితం చేసేందుకు మనం అనుమతిస్తే, అది పరిచర్యలో మన సమర్థతను తగ్గించవచ్చు. అలాంటి అలోచనా విధానం మనపై ప్రభావం చూపేందుకు అనుమతించే బదులు, మన పరిచర్య పట్ల యెహోవా యేసులు కల్గివున్న దృక్పథాన్ని కల్గివుండటానికి మనం ప్రయత్నిద్దాము. అపొస్తలుడైన పౌలు, “మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యముగలవారమును దేవునివలన నియమింపబడిన వారమునైయుండి, క్రీస్తునందు దేవునియెదుట బోధించుచున్నాము” అని చెప్పినప్పుడు అలాంటి ఉన్నతమైన దృక్పథాన్నే వ్యక్తపరిచాడు.—2 కొరింథీయులు 2:17.
11. హింసల సమయంలో కూడా ఉత్సాహంగా ఉండటానికి మొదటి క్రైస్తవులకు ఏది సహాయం చేసింది, వారి మాదిరి మనల్నెలా ప్రభావితం చేయాలి?
11 యేసు మరణించిన తర్వాత, యెరూషలేములో ఉన్న ఆయన శిష్యులు కొంతకాలంపాటు హింసించబడ్డారు. వాళ్లను అపొస్తలుల కార్యములు 4:17, 21, 31) అటుతర్వాత కొన్ని సంవత్సరాలకు పౌలు తిమోతికి వ్రాసిన మాటలు, క్రైస్తవులు కాపాడుకోవలసిన అనుకూల దృక్పథాన్ని చూపిస్తున్నాయి. పౌలు ఇలా చెప్పాడు: “దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మనియ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చియైనను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చియైనను సిగ్గుపడక, దేవుని శక్తినిబట్టి సువార్తనిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము.”—2 తిమోతి 1:7, 8.
భయపెట్టి, ప్రకటించడం ఆపమని ఆజ్ఞాపించడం జరిగింది. అయినప్పటికీ, వారు “పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి” అని బైబిలు చెబుతుంది. (మనం మన పొరుగువారికి ఏమి ఋణపడి ఉన్నాము?
12. మనం సువార్త ప్రకటించటానికి గల ముఖ్య కారణం ఏమిటి?
12 మన పరిచర్య పట్ల సరైన దృక్పథం కల్గివుండటానికి మనకు సరైన ఉద్దేశం ఉండాలి. అసలు మనమెందుకు ప్రకటిస్తాము? దానికి గల ముఖ్య కారణాన్ని కీర్తన గ్రంథకర్త వ్రాసిన ఈ మాటల్లో చూడవచ్చు: “నీ భక్తులు నిన్ను [యెహోవాను] సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్యప్రభావమునుగూర్చి చెప్పుకొందురు నీ శౌర్యమునుగూర్చి పలుకుదురు.” (కీర్తన 145:10-12) అవును, యెహోవాను బహిరంగంగా స్తుతించడానికీ, మానవజాతి అంతటి ఎదుటా ఆయన నామాన్ని మహిమపర్చటానికీ మనం ప్రకటిస్తాము. మనం చెప్పేది కేవలం కొంతమందే విన్నప్పటికీ, మనం రక్షణ సందేశాన్ని నమ్మకంగా ప్రకటించడం యెహోవాకు స్తుతిని తెస్తుంది.
13. రక్షణ నిరీక్షణను గురించి ఇతరులకు చెప్పటానికి మనల్ని ఏది పురికొల్పుతుంది?
13 ప్రజల పట్ల ఉన్న ప్రేమతోనూ, రక్తాపరాధాన్ని తప్పించుకోవటానికిగానూ కూడా మనం ప్రకటిస్తాము. (యెహెజ్కేలు 33:8; మార్కు 6:34) “గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కానివారికిని, జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్థుడను” అని క్రైస్తవ సంఘం వెలుపల ఉన్నవారి గురించి మాట్లాడుతూ పౌలు చెప్పిన మాటలు దీనికి సంబంధించినవే. (రోమీయులు 1:14) ‘మనుష్యులందరు రక్షణపొందాలన్నది’ దేవుని చిత్తం గనుక ప్రజలకు సువార్త ప్రకటించవలసిన బాధ్యత తనకుందనీ, అది తను తీర్చాల్సిన ఋణమనీ పౌలు భావించాడు. (1 తిమోతి 2:4) నేడు మనం కూడా పొరుగువారి పట్ల అదే ప్రేమను కల్గివుండి, వారి పట్ల అదే బాధ్యతను కల్గివున్నట్లు భావిస్తాము. మానవజాతి పట్ల యెహోవాకున్న ప్రేమ, వారి కోసం మరణించేందుకు తన కుమారుడ్ని ఈ భూమిపైకి పంపేలా ఆయనను ప్రేరేపించింది. (యోహాను 3:16) అది గొప్ప త్యాగం. యేసు బలిపై ఆధారపడి ఉన్న రక్షణ సువార్తను ఇతరులకు చెప్పటానికి మన సమయాన్ని వెచ్చించి మనం కృషి చేసినప్పుడు మనం యెహోవా ప్రేమను అనుకరిస్తాము.
14. క్రైస్తవ సంఘానికి వెలుపలున్న లోకాన్ని బైబిలు ఎలా వర్ణిస్తుంది?
14 యెహోవా సాక్షులు తమ తోటి మానవులను క్రైస్తవ సహోదర సహోదరీలు కాగలవారిగా దృష్టిస్తారు. మనం ధైర్యంగా ప్రకటించాలి, అయితే మన ధైర్యం పోరు పెట్టుకునేలాంటిదై ఉండకూడదు. ఒక విషయం ఏమిటంటే, లోకం గురించి మాట్లాడేటప్పుడు బైబిలు చాలా ఘాటైన పదాలనే ఉపయోగిస్తుంది. “లోక జ్ఞానము,” “ఇహలోక సంబంధమైన దురాశ” వంటి వాటి గురించి మాట్లాడేటప్పుడు పౌలు ‘లోకం’ అన్న పదాన్ని ప్రతికూల భావంలోనే ఉపయోగించాడు. (1 కొరింథీయులు 3:19; తీతు 2:12) “యీ ప్రపంచ ధర్మముచొప్పున” నడుచుకున్నప్పుడు వారు ఆధ్యాత్మికంగా “చచ్చినవారై” ఉంటారని కూడా పౌలు ఎఫెసులోని క్రైస్తవులకు గుర్తు చేశాడు. (ఎఫెసీయులు 2:1-3) ఈ వ్యాఖ్యానాలు, అలాంటి ఇతర వ్యాఖ్యానాలు, “లోకమంతయు దుష్టుని యందున్నదని” అపొస్తలుడైన యోహాను వ్రాసిన మాటలతో పొందిక కల్గివున్నాయి.—1 యోహాను 5:19.
15. క్రైస్తవ సంఘం వెలుపలున్న వ్యక్తుల గురించి మనం ఏమి చేయకూడదు, ఎందుకు?
15 అయితే అలాంటి వ్యాఖ్యానాలు దేవుని నుండి దూరమైపోయిన లోకాన్ని సూచిస్తాయి గానీ వ్యక్తులను కాదని గుర్తుంచుకోండి. ప్రకటనా పనికి ఏ వ్యక్తియైనా ఎలా ప్రతిస్పందిస్తారనేది క్రైస్తవులు ముందుగా తామే నిర్ణయించాలని అనుకోరు. ఎవరినైనా మేకలుగా వర్ణించటానికి వారికి ఏ ఆధారమూ లేదు. “మేకల” నుండి “గొర్రెల”ను వేరు చేయటానికి యేసు వచ్చినప్పుడు ఫలితమేమై ఉంటుందో చెప్పడం మన పని కాదు. (మత్తయి 25:31-46) నియమింపబడిన న్యాయాధిపతి యేసే గానీ మనం కాదు. అంతేగాక, ఎంతో ఘోరమైన ప్రవర్తన కల్గివున్న కొంతమంది బైబిలు సందేశాన్ని స్వీకరించి, మార్పులు చేసుకుని, పరిశుభ్రమైన జీవితాన్ని గడిపే క్రైస్తవులుగా తయారయ్యారని అనుభవం చూపిస్తుంది. కాబట్టి, మనం కొంతమంది వ్యక్తులతో సహవసించాలని ఇష్టపడకపోయినప్పటికీ, అవకాశం లభించినప్పుడు వారితో రాజ్య నిరీక్షణ గురించి మాట్లాడటానికి మనం వెనుకాడము. అవిశ్వాసులుగా ఉన్నప్పుడే, “నిత్యజీవమునకు నిర్ణయింపబడిన” కొంతమంది వ్యక్తుల గురించి లేఖనాలు మాట్లాడుతున్నాయి. చివరికి వాళ్లు విశ్వాసులయ్యారు. (అపొస్తలుల కార్యములు 13:48) కాబట్టి మనం బహుశా అనేక సార్లు సాక్ష్యం ఇవ్వనిదే నిత్యజీవం కోసం నిర్ణయింపబడిన వారు ఎవరో మనకు తెలియదు. దీన్ని మనస్సులో ఉంచుకుని, ఇప్పటికింకా రక్షణ సందేశాన్ని అంగీకరించని వారిలో కొందరు జీవ సందేశానికి ప్రతిస్పందించవచ్చని నిరీక్షిస్తూ వారితో మనం “సాత్వికముతో” అలాగే వారి పట్ల “ప్రగాఢమైన గౌరవంతో” వ్యవహరించాలి.—2 తిమోతి 2:24-26; 1 పేతురు 3:15, 16NW.
16. మనం “బోధనా కళను” పెంపొందింపజేసుకోవటానికి గల ఒక కారణం ఏమిటి?
16 సువార్త ప్రకటించాలనే మన ఆకాంక్షను, బోధకులముగా మన నైపుణ్యాలను వృద్ధి చేసుకోవటం అధికం చేస్తుంది. ఉదాహరణకు, ఎంతో ఉల్లాసభరితమైన ఒక ఆటగానీ లేదా క్రీడ గానీ ఎలా ఆడాలో తెలియని వ్యక్తికి అది అంత ఆసక్తికరమైనదిగా అనిపించకపోవచ్చు. కానీ బాగా ఆడే వ్యక్తికి అది ఎంతో ఆనందభరితమైనదిగా ఉంటుంది. అలాగే, “బోధనా కళను” వృద్ధి చేసుకునే క్రైస్తవులు పరిచర్యలో తమ ఆనందాన్ని అధికం చేసుకుంటారు. (2 తిమోతి 4:2, NW; తీతు 1:9) పౌలు తిమోతికిలా ఉపదేశించాడు: “దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము.” (2 తిమోతి 2:15) మనం మన బోధనా సామర్థ్యాలను ఎలా వృద్ధి చేసుకోవచ్చు?
17. బైబిలు జ్ఞానం పట్ల మనం ‘అపేక్షను’ ఎలా వృద్ధి చేసుకోవచ్చు, అలాంటి జ్ఞానం మన పరిచర్యకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది?
17 ఒక మార్గం ఏమిటంటే, అదనపు కచ్చితమైన జ్ఞానాన్ని తీసుకోవడం. అపొస్తలుడైన పేతురు మనల్నిలా ప్రోత్సహిస్తున్నాడు: “కొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.” (1 పేతురు 2:2, 3) ఆరోగ్యంగల బిడ్డ పాల కోసం సహజ సిద్ధంగానే అపేక్షిస్తుంది. అయితే ఒక క్రైస్తవుడు బైబిలు జ్ఞానం కోసం ‘అపేక్షను’ తనలో వృద్ధి చేసుకోవలసిన అవసరం ఉంది. చక్కని పఠన, అధ్యయన అలవాట్లు ఏర్పరచుకోవటం ద్వారా దీన్ని సాధించవచ్చు. (సామెతలు 2:1-6) మనం దేవుని వాక్యాన్ని బోధించే నైపుణ్యంగల బోధకులం కావాలంటే కృషి, స్వయం శిక్షణ అవసరం, అయితే అలాంటి ప్రయాసలకు తగిన ఫలితాలు లభిస్తాయి. దేవుని వాక్యాన్ని పరిశీలించడం నుండి లభించే ఆనందం, మనం దేవుని ఆత్మయందు తీవ్రతగలవారమై ఉండి, మనం నేర్చుకునే విషయాలను ఇతరులతో పంచుకునేలా చేస్తుంది.
18. సత్యవాక్యాన్ని సరిగా చేపట్టటానికి క్రైస్తవ కూటాలు మనల్ని ఎలా సంసిద్ధం చేయగలవు?
18 దేవుని వాక్యాన్ని నైపుణ్యవంతంగా ఉపయోగించడంలో క్రైస్తవ కూటాలు కూడా ప్రముఖ పాత్రను వహిస్తాయి. బహిరంగ ప్రసంగాల సమయంలోనూ ఇతర లేఖనాధార చర్చలలోనూ బైబిలు లేఖనాలను చదివినప్పుడు, మనం మన స్వంత బైబిళ్లను తెరిచి చూసుకోవటం మంచిది. మన ప్రకటనా పనికి సంబంధించిన వాటితో సహా కూటాల్లోని భాగాలన్నిటికీ పూర్తి అవధానాన్నివ్వడం జ్ఞానయుక్తమైన పని. ప్రదర్శనల విలువను ఎన్నడూ తక్కువ అంచనా వేయకూడదు, వాటికి అవధానం ఇవ్వకుండా ధ్యాస ఇటు అటు మళ్లించకూడదు. ఇందుకు కూడా స్వయం శిక్షణ, అవధానం నిలుపడం ఎంతో అవసరం. (1 తిమోతి 4:16) క్రైస్తవ కూటాలు మన విశ్వాసాన్ని బలపర్చి, దేవుని వాక్యంపట్ల అపేక్షను పెంపొందించుకోవటానికి సహాయం చేసి, సువార్తను అత్యంత ఉత్సాహంతో ప్రకటించటానికి మనకు తర్ఫీదునిస్తాయి.
మనం యెహోవా ఇచ్చే మద్దతుపై ఆధారపడవచ్చు
19. ప్రకటనా పనిలో క్రమంగా పాల్గొనటం ఎందుకు ప్రాముఖ్యం?
19 “ఆత్మయందు తీవ్రతగల,” సువార్త ప్రకటించాలనే ఎఫెసీయులు 5:15, 16) నిజమే, పరిస్థితులు భిన్నంగా ఉంటాయి, జీవాన్ని రక్షించే ఈ పనిలో అందరూ ఒకే మొత్తంలో సమయాన్ని గడపలేకపోవచ్చు. (గలతీయులు 6:4, 5) అయితే మనం పరిచర్యలో ఎంత సమయాన్ని గడుపుతాము అనేదాని కన్నా మరింత ప్రాముఖ్యమైన విషయం మనం ఇతరులతో మన నిరీక్షణ గురించి ఎంత తరచుగా మాట్లాడుతామన్నదే. (2 తిమోతి 4:1, 2) మనం ఎంత ఎక్కువగా ప్రకటిస్తే, ఈ పనికున్న ప్రాముఖ్యతను మనం అంత ఎక్కువగా గుణగ్రహిస్తాము. (రోమీయులు 10:14, 15) మూల్గులిడుతూ ప్రలాపిస్తూ ఏ నిరీక్షణా లేకుండా ఉన్న యథార్థమైన ప్రజలను మనం క్రమంగా కలిసినప్పుడు మనకు వారిపట్ల ప్రేమ, సహానుభూతి అధికమౌతాయి.—యెహెజ్కేలు 9:4; రోమీయులు 8:22.
ఆకాంక్షగల క్రైస్తవులు పరిచర్యలో క్రమంగా పాల్గొంటారు. (20, 21. (ఎ) మనముందు ఇంకా ఏ పని ఉంది? (బి) మన ప్రయత్నాలకు యెహోవా ఎలా మద్దతునిస్తున్నాడు?
20 యెహోవా మనకు సువార్తను అప్పగించాడు. ఆయన “జతపనివార”ముగా మనం ఆయన నుండి అందుకునే మొట్టమొదటి నియామకం ఇదే. (1 కొరింథీయులు 3:6-9) దేవుడిచ్చిన ఈ బాధ్యతను మనం మనకు సాధ్యమైనంత మేరకు పూర్ణాత్మతో నిర్వర్తించాలన్న అకాంక్షతో ఉన్నాము. (మార్కు 12:30; రోమీయులు 12:1) సత్యం కోసం ఆకలిదప్పులు గలవారు, నిత్యజీవం కోసం నిర్ణయింపబడిన వారు ఇంకా అనేకులు ఉన్నారు. చేయవలసిన పని ఎంతో ఉంది, అయితే మనం మన పరిచర్యను పూర్తిగా నిర్వర్తిస్తుండగా మనం యెహోవా ఇచ్చే మద్దతుపై ఆధారపడవచ్చు.—2 తిమోతి 4:5.
21 యెహోవా దేవుడు మనకు తన ఆత్మనిచ్చి, తన వాక్యమైన “ఆత్మ ఖడ్గము”తో మనల్ని ఆయత్తపరుస్తాడు. ఆయన సహాయంతో మనం “సువార్త మర్మమును తెలియజేయుటకు” మన నోరు తెరువగల్గుతాము. (ఎఫెసీయులు 6:17-20) “మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న”దని థెస్సలోనీకలోని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు వ్రాసిన మాటలు మన గురించి కూడా చెప్పబడగల్గేలా మనం ఉండాలి. (1 థెస్సలొనీకయులు 1:4-6) అవును మనం సువార్తను అత్యంత ఉత్సాహంతో ప్రకటిద్దాము !
సంక్షిప్త సమీక్ష
• జీవిత చింతల మూలంగా, పరిచర్యలో మన ఉత్సాహానికి ఏమి సంభవించవచ్చు?
• సువార్త ప్రకటించాలనే కోరిక మన హృదయాల్లో “మండుతున్న అగ్ని” వలె ఏ విధంగా ఉండాలి?
• పరిచర్యపట్ల ఏ ప్రతికూల దృక్పథాలను మనం నివారించాలి?
• సాధారణంగా, మన నమ్మకాలను పంచుకోని వారిని మనం ఎలా దృష్టించాలి?
• ప్రకటనా పనిలో మన ఉత్సాహాన్ని కాపాడుకోవటానికి యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడు?
[అధ్యయన ప్రశ్నలు]
[అధ్యయన ప్రశ్నలు]
[9వ పేజీలోని చిత్రం]
క్రైస్తవులు పౌలు, యిర్మీయాలు చూపించిన ఆసక్తిని అనుకరిస్తారు
[10వ పేజీలోని చిత్రం]
పరిచర్యలో మనకున్న అత్యంత ఉత్సాహం దేవుని పట్ల పొరుగువారి పట్ల మనకుగల ప్రేమతో పురికొల్పబడుతుంది