మీరు మంచి మాదిరుల—నుండి ప్రయోజనం పొందుతున్నారా?
మీరు మంచి మాదిరుల—నుండి ప్రయోజనం పొందుతున్నారా?
థెస్సలొనీకలో నివసిస్తున్న నమ్మకస్థులైన క్రైస్తవులకు, అపొస్తలుడైన పౌలు “మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని [మీరు] మాదిరియైతిరి” అని వ్రాశాడు. వాళ్ళు తోటి క్రైస్తవులకు ఉంచిన మాదిరి నిజంగా ప్రశంసనీయమైనది. అయినప్పటికీ, పౌలూ ఆయన సహవాసులూ ఉంచిన మాదిరికి వాళ్ళు స్పందించారు. కనుకనే, పౌలు, “మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును. మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమై యుంటిమో మీరెరుగుదురు. . . . మీరు . . . మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి” అని వ్రాశాడు.—1 థెస్సలొనీకయులు 1:5-7.
అవును, పౌలు ప్రసంగాలను ఇవ్వడం కన్నా ఎక్కువే చేశాడు. ఆయన జీవితమే ఒక మంచి ప్రసంగంగా పని చేసింది. విశ్వాసానికీ, సహనశీలానికీ, ఆత్మత్యాగపూరిత స్ఫూర్తికీ ఆయన మంచి మాదిరిగా ఉన్నాడు. పౌలూ ఆయన సహవాసులూ మంచి మాదిరులుగా ఉన్నారు గనుకనే, థెస్సలొనీకలోని ప్రజల జీవితంలో ఎంతో శక్తివంతమైన ప్రభావాన్ని చూపగల్గారు, వాళ్ళు “గొప్ప ఉపద్రవాన్ని” అనుభవించవలసి వచ్చినప్పటికీ సత్యాన్ని స్వీకరించేలా పురికొల్పగల్గారు. అయితే, ఆ విశ్వాసుల మీద మంచి ప్రభావాన్ని చూపింది పౌలూ, ఆయన తోటి పనివారూ మాత్రమే కాదు. ఉపద్రవాల్ని సహించిన ఇతరుల మాదిరులు కూడా వారికీ ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాయి. అందుకే, పౌలు, “సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తుయేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదులవలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంతదేశస్థులవలన అనుభవించితిరి” అని వ్రాశాడు.—1 థెస్సలొనీకయులు 2:14.
క్రీస్తు యేసు—ప్రధాన మాదిరి
అనుకరించదగిన మంచి మాదిరిని పౌలు ఉంచినప్పటికీ, క్రైస్తవులు అనుసరించవలసిన ప్రధాన మాదిరి యేసు క్రీస్తేనన్న విషయాన్ని పౌలు చెప్పకుండా ఉండలేదు. (1 థెస్సలొనీకయులు 1:6) అప్పుడూ ఇప్పుడూ క్రీస్తే ప్రధాన మాదిరి. “క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను” అని అపొస్తలుడైన పేతురు వ్రాశాడు.—1 పేతురు 2:21.
అయితే, దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, మానవుడిగా యేసు తన భూ జీవితాన్ని ముగించాడు. ఆయన ఇప్పుడు అమర్త్యుడైన ఆత్మ వ్యక్తిగా “సమీపింపరాని తేజస్సులో . . . వసించు”చున్నాడు. కాబట్టి, ‘మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేరు.’ (1 తిమోతి 6:16) అలాంటప్పుడు, మనం ఆయనను ఎలా అనుకరించగలం? ఒక మార్గం, యేసు జీవితాన్ని గురించిన నాలుగు బైబిలు వృత్తాంతాలనూ అధ్యయనం చేయడమే. ఆయన వ్యక్తిత్వాన్ని గురించిన, ఆయన జీవన విధానాన్ని గురించిన, ఆయన “మనస్సు”ను గురించిన మంచి అవగాహనను సువార్తలు ఇస్తాయి. (ఫిలిప్పీయులు 2:5-8) జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని అధ్యయనం చేయడం ద్వారా మరింత అవగాహనను పొందవచ్చు. * యేసు జీవితంలోని సంఘటనలు ఏయే సమయాల్లో ఎలా జరిగాయో ఎంతో వివరంగా ఆ పుస్తకం చర్చిస్తుంది.
యేసు చూపించిన ఆత్మత్యాగపూరిత మాదిరి అపొస్తలుడైన పౌలుపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపించింది. కనుకనే, కొరింథులోని క్రైస్తవులతో ఆయన, “నాకు కలిగినది యావత్తు మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను; నన్నును నేను వ్యయపరచుకొందును” అని చెప్పాడు. (2 కొరింథీయులు 12:15) ఆయన దృక్పథం క్రీస్తు దృక్పథంతో ఎంతగా పోలి ఉంది! మనం క్రీస్తు యొక్క పరిపూర్ణమైన మాదిరిని గురించి ఆలోచించినప్పుడు, మనం కూడా మన సొంత జీవితంలో ఆయనను అనుకరించడానికి పురికొల్పబడాలి.
ఉదాహరణకు, భౌతిక అవసరాలను తీరుస్తానని దేవుడు చేసిన వాగ్దానాలపై మనం ఆధారపడాలని యేసు బోధించాడు. అయితే ఆయన అలా బోధించడమే కాక, యెహోవా మీద అలాంటి మత్తయి 6:25; 8:20) భౌతిక చింతలు మీ ఆలోచన సరళిని, మీ ప్రవర్తనను నియంత్రిస్తున్నాయా? అలాకాక, మీరు మొదట దేవుని రాజ్యాన్ని వెదుకుతున్నారనేదానికి మీ జీవితం రుజువులనిస్తుందా? యెహోవా సేవ విషయంలో మీ దృక్పథం ఏమిటి? అది మనకు మాదిరిగా ఉన్న యేసును పోలి ఉందా? యేసు, యెహోవా సేవ అంటే అత్యంతాసక్తి కలగి ఉండాలని కేవలం బోధించడమే కాక అనేక సందర్భాల్లో తను కూడా కనబరచాడు. (యోహాను 2:14-17) అంతేకాక, ప్రేమ విషయమై ఆయన ఎంత చక్కటి మాదిరిని ఉంచాడు ! అంతెందుకు, తన సొంత ప్రాణాన్ని శిష్యుల కోసం బలిగా అర్పించాడు ! (యోహాను 15:13) క్రైస్తవ సహోదరులపై ప్రేమను కనబరచడంలో మీరు యేసును అనుకరిస్తున్నారా? లేక కొందరిలోని అపరిపూర్ణతలు వాళ్ళపై మీకు ప్రేమ కలగకుండా అడ్డు రావడానికి మీరు అనుమతిస్తున్నారా?
విశ్వాసాన్నీ నమ్మకాన్నీ దైనందిన జీవితంలో కనబరచాడు కూడా. “నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని” ఆయన చెప్పాడు. (క్రీస్తు మాదిరిని అనుసరించడానికి మనం శ్రమిస్తున్నప్పటికీ అప్పుడప్పుడు తప్పిపోవచ్చు. అయినా కూడా, “ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొను”టకు మనం చేసే ప్రయత్నాలను బట్టి యెహోవా తప్పక సంతోషిస్తాడు.—రోమీయులు 13:14.
“మందకు మాదిరులు”
నేడు సంఘంలోని ఎవరైనా మనకు మాదిరిలుగా ఉన్నారా? తప్పకుండా ఉన్నారు ! ముఖ్యంగా నియుక్త పదవుల్లో ఉన్న బాధ్యతగల సహోదరులు తప్పనిసరిగా మంచి మాదిరినుంచాలి. క్రేతులోని సంఘాల్లో సేవ చేసి, ఆ సంఘాల్లో పైవిచారణకర్తలను నియమించిన తీతు, నియమించబడిన ప్రతి పెద్దా “నిందారహితుడు” అయ్యుండడం తప్పనిసరి అని చెప్పాడు. (తీతు 1:5, 6) “మందకు మాదిరులుగా” ఉండమని అపొస్తలుడైన పేతురు కూడా “పెద్దలను” హెచ్చరించాడు. (1 పేతురు 5:1-3) పరిచర్య సేవకులుగా సేవచేసే వారి విషయమేమిటి? వాళ్ళు కూడా తప్పకుండా, తమ ‘పనిని బాగుగా నెరవేర్చేవారై’ ఉండాలి.—1 తిమోతి 3:13.
నిజమే, ప్రతి పెద్దా, ప్రతి పరిచర్య సేవకుడూ క్రైస్తవ పరిచర్యలోని ప్రతి రంగంలోను ఆరితేరి ఉండాలని ఎదురు చూడడం వాస్తవ విరుద్ధమే అవుతుంది. “మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము” అని రోములో ఉన్న క్రైస్తవులకు పౌలు వ్రాశాడు. (రోమీయులు 12:6) ఒక్కొక్క సహోదరుడు ఒక్కొక్క విషయంలో శ్రేష్ఠంగా ఉంటాడు. అందరూ అన్ని విషయాల్లో శ్రేష్ఠంగా ఉండరు. కనుక, పెద్దలు ఏది చేసినా ఏమి చెప్పినా పరిపూర్ణంగా ఉండాలని ఎదురు చూడడం సహేతుకం కాదు. “అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును” అని బైబిలులో యాకోబు 3:2 చెబుతుంది. అయితే, పెద్దలు, తమకు అపరిపూర్ణతలు ఉన్నప్పటికీ కూడా, తిమోతిలాగ “మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా” ఉండగలరు. (1 తిమోతి 4:12) పెద్దలు అలా మంచి మాదిరినుంచినప్పుడు, మందలో ఉన్నవాళ్ళు, “మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి” అని హెబ్రీయులు 13:7 లో ఉన్న ఉపదేశాన్ని సిద్ధమనస్సుతో ఆచరణలో పెడుతారు.
ఆధునిక ఇతర మాదిరులు
గత కొన్ని దశాబ్దాల్లో మరెంతో మంది మంచి మాదిరులను చూపించారు. విదేశీ క్షేత్రాల్లో తమ క్రైస్తవ నియామకాన్ని నెరవేర్చేందుకు “అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన” ఆత్మత్యాగులైన వేలాది మంది మిషనరీల విషయమేమిటి? (మత్తయి 19:29) ప్రయాణ పైవిచారణకర్తలను, వారి భార్యలను, వాచ్ టవర్ సొసైటీ కార్యాలయాల్లో స్వచ్ఛంద సేవకులుగా పని చేసే స్త్రీ పురుషులను, సంఘాల్లో పయినీర్లుగా సేవ చేసే సహోదర సహోదరీలను గురించి ఆలోచించండి. అలాంటి ఉదాహరణలు ఇతరులను పురికొల్పగలవా? ఆసియాలోని ఒక క్రైస్తవ సువార్తికుడు, వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ ఎనిమిదవ తరగతి నుండి వచ్చిన ఒక మిషనరీని గుర్తుచేసుకుంటున్నాడు. నమ్మకస్థుడైన ఆ సహోదరుడు, “దోమల బెడదను, భయంకరంగా తేమగా ఉండే వాతావరణాన్ని భరించడానికి సుముఖత చూపించాడు. . . . ఆయన ఇంగ్లండ్ దేశస్థుడైనప్పటికీ, చైనీస్ భాషలోను, మలే భాషలోను అందింపులను తయారు చేసి చెప్పగల ఆయన సామర్థ్యం మరెక్కువగా నన్ను ముగ్ధుడను చేసింది” అని ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. ఆ మిషనరీ చూపించిన మంచి మాదిరి వల్ల కలిగిన ఫలితమేమిటి? “ఆయన నెమ్మది, నమ్మకము నేను పెద్దవాడినైనప్పుడు మిషనరీగా అవ్వాలని కోరుకునేలా పురికొల్పాయి” అని ఆయన అంటున్నారు. తర్వాత ఆయన మిషనరీగా అవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదు.
వాచ్ టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్‌లో కావలికోట తేజరిల్లు ! పత్రికల్లో వచ్చిన అనేకానేక జీవిత కథల లిస్టు ఉంది. ఆ కథలు లౌకిక ఉద్యోగాలను, లక్ష్యాలను వదిలిపెట్టిన వారిని గురించి, బలహీనతలను అధిగమించినవారిని గురించి, వ్యక్తిత్వంలో చాలా గొప్ప మార్పులు తెచ్చుకున్నవారిని గురించి, ప్రతికూల పరిస్థితుల్లో అనుకూల దృక్పథంతో నిలబడినవారిని గురించి, బాగా శ్రమించే స్వభావాన్నీ, సహనశీలాన్నీ, నమ్మకంగా ఉండే స్వభావాన్నీ, అణకువనూ, ఆత్మత్యాగ స్ఫూర్తినీ చూపించిన వారిని గురించి చెబుతాయి. “ఆ కథలు, నన్ను మరింత అణకువా కృతజ్ఞతా భావమూ గల క్రైస్తవుడిగా చేస్తున్నాయి. ఇతరుల అనుభవాలను గురించి చదవడం, నేను నా గురించి అమితంగా చింతించకుండా ఉండేలా, స్వార్థంగా ప్రవర్తించకుండా ఉండేలా చేసింది” అని ఒక పాఠకుడు వాటిని గురించి వ్రాశాడు.
అంతేకాక, తమ కుటుంబపు భౌతిక ఆధ్యాత్మిక అవసరాలను చూసుకునే కుటుంబ శిరస్సులు; ఒకవైపు పరిచర్యలో చురుగ్గా పాల్గొంటూనే పిల్లలను పెంచడంలో ఉండే ఇబ్బందులను ఎదుర్కొంటున్న సహోదరీలు, ఒంటరి తల్లులు; తాము రోజు రోజుకూ బలహీనంగా అవుతున్నా నమ్మకంగా కొనసాగుతున్న వృద్ధులు రోగగ్రస్థులు మొదలైన మీ సంఘంలో ఉన్న మంచి మాదిరులను మరవకండి. ఇలాంటి మాదిరులను చూసి మీరు కదిలించబడడంలేదా?
నిజమే, నేటి లోకం చెడ్డ మాదిరులతో నిండి ఉంది. (2 తిమోతి 3:13) అయినప్పటికీ, యూదయలో నివసిస్తున్న క్రైస్తవులకు పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని పరిగణనలోకి తీసుకోండి. అపొస్తలుడైన పౌలు, విశ్వాసులైన ప్రాచీన స్త్రీ పురుషుల మాదిరికరమైన ప్రవర్తనను గురించి వాళ్ళకు చెప్పిన తర్వాత, “ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనముకూడ . . . విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము” అని ఉద్బోధించాడు. (హెబ్రీయులు 12:1, 2) నేటి క్రైస్తవుల చుట్టు ప్రాచీన మరియు ఆధునిక మంచి మాదిరుల ‘గొప్ప సమూహము’ ఉంది. మీరు వాటి నుండి నిజంగా ప్రయోజనం పొందుతున్నారా? “చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచు”కోవాలన్న కృత నిశ్చయం మీకుంటే మీరలా చేయగలరు.—3 యోహాను 11.
[అధస్సూచి]
^ పేరా 6 వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది.
[20వ పేజీలోని బ్లర్బ్]
ప్రతి పెద్దా, ప్రతి పరిచర్య సేవకుడూ క్రైస్తవ పరిచర్యలోని ప్రతి రంగంలోను ఆరితేరి ఉండాలని ఎదురుచూడడం వాస్తవ విరుద్ధమే అవుతుంది
[21వ పేజీలోని చిత్రం]
పెద్దలు “మందకు మాదిరులుగా” ఉండాలి