అధికారం పట్ల గౌరవం ఉండడం—ఎందుకంత ప్రాముఖ్యం?
అధికారం పట్ల గౌరవం ఉండడం—ఎందుకంత ప్రాముఖ్యం?
మన ఆస్తులను దొంగిలించేవారిని లేదా మన కుటుంబాన్ని బెదిరించేవారిని అరెస్ట్ చేసే అధికారం పోలీసులకున్నందుకు కృతజ్ఞతా భావం లేనిదెవరికి? సమాజాన్ని కాపాడేందుకు నేరస్థులను శిక్షించే అధికారం కోర్టులకుందన్న విషయాన్ని మనలో గుర్తించనిదెవరు?
రహదారులను మంచిగా ఉంచడం, పారిశుద్ధ్యము, విద్యా మొదలైన ఇతర సహాయకరమైన ప్రజాసేవలు కూడా మన మనస్సులోకి రావచ్చు. ప్రభుత్వాధికారాలు విధించగా ప్రజలు చెల్లించే పన్నును ఈ సేవలకు ఉపయోగిస్తారు. సముచితమైన నియుక్త అధికారాలకు గౌరవం చూపించడంలో నిజక్రైస్తవులు ముందుంటారు. కాని ఆ గౌరవాన్ని ఎంత మేరకు చూపించాలి? మనం గౌరవం చూపవలసింది జీవితంలోని ఏయే రంగాల్లోని అధికారానికి?
సమాజంలో అధికారం
సమాజ శ్రేయస్సుకోసం పనిచేసే పౌర అధికారానికి గౌరవం చూపించాలని విశ్వాసులు, అవిశ్వాసులు అన్న తేడా లేకుండా అందరికీ బైబిలు చెబుతుంది. అధికారానికి గౌరవం చూపించాలన్న విషయాన్ని గురించి రోమ్‌లోని తోటి విశ్వాసులకు క్రైస్తవ అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. రోమీయులు 13:1-7 వచనాల్లో ఆయన చెప్పిన మాటలను పరిగణనలోకి తీసుకోవడం మనకు సహాయకరంగా ఉంటుంది.
పౌలు రోమా పౌరుడు. ఆ కాలంలో రోమ్ ప్రపంచశక్తిగా ఉండేది. సా.శ. దాదాపు 56 లో పౌలు వ్రాసిన ఉత్తరం, మాదిరికరమైన పౌరులుగా ఉండమని క్రైస్తవులను ఉపదేశించింది. “ప్రతివాడును పై అధికారులకు లోబడియుండ వలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి” అని ఆయన వ్రాశాడు.
దేవుడు అనుమతించి ఉండకపోతే, ఏ మానవ అధికారమూ ఉండేది కాదని పౌలు వివరిస్తున్నాడు. అంటే, పై అధికారాలకు దేవుని ఉద్దేశమనే చట్రంలో సాపేక్షికమైన స్థానం ఉందన్నమాట. కనుక, “అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు.”
మంచిని చేసే పౌరులు పై అధికారుల నుండి ప్రశంసలను పొందవచ్చు. అయితే, తప్పు చేసేవారిని శిక్షించే అధికారం కూడా ఈ అధికారులకు ఇవ్వబడింది. “దేవుని సేవకులు”గా “దండించే” [పరిశుద్ధ బైబిల్] హక్కు ప్రభుత్వాలకు ఉంది కనుక, కీడు చేసేవారు ప్రభుత్వానికి భయపడడానికి మరింత కారణముంది.
“ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని
కలిగియుందురు. ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు?” అని అంటూ పౌలు తన వాదనను ముందుంచుతున్నాడు.ప్రజలు చెల్లించిన పన్నును ఎలా ఉపయోగించాలన్నది నిర్ణయించే బాధ్యత పై అధికారులదే కానీ, పన్ను చెల్లించే వ్యక్తిది కాదు. ఒక క్రైస్తవుడు నిజాయితీ గల పౌరుడుగా, మంచి మనస్సాక్షిని కలిగివుంటాడు. పై అధికారులకు లోబడి ఉంటూ, పన్నులను చెల్లించడం ద్వారా తాను నివసిస్తున్న సమాజపు స్థాయిని పెంచడమే కాక, దేవుడు కోరుతున్నవాటి అనుసారంగా తాను జీవిస్తున్నాడని ఆయనకు తెలుసు.
కుటుంబమూ, అధికారమూ
కుటుంబంలోని అధికారం విషయమేమిటి? ఒక పసిపాప, తల్లిదండ్రుల అవధానాన్ని పొందడానికి ఏడుస్తుంది, ఏడ్చి గీ పెడుతుంది. వివేకం గల తల్లిదండ్రులు తాము ఏమి చేయాలన్నది పాప ఏడ్పును బట్టి నిర్ణయించరు, పాప యొక్క నిజమైన అవసరాలేమిటో గ్రహించి దాన్ని బట్టి నిర్ణయిస్తారు. అయితే, కొంతమంది పిల్లలకు వాళ్ళు పెద్దవాళ్ళవుతున్న కొలది మరింత స్వాతంత్ర్యం ఇవ్వబడుతుంది, వాళ్ళు సొంతంగా ప్రమాణాలను నిర్ణయించుకునేందుకు అనుమతి కూడా ఇవ్వబడుతుంది. దీని వల్లా, వాళ్ళకు అనుభవం లేనందువల్లా, వాళ్ళు నేరాల్లో గానీ తప్పుడు పనుల్లో గానీ ఇరుక్కుని, కుటుంబ శాంతికీ సమాజమంతటి శాంతికీ భంగం కలిగించవచ్చు. అలా ఎంతమంది యౌవనస్థులు చేస్తున్నారో స్థానిక అధికారులకే బాగా తెలుసు.
చిల్డ్రన్ వి డిసర్వ్ అనే పుస్తకానికి రచయితయైన రాజ్‌లిండ్ మైల్స్, “తల్లిదండ్రులు తమ పిల్లలకు చాలా ఆలస్యంగా క్రమశిక్షణనిస్తారు. బిడ్డ పుట్టినప్పటి నుండే క్రమశిక్షణనివ్వడం మొదలుపెట్టాలి” అని అంటున్నారు. తల్లిదండ్రులు మొదటి నుండీ తమ పిల్లలతో దయాపూర్వకమైన స్వరంతో, శ్రద్ధాపూర్వకమైన అధికారంతో మాట్లాడి, తల్లిదండ్రులిరువురూ పరస్పర విరుద్ధంగా కాకుండా ఎల్లప్పుడూ ఒకే విధంగా ప్రవర్తించినట్లయితే, వాళ్ళ పిల్లలు వాళ్ళ అధికారాన్నీ, ఆ అధికారం నుండి వచ్చే ప్రేమపూర్వకమైన శిక్షణనూ అంగీకరించడాన్ని త్వరలోనే నేర్చుకుంటారు.
కుటుంబ అధికారాన్ని గురించిన సమాచారం బైబిలులో కావలసినంత ఉంది. సామెతల పుస్తకంలో, వివేకియైన సొలొమోను, “నా కుమారుడా, నీ తండ్రి ఇచ్చే క్రమశిక్షణను అనుసరించు, నీ తల్లి పెట్టిన శాసనాన్ని నిరాకరించకు” అని అన్నప్పుడు దైవభయంగల తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుట ఐకమత్యంగా ఉండాలని సూచిస్తున్నాడు. (సామెతలు 1:8, NW) తల్లిదండ్రులిరువురిదీ ఒకటే అభిప్రాయం అని పిల్లలు గ్రహించినప్పుడు, కుటుంబంలో తమ స్థానమేమిటో గ్రహించగల్గుతారు, తాము అనుకుంటున్నట్లు పనులు జరిగేందుకు, తల్లిదండ్రుల్లో ఒకరిని మరొకరికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి వాళ్ళు ప్రయత్నించరు. తల్లిదండ్రులు ఐకమత్యంతో ఉన్నప్పుడు వాళ్ళ అధికారం పిల్లలకు సురక్షితాన్నిస్తుంది.
భర్త, తన పిల్లల ఆధ్యాత్మిక క్షేమానికే కాక, తన భార్య ఆధ్యాత్మిక క్షేమానికి కూడా ప్రాథమిక బాధ్యతను వహిస్తాడు అని బైబిలు వివరిస్తుంది. శిరస్సత్వం అంటే ఇదే. భర్త ఈ శిరస్సత్వాన్ని ఎలా ఉపయోగించాలి? సంఘానికి క్రీస్తు శిరస్సై ఉన్నలాగున, పురుషుడు తన భార్యకు శిరస్సై ఉన్నాడని పౌలు బోధిస్తున్నాడు. “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును [తన ఆధ్యాత్మిక పెండ్లికుమార్తెను] ప్రేమించి . . . దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను” అని కూడా పౌలు అన్నాడు. (ఎఫెసీయులు 5:25-27) భర్త, యేసు మాదిరిని అనుసరించి, శిరస్సత్వాన్ని ప్రేమపూర్వకమైన విధంగా ఉపయోగించినప్పుడు, ఆయన తన భార్య యొక్క “ప్రగాఢమైన గౌరవము”ను సంపాదించుకుంటాడు. (ఎఫెసీయులు 5:33, NW) అలాంటి ఇంట్లో పెరుగుతున్న పిల్లలు దేవుడిచ్చిన అధికారానికి ఉన్న విలువను గ్రహిస్తారు, దాన్ని అంగీకరించడానికి ప్రోత్సహించబడతారు కూడా.—ఎఫెసీయులు 6:1-3.
తన భర్త/భార్య చనిపోయినందువల్ల, లేక ఇతర పరిస్థితుల వల్ల ఒంటరివారైన తల్లులు/తండ్రులు పిల్లలను పెంచే విషయంలో ఎలా వ్యవహరించగలరు? వాళ్ళు ఒంటరివారే అయినా, వారికి పిల్లలపై యెహోవా, యేసుక్రీస్తు ఇచ్చిన అధికారం ఉంది. తన తండ్రి ఇచ్చిన అధికారంతోనే, ప్రేరేపిత మత్తయి 4:1-10; 7:29; యోహాను 5:19, 30; 8:28.
లేఖనాల అధికారంతోనే యేసు ఎల్లప్పుడూ మాట్లాడాడు.—పిల్లలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు సహాయపడే విలువైన సూత్రాలు అనేకం బైబిలులో ఉన్నాయి. అయితే, ఈ సూత్రాలు బైబిలులో ఎక్కడెక్కడ ఉన్నాయో కనుగొని, వాటిని అనుసరించడం ద్వారా, తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రేమపూర్వకమైన సహాయకరమైన ఉపదేశాన్ని ఇవ్వగల్గుతారు. (ఆదికాండము 6:22; సామెతలు 13:20; మత్తయి 6:33; 1 కొరింథీయులు 15:33; ఫిలిప్పీయులు 4:8, 9) లేఖనాలు చెబుతున్నదానికి గౌరవమివ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను పిల్లలు గ్రహించేలా తల్లిదండ్రులు వాళ్ళకు తర్ఫీదునివ్వాలి. అలా తర్ఫీదునిచ్చేందుకు సహాయపడేలా ప్రత్యేకంగా రూపకల్పన చేయబడిన బైబిలు ఆధారిత పుస్తకాలు ఉన్నాయి. తల్లిదండ్రులు వాటిని చూడవచ్చు. *
క్రైస్తవ సంఘమూ - అధికారమూ
“ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని” యేసును గురించి అంటూ, యేసు దైవిక అధికారంతో మాట్లాడుతున్నాడని యెహోవా దేవుడే స్వయంగా చెప్పాడు. (మత్తయి 17:5) మనం అనుసరించేందుకు యేసు ఇచ్చిన నిర్దేశాలు నాలుగు సువార్తల్లోను వ్రాయబడి ఉన్నాయి. మనం వాటిని సులభంగా తీసి చూడవచ్చు.
“పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది” అని యేసు పరలోకానికి ఆరోహణం కాక ముందు తన శిష్యులకు తెలియజేశాడు. (మత్తయి 28:18) సంఘ శిరస్సుగా, యేసు, భూమి మీద తన అడుగుజాడలను అనుసరించే అభిషిక్తులను సునిశితంగా పరిశీలిస్తున్నాడు. అంతేకాక, సా.శ. 33 పెంతెకొస్తు దినమున శిష్యులపై పరిశుద్ధాత్మ కుమ్మరించినది మొదలుకొని, వారిని, సత్యమును తెలియజేసే మాధ్యమముగా, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ తరగతిగా కూడా ఉపయోగిస్తున్నాడు. (మత్తయి 24:45-47; అపొస్తలుల కార్యములు 2:1-36) క్రైస్తవ సంఘాన్ని బలపరచేందుకు ఆయన ఏమి చేశాడు? “ఆయన ఆరోహణమైనప్పుడు, . . . మనుష్యులకు ఈవులను అనుగ్రహించె[ను].” (ఎఫెసీయులు 4:8) ఈ ‘మనుష్యులకు ఈవులు’ క్రైస్తవ పెద్దలు. వారిని పరిశుద్ధాత్మ నియమించింది, తోటి విశ్వాసుల ఆధ్యాత్మిక క్షేమాన్ని గురించి శ్రద్ధ తీసుకునే అధికారం వారికి ఇవ్వబడింది.—అపొస్తలుల కార్యములు 20:28.
అందుకే, “మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి” అని పౌలు ఉపదేశమిచ్చాడు. ఈ నమ్మకస్థులైన పురుషులు క్రీస్తు అడుగుజాడలను సన్నిహితంగా అనుసరిస్తారు కనుక, వీరి విశ్వాసాన్ని అనుకరించడం నిజంగా వివేకవంతమైన పనే. “మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి” అని కూడా పౌలు బోధిస్తున్నాడు.—హెబ్రీయులు 13:7, 17.
అలాంటి నిర్దేశాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమి జరుగుతుంది? తొలి క్రైస్తవ సంఘంలోని కొందరు సభ్యులు అలా చేసి, చివరికి విశ్వాస భ్రష్టులయ్యారు. హుమెనై, ఫిలేతు అనేవారు, కొందరి విశ్వాసమును చెరిపారనీ, “అపవిత్రమైన” వట్టి మాటలు పలికారనీ బైబిలు చెబుతుంది. ఆత్మ సంబంధమైన పునరుత్థానమైనా, ఆలంకారిక పునరుత్థానమైనా ఇప్పటికే జరిగిపోయింది, భవిష్యత్తులో దేవుని రాజ్యం క్రింద మరో పునరుత్థానం ఇక జరగదన్నది వాళ్ళు నొక్కి చెప్పిన ఒక విషయం.—2 తిమోతి 2:16-18.
సంఘంలోని నియుక్త అధికారం, సంఘంలోని మిగతా సభ్యులను ఆ అబద్ధ బోధల నుండి కాపాడింది. 2 తిమోతి 3:16, 17) “సత్యమునకు స్తంభమును ఆధారమునై యున్న” క్రైస్తవ సంఘంలోని నేటి పెద్దలు కూడా అలాగే చేస్తారు. (1 తిమోతి 3:15) బైబిలు పుటల్లో మన కోసం పదిలపరచబడిన మంచి నిక్షేపమైన “హితవాక్యప్రమాణమును” పాడు చేసేందుకు అబద్ధ బోధలు ఎన్నడూ అనుమతించబడవు.—2 తిమోతి 1:13, 14.
యేసుక్రీస్తు ప్రతినిధులుగా, క్రైస్తవ పెద్దలు లేఖనాల అధికారాన్ని ఉపయోగిస్తూ అలాంటి వాదనలు తప్పని నిరూపించగల్గారు. (ఒకవైపు, లోకంలో, అధికారం మీద గౌరవం చూపని ధోరణి పెరిగిపోతున్నా, సమాజంలోను కుటుంబంలోను క్రైస్తవ సంఘంలోను ఉన్న సముచితమైన అధికారాలు మన ప్రయోజనార్థమే స్థిరపరచబడి ఉన్నాయని క్రైస్తవులముగా మనం గుర్తిస్తాం. అధికారం మీద గౌరవం చూపించడం, మన శారీరక భావోద్వేగ ఆధ్యాత్మిక క్షేమానికి అత్యంతావశ్యకము. దేవుడు ఇచ్చిన అధికారాలను అంగీకరించి గౌరవిస్తే, మహోన్నతాధికారులైన యెహోవా దేవుడూ, యేసుక్రీస్తూ మనకు శాశ్వత క్షేమాన్ని కలుగజేస్తారు.—కీర్తన 119:165; హెబ్రీయులు 12:9.
[అధస్సూచి]
^ పేరా 17 వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన యువత ఇలా అడుగుతోంది—ఆచరణాత్మక సమాధానాలు, కుటుంబ సంతోషానికి గల రహస్యము అనే పుస్తకాలు చూడండి.
[5వ పేజీలోని బ్లర్బ్]
బైబిలులో కుటుంబ అధికారాన్ని గురించిన సమాచారం కావలసినంత ఉంది
[6వ పేజీలోని చిత్రం]
ఒంటరి తల్లికి/తండ్రికి కూడా యెహోవా దేవుడూ యేసుక్రీస్తూ ఇచ్చిన అధికారం ఉంది
[7వ పేజీలోని చిత్రాలు]
కుటుంబంలోను, క్రైస్తవ సంఘంలోను, సమాజంలోను ఉన్న సముచితమైన అధికారాలు తమ ప్రయోజనార్థమే స్థిరపరచబడి ఉన్నాయని క్రైస్తవులు గుర్తిస్తారు
[4వ పేజీలోని చిత్రసౌజన్యం]
Photo by Josh Mathes, Collection of the Supreme Court of the United States