మీరు వివేకము గలవారేనా?
మీరు వివేకము గలవారేనా?
ఇశ్రాయేలీయులపై న్యాయాధిపతులను నియమించడానికిగాను మోషే, “జ్ఞానవివేకములు కలిగి, . . . ప్రసిద్ధిచెందిన [“అనుభవజ్ఞులైన” NW] మనుష్యులను” వెదకడానికి ప్రయత్నించాడు. (ద్వితీయోపదేశకాండము 1:13) వయసుతో వచ్చే అనుభవం మాత్రమే కాదు కావాల్సింది. జ్ఞానం, వివేకం కూడా చాలా ప్రాముఖ్యం.
వివేకవంతుడైన వ్యక్తి మాటలోనూ ప్రవర్తనలోనూ సమతూకాన్ని చూపిస్తాడు. వెబ్‌స్టర్స్ నైన్త్ కాలేజియేట్ డిక్షనరీ ప్రకారం, వివేకం గల వ్యక్తికి “వివేచనతో మౌనంగా ఉండే సామర్థ్యం కూడా ఉంటుంది.” అవును, “మౌనముగా నుండుకు మాటలాడుటకు” సమయమున్నది, వివేకవంతుడైన వ్యక్తి రెండింటికీ గల భేదాన్ని గుర్తిస్తాడు. (ప్రసంగి 3:7) మౌనంగా ఉండడానికి కారణం ఉందని బైబిలు చెప్తుంది: “విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు [“వివేకవంతుడు,” NW].”—సామెతలు 10:19.
ఒకరితో ఒకరు వ్యవహరించేటప్పుడు క్రైస్తవులు వివేకవంతంగా ఉంటూ జాగ్రత్తపడతారు. అతి తరచుగా మాట్లాడేవ్యక్తి లేదా అతి శక్తివంతంగా మాట్లాడేవ్యక్తి సాధారణంగా అతి ప్రాముఖ్యమైన లేదా అత్యవసరమైన వ్యక్తి కానేరడు. గుర్తుంచుకోండి, మోషే “మాటలయందు . . . ప్రవీణుడైయుండెను” కానీ సహనము, సాత్వికము, ఆశానిగ్రహము వంటివాటిని అలవర్చుకున్న తర్వాత గాని ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రభావవంతంగా నడిపించలేకపోయాడు. (అపొస్తలుల కార్యములు 7:22) కాబట్టి, ఇతరులపై అధికారులుగా నియమించబడినవారు వినయంతో సహేతుకతతో ఉండడానికి గట్టిగా పోరాడాలి.
యేసు “తన యావదాస్తిమీద” నియమించిన వారి తరగతిని గూర్చి బైబిలు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడు [“వివేకవంతుడు,” NW]”ను అని వర్ణిస్తుంది. (ఇటాలిక్కులు మావి.) (మత్తయి 24:45-47) వారు వినయాన్ని కోల్పోయి చిత్తచాపల్యంతో యెహోవానే మించిపోవాలని అనుకోరు; అలాగని, వారు ఏదైనా విషయంలో దేవుని నిర్దేశం స్పష్టంగా ఉన్నప్పుడు వెనుకబడరు కూడాను. ఎప్పుడు మాట్లాడాలో, అధిక వివరణకోసం ఎప్పుడు మౌనంగా వేచి చూడాలో వాళ్ళకు తెలుసు. క్రైస్తవులందరూ వారి విశ్వాసాన్ని అనుకరించడం శ్రేయస్కరం. దాసుని తరగతిలానే తాము కూడా వివేకం గలవారమని వారు నిరూపించుకుంటారు.—హెబ్రీయులు 13:7.