యెహోవా జ్ఞాపికలు మీకు అతి ప్రియమైనవిగా ఉన్నాయా?
యెహోవా జ్ఞాపికలు మీకు అతి ప్రియమైనవిగా ఉన్నాయా?
“నేను నీ శాసనములను [“జ్ఞాపికలను,” NW] బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు.” —కీర్తన 119:167.
1. యెహోవా జ్ఞాపికలు పదే పదే ప్రత్యేకించి ఎక్కడ ప్రస్తావించబడ్డాయి?
తన ప్రజలు సంతోషంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. అయితే, నిజమైన సంతోషాన్ని పొందాలంటే మనం దేవుని నియమాల ప్రకారం నడుచుకోవాలి, ఆయన కట్టడలను అనుసరించాలి. అందుకే ఆయన మనకు జ్ఞాపికలు ఇస్తాడు. ఇవి లేఖనాల్లో, ప్రత్యేకించి 119వ కీర్తనలో పదే పదే ప్రస్తావించబడ్డాయి, ఈ కీర్తనను బహుశా యూదా రాకుమారుడైన హిజ్కియా కూర్చి ఉండవచ్చు. ఆ రమ్యమైన పాట ఈ పదాలతో ప్రారంభమౌతుంది: “యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు. ఆయన [“జ్ఞాపికలను,” NW] గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు.”—కీర్తన 119:1, 2.
2. దేవుని జ్ఞాపికలు సంతోషంతో ఎలా సంబంధం కల్గివున్నాయి?
2 మనం ఆయన వాక్యంలోని కచ్చితమైన జ్ఞానాన్ని పొందడం ద్వారా, దాన్ని జీవితంలో అన్వయించుకోవడం ద్వారా ‘యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుంటాము.’ అయితే మనం అపరిపూర్ణులం గనుక మనకు జ్ఞాపికలు అవసరం. “జ్ఞాపికలు” అని అనువదించబడిన హెబ్రీ పదం, దేవుడు తన చట్టాలను, శాసనాలను, కట్టడలను, ఆజ్ఞలను మనకు జ్ఞాపకం చేస్తాడని సూచిస్తుంది. (మత్తయి 10:18-20) అలాంటి జ్ఞాపికలను అనుసరించడంలో కొనసాగితేనే మనం సంతోషంగా ఉంటాం. ఎందుకంటే, వేదనకు బాధకు కారణమయ్యే ఆధ్యాత్మిక ఉరులలో చిక్కుకుపోకుండా అవి మనకు సహాయం చేస్తాయి.
యెహోవా జ్ఞాపికలను హత్తుకొని ఉండండి
3. కీర్తన 119:60, 61 ఆధారంగా, మనకు ఏ నమ్మకం ఉంది?
3 “నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడితిని. భక్తిహీనులపాశములు నన్ను చుట్టుకొనియున్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు” అని పాడిన కీర్తనకర్తకు దేవుని జ్ఞాపికలు అతి ప్రియమైనవిగా ఉన్నాయి. (కీర్తన 119:60, 61) హింసను సహించడానికి యెహోవా జ్ఞాపికలు మనకు సహాయం చేస్తాయి, ఎందుకంటే శత్రువులు మన చుట్టూ బిగించే తాళ్లను మన పరలోకపు తండ్రి తెంచగలడన్న నమ్మకం మనకుంది. రాజ్య ప్రకటనా పనిని కొనసాగించ గలిగేలా ఆయన తగిన సమయంలో అలాంటి నిర్బంధాలను తొలగిస్తాడు.—మార్కు 13:10.
4. దేవుని జ్ఞాపికలకు మనం ఎలా ప్రతిస్పందించాలి?
కీర్తన 119:24, 119) కీర్తనకర్తకు ఉండిన వాటికంటే మనకు ఎక్కువ దేవుని జ్ఞాపికలు ఉన్నాయి. హెబ్రీ లేఖనాల్లో నుండి గ్రీకులేఖనాల్లోకి ఎత్తి వ్రాయబడిన వందలాది వచనాలు, యెహోవా ధర్మశాస్త్రం క్రిందనున్న తన ప్రజలకు ఇచ్చిన ఉపదేశాలనే కాదుగానీ క్రైస్తవ సంఘం గురించి ఆయనకున్న సంకల్పాలను కూడా మనకు జ్ఞాపకం చేస్తాయి. తన కట్టడలను మనకు జ్ఞాపకం చేయడం అవసరమని దేవుడు భావిస్తున్నాడు గనుక అలాంటి నడిపింపును బట్టి మనం కృతజ్ఞత కల్గివుండాలి. మన సృష్టికర్తను బాధపెట్టి, మన సంతోషాన్ని దోచుకునే పాపభరితమైన ఉరులను మనం తప్పించుకోవాలంటే, మనం ‘యెహోవా జ్ఞాపికలను హత్తుకొని ఉండాలి.’—కీర్తన 119:31.
4 కొన్నిసార్లు, యెహోవా జ్ఞాపికలు మనల్ని సరిదిద్దుతాయి. కీర్తనకర్తలాగే మనం కూడా అలాంటి దిద్దుబాటును ఎల్లప్పుడూ విలువైనదిగా ఎంచుదాం. ఆయన ప్రార్థనాపూర్వకంగా దేవునితో ఇలా అన్నాడు: “నీ [“జ్ఞాపికలు,” NW] నాకు సంతోషకరములు . . . [అవి] నాకు ఇష్టమైయున్నవి.” (5. మనం యెహోవా జ్ఞాపికలను అతి ప్రియమైనవిగా ఎలా ఎంచగల్గుతాం?
5 యెహోవా జ్ఞాపికలు మనకు ఎంత ప్రియమైనవై ఉండాలి? “నేను నీ శాసనములను [“జ్ఞాపికలను,” NW] బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు” అని కీర్తనకర్త పాడాడు. (ఇటాలిక్కులు మావి.) (కీర్తన 119:167) మన గురించి నిజంగా శ్రద్ధగల తండ్రి ఇచ్చే ఉపదేశంగా యెహోవా జ్ఞాపికలను మనం దృష్టించి, అంగీకరిస్తే, మనం వాటిని అతి ప్రియమైనవిగా ఎంచుతాం. (1 పేతురు 5:6, 7) మనకు ఆయన జ్ఞాపికలు ఎంతో అవసరం, అవి మనకెలా ప్రయోజనం చేకూరుస్తాయో మనం తెలుసుకుంటుండగా వాటిపట్ల మన ప్రేమ అధికమౌతుంది.
మనకు దేవుని జ్ఞాపికలు ఎందుకవసరం?
6. యెహోవా జ్ఞాపికలు మనకు అవసరం అనడానికి గల ఒక కారణం ఏమిటి, వాటిని గుర్తుంచుకోవడానికి మనకు ఏం సహాయం చేస్తుంది?
6 మనం విషయాల్ని మరిచిపోతుంటాం గనుక మనకు యెహోవా జ్ఞాపికలు అవసరం. ద వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా ఇలా చెప్తుంది: “సాధారణంగా సమయం గడుస్తుండగా ప్రజలు విషయాలను మరచిపోతుంటారు. . . . నోట్లో మెదులుతున్న ఒక పేరునో లేదా చిన్న సమాచారాన్నో మీరు గుర్తు తెచ్చుకోలేకపోవడమన్నది మీకు అనుభవమయ్యే ఉండవచ్చు. . . . తరచుగా సంభవించే అలాంటి తాత్కాలిక మతిమరుపును రిట్రీవల్ ఫెయిల్యూర్ అంటారు. చిందరవందరగా ఉన్న గదిలో ఏదైనా ఒక వస్తువును కనుగొనడానికి ప్రయత్నించడంతో శాస్త్రవేత్తలు దాన్ని పోలుస్తారు. . . . ఏదైనా సమాచారాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి ఒక చక్కని మార్గం ఏమిటంటే, మీకు బాగా తెలుసని మీరనుకుంటున్న ఒక విషయాన్ని చాలాకాలం గడిచిన తర్వాత మళ్లీ మరోసారి అధ్యయనం చేయడమే.” శ్రద్ధగా అధ్యయనం చేయడమూ, పునరుక్తి చేసుకోవడమూ దేవుని జ్ఞాపికలను గుర్తు తెచ్చుకోవటానికీ—మనకు ప్రయోజనం కలిగేలా—వాటికి అనుగుణంగా ప్రవర్తించటానికీ సహాయం చేస్తాయి.
7. దేవుని జ్ఞాపికలు మనకు మునుపెన్నటికన్నా నేడు ఎందుకు ఎక్కువ అవసరం?
7 యెహోవా జ్ఞాపికలు మనకు మునుపెన్నటికన్నా నేడు ఎక్కువ అవసరం. ఎందుకంటే, దుష్టత్వం మానవ చరిత్రలో ఎన్నడూ లేనంత హెచ్చుస్థాయికి చేరుకుంది. మనం దేవుని జ్ఞాపికలపై శ్రద్ధ నిలిపితే, ఈ లోక దుష్ట విధానాల ప్రలోభానికి లొంగిపోకుండా ఉండేందుకు అవసరమైన అంతర్దృష్టి కీర్తన 119:99-101) దేవుని జ్ఞాపికలను పాటించడం ద్వారా, మనం “దుష్టమార్గములన్నిటిలో నుండి” వైదొలగి, “అంధకారమైన మనస్సుగలవారై . . . దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడిన” జనసమూహాలలా తయారుకాము.—ఎఫెసీయులు 4:17-19.
మనకు లభిస్తుంది. కీర్తనకర్త ఇలా చెప్పాడు: “నీ శాసనములను [“జ్ఞాపికలను,” NW] నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు. నేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్టమార్గములన్నిటిలోనుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను.” (8. విశ్వాస పరీక్షలను విజయవంతంగా ఎదుర్కోవడానికి తగినవిధంగా మనమెలా ఆయత్తం కాగలం?
8 దేవుని జ్ఞాపికలు అవసరమనడానికి గల మరో కారణం, ఈ “అంత్యకాలము”లో మనకు ఎదురయ్యే అనేక శ్రమలను సహించడానికి తగిన సహాయాన్ని అవి అందించడమే. (దానియేలు 12:4) అలాంటి జ్ఞాపికలు లేకపోతే మనం ‘విని మరచిపోయేవారిలా’ తయారు కాగలం. (యాకోబు 1:25) అయితే ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అందజేస్తున్న ప్రచురణల సహాయంతో లేఖనాలను అత్యంత శ్రద్ధతో వ్యక్తిగతంగానూ, సంఘంగానూ అధ్యయనం చేయడం, విశ్వాస పరీక్షలను విజయవంతంగా ఎదుర్కోడానికి మనకు సహాయం చేస్తుంది. (మత్తయి 24:45-47) మనం కష్టభరితమైన పరిస్థితులలో ఉన్నప్పుడు యెహోవాకు ప్రీతికరమైన విధంగా ప్రవర్తించాలంటే ఏమి చేయాలనేది గ్రహించడానికి అలాంటి ఆధ్యాత్మిక ఏర్పాట్లు మనకు సహాయం చేస్తాయి.
మన కూటాలు వహించే కీలకమైన పాత్ర
9. ‘మనుష్యులలో ఈవులు’ ఎవరు, వారు తోటి విశ్వాసులకు ఎలా సహాయం చేస్తారు?
9 దేవుని జ్ఞాపికల అవసరత క్రైస్తవ కూటాల్లో కొంతమేరకు తీరుతుంది, అక్కడ నియమిత సహోదరులు ఉపదేశాన్నిస్తారు. యేసు “ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనుష్యులకు [“మనుష్యులలో,” NW] ఈవులను అనుగ్రహించెనని” అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. ఆయనింకా ఇలా జతచేశాడు: “పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, [క్రీస్తు] కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.” (ఎఫెసీయులు 4:8, 11-13) మనం ఆరాధన కోసం సమకూడినప్పుడు ఈ ‘మనుష్యులలో ఈవులు’—నియమిత పెద్దలు—మన అవధానాన్ని యెహోవా జ్ఞాపికల వైపుకు మరలుస్తారు గనుక మనం ఎంత కృతజ్ఞత కల్గివుండాలో కదా!
10. హెబ్రీయులు 10:24, 25 లోని ముఖ్యాంశం ఏమిటి?
10 దైవిక ఏర్పాట్ల ఎడల మనకున్న కృతజ్ఞతాభావం, ప్రతివారం మనం ఐదు సంఘ కూటాలకు హాజరయ్యేలా మనల్ని పురికొల్పుతుంది. క్రమంగా కలిసి సమకూడవలసిన అవసరాన్ని పౌలు నొక్కిచెప్పాడు. ఆయనిలా వ్రాశాడు: “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.”—హెబ్రీయులు 10:24, 25.
11. మన వారపు కూటాల్లో ఒక్కోటి మనకు ఎలా ప్రయోజనం చేకూరుస్తాయి?
11 మన కూటాలు మనకు చేకూర్చే ప్రయోజనం పట్ల మీరు మెప్పుదల కల్గివుంటున్నారా? వారం వారం జరిగే కావలికోట పఠనం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది, యెహోవా జ్ఞాపికలను 1 కొరింథీయులు 2:12; అపొస్తలుల కార్యములు 15:31) బహిరంగ కూటాల్లో, ప్రసంగీకులు యెహోవా జ్ఞాపికలను గురించి, యేసు చెప్పిన అద్భుతమైన “నిత్యజీవపు మాటల”ను గురించి ఉపదేశిస్తారు, అలాగే దేవుని వాక్యం నుండి ఉపదేశిస్తారు. (యోహాను 6:68; 7:46; మత్తయి 5:1-7:29) దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో మన బోధనా నైపుణ్యాలకు పదును పెట్టబడుతుంది. సేవా కూటం ఇంటింటి పరిచర్యలోనూ, పునర్దర్శనాలు చేసేటప్పుడూ, గృహ బైబిలు పఠనాలు నిర్వహించేటప్పుడూ, మన పరిచర్యలోని ఇతర రంగాల్లో సువార్తను చక్కగా ప్రకటించేందుకూ మనకు ఎనలేని సహాయాన్ని అందజేస్తుంది. చిన్న గుంపుగా ఉండే సంఘ పుస్తక పఠనం సాధారణంగా దేవుని జ్ఞాపికలు ఇమిడివున్న వ్యాఖ్యానాలు చేయడానికి మనకు చక్కని అవకాశాన్ని ఇస్తుంది.
అనుసరించడానికి మనకు సహాయం చేస్తుంది, “లౌకికాత్మను” ఎదిరించేందుకు కావలసిన శక్తినిస్తుంది. (12, 13. ఆసియాలోని ఒక దేశంలోవున్న దేవుని ప్రజలు క్రైస్తవ కూటాల పట్ల తమకున్న మెప్పును ఎలా చూపించారు?
12 సంఘ కూటాలకు క్రమంగా హాజరు కావడం, దేవుని ఆజ్ఞలను మనకు గుర్తుచేసి, యుద్ధాలు, ఆర్థిక కష్టాలు, ఇతర విశ్వాస పరీక్షల సమయంలో మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉండేందుకు మనకు సహాయం చేస్తుంది. ఆసియాలోని ఒక దేశంలో 70 మంది, కూటాల ప్రాముఖ్యాన్ని సంపూర్ణంగా గ్రహించారు, వారు తమ ఇళ్లనుండి వెళ్లగొట్టబడటంతో దట్టమైన అడవుల్లో నివసించవలసిన పరిస్థితి ఏర్పడింది. క్రమంగా సమకూడుతూనే ఉండాలని వారు దృఢంగా నిశ్చయించుకుని, యుద్ధం మూలంగా అల్లకల్లోలమైవున్న పట్టణానికి తిరిగివచ్చి, సగం శిథిలమైవున్న రాజ్యమందిరం భాగాలను తీసుకు వెళ్లి అడవిలో రాజ్యమందిరాన్ని మళ్లీ నిర్మించుకున్నారు.
13 అదే దేశంలోని మరో ప్రాంతంలో సంవత్సరాలపాటు యుద్ధాన్ని సహించిన తర్వాత, యెహోవా ప్రజలు ఇప్పటికీ ఉత్సాహంగా సేవ చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని ఒక పెద్దను ఇలా అడగడం జరిగింది: “సహోదరులను ఐక్యంగా ఉంచడానికి ఏది ఎక్కువగా తోడ్పడింది?” ఆయన సమాధానం? “19 సంవత్సరాల్లో మేము ఎన్నడూ ఒక్క కూటాన్ని కూడా జరుపుకోకుండా ఉండలేదు. కొన్నిసార్లు బాంబుదాడుల మూలంగా, లేక ఇతర కష్టాల మూలంగా కొంతమంది సహోదరులు కూటాలకు రాలేకపోయారు గానీ కూటాలు మాత్రం ఎన్నడూ జరుగకుండా ఉండలేదు.” ఈ ప్రియ సహోదర సహోదరీలు ‘సమాజముగా కూడుకోవడం’ యొక్క ప్రాముఖ్యాన్ని గుణగ్రహించారనడంలో సందేహం లేదు.
14. వృద్ధురాలైన అన్నకున్న మంచి అలవాటు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
14 విధవరాలైన 84 ఏళ్ల అన్న “దేవాలయము విడువక” సేవ చేస్తుండేది. తత్ఫలితంగా, నవజాత శిశువుగా ఉన్న యేసును దేవాలయానికి తీసుకుని వచ్చినప్పుడు ఆమె ఆ బిడ్డను చూడగలిగింది. (లూకా 2:36-38) అలాగే మీరూ కూటాలకు విడువక హాజరవ్వాలని కోరుకుంటారా? మన సమావేశాల్లోని కార్యక్రమాలన్నిటికీ హాజరయ్యేందుకు మీరు చేయగలిగినదంతా చేస్తున్నారా? ఆధ్యాత్మికంగా ప్రయోజనాన్ని చేకూర్చే ఉపదేశం ఈ కూటాల్లో అందజేయబడుతుంది, అది మన పరలోక తండ్రి తన ప్రజలపట్ల శ్రద్ధ కల్గివున్నాడన్నదానికి స్పష్టమైన నిదర్శనాన్నిస్తుంది. (యెషయా 40:11) అలాంటి కూటాలు ఆనందాన్ని అధికం చేస్తాయి, మనం అక్కడ ఉండడం యెహోవా జ్ఞాపికలపట్ల మనకున్న మెప్పును వెల్లడిచేస్తుంది.—నెహెమ్యా 8:5-8, 12.
యెహోవా జ్ఞాపికలను బట్టి ప్రత్యేకించబడ్డాము
15, 16. యెహోవా జ్ఞాపికల్ని అనుసరించడం మన ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుంది?
15 దేవుని జ్ఞాపికలను అనుసరించడం, మనల్ని మనం ఈ దుష్ట లోకం నుండి ప్రత్యేకపర్చుకోవడానికి సహాయం చేస్తుంది. ఉదాహరణకు, దేవుని జ్ఞాపికలను లక్ష్యపెట్టడం లైంగిక దుర్నీతిలో పడిపోకుండా మనల్ని కాపాడుతుంది. (ద్వితీయోపదేశకాండము 5:18; సామెతలు 6:29-35; హెబ్రీయులు 13:4) అబద్ధం చెప్పాలనీ, అవినీతికి పాల్పడాలనీ, లేక దొంగతనం చేయాలనీ కలిగే శోధనలను దైవిక జ్ఞాపికలకు అనుగుణ్యంగా జీవించడం ద్వారా విజయవంతంగా తప్పించుకోవచ్చు. (నిర్గమకాండము 20:15, 16; లేవీయకాండము 19:11; సామెతలు 30:7-9; ఎఫెసీయులు 4:25, 27, 28; హెబ్రీయులు 13:18) యెహోవా జ్ఞాపికలను పాటించడమన్నది పగతీర్చుకోవడం, ఉక్రోషాన్ని నిలుపుకోవడం, లేక ఎవరిపైనైనా అపనిందలు వేయడం వంటివి చేయకుండా కాపాడుతుంది.—లేవీయకాండము 19:16, 18; కీర్తన 15:1, 3.
16 దేవుని జ్ఞాపికలను అనుసరించడం ద్వారా మనం ఆయన సేవ కోసం పరిశుద్ధపర్చబడతాం లేక ప్రత్యేకించబడతాం. ఈ లోకం నుండి వేరై ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా! యేసు తన భూజీవితంలోని చివరి రాత్రి ప్రార్థిస్తూ తన అనుచరుల గురించి ఇలా వేడుకున్నాడు: “వారికి నీ వాక్యమిచ్చి యున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసికొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.” (యోహాను 17:14-17) దేవుని సేవ కోసం మనల్ని ప్రత్యేకపరిచే ఆయన వాక్యాన్ని బట్టి ఆనందించడంలో మనం కొనసాగుదాం.
17. దేవుని జ్ఞాపికలను అలక్ష్యం చేస్తే ఏమి జరుగవచ్చు, కాబట్టి మనం ఏమి చేయాలి?
17 యెహోవా సేవకులముగా మనం ఆయన సేవ చేసేందుకు అంగీకారయోగ్యమైన వారిగా ఉండాలని కోరుకుంటాం. అయితే మనం దేవుని జ్ఞాపికలను అలక్ష్యం చేస్తే, ఈ లోకపు భాష, సాహిత్యం, వినోదం, ప్రవర్తనల ద్వారా పెంపొందింపజేయబడే లోకాత్మ మనల్ని అధిగమించడానికి అనుమతిస్తాం. ధనాపేక్షగలవారిగా, బింకములాడేవారిగా, అహంకారులుగా, కృతజ్ఞతలేనివారిగా, అపవిత్రులుగా, క్రూరులుగా, మూర్ఖులుగా, గర్వాంధులుగా, దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించేవారిగా ఉండాలని మనం కచ్చితంగా కోరుకోము, దేవుని నుండి వేరైనవారు చూపించే లక్షణాలలో ఇవి కేవలం కొన్ని మాత్రమే. (2 తిమోతి 3:1-5) మనం ఈ దుష్టవిధానపు అంత్యదినాల్లో జీవిస్తున్నాం గనుక, మనం యెహోవా జ్ఞాపికలను అనుసరిస్తూ ‘ఆయన వాక్యమునుబట్టి మన నడతను జాగ్రత్తగా’ పరిశీలించుకోగలిగేలా దైవిక సహాయం కోసం ప్రార్థిద్దాం.—కీర్తన 119:9.
18. దేవుని జ్ఞాపికలను అనుసరించడం మనం ఏ అనుకూలమైన చర్యలు తీసుకునేలా చేస్తుంది?
ద్వితీయోపదేశకాండము 6:5; కీర్తన 4:5; సామెతలు 3:5, 6; మత్తయి 22:37; మార్కు 12:30) మన పొరుగువారిని ప్రేమించేలా కూడా దేవుని జ్ఞాపికలు మనల్ని పురికొల్పుతాయి. (లేవీయకాండము 19:18; మత్తయి 22:39) దైవిక చిత్తాన్ని చేస్తూ, జీవదాయకమైన “దేవుని గూర్చిన విజ్ఞానము”ను ఇతరులతో పంచుకోవడం ద్వారా మనం దేవుని పట్ల, పొరుగువారి పట్ల ప్రేమను చూపిస్తాం.—సామెతలు 2:1-5.
18 యెహోవా జ్ఞాపికలు మనం ఏమి చేయకూడదనే విషయమై హెచ్చరించడం కన్నా ఎక్కువే చేస్తాయి. ఆయన జ్ఞాపికలను పాటించడం మనం అనుకూలమైన చర్య గైకొనేలా, యెహోవాను సంపూర్ణంగా విశ్వసించేలా, మన పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ బలంతోనూ ఆయనను ప్రేమించేలా పురికొల్పుతుంది. (యెహోవా జ్ఞాపికలను పాటించడం జీవదాయకం!
19. యెహోవా జ్ఞాపికలను అనుసరించడం ఆచరణాత్మకమైనదనీ, ప్రయోజనకరమైనదనీ మనం ఇతరులకు ఎలా చూపించవచ్చు?
19 మనం యెహోవా జ్ఞాపికలను పాటిస్తూ అలా చేయడానికి ఇతరులకు సహాయం చేస్తే, మనల్ని మనమే గాక మనం చెప్పేది వినేవారిని కూడా రక్షించుకుంటాం. (1 తిమోతి 4:16) యెహోవా జ్ఞాపికలను పాటించడం నిజంగా ఆచరణాత్మకమైనదనీ, ప్రయోజనకరమైనదనీ మనం ఇతరులకు ఎలా చూపించవచ్చు? బైబిలు సూత్రాలను మన స్వంత జీవితాల్లో అన్వయించుకోవడం ద్వారా మనమలా చూపించవచ్చు. దేవుని వాక్యంలో చెప్పబడిన మార్గమే నిజంగా అనుసరించవలసిన అతిశ్రేష్ఠమైన మార్గమని “నిత్యజీవమునకు నిర్ణయంపబడిన” వారికి ఒక నిదర్శనం లభిస్తుంది. (అపొస్తలుల కార్యములు 13:48) ‘దేవుడు నిజంగా మన మధ్య ఉన్నాడని’ కూడా వారు చూస్తారు, అంతేగాక సర్వోన్నత ప్రభువైన యెహోవా ఆరాధనలో మనతో కలిసేందుకు వారు పురికొల్పబడతారు.—1 కొరింథీయులు 14:24, 25.
20, 21. దేవుని జ్ఞాపికలు, ఆయన ఆత్మ మనం ఏమి చేయడానికి సహాయం చేస్తాయి?
20 లేఖనాలను అధ్యయనం చేయడంలో కొనసాగడం ద్వారా, మనం నేర్చుకుంటున్నవాటిని అన్వయించుకోవడం ద్వారా, యెహోవా చేస్తున్న ఆధ్యాత్మిక ఏర్పాట్ల నుండి పూర్తి ప్రయోజనం పొందడం ద్వారా మనం ఆయన జ్ఞాపికలను అతి ప్రియమైనవిగా ఎంచుతాం. ఈ జ్ఞాపికలను అనుసరిస్తే, ‘నీతియు యథార్థమైన భక్తియుగలవారమై, దేవుని పోలికగా సృష్టించబడిన నవీనస్వభావమును ధరించుకునేందుకు’ మనకు సహాయం లభిస్తుంది. (ఎఫెసీయులు 4:20-24) ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం వంటి లక్షణాలను మనం ప్రదర్శించేందుకు యెహోవా జ్ఞాపికలు, ఆయన పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాయి. ఇవన్నీ సాతాను స్వాధీనంలోవున్న ప్రపంచంలో ఎంతమాత్రం కనిపించని లక్షణాలు! (గలతీయులు 5:22-24; 1 యోహాను 5:19) అందుకే, మనం వ్యక్తిగత బైబిలు అధ్యయనం ద్వారాగానీ, నియమిత పెద్దల ద్వారా గానీ, లేక మన కూటాల్లో సమావేశాల్లో గానీ యెహోవా కోరేవాటి గురించి మనకు జ్ఞాపకం చేయబడినప్పుడు మనం కృతజ్ఞత కల్గివుండాలి.
21 మనం యెహోవా జ్ఞాపికలను అనుసరిస్తున్నాం గనుక, నీతి నిమిత్తం హింసించబడినప్పుడు కూడా మనం ఆనందించగల్గుతున్నాం. (లూకా 6:22, 23) ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులలో నుండి మనల్ని రక్షించాలని మనం ఆయన సహాయాన్ని అర్థిస్తాం. “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము” అయిన హార్మెగిద్దోను కోసం అన్ని జనాంగాలు సమకూర్చబడుతున్నందున ఇప్పుడు అది మరింత ప్రాముఖ్యం.—ప్రకటన 16:14-16.
22. యెహోవా జ్ఞాపికల విషయమై మన నిశ్చయత ఏమైవుండాలి?
22 మనం గనుక నిత్యజీవమనే కృపావరాన్ని పొందాలంటే, యెహోవా జ్ఞాపికలను అతి ప్రియమైనవిగా ఎంచి, వాటిని మనం హృదయపూర్వకంగా అనుసరించాలి. కాబట్టి మనం ఇలా పాడిన కీర్తనకర్త స్ఫూర్తినే కల్గివుందాం: “నీ శాసనములు [“జ్ఞాపికలు,” NW] శాశ్వతమైన నీతిగలవి. నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము.” (కీర్తన 119:144) మనం కీర్తనకర్త మాటల్లో స్పష్టమౌతున్న ఈ నిశ్చయతనే చూపిద్దాం: “నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను. నీ శాసనముల [“జ్ఞాపికల,” NW] చొప్పున నేను నడుచుకొనునట్లు నన్ను రక్షింపుము.” (కీర్తన 119:146) అవును, మనం యెహోవా జ్ఞాపికలను అతి ప్రియమైనవిగా ఎంచుతున్నామని మాటల్లోనూ క్రియల్లోనూ చూపిద్దాం.
మీరెలా సమాధానమిస్తారు?
• కీర్తనకర్త యెహోవా జ్ఞాపికలను ఎలా దృష్టించాడు?
• మనకు దేవుని జ్ఞాపికలు ఎందుకవసరం?
• దైవిక జ్ఞాపికలకు సంబంధించి మన కూటాలు ఏ పాత్ర నిర్వహిస్తాయి?
• యెహోవా జ్ఞాపికలు మనల్ని ఈ లోకం నుండి ఎలా ప్రత్యేకపరుస్తాయి?
[అధ్యయన ప్రశ్నలు]
[15వ పేజీలోని చిత్రం]
కీర్తనకర్త యెహోవా జ్ఞాపికలను అతి ప్రియమైనవిగా ఎంచాడు
[16, 17వ పేజీలోని చిత్రాలు]
కూటాలకు హాజరవ్వడంలో మీరు అన్న ఉదాహరణను అనుసరిస్తారా?
[18వ పేజీలోని చిత్రం]
యెహోవా జ్ఞాపికలను అనుసరించడం ఆయన సేవ కోసం పరిశుభ్రంగా, అంగీకారయోగ్యంగా ఉండేలా మనల్ని ప్రత్యేకపరుస్తుంది