యెహోవా సేవలో మీ ఆనందాన్ని కాపాడుకోండి
యెహోవా సేవలో మీ ఆనందాన్ని కాపాడుకోండి
“ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి.”—ఫిలిప్పీయులు 4:4.
1, 2. ఒక సహోదరుడూ, ఆయన కుటుంబమూ తమకున్న సమస్తాన్నీ కోల్పోయినా కూడా తమ ఆనందాన్ని ఎలా కాపాడుకోగల్గారు?
సియర్రా లీయోన్లో నివసిస్తున్న జేమ్స్ అనే 70 ఏళ్ళ క్రైస్తవుడు తన జీవితకాలమంతా కష్టపడి పని చేశాడు. చివరికి, నాలుగు గదులున్న ఒక ఇంటిని కొనుక్కునేందుకు కావలసినంత డబ్బు ఆదా అయినప్పుడు ఆయనకు ఎంత ఆనందం కలిగివుంటుందో ఊహించండి! కానీ, జేమ్స్ తన కుటుంబంతోపాటు ఆ క్రొత్త ఇంట్లోకి వెళ్ళిన కొంతకాలానికి, ఆ దేశంలో అంతర్యుద్ధం చెలరేగింది, అప్పుడు వాళ్ళ ఇల్లు పూర్తిగా కాల్చివేయబడింది. ఆ విధంగా వాళ్ళు తమ ఇంటిని కోల్పోయినా తమ ఆనందాన్ని కోల్పోలేదు. ఎందుకని?
2 జేమ్స్, ఆయన కుటుంబము తాము కోల్పోయిన దాని మీద కాక, ఇప్పటికీ మిగిలివున్న వాటిపై తమ మనస్సులను కేంద్రీకరించారు. జేమ్స్, “అంత ఘోరమైన సమయంలో కూడా మేము కూటాలను జరుపుకున్నాం, బైబిలు చదువుకున్నాం, కలిసి ప్రార్థన చేసుకున్నాం, మా దగ్గర ఉన్నదాన్నే ఇతరులతో పంచుకున్నాం. మాకు యెహోవాతో ఉన్న అద్భుతమైన సంబంధంపై మా మనస్సులను కేంద్రీకరించుకున్నాం కనుక మేము ఆనందాన్ని కాపాడుకోగల్గాం” అని వివరిస్తున్నాడు. తమకు లభించిన ఆశీర్వాదాలను, ముఖ్యంగా, యెహోవాతో వ్యక్తిగత సన్నిహిత సంబంధాన్ని కలిగివుండడమనే 2 కొరింథీయులు 13:11) నిజమే, బాధాకరమైన పరిస్థితులను సహించడం వారికి అంత సులభమేమీ కాలేదు. అయినప్పటికీ యెహోవాను బట్టి ఆనందించడం వాళ్ళు మానలేదు.
అత్యంత గొప్ప ఆశీర్వాదాన్ని గురించి ఆలోచించడం ద్వారా ఈ నమ్మకస్థులైన క్రైస్తవులు ఎల్లప్పుడూ ‘సంతోషంగా’ ఉండగలిగారు. (3. కొందరు తొలి క్రైస్తవులు తమ ఆనందాన్ని ఎలా కాపాడుకున్నారు?
3 జేమ్స్, ఆయన కుటుంబము అనుభవించినవాటిని పోలిన శ్రమలను తొలి క్రైస్తవులూ ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, అపొస్తలుడైన పౌలు, “మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి” అని హెబ్రీ క్రైస్తవులకు వ్రాశాడు. ఆ తర్వాత వారి సంతోషానికి మూలం ఏమిటో పౌలు వివరిస్తూ, “మీకు మరి శ్రేష్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి[యున్నారు]” అని చెప్పాడు. (ఇటాలిక్కులు మావి) (హెబ్రీయులు 10:34) అవును, మొదటి శతాబ్దపు ఆ క్రైస్తవులకు బలమైన నిరీక్షణ ఉంది. ఎవరి మూలంగానూ కోల్పోని, వాడబారని ‘జీవకిరీటాన్ని’ దేవుని పరలోక రాజ్యంలో పొందవచ్చని వారు నమ్మకంతో ఎదురు చూశారు. (ప్రకటన 2:10) నేడు, మన క్రైస్తవ నిరీక్షణ, అది పరలోకసంబంధమైనదైనా, భూసంబంధమైనదైనా సరే, మనం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు కూడా ఆనందాన్ని కాపాడుకునేందుకు సహాయపడగలదు.
‘నిరీక్షణగలవారై సంతోషించండి’
4, 5. (ఎ) ‘నిరీక్షణగలవారై సంతోషించండి’ అని పౌలు ఇచ్చిన సలహా రోమీయులకు ఎందుకంత సమయోచితంగా ఉంది? (బి) క్రైస్తవుడు తన నిరీక్షణను ప్రస్తుతం దృష్టిలో పెట్టుకోకపోవడానికి ఏవి కారణం కావచ్చు?
4 నిత్యజీవమనే ‘నిరీక్షణగలవారై సంతోషించండి’ అని రోములోని తోటి విశ్వాసులను అపొస్తలుడైన పౌలు ప్రోత్సహించాడు. (రోమీయులు 12:12) అది రోమీయులకు సమయోచితమైన సలహా. పౌలు వాళ్ళకు అలా వ్రాసిన దాదాపు ఒక దశాబ్దం తర్వాత, వాళ్ళు తీవ్రంగా హింసించబడ్డారు, నీరో చక్రవర్తి ఆజ్ఞానుసారంగా కొందరు ఘోరంగా పీడించబడి చంపబడ్డారు. వాగ్దత్త జీవకిరీటాన్ని దేవుడు తమకు ఇస్తాడన్న విశ్వాసం, వాళ్ళు తమ శ్రమలను తట్టుకునేందుకు బలాన్నిచ్చింది. నేడు మన విషయం ఏమిటి?
5 క్రైస్తవులముగా, మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు హింసించబడతామని మనకు తెలుసు. (2 తిమోతి 3:12) అంతేకాక, ‘కాలవశానికీ, అనూహ్య సంఘటనలకూ’ మనమందరమూ గురవుతామని మనకు తెలుసు. (ప్రసంగి 9:11, NW) ఏదైన ఒక ప్రమాదం వల్ల మన ప్రియమైనవారెవరైనా చనిపోవచ్చు. మన తల్లి/తండ్రి గానీ దగ్గరి స్నేహితులు గానీ జబ్బు చేసి చనిపోవచ్చు. మనం మన రాజ్య నిరీక్షణపై పూర్తి అవధానాన్ని ఉంచకపోతే, అలాంటి శ్రమలు కలిగినప్పుడు మన ఆధ్యాత్మికత ప్రమాదంలో పడిపోగలదు. కనుక మనల్ని మనం, “నేను ‘నిరీక్షణను కలిగి సంతోషిస్తున్నానా’? నిరీక్షణను గురించి ధ్యానించడానికి నేనెంత తరచుగా సమయాన్ని వెచ్చిస్తాను? రాబోయే పరదైసును నేను వాస్తవమైనదిగా దృష్టిస్తున్నానా? నేను అక్కడ ఉన్నట్లు మనోఫలకంపై చూస్తున్నానా? నేను సత్యాన్ని తెలుసుకున్న తొలి కాలంలో ప్రస్తుత విధానాంతం కోసం ఎంతో ఆతురతతో ఎదురుచూసినట్లు, ఇప్పుడూ ఎదురు చూస్తున్నానా?” అని ప్రశ్నించుకోవడం మంచిది. చివరి ప్రశ్నను గురించి గంభీరంగా ఆలోచించవలసిన అవసరముంది. ఎందుకని? ఇప్పుడు మనకు మంచి ఆరోగ్యం ఉన్నట్లయితే, అన్ని సౌకర్యాలూ ఉన్నట్లయితే, యుద్ధాలు, ఆహార కొరతలు, లేదా ప్రకృతి వైపరీత్యాలు వంటివాటి ప్రభావం దాదాపుగా లేని భూభాగంలో మనం నివసిస్తున్నట్లయితే, దేవుని నూతన లోకం రావలసిన అత్యావశ్యకతను ప్రస్తుతం దృష్టిలో పెట్టుకోకపోవచ్చు. కాబట్టే, ఆ ప్రశ్నను గురించి గంభీరంగా ఆలోచించాలి.
6. (ఎ) పౌలు, సీలలు శ్రమలను అనుభవించినప్పుడు, వాళ్ళు తమ ఆలోచనలను వేటి మీద కేంద్రీకరించారు? (బి) పౌలు, సీలల మాదిరులు మనకు ఈనాడు ఎలాంటి ప్రోత్సాహాన్నివ్వగలవు?
6 “శ్రమయందు ఓర్పుగలవారై” ఉండమని కూడా పౌలు రోమీయులకు సలహా ఇచ్చాడు. (రోమీయులు 12:12) పౌలుకు శ్రమలు క్రొత్తేమీ కాదు. యెహోవాను గురించి నేర్చుకోవడానికి మాసిదోనియలో ఉన్న ప్రజలకు సహాయపడేందుకు ‘మాసిదోనియకు రండి’ అని ఒక వ్యక్తి తనను ఆహ్వానించడాన్ని పౌలు దర్శనంలో చూశాడు. (అపొస్తలుల కార్యములు 16:9) అప్పుడు, పౌలు లూకా, సీల, తిమోతిలతో యూరప్‌కు బయల్దేరాడు. ఆసక్తిగల ఆ మిషనరీల కోసం అక్కడ ఏమి వేచివున్నాయి? శ్రమలు! మాసిదోనియా నగరమైన ఫిలిప్పీలో వారు ప్రకటించిన తర్వాత, పౌలు, సీల బెత్తాలతో కొట్టబడి జైలులో వేయబడ్డారు. స్పష్టంగా, ఫిలిప్పీలోని కొందరు పౌరులు రాజ్య సందేశమంటే ఉదాసీన వైఖరి కలిగివుండడమే కాక, చాలా తీవ్రంగా వ్యతిరేకించేవారు కూడా. ఆసక్తిగల ఆ మిషనరీలు తమ ఆనందాన్ని కోల్పోయేలా ఈ సంఘటనలు చేయగల్గాయా? లేదు. తమను కొట్టి, జైలులో వేసిన తర్వాత, “మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి.” (ఇటాలిక్కులు మావి) (అపొస్తలుల కార్యములు 16:25, 26) నిజమే, దెబ్బలు తిన్నందువల్ల కలిగిన నొప్పి మిషనరీలైన పౌలుకు, సీలకు ఆనందాన్నివ్వలేదు, కానీ వాళ్ళిద్దరూ తమ మనస్సును కేంద్రీకరించింది దాని మీద కాదు. వాళ్ళ ఆలోచనలు యెహోవా మీద, ఆయన తమను ఏయే విధాలుగా ఆశీర్వదిస్తున్నాడన్నదాని మీద కేంద్రీకరించబడ్డాయి. ‘తమ శ్రమలను’ ఆనందంగా ‘ఓర్చుకోవడం’ ద్వారా, పౌలు సీలలు, ఫిలిప్పీలోను మరితర చోట్లలోను ఉన్న తమ సహోదరులకు మంచి మాదిరులనుంచారు.
7. మన ప్రార్థనల్లో కృతజ్ఞతాస్తుతులను కూడా ఎందుకు చేర్చాలి?
7 “ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి” అని పౌలు వ్రాశాడు. (రోమీయులు 12:12) మీరు వ్యాకులంగా ఉన్న సమయాల్లో ప్రార్థన చేస్తారా? ఏమని ప్రార్థిస్తారు? మీకున్న నిర్దిష్ట సమస్యను పేర్కొని, యెహోవా సహాయం కోసం వేడుకోవచ్చు. కానీ, మీ ప్రార్థనలో మీరు అనుభవిస్తున్న ఆశీర్వాదాలకు కృతజ్ఞతాస్తుతులను కూడా చేర్చవచ్చు. సమస్యలు తలెత్తినప్పుడు, యెహోవా మనతో వ్యవహరించేటప్పుడు చూపే మంచితనాన్ని గురించి ఆలోచించడం మనం ‘నిరీక్షణ గలవారమై సంతోషించడానికి’ మనకు సహాయపడుతుంది. దావీదు జీవితం సమస్యలమయమై ఉండింది. ఆయన, “యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైనవాడొకడును లేడు” అని వ్రాశాడు. (కీర్తన 40:5) దావీదులాగే మనం కూడా, యెహోవా నుండి పొందిన ఆశీర్వాదాలను క్రమంగా ధ్యానిస్తే, ఆనందంగా ఉండకపోవడం అసాధ్యమని మనమే కనుగొంటాం.
అనుకూల దృక్పథాన్ని కాపాడుకోండి
8. హింసించబడుతున్నప్పుడు సంతోషంగా ఉండేందుకు క్రైస్తవుడికి ఏది సహాయపడుతుంది?
8 వివిధ శ్రమలకు గురైనప్పుడు అనుకూల దృక్పథాన్ని కలిగివుండాలని యేసు తన అనుచరులను ప్రోత్సహించాడు. “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు” అని ఆయన అన్నాడు. (మత్తయి 5:11) అలాంటి పరిస్థితుల్లో సంతోషంగా ఉండేందుకు మనకు ఏ కారణాలున్నాయి? వ్యతిరేకతను తట్టుకునే శక్తి మనకుందంటే, అది యెహోవా ఆత్మ మనమీద ఉందనేందుకు రుజువు. “క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు” అని అపొస్తలుడైన పౌలు తన కాలం నాటి తోటి క్రైస్తవులకు చెప్పాడు. (1 పేతురు 4:13, 14) మనం ఓర్పు కూడా గలవారమై ఉండేందుకు, అలా మన ఆనందాన్ని కాపాడుకునేందుకు యెహోవా తన ఆత్మ ద్వారా మనకు సహాయం చేస్తాడు.
9. తమ విశ్వాసము నిమిత్తం జైలులో ఉన్నప్పుడు ఆనందించడానికి కారణాలను కనుగొనేందుకు కొందరు సహోదరులకు ఏమి సహాయపడింది?
9 మనమెంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఆనందించేందుకు కారణాలను కనుగొనవచ్చు. అది నిజమని అడాల్ఫ్ అనే ఒక క్రైస్తవుడు కనుగొన్నాడు. యెహోవాసాక్షుల పని అనేక సంవత్సరాలపాటు నిషేధించబడి ఉన్న దేశంలో ఆయన నివసిస్తున్నాడు. అడాల్ఫ్, అలాగే ఆయన సహచరులనేకులు తమ బైబిలు ఆధారంగాగల విశ్వాసాలను యాకోబు 1:17; అపొస్తలుల కార్యములు 20:35.
త్యజించేందుకు ఒప్పుకోనందున వాళ్ళను అరెస్ట్ చేసి, వారికి దీర్ఘకాల జైలు శిక్షను విధించారు. జైలు జీవితం చాలా కఠినంగా ఉండేది. అయితే, పౌలు సీలల్లా, అడాల్ఫు, ఆయన సహచరులు కూడా దేవునికి కృతజ్ఞతలు తెలపడానికి కారణాలను కనుగొన్నారు. తమ జైలు అనుభవం, తమ విశ్వాసాన్ని బలపరచుకునేందుకు, ఔదార్యం, సానుభూతి, సహోదర అనురాగం వంటి అమూల్యమైన క్రైస్తవ లక్షణాలను పెంపొందించుకునేందుకు తమకు సహాయపడిందని వాళ్ళు గ్రహించారు. ఉదాహరణకు, ఒక ఖైదీకి తన ఇంటి నుండి ఏదైనా ప్యాకెట్ అందితే, దానిలో ఉన్నవాటిని తోటి విశ్వాసులకు పంచిపెట్టేవాడు. అవి, “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” ఇచ్చే యెహోవా నుండే వస్తున్నాయని వాళ్ళు దృష్టించేవారు. అలాంటి దయాపూర్వక క్రియలు అటు ఇచ్చేవారికీ, ఇటు పొందేవారికీ ఆనందాన్నిచ్చాయి. కాబట్టి, వాళ్ళ విశ్వాసాన్ని ధ్వంసం చేయాలన్న ఉద్దేశంతో వారికి విధించబడిన ఖైదు శిక్ష, నిజానికి వాళ్ళను ఆధ్యాత్మికంగా మరింత బలవంతులనుగా చేసింది!—10, 11. అనేకసార్లు ఇంటరాగేషన్లలోను, తర్వాత కొన్ని సంవత్సరాలపాటు జైలు శిక్ష అనుభవించినప్పుడు ఒక సహోదరి ఎలా వ్యవహరించింది?
10 ఎల్లా కూడా ఎంతోకాలంగా రాజ్య పని నిషేధించబడిన దేశంలో నివసిస్తుంది. ఆమె ఇతరులతో తన క్రైస్తవ నిరీక్షణను పంచుకున్నందుకు అరెస్ట్ చేయబడింది. ఎనిమిది నెలలు ఆమెను అనేకసార్లు ఇంటరాగేట్ చేశారు. చివరికి ఆమెను విచారణకు తీసుకువచ్చినప్పుడు, ఆమెకు పది సంవత్సరాల జైలు శిక్షను విధించారు. ఆ జైలులో యెహోవా ఆరాధకులు ఎవ్వరూ లేరు. అప్పుడు ఎల్లాకు కేవలం 24 ఏండ్లు.
11 నిజమే, తన యౌవనమంతా జైలులో గడపాలనేమీ ఎల్లా కోరుకోలేదు. తాను తన పరిస్థితిని మార్చుకోలేదు కనుక, తన దృక్కోణాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంది. దాని ప్రకారం, సాక్ష్యమిచ్చేందుకు జైలును తన వ్యక్తిగత సేవా ప్రాంతంగా దృష్టించనారంభించింది. “అక్కడ ప్రకటనా పని ఎంతగా చేయవలసి ఉందంటే, సంవత్సరాలు చాలా త్వరగా గడిచిపోయాయి” అని ఆమె అంటుంది. అలా జైలులో ఐదు కన్నా ఎక్కువ సంవత్సరాలు గడిపిన తర్వాత, ఎల్లాను మళ్ళీ ఇంటరాగేట్ చేశారు. జైలు చువ్వలు ఆమె విశ్వాసాన్ని నాశనం చేయలేకపోయాయని తెలుసుకున్న ఇంటరాగేటర్లు, “నిన్ను విడుదల చేయలేం; నువ్వు మారలేదు” అని ఆమెకు చెప్పారు. ఎల్లా దృఢంగా, “లేదు, నేను మారాను!” అని అంది. “నేను మొదటిసారి జైలుకు వచ్చినప్పటి కంటే నాలో ఇప్పుడు ఇంకా మంచి స్ఫూర్తి ఉంది, నా విశ్వాసం మునుపటికన్నా మరింత పటిష్ఠమైంది!” అని కూడా ఆమె అంది. “మీరు నన్ను విడుదల చేయకూడదనుకుంటే, నన్ను విడుదల చేసే సమయం వచ్చిందని యెహోవా అనుకునేంత వరకు నేను ఇక్కడే ఉంటాను” అని కూడా ఆమె అంది. ఐదున్నర సంవత్సరాల జైలు జీవితం ఎల్లా ఆనందాన్ని దోచుకోలేకపోయింది! తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సంతృప్తిగా ఉండడం ఆమె నేర్చుకుంది. ఆమె మాదిరి నుండి మీరేమైనా నేర్చుకోగలరా?—హెబ్రీయులు 13:5.
12. కష్టతరమైన పరిస్థితుల్లో క్రైస్తవులకు ఏది మనశ్శాంతిని ఇవ్వగలదు?
12 అలాంటి సవాళ్ళను ఎదుర్కునేందుకు అసాధారణమైన ఏదో శక్తి ఎల్లాకు ఇవ్వబడిందన్న నిర్ధారణకు రాకండి. తనకు జైలు శిక్ష విధించబడక ముందు, తనకు ఇంటరాగేషన్ జరిగిన కాలాన్ని గురించి చెబుతూ, “నా పళ్ళు గట్టిగా కొట్టుకోవడం నాకు గుర్తుంది. నేను పిచ్చుకలా వణికిపోయాను” అని ఎల్లా ఒప్పుకుంటుంది. అయితే, ఎల్లాకు యెహోవాపై ప్రగాఢమైన విశ్వాసముంది. ఆమె యెహోవా మీద నమ్మకాన్ని ఉంచడం నేర్చుకుంది. (సామెతలు 3:5-7) దాని ఫలితంగా, దేవుడు ఆమెకు మునుపటికన్నా మరింత వాస్తవంగా ఉన్నాడు. “ఇంటరాగేషన్ గదిలోకి ప్రవేశించే ప్రతిసారీ, నాకు మనశ్శాంతిగా ఉన్నట్లు అనిపించేది. . . . పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటే, అంత ఎక్కువ మనశ్శాంతిగా ఉండేది” అని ఆమె వివరిస్తోంది. ఆ మనశ్శాంతికి మూలం యెహోవాయే. అపొస్తలుడైన పౌలు ఇలా వివరిస్తున్నాడు: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.”—ఫిలిప్పీయులు 4:6, 7.
13. మనకు శ్రమలు కలిగినప్పుడు, వాటిని సహించే శక్తి మనకుంటుందని మనకేది అభయమిస్తుంది?
13 ఎల్లా విడుదలైంది, తను కష్టాల్లో ఉన్నా ఆనందాన్ని కాపాడుకుంది. ఆమె అలా సహించింది తన సొంత బలం వల్ల కాదు కానీ, తనకు యెహోవా ఇచ్చిన బలాన్ని బట్టే అలా చేయగలిగింది. అపొస్తలుడైన పౌలు విషయంలో కూడా అది నిజం. “క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను” అని ఆయన వ్రాశాడు.—2 కొరింథీయులు 12:9, 10.
14. క్లిష్టమైన పరిస్థితిని కూడా క్రైస్తవులు అనుకూలమైన పరిస్థితిగా ఎలా దృష్టించవచ్చు, దాని వల్ల ఎలాంటి ఫలితం కలగవచ్చో సోదాహరణంగా చెప్పండి.
14 నేడు మీరు వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న ఒత్తిళ్ళు మనమిప్పటి వరకు చర్చించుకున్న వాటికి భిన్నంగా ఉండవచ్చు. 1 పేతురు 2:18) అంతేకాక, మీరు మరింత విలువైన ఒక ఉద్యోగిగా మారవచ్చు. అది, మీరు ఒకనాడు మరింత సంతృప్తికరమైన ఉద్యోగాన్ని పొందే అవకాశాలను పెంచవచ్చు. యెహోవా సేవలో మన ఆనందాన్ని కాపాడుకోగల మరి కొన్ని మార్గాల గురించి మనమిప్పుడు చర్చిద్దాం.
ఒత్తిళ్ళు ఏ రూపంలో ఉన్నప్పటికీ, వాటిని తట్టుకోవడం కష్టమే. ఉదాహరణకు, మీ యజమాని ఇతర మత విశ్వాసాలకు చెందిన మిగతా ఉద్యోగస్థుల పనికన్నా మీ పనినే ఎప్పుడూ ఎక్కువగా విమర్శిస్తూ ఉండవచ్చు. మీరు మరో ఉద్యోగాన్ని సంపాదించుకోవడం కూడా సాధ్యం కాకపోవచ్చు. అలాంటి పరిస్థితిలో మీరు మీ ఆనందాన్ని ఎలా కాపాడుకోవచ్చు? అడాల్ఫ్నీ, ఆయన సహచరులనూ గుర్తుచేసుకోండి. వాళ్ళ జైలువాసం వాళ్ళకు ప్రాముఖ్యమైన లక్షణాలను నేర్పింది. మీ యజమాని ‘ముష్కరుడైనా’ సరే, ఆయనను సంతృప్తిపరచేందుకు మీరు హృదయపూర్వకంగా కృషి చేస్తే సహనము, దీర్ఘశాంతము వంటి క్రైస్తవ లక్షణాలను పెంపొందించుకున్నవారవుతారు. (సరళత ఆనందానికి నడుపుతుంది
15-17. తమ ఒత్తిడికి మూలమైనదాన్ని పూర్తిగా తొలగించుకోలేకపోయినా, దాని నుండి ఉపశమనాన్ని పొందడాన్ని గురించి ఆ దంపతులు ఏమి తెలుసుకున్నారు?
15 మీరెలాంటి పనిని చేస్తారు, ఎక్కడ చేస్తారు అనే విషయంలో ఎంపిక చేసుకునే అవకాశం మీకు లేకపోవచ్చు, కానీ, మీ జీవితంలో కొన్ని ఇతర విషయాలు మీ నియంత్రణలో ఉండవచ్చు. ఈ క్రింది అనుభవాన్ని చూడండి.
16 ఒక క్రైస్తవ జంట ఒక పెద్దను తమ ఇంటికి భోజనానికి పిలిచింది. ఆ సాయంకాలాన, తాము ఈ మధ్య జీవితంలో అనేక ఒత్తిళ్ళతో సతమతమవుతున్నట్లు ఆ సహోదరుడూ సహోదరీ మనసు విప్పి ఆ పెద్దకు చెప్పుకున్నారు. వాళ్ళిద్దరూ చేస్తున్నది పూర్తికాల ఉద్యోగాలే అయినా వేరే ఉద్యోగాల్ని వెదుక్కునే పరిస్థితిలో లేరు. తామిలా ఎంతకాలం ఒత్తిడిని తట్టుకోగలమని వాళ్ళనుకుంటున్నారు.
17 సలహా ఇవ్వమని వాళ్ళు పెద్దను కోరినప్పుడు, “సరళం చేసుకోండి” అని చెప్పాడు. ఎలా?
ఆ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగ స్థలానికి చేరుకోవడానికి అక్కడి నుండి తిరిగి రావడానికి ప్రతి రోజూ దాదాపు మూడు గంటలు వెచ్చిస్తున్నారు. ఆ దంపతుల గురించి బాగా తెలిసిన ఆ పెద్ద, వాళ్ళ ఉద్యోగ స్థలానికి దగ్గర్లో ఇల్లు చూసుకోమనీ, అలాగైతే ప్రతిరోజు వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళేందుకు తిరిగి వచ్చేందుకు ప్రయాణం చేసే సమయాన్ని ఆదా చేయవచ్చు, అలా ఆదా చేసే సమయాన్ని ఇతర ప్రాముఖ్యమైన విషయాల కోసం వెచ్చించవచ్చు, లేదా కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. జీవిత ఒత్తిళ్ళు మీ ఆనందాన్ని కొంత మేరకు హరించివేస్తున్నట్లయితే, మీరు కొన్ని సర్దుబాట్లు చేసుకోవడం ద్వారా కొంత ఉపశమనాన్ని పొందే అవకాశముందేమో ఎందుకు పరిశీలించకూడదు?18. నిర్ణయాలను తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించడం ఎందుకంత ప్రాముఖ్యం?
18 ఒత్తిళ్ళను తగ్గించుకోగల మరొక మార్గమేమిటంటే, నిర్ణయాలను తీసుకోకముందు జాగ్రత్తగా ఆలోచించడమే. ఉదాహరణకు, ఒక క్రైస్తవుడు ఒక ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను మునుపెన్నడూ ఇల్లు కట్టించకపోయినా, చాలా సంక్లిష్టమైన డిజైన్‌ను ఎన్నుకున్నాడు. తన ఇంటి డిజైన్ని ఎన్నుకునే ముందు, “తన నడతలను బాగుగా కనిపెట్టు”కుంటే అనవసరమైన సమస్యలను నివారించుకోగల్గేవాడని ఆయన ఇప్పుడు గుర్తిస్తున్నాడు. (సామెతలు 14:15) మరొక క్రైస్తవుడు తన తోటి విశ్వాసి తీసుకున్న అప్పుకి తాను బాధ్యత వహిస్తానని ఒప్పుకున్నాడు. ఒప్పందం ప్రకారం, అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు తీర్చలేకపోతే, బాధ్యత వహిస్తానని మాటిచ్చిన వ్యక్తి ఆ అప్పు తీర్చాలి. మొదట్లో అంతా బాగానే ఉంది. కానీ, కొంతకాలం తర్వాత, అప్పు తీసుకున్న వ్యక్తి తనిచ్చిన మాట తప్పాడు. అప్పిచ్చిన వ్యక్తి భయపడిపోయి, బాధ్యత వహిస్తానన్న వ్యక్తిని అప్పంతా తీర్చమని ఒత్తిడి చేశాడు. అది ఆయనకు చాలా ఇబ్బంది కలిగించింది. ఆ అప్పుకి తాను బాధ్యత వహిస్తానని మాటివ్వక ముందు అన్ని విషయాలను గురించీ జాగ్రత్తగా ఆలోచించి ఉంటే ఆ పరిస్థితిని నివారించుకునేవాడేనా?—సామెతలు 17:18.
19. మన జీవితాల్లో ఒత్తిళ్ళను తగ్గించుకునే కొన్ని మార్గాలు ఏవి?
19 మనం అలిసిపోయినప్పుడు, వ్యక్తిగత బైబిలు పఠనానికీ, క్షేత్ర సేవకీ, కూటాలకు హాజరు కావడానికీ వెచ్చించవలసిన సమయాన్ని తగ్గించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చనీ, తిరిగి ఆనందాన్ని పొందవచ్చనీ ఎన్నడూ అనుకోవద్దు. లేదు, మనమలా ఎన్నడూ అనుకోకూడదు. ఎందుకంటే మనం యెహోవా పరిశుద్ధాత్మనూ, దాని ఒక ఫలమైన సంతోషాన్నీ పొందేందుకు చాలా ప్రాముఖ్యమైన మార్గాలు ఇవే. (గలతీయులు 5:22) క్రైస్తవ కార్యకలాపాలు ఎల్లప్పుడూ నూతనోత్సాహాన్నిచ్చేవిగా ఉంటాయి, సాదారణంగా మరీ అలసట కలిగించేవిగా ఉండవు. (మత్తయి 11:28-30) బహుశ మనం మరింత అలసిపోవడానికి కారణమయ్యేది ఎక్కువగా లౌకిక కార్యక్రమాలు లేదా వినోద కార్యక్రమాలై ఉండవచ్చుగాని, ఆధ్యాత్మిక కార్యకలాపాలు కావు. మనం సరైన సమయానికి నిద్రపోవడాన్ని అలవాటు చేసుకోవడం మళ్ళీ మామూలుగా అయ్యేందుకు సహాయపడవచ్చు. ఇంకొంచెం ఎక్కువ విశ్రాంతి వల్ల చాలా ప్రయోజనాలు లభించవచ్చు. “మీకు నిరుత్సాహం కలిగినప్పుడు, మీరు మొట్టమొదట చేయవలసిన పని కాస్త విశ్రాంతి తీసుకోవడమే. రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత, దాదాపు ప్రతి సమస్యా ఎంతో సులభమైనదిగా అనిపించడం చూసి మీరు ఆశ్చర్యపోతారు!” అని తను చనిపోయేంత వరకూ, యెహోవాసాక్షుల పరిపాలక సభలో సభ్యుడిగా సేవ చేసిన ఎన్.హెచ్. నార్ మిషనరీలతో తరచూ చెప్పేవారు.
20. (ఎ) మనం మన ఆనందాన్ని కాపాడుకోగల కొన్ని మార్గాలను సంగ్రహంగా చెప్పండి. (బి) ఆనందభరితులుగా ఉండేందుకు మీరు ఏ కారణాలను గురించి ఆలోచించగలరు? (17వ పేజీలోని బాక్సును చూడండి.)
20 క్రైస్తవులు ‘సంతోషంగల దేవుణ్ణి’ సేవించే ఆధిక్యతను కలిగివున్నారు. (1 తిమోతి 1:11, NW) మనం ఇప్పటి వరకు చూసినట్లుగా, గంభీరమైన సమస్యలు మనలను చుట్టుముట్టినప్పటికీ, మనం మన ఆనందాన్ని కాపాడుకోగల్గుతాం. రాజ్య నిరీక్షణను మన ఎదుట ఉంచుకుందాం, అవసరమైనప్పుడు మన దృక్కోణాన్ని సరిదిద్దుకుందాం, మన జీవితాన్ని సరళంగా చేసుకుందాం. అటు తరువాత, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అపొస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాటలకు ప్రతిస్పందిస్తాము: “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి.”—ఫిలిప్పీయులు 4:4.
ఈ ప్రశ్నలను సాలోచనగా పరిగణనలోకి తీసుకోండి:
• క్రైస్తవులు రాజ్య నిరీక్షణపై మనస్సునెందుకంత సునిశితంగా కేంద్రీకరించాలి?
• కష్టతరమైన పరిస్థితుల్లో మన ఆనందాన్ని కాపాడుకునేందుకు మనకేది సహాయపడగలదు?
• మన జీవితాలను సరళంగా చేసుకునేందుకు మనమెందుకు ప్రయత్నించాలి?
• కొందరు ఏ విషయాల్లో తమ జీవితాలను సరళం చేసుకున్నారు?
[అధ్యయన ప్రశ్నలు]
[17వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
ఆనందంగా ఉండేందుకు అదనపు కారణాలు
క్రైస్తవులముగా మనం ఆనందించేందుకు అనేక కారణాలున్నాయి. ఈ క్రింది కారణాలను గురించి ఆలోచించండి:
1. మనకు యెహోవా తెలుసు.
2. దేవుని వాక్యపు సత్యాన్ని గురించి మనం తెలుసుకున్నాం.
3. యేసు ఇచ్చిన బలి మీద మనకుండే విశ్వాసం ద్వారా మన పాపాలు క్షమించబడగలవు.
4. దేవుని రాజ్యం పరిపాలిస్తోంది—త్వరలోనే క్రొత్తలోకం వస్తుంది!
5. యెహోవా మనలను ఆధ్యాత్మిక పరదైసులోకి తీసుకొని వచ్చాడు.
6. మనం ఆరోగ్యకరమైన క్రైస్తవ సహవాసాన్ని ఆనందిస్తున్నాం.
7. ప్రకటనా పనిలో పాల్గొనే ఆధిక్యత మనకుంది.
8. మనం సజీవంగా ఉన్నాం, ఎంతో కొంత బలం ఉంది.
ఆనందించడానికి ఇంకా ఎన్ని కారణాలను మీరు పేర్కొనగలరు?
[13వ పేజీలోని చిత్రం]
పౌలు, సీలలు జైలులో ఉన్నప్పుడు కూడా ఆనందంగానే ఉన్నారు
[15వ పేజీలోని చిత్రాలు]
దేవుని క్రొత్త లోకమనే ఆనందకరమైన భవిష్యత్తుపై మీ దృష్టి కేంద్రీకరించబడి ఉందా?