“ప్రజలు నరకంలో కాల్చబడాలని దేవుడు నిజంగా శిక్ష విధిస్తాడా?”
“ప్రజలు నరకంలో కాల్చబడాలని దేవుడు నిజంగా శిక్ష విధిస్తాడా?”
“మీరు థియోలజీ చదువుకుంటున్నారా?”
ఒక పుస్తకాల దుకాణంలో పుస్తకాలను తిరగేస్తున్న జోయెల్, కార్ల్లు ఆప్రశ్న విని ఆశ్చర్యపోయారు. ఆఇద్దరు యువకులు స్వచ్ఛంద సేవకులు, ప్రస్తుతం న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోవున్న యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయంలో సేవ చేస్తున్నారు. జోయెల్ బైబిలు పదవిషయకోశాన్ని పరిశీలిస్తుండగా, కార్ల్ తన పరిచర్యలో ఆనందించిన ఒక చర్చను గురించి ఆయనకు చెబుతున్నాడు. వారికి దగ్గర్లోనే నిలుచున్న ఒక వ్యక్తి వారి సంభాషణలోని కొన్ని మాటలు విని వెంటనే వారి దగ్గరకు వచ్చి పై ప్రశ్న అడిగాడు.
అయితే ఆవ్యక్తి వేసిన ప్రశ్నలో ఆఇద్దరు యువకులు థియోలజీ చదువుకుంటున్నారా లేదా అని తెలుసుకోవడంకంటే ఆయనకున్న వ్యక్తిగత చింతే ఎక్కువుంది. ఆయనిలా వివరించాడు: “నేనొక యూదుణ్ణి, యూదులు యేసును తిరస్కరించారు కాబట్టి నేను నరకంలో కాల్చబడతానని నా క్రైస్తవ స్నేహితులు కొందరు నాకు చెప్పారు. ఇది నన్ను చాలా కలతపరుస్తోంది. ఒక ప్రేమగల దేవుడు అలాంటి శిక్ష విధిస్తాడంటే న్యాయం అనిపించడం లేదు. ప్రజలు నరకంలో కాల్చబడాలని దేవుడు నిజంగా శిక్ష విధిస్తాడా?”
జోయెల్, కార్ల్లు తాము చిత్తశుద్ధిగల బైబిలు విద్యార్థులమని ఆయథార్థపరుడితో చెప్పారు. అలాగే మరణించినవారు ఏమీ ఎరుగని స్థితిలో ఉంటారనీ, వారు కేవలం మరణం అనే నిద్రలో పునరుత్థానం కోసం ఎదురుచూస్తున్నారనీ, ఆకారణంగా, మరణించినవారు హింసను లేక బాధాకరమైన నరకాగ్నిని అనుభవించరనీ లేఖనాల్లోనుండి ఆయనకు చూపించారు. (కీర్తన 146:3,4; ప్రసంగి 9:5,10; దానియేలు 12:13; యోహాను 11:11-14,23-26) అలా 45 నిమిషాలపాటు జరిగిన వారి చర్చ ముగింపులో ఆవ్యక్తి జోయెల్, కార్ల్లకు తన అడ్రస్ ఇచ్చి ఆవిషయంపై మరింత సమాచారం కావాలని కోరాడు.
ఒకవేళ నరకం అగ్నిమయంగా ఉండి చిత్రహింసలు పెట్టబడే స్థలమే అయితే, ఎవరైనా తనను అక్కడికి పంపించమని కోరుకుంటారా? అయినా, పితరుడైన యోబు తను అనుభవిస్తున్న దురవస్థనుండి విముక్తి పొందాలని ఆశిస్తూ ఇలా అభ్యర్థించాడు: “నీవు నాకు నరకంలో రక్షణ కలిగిస్తే ఎంత బాగుండు, నీ కోపం చల్లారేవరకు నన్ను అక్కడ దాచిపెడితే ఎంత బాగుండు, అలాంటి రక్షణను నాకు ఎవరు ఇవ్వగలరు?” (యోబు 14:13, డుయే వర్షన్) నరకం చిత్రహింసలు పెట్టే స్థలమని యోబు నమ్మలేదన్నది స్పష్టం. బదులుగా ఆయన దాన్ని రక్షణ కోసం కోరుకున్నాడు. మరణమంటే ఇక ఉనికిలో లేకుండా పోవడమే, బైబిలు చెబుతున్న నరకం మానవులందరూ వెళ్ళే సాధారణమైన సమాధి.
మనం చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది, ఆతర్వాత నిరీక్షణ ఏదైనా ఉందా అన్న విషయాలపై మరింత సమాచారం మీరు కావాలని ఇష్టపడితే, ఈక్రింది ప్రతిపాదనకు ప్రతిస్పందించమని మీరు హృదయపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు.