సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్
సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్
అది, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని అసోసియేషన్ ఆఫ్ కాంగోలీస్ అండ్ ఆఫ్రికన్ జర్నలిస్ట్స్ ఫర్ ద డెవలప్‌మెంట్ (అజోకాడ్), “[కాంగో] అభివృద్ధికి తోడ్పడే విశిష్ట వ్యక్తులను లేదా సాంఘిక సంస్థలను సన్మానించడానికి” ఇచ్చే సర్టిఫికెట్.
“తమ ప్రచురణల్లోని విద్యా బోధల ద్వారా కాంగో దేశ ప్రజల వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడినందుకు” సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని 2000, నవంబరు 17న యెహోవాసాక్షులకు ఇచ్చారు.
ఆ సర్టిఫికెట్ గురించి వ్యాఖ్యానిస్తూ, ల ఫార్ అనే కిన్షాసా వార్తాపత్రిక, “యెహోవాసాక్షులు ప్రచురిస్తున్న కావలికోట, తేజరిల్లు! పత్రికలు గానీ మరితర ప్రచురణలు గానీ లేని కాంగోవారిని ఒకరినైనా కనుగొనడం కష్టం. ఈపత్రికలు జీవితంలోని అన్ని రంగాలను [చర్చిస్తాయి]” అని అంది. ఈపత్రికలు “నేటి సమస్యలను ఎలా ఎదుర్కోవచ్చో” చూపిస్తాయి, “ప్రస్తుత సంఘటనల వెనుకనున్న అసలు భావాన్ని” తెలియజేస్తాయి, ప్రతి తేజరిల్లు! సంచికా “రాజకీయంగా ఎల్లప్పుడూ తటస్థంగా ఉంటూ, ఒక జాతిని మరో జాతికంటే ఎక్కువని ఘనపర్చ”కుండా ఉంటుంది అని ఆవ్యాసం పేర్కొంది. అంతే కాక, ఆప్రచురణలు, “ప్రస్తుత దుష్ట అరాచక విధానం స్థానంలో రానున్న శాంతిభద్రతలతో కూడిన ఒక నూతనలోకాన్ని గూర్చిన సృష్టికర్త వాగ్దానమందు నమ్మకాన్ని” పెంచుతాయి అని కూడా పేర్కొంది.
అజోకాడ్ పేర్కొన్నట్లు, యెహోవాసాక్షుల ప్రచురణలు కాంగో ప్రజల్లోని చాలా మందికి ప్రయోజనకరమైనవిగా ఉన్నాయని నిరూపించబడింది. వందల భాషల్లో లభ్యమవుతున్న నిరీక్షణను కలిగించే వారి సందేశం మీకు కూడా ప్రయోజనం చేకూర్చవచ్చు.
వాటిని మీరు ఎలా పొందవచ్చో తెలుసుకునేందుకు క్రింద చూడండి.