పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
కొలొస్సయులు 1:16 దేవుని కుమారుని గురించి, “సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను” అని చెబుతోంది. ఏభావంలో దేవుని కుమారుడైన యేసును “బట్టి” సర్వము సృజింపబడ్డాయి?
యెహోవా యేసు క్రీస్తును సృష్టించిన తర్వాత మిగతా సర్వమును సృజించడంలో తన జనితైక కుమారుడ్ని ప్రధానశిల్పిగా ఉపయోగించుకున్నాడు. (సామెతలు 8:27-30; యోహాను 1:3) సముచితంగానే, కుమారుడు ఈపనుల నుండి సంతోషాన్ని పొందుతాడు, ఈభావంలో అవి ఆయనను “బట్టి” సృజింపబడ్డాయి.
మానవ తల్లిదండ్రులు తమ పిల్లలనుబట్టి ఎంతో సంతోషాన్ని పొందాలని అపేక్షిస్తారనీ, తరచూ అలాగే పొందుతారనీ మనకు తెలుసు. అందుకే బైబిలు సామెత, ‘తండ్రిని సంతోషపరచే కుమారుని’ గురించి మాట్లాడుతుంది. (సామెతలు 3:12; 29:17) అలాగే, యెహోవా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు నమ్మకంగా ఉన్నప్పుడు వారినిబట్టి ఎంతో ఆనందించాడు. (కీర్తన 44:3; 119:108; 147:11) యథార్థవంతులైన తన ప్రజల విశ్వసనీయతనుబట్టి ఆయన మన కాలంలో కూడా ఆనందిస్తున్నాడు.—సామెతలు 12:22; హెబ్రీయులు 10:38.
కాబట్టి, తనతోటి పనివాడు అయిన యేసు తాను సాధించినవాటిని బట్టి సంతోషించడానికి దేవుడు అనుమతించడం సరైనదే. వాస్తవానికి కుమారుడు, ‘ఆయన కలుగజేసిన లోకమునుబట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుండెనని’ సామెతలు 8:31 చెబుతోంది. ఆభావంలోనే కొలొస్సయులు 1:16 ఇలా చెబుతోంది: “సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.” (ఇటాలిక్కులు మావి.)