“నా వ్యాధేమిటో నాకిప్పుడు అర్థమైంది!”
“నా వ్యాధేమిటో నాకిప్పుడు అర్థమైంది!”
టోక్యోలోని ఒక వ్యక్తి, డిసెంబరు1, 2000 కావలికోట సంచికలోని జీవిత కథను చదివాక అలా అనుకున్నాడు. ఆఆర్టికల్ పేరు “రేపేమి సంభవించునో మీకు తెలియదు.” అది, వైద్యపరంగా మేనియక్ డిప్రెస్సివ్ సైకోసిస్ అని పిలువబడే వ్యాధితో బాధపడుతున్న ఒక మాజీ మిషనరీ అనుభవం గురించి తెలియజేసింది.
ఈ పత్రిక ప్రచురణకర్తలకు వ్రాసిన ఒక ఉత్తరంలో, టోక్యోలోని ఆవ్యక్తి ఇలా తెలియజేశాడు: “అందులో వర్ణించబడిన రోగలక్షణాలు నాకు సరిగ్గా సరిపోతాయి. అందుకని నేను మానసిక రోగుల హాస్పిటల్కు వెళ్ళి, నాకు మేనియక్ డిప్రెషన్ ఉందని తెలుసుకున్నాను. ‘ఈ వ్యాధివున్న వారు తమకు అనారోగ్యం ఉందని అనుకోవడం చాలా అరుదు’ అని నన్ను పరీక్షించిన వైద్యుడు ఆశ్చర్యపోయాడు. పరిస్థితి విషమించక ముందే రోగనిర్థారణ చేయడానికి నాకు సహాయం లభించింది.”
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు కావలికోట, దాని సహపత్రిక తేజరిల్లు! పత్రికల ప్రతి సంచికను చదవడం ద్వారా అనేక విధాలుగా ప్రయోజనం పొందుతున్నారు. ఆర్టికల్స్ ఎంతో సమాచారాన్ని కలిగివున్నట్లు, సంతృప్తినిచ్చేవిగా ఉన్నట్లు వారు భావిస్తున్నారు. ఇప్పుడు కావలికోట పత్రిక 141 భాషల్లో ముద్రించబడుతోంది, తేజరిల్లు! 86 భాషల్లో ప్రచురించబడుతోంది. మీరు కూడా కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలను క్రమంగా చదివి ఆనందిస్తారు.