యెహోవాకు భయపడేలా మీహృదయాన్ని మలచుకోండి
యెహోవాకు భయపడేలా మీహృదయాన్ని మలచుకోండి
“వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు.”—ద్వితీయోపదేశకాండము 5:29.
1. ప్రజలు భయము లేకుండా ఉండే రోజు వస్తుందన్న నిశ్చయతను మనమెలా కలిగివుండగలము?
భయం మానవజాతిని శతాబ్దాలుగా వెంటాడుతోంది. ఆకలి, వ్యాధి, నేరాలు, లేదా యుద్ధాలు మొదలైనవాటిని గూర్చిన భయం లక్షలాది మందిని నిరంతరం వ్యాకులపరుస్తూనే ఉంది. ఈకారణంగానే, మానవులందరూ నిర్భయులుగా జీవించగలిగే లోకాన్ని రూపొందించాలన్న కోరికను మానవ హక్కుల విశ్వప్రకటన యొక్క ఉపోద్ఘాతం వ్యక్తం చేసింది. * అలాంటి లోకం వస్తుందని దేవుడే స్వయంగా హామీ ఇవ్వడం సంతోషకరమైన విషయం, అయితే, అది మానవ ప్రయత్నాల వల్ల వచ్చేది కాదు. నీతి నివసించే తన నూతన లోకంలో, ‘తన ప్రజలు ఎవరి భయమూ లేకుండా ఉంటారు’ అని తన ప్రవక్తయైన మీకా ద్వారా ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు.—మీకా 4:4.
2. (ఎ) దేవునికి భయపడాలని లేఖనాలు మనకెలా బోధిస్తున్నాయి? (బి)మనం దేవునికి భయపడబద్ధులమై ఉన్నామన్న విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఏ ప్రశ్నలు తలెత్తుతాయి?
2 మరొకవైపు భయం నిర్మాణాత్మకమైన ప్రేరణగా కూడా ఉండగలదు. దేవుని సేవకులు యెహోవాకు భయపడాలని లేఖనాల్లో పదేపదే ఉపదేశించబడింది. ‘నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించాలి’ అని మోషే ఇశ్రాయేలీయులకు చెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 6:13) శతాబ్దాల తర్వాత సొలొమోను, “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి” అని వ్రాశాడు. (ప్రసంగి 12:13) దేవదూతల పర్యవేక్షణ క్రింద జరుగుతున్న మన ప్రకటనా పని ద్వారా, మనం కూడా ప్రజలందరికీ “మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి” అని బోధిస్తాము. (ప్రకటన 14:6,7) క్రైస్తవులు యెహోవాకు భయపడడమే గాక, ఆయనను తప్పనిసరిగా తమ పూర్ణహృదయముతో ప్రేమించాలి. (మత్తయి 22:37,38) మనం ఒకవైపు దేవుణ్ణి ప్రేమిస్తూ మరోవైపు ఎలా భయపడగలం? ప్రేమగల దేవునికి భయపడాల్సిన అవసరం ఏమిటి? దైవిక భయాన్ని పెంపొందించుకోవడం ద్వారా మనం ఎలాంటి ప్రయోజనాలను పొందగలుగుతాము? ఈప్రశ్నల జవాబుల కోసం, మనం మొదట, దేవుని భయం అంటే ఏమిటో, ఈరకమైన భయం, యెహోవా దేవునితో మనకున్న సంబంధంలో ఒక ప్రాథమిక భాగమెలా అవుతుందో తప్పకుండా అర్థం చేసుకోవాలి.
సంభ్రమాశ్చర్యం, పూజ్యభావం, భయం
3. దేవుని భయం అంటే ఏమిటి?
3 దేవుని భయం, క్రైస్తవులకు సృష్టికర్త పట్ల ఉండవలసిన ఒక భావం. దేవుని భయం అంటే, “సృష్టికర్త పట్ల సంభ్రమాశ్చర్యాలు మిళితమైన భయం, ఆయన పట్ల ప్రగాఢమైన పూజ్యభావము, ఆయనకు అప్రీతిని కలిగించడమంటే ఉండే ఆరోగ్యకరమైన భయము” అని ఒక నిర్వచనం చెబుతుంది. కనుక, దేవుని భయం, మన జీవితంలోని రెండు ముఖ్యాంశాలపై ప్రభావం చూపుతుంది. అవేంటంటే: మనకు దేవుని పట్ల ఉండే దృక్పథము, ఆయన అసహ్యించుకునే ప్రవర్తన పట్ల ఉండే దృక్పథము. ఈరెండూ చాలా ప్రాముఖ్యమైనవి, వీటిని గురించి చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉంది. క్రైస్తవులకు దేవుని పట్ల ఉండే పూజ్యభావంతో కూడిన భయం, ‘వారి జీవితాన్ని శాసించే ప్రేరణాత్మక శక్తిగా ఉంటుంది, అది వారి ఆధ్యాత్మిక విషయాలను నైతిక విషయాలను శాసిస్తుంది’ అని వైన్స్ ఎక్స్‌పొజిటరీ డిక్షనరీ ఆఫ్ న్యూ టెస్టమెంట్ వర్డ్స్ చెబుతుంది.
4. మన సృష్టికర్త అంటే సంభ్రమాశ్చర్యాలు మిళితమైన భావాన్నీ, పూజ్య భావాన్నీ మనమెలా పెంపొందించుకోగలం?
4 మన సృష్టికర్త అంటే సంభ్రమాశ్చర్యాలు మిళితమైన భావాన్ని, పూజ్యభావాన్ని మనమెలా పెంపొందించుకోవచ్చు? మనోహరమైన ప్రకృతి దృశ్యం కనిపించినప్పుడు, అది ఆకర్షణీయమైన జలపాతమే గానివ్వండి, మనోరంజకమైన సూర్యాస్తమయమే గానివ్వండి, సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ నిలబడిపోతాం. ఈసృష్టిపనుల వెనుక దేవుని హస్తముందని మనం విశ్వాస నేత్రాలతో చూసినప్పుడు ఈభావం కీర్తన 8:3,4) ఈవిధమైన సంభ్రమాశ్చర్యాలు మిళితమైన భావం పూజ్య భావానికి దారితీస్తుంది, అది, యెహోవా మన కోసం చేసేవాటన్నింటిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలిపేలా, ఆయనను స్తుతించేలా మనలను పురికొల్పుతుంది. “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది” అని కూడా దావీదు వ్రాశాడు.—కీర్తన 139:14.
ఇంకా అధికమవుతుంది. అంతేకాక, రాజైన దావీదులాగే, మనం కూడా యెహోవా చేసిన సంభ్రమాశ్చర్యాలు కలిగించే సృష్టి ఎదుట ఎంతో అల్పులమని గ్రహిస్తాం. “నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు?” (5. మనం యెహోవాకు ఎందుకు భయపడాలి, ఈవిషయంలో మనకు ఎవరు మంచి మాదిరిగా ఉన్నారు?
5 సంభ్రమాశ్చర్యాలు మిళితమైన భావమూ, పూజ్యభావమూ సృష్టికర్తగా దేవుని శక్తి పట్ల, విశ్వం యొక్క న్యాయబద్ధమైన పరిపాలకుడుగా ఆయనకు గల అధికారంపట్ల ఆరోగ్యకరమైన గౌరవపూర్వకమైన భయాన్ని కలిగిస్తాయి. అపొస్తలుడైన యోహాను చూసిన ఒక దర్శనంలో, “క్రూరమృగమునకును దాని ప్రతిమకును ... లోబడక వాటిని జయించినవారు”—ఇప్పుడు పరలోకంలో తమ స్థానంలో ఉన్న క్రీస్తు అభిషిక్త అనుచరులు—“ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి; ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు?” అని ప్రకటిస్తారు. (ప్రకటన 15:2-4) దేవుని సర్వాధికారం పట్ల ఉన్న ప్రగాఢమైన పూజ్యభావం నుండి పుట్టిన దేవుని భయం, సర్వోన్నతాధికారిగా దేవుణ్ణి ఘనపర్చేందుకు పరలోక రాజ్యంలోని క్రీస్తు సహపరిపాలకులను పురికొల్పుతుంది. యెహోవా నెరవేర్చిన కార్యాలన్నింటిని బట్టి, నీతియుక్తమైన ఆయన విశ్వ పరిపాలనా విధానాన్ని బట్టి, ఆయనకు భయపడడానికి మనకు కూడా కావలసినన్ని కారణాలు లేవా?—కీర్తన 2:11; యిర్మీయా 10:7.
6. యెహోవాను అప్రీతిపరచకుండా ఉండాలన్న ఆరోగ్యకరమైన భయం మనకెందుకుండాలి?
6 అయితే, సంభ్రమాశ్చర్యాలు మిళితమైన భావము, పూజ్యభావముతోపాటు, దేవునికి అప్రీతికరమైనవి చేయకుండా లేదా ఆయనకు అవిధేయత చూపకుండా ఆరోగ్యకరమైన భయం కూడా తప్పనిసరిగా ఉండాలి. ఎందుకని? ‘దేవుడైన యెహోవా దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల’వాడే అయినప్పటికీ, ‘ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు’ అని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. నిర్గమకాండము 34:6,7) యెహోవా ప్రేమా కరుణా గలవాడే అయినప్పటికీ అవినీతినీ, కావాలని చేసే తప్పిదాలనూ సహించడు. (కీర్తన 5:4, 5; హబక్కూకు 1:13) యెహోవా దుష్టత్వముగా దృష్టించేవాటిని ఉద్దేశపూర్వకంగా, పశ్చాత్తాపపడకుండా చేసేవారు, తమను తాము ఆయనకు వ్యతిరేకంగా చేసుకునేవారు శిక్షించబడకుండా ఉండరు. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు, “జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము.” అలాంటి పరిస్థితిలో పడిపోతామేమోనన్న ఆరోగ్యకరమైన భయం చివరికి మనలను కాపాడుతుంది.—హెబ్రీయులు 10:31.
(“మీరు ... ఆయనను హత్తుకొని యుండవలెను”
7. యెహోవాకున్న కాపాడే శక్తిపై నమ్మకముంచడానికి మనకే కారణాలున్నాయి?
7 యెహోవా దేవుని మీద నమ్మకమూ, విశ్వాసమూ కలగడానికి ముందు ఆయన మీద పూజ్యభావంతో కూడిన భయం, సంభ్రమాశ్చర్యాలను కలిగించే ఆయన శక్తిని గురించిన స్పష్టమైన స్పృహ ఉంటాయి. పిల్లలు ఎలాగైతే, తమ తండ్రి దగ్గరున్నప్పుడు సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారో, అలాగే, మనం కూడా మనలను నడిపించే యెహోవా హస్తం క్రింద సురక్షితంగా నిశ్చింతగా ఉంటాము. యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తీసుకు వెళ్ళిన తర్వాత, వాళ్ళెలా ప్రతిస్పందించారో గమనించండి: “యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందు ... నమ్మకముంచిరి.” (నిర్గమకాండము 14:31) “యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును” అన్న వాస్తవాన్ని ఎలీషా అనుభవం ధ్రువీకరిస్తుంది. (కీర్తన 34:7; 2 రాజులు 6:15-17) తనను సేవించేవారి కోసం యెహోవా తన శక్తిని ఉపయోగిస్తాడని ఆధునిక యెహోవా ప్రజల చరిత్రా, అలాగే బహుశా మన సొంత అనుభవాలూ కూడా ధ్రువీకరిస్తాయి. (2 దినవృత్తాంతములు 16:9) “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును” అని గ్రహించనారంభిస్తాం.—సామెతలు 14:26.
8. (ఎ) దేవుని భయం, మనమాయన మార్గాల్లో నడవడానికి ఎందుకు పురికొల్పుతుంది? (బి)మనం యెహోవాను ఎలా “హత్తుకొని” ఉండాలో వివరించండి.
8 ఆరోగ్యకరమైన దైవికభయం, ఆయన మీద నమ్మకాన్నీ, విశ్వాసాన్ని కలిగించడమే కాక, మనమాయన మార్గాల్లో నడిచేలా మనలను పురికొల్పుతుంది కూడా. సొలొమోను ఆలయ ప్రారంభోత్సవాన్ని జరిపినప్పుడు, ‘నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు [ఇశ్రాయేలీయులు] తమ జీవితకాలమంతయు నీయందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచుకొనునుగాక’ అని ప్రార్థించాడు. (2 దినవృత్తాంతములు 6:30,31) పూర్వము, మోషే, “మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలననుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని యుండవలెను” అని ఇశ్రాయేలీయులకు ఉద్బోధించాడు. (ద్వితీయోపదేశకాండము 13:4) ఈవచనాలు స్పష్టంగా చూపిస్తున్నట్లు, యెహోవా మార్గాల్లో నడవాలి, ఆయనను “హత్తుకొని” ఉండాలి అన్న కోరిక ఆయన మీద ఉన్న నమ్మకం, విశ్వాసముల నుండి పుడుతుంది. అవును, తన తండ్రి మీద తనకున్న నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి చిన్న పిల్లవాడు తన తండ్రి చేతిని విడవనట్లే, దేవుని భయం మనం యెహోవాకు విధేయత చూపేలా, ఆయనకు సేవచేసేలా, ఆయనను హత్తుకుని ఉండేలా చేస్తుంది.—కీర్తన 63:8; యెషయా 41:13.
దేవుణ్ణి ప్రేమించడమంటే ఆయనకు భయపడడమే
9. దేవుణ్ణి ప్రేమించడానికీ, దేవుని భయానికీ ఉన్న సంబంధమేమిటి?
9 లేఖనాల దృక్కోణంలోంచి చూస్తే, దేవుని భయం ఆయనను ప్రేమించడాన్ని అసాధ్యం చేయదు. మరోవైపు, ‘నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించు’ అని ఇశ్రాయేలీయులకు బోధించబడింది. (ద్వితీయోపదేశకాండము 10:12) కనుక, దేవుని భయమూ, దేవుని మీద ప్రేమా ఒకదానితో ఒకటి ముడిపడివుంటాయి. దేవుని భయము ఆయన మార్గాల్లో నడిచేలా మనలను పురికొల్పుతుంది, అది, మనకు ఆయన మీదున్న ప్రేమకు రుజువునిస్తుంది. (1 యోహాను 5:3) ఇది సహేతుకమైనదే, ఎందుకంటే, మనమెవరినైనా ప్రేమిస్తున్నట్లయితే, ఆయన మనస్సు నొప్పిస్తామేమోనని భయపడడం యుక్తమే. ఇశ్రాయేలీయులు అరణ్యంలో తమ తిరుగుబాటు ధోరణి ద్వారా యెహోవాకు దుఃఖం కలిగించారు. మన పరలోక తండ్రికి అలాంటి విచారాన్ని కలిగించేదేదీ చేయాలని మనం నిశ్చయంగా కోరుకోము. (కీర్తన 78:40,41) మరోవైపు, “తనయందు భయభక్తులుగలవారియందు ... యెహోవా ఆనందించువాడైయున్నాడు” కాబట్టి, మన విధేయత, మనం నమ్మకంగా ఉండడమూ ఆయన హృదయానికి ఆనందం కలుగజేస్తాయి. (కీర్తన 147:11; సామెతలు 27:11) దేవునిమీద మనకున్న ప్రేమ, మనమాయనను ప్రీతిపర్చేందుకు పురికొల్పుతుంది, దేవుని భయం, ఆయనకు దుఃఖం కలిగించకుండా ఉండేలా చేస్తుంది. ఇవి పరస్పర పూరకాలే కానీ, పరస్పర విరుద్ధమైన లక్షణాలు కావు.
10. యెహోవాకు భయపడడం తనకు ఆనందకరమైన విషయమని యేసు ఎలా చూపించాడు?
10 మనం ఒకవైపు దేవుణ్ణి ప్రేమిస్తూ మరొకవైపు ఆయనకు ఎలా భయపడగలమో యేసుక్రీస్తు జీవితం స్పష్టంగా చూపిస్తుంది. “యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెషయా 11:2,3) ఈప్రవచనం ప్రకారం, దేవుని ఆత్మ యేసు తన పరలోక తండ్రికి భయపడేలా పురికొల్పింది. అంతేకాక, ఈభయము, అణచివేసేదిగా కాక, సంతృప్తినిచ్చేదిగా ఉంటుంది. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సహితం దేవుని చిత్తాన్ని చేయడంలో, ఆయనను ప్రీతిపరచడంలో యేసు ఆనందాన్ని పొందాడు. హింసా కొయ్యపై తనకు మరణశిక్ష అమలుచేయబోతున్న సమయంలో, “నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని” ఆయన యెహోవాకు చెప్పాడు. (మత్తయి 26:39) తన కుమారునికున్న దేవుని భయం మూలంగా, యెహోవా ఆయన యాచనలను ఆలకించి, ఆయనను బలపరచాడు, ఆయనను మరణం నుండి విడిపించాడు.—హెబ్రీయులు 5:7.
యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును” అని యెషయా ప్రవక్త యేసు గురించి వ్రాశాడు. (యెహోవాకు భయపడటాన్ని నేర్చుకోవడం
11, 12. (ఎ) మనం దేవుని భయాన్ని నేర్చుకోవడమెందుకు తప్పనిసరి? (బి)యేసు మనకు యెహోవా భయాన్ని ఎలా నేర్పిస్తాడు?
11 ప్రకృతిలో కనిపించే ఆయన శక్తిని, మహత్వాన్ని చూసినప్పుడు సహజంగా సంభ్రమాశ్చర్యాలు కలిగినట్లు, దేవుని భయం దానంతటదే రాదు. గొప్ప దావీదైన యేసుక్రీస్తు, “పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను” అని ప్రవచన రూపంలో మనలను ఆహ్వానిస్తున్నాడు. (కీర్తన 34:11) యెహోవాకు భయపడడాన్ని యేసు నుండి మనమెలా నేర్చుకోగలము?
12 మన పరలోక తండ్రి యొక్క అద్భుతమైన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేందుకు మనకు సహాయపడడం ద్వారా యెహోవాకు భయపడడం యేసు మనకు నేర్పిస్తాడు. (యోహాను 1:18) దేవుడెలా ఆలోచిస్తాడు, ఇతరులతో ఎలా వ్యవహరిస్తాడు అన్నది యేసు మాదిరి వెల్లడి చేస్తుంది, ఆయన తన తండ్రి వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా ప్రతిబింబించాడు. (యోహాను 14:9,10) అంతేకాక, మనం మన పాపాల క్షమాపణ కోసం ప్రార్థించేటప్పుడు, యేసు బలి ద్వారా మనం యెహోవాను సమీపించగలుగుతాము. దేవుడు తన కనికరాన్ని వెల్లడిచేసిన ఈఅత్యున్నతమైన విధానం, మనమాయనకు భయపడడానికి శక్తివంతమైన కారణాన్నిస్తుంది. “జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును” అని కీర్తనకర్త వ్రాశాడు.—కీర్తన 130:4.
13. యెహోవాకు భయపడేలా మనకు సహాయపడేందుకు సామెతల గ్రంథంలో ఏ మెట్లు సంక్షిప్తంగా తెలియజేయబడ్డాయి?
13 మనం దేవుని భయాన్ని పెంపొందింపజేసుకునేందుకు సహాయపడే మెట్ల గురించి సామెతల గ్రంథం సంక్షిప్తంగా చెబుతుంది. “నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల ... యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును.” (సామెతలు 2:1-5) కాబట్టి, దేవునికి భయపడాలంటే, మనం తప్పక ఆయన వాక్యాన్ని అధ్యయనం చేయాలి, దానిలో ఉన్న ఉపదేశాన్ని అర్థం చేసుకునేందుకు హృదయపూర్వకంగా శ్రమించాలి, ఆఉపదేశాన్ని జాగ్రత్తగా అనుసరించాలి.
14. ఇశ్రాయేలు రాజులకు ఇవ్వబడిన ఉపదేశాన్ని మనమెలా అనుసరించవచ్చు?
14 ప్రాచీన ఇశ్రాయేలులోని ప్రతి రాజు, ధర్మశాస్త్రము యొక్క ప్రతిని వ్రాయించుకుని, ‘తన దేవుడైన యెహోవాకు భయపడి [“భయపడటాన్ని నేర్చుకునేందుకు,” NW] ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ... అనుసరించి నడువ నేర్చుకొనేందుకు, అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను’ అని నిర్దేశించబడింది. (ద్వితీయోపదేశకాండము 17:18,19) మనం యెహోవాకు భయపడడాన్ని నేర్చుకోవాలంటే బైబిలు చదవడమూ, అధ్యయనం చేయడమూ అత్యవసరము. మనం బైబిలు సూత్రాలను ఆచరణలో పెడుతుండగా, క్రమక్రమముగా దేవుని జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటాం. ‘యెహోవాయందు భయభక్తులు కలిగియుండడమంటే యెట్టిదో మనం గ్రహిస్తాము.’ ఎలాగంటే, మన జీవితంలో అది తీసుకువచ్చే మంచి ఫలితాలను చూస్తాము, దేవునితో మనకున్న సంబంధాన్ని అమూల్యమైనదిగా ఎంచుతాము. అంతేకాక, పెద్ద వయస్కులు పిన్న వయస్కులు తోటి విశ్వాసులతో క్రమంగా సమావేశమవడం ద్వారా, దైవిక బోధను విని, దేవుని భయాన్ని నేర్చుకుని, ఆయన మార్గాల్లో నడవగలుగుతారు.—ద్వితీయోపదేశకాండము 31:12.
యెహోవాకు భయపడే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు
15. దేవుని భయం ఆయనను ఆరాధించడంతో ఏయే విధాల్లో ముడిపడి ఉంది?
15 ముందు పేర్కొన్నదాని ప్రకారం, దేవుని భయం, మనం యెహోవాకు చేసే ఆరాధనలో ప్రాథమిక భాగమై ఉంది కనుక, అది మనమందరం అలవరచుకోవలసిన ఆరోగ్యకరమైన దృక్పథమని గుర్తిస్తాము. అది మనమాయన మీద సంపూర్ణ విశ్వాసాన్నుంచేలా, ఆయన మార్గాల్లో నడిచేలా, ఆయనను హత్తుకుని ఉండేలా చేస్తుంది. దేవుని భయం యేసుక్రీస్తును ప్రేరేపించినట్లే, మనలను కూడా మన సమర్పణా ప్రతిజ్ఞను ఇప్పుడూ, తర్వాత అనంత కాలమూ నెరవేర్చేందుకు ప్రేరేపించగలదు.
16. మనం తనకు భయపడాలని యెహోవా ఎందుకు మనలను ప్రోత్సహిస్తున్నాడు?
16 దేవుని భయం అనారోగ్యకరమైన భీతి కాదు, అన్యాయంగా నిర్బంధంలో ఉంచేది కాదు. “యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు” అని బైబిలు మనకు హామీ ఇస్తుంది. (కీర్తన 128:1) మనం తనకు భయపడాలని యెహోవా ప్రోత్సహిస్తున్నాడు, ఎందుకంటే ఈగుణం మనలను కాపాడుతుందని ఆయనకు తెలుసు. ప్రేమపూర్వకమైన ఆయన శ్రద్ధ, ‘వారికిని [ఇశ్రాయేలీయులకును] వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు’ అని మోషే వ్రాసిన మాటల్లో మనం చూస్తాము.—ద్వితీయోపదేశకాండము 5:29.
17. (ఎ) మనం దేవునికి భయపడడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలను పొందుతాము? (బి)దేవుని భయాన్ని తర్వాతి ఆర్టికల్‌లో ఏ కోణాల్లో పరిశీలించవచ్చు?
17 అదేవిధంగా, మనం దేవునికి భయపడేలా మన హృదయాన్ని మలుచుకుంటే మనకే మంచిది. ఎలా? మొట్టమొదటిగా, అలాంటి దృక్పథం దేవుణ్ణి ప్రీతిపరుస్తుంది, దాని ద్వారా మనం ఆయనకు దగ్గరవుతాము. “తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును” అని దావీదుకు సొంత అనుభవం ద్వారా తెలుసు. (కీర్తన 145:19) రెండవదిగా, చెడ్డవాటిని గురించి మనకుండే దృక్పథంపై దేవుని భయం ప్రభావం చూపిస్తుంది కనుక, అది మనకు ప్రయోజనకరం. (సామెతలు 3:7) తర్వాతి ఆర్టికల్, ఈభయం మనలను ఆధ్యాత్మిక ప్రమాదం నుండి ఎలా కాపాడగలదో చూపిస్తుంది, దేవునికి భయపడి, చెడుతనాన్ని విడిచిపెట్టిన కొందరు వ్యక్తులను గురించిన లేఖనాధారిత ఉదాహరణలను సమీక్షిస్తుంది.
[అధస్సూచి]
^ పేరా 1 ఐక్య రాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీ, 1948 డిసెంబరు 10న మానవ హక్కుల విశ్వప్రకటనను స్వీకరించింది.
ఈ క్రింది వాటికి మీరు జవాబివ్వగలరా?
• దేవుని భయం అంటే ఏమిటి, అది మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
• దేవునికి భయపడడానికీ, ఆయనతో నడవడానికి సంబంధం ఏమిటి?
• దేవుని భయం, దేవుని మీద ప్రేమతో సంబంధం కలిగివుందని యేసు మాదిరి ఎలా చూపిస్తుంది?
• యెహోవాకు భయపడేలా మన హృదయాన్ని ఏ విధంగా మలచుకోవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
[17వ పేజీలోని చిత్రం]
ధర్మశాస్త్రపు నకలును తమ కోసం వ్రాయించుకుని, దానిని ప్రతిరోజూ చదువుకోవాలని ఇశ్రాయేలీయుల రాజులకు ఆజ్ఞాపించబడింది
[18వ పేజీలోని చిత్రం]
ఒక కుమారుడు తన తండ్రిపై నమ్మకముంచేట్లుగా, మనం యెహోవాపై నమ్మకముంచేలా దేవుని భయము చేస్తుంది
[15వ పేజీలోని చిత్రసౌజన్యం]
నక్షత్రాలు: Photo by Malin, © IAC/RGO 1991