ఒత్తిడి నుండి ఉపశమనానికి ఆచరణాత్మకమైన ఒక పరిష్కార మార్గం
ఒత్తిడి నుండి ఉపశమనానికి ఆచరణాత్మకమైన ఒక పరిష్కార మార్గం
“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.”—మత్తయి 11:28.
1, 2. (ఎ) అమిత ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందడానికి సహాయపడే ఎలాంటి విషయాలు బైబిలులో ఉన్నాయి? (బి)యేసు బోధలు ఎంత ఫలవంతంగా ఉండేవి?
అమిత ఒత్తిడి హానికరమని మీరు అంగీకరిస్తుండవచ్చు; అది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. మానవులందరూ అనేక విధాలైన భారాలతో క్రుంగిపోయారనీ, నేటి ఒత్తిళ్ళతో కూడిన జీవితం నుండి విడుదల పొందాలని అనేకులు ఆతురతతో ఎదురు చూస్తున్నారనీ బైబిలు సూచిస్తుంది. (రోమీయులు 8:20-22) కానీ, మనం మానసిక ఒత్తిళ్ళ నుండి చెప్పుకోదగినంత ఉపశమనాన్ని ఇప్పుడే ఎలా పొందవచ్చో కూడా లేఖనాలు చూపిస్తున్నాయి. 20 శతాబ్దాల పూర్వం జీవించిన ఒక యువకుని సలహాను, మాదిరిని అనుసరించడం ద్వారా అలాంటి ఉపశమనం కలుగుతుంది. ఆయన ఒక వడ్రంగి, కానీ, ఆయనకు తన వృత్తి కన్నా, ప్రజల మీదే ఎక్కువ మక్కువ. ఆయన ప్రజల హృదయాలను తాకేలా మాట్లాడాడు. వారి అవసరాలపై శ్రద్ధ చూపాడు, బలహీనులకు సహాయం చేశాడు, క్రుంగిపోయినవారిని ఓదార్చాడు. ఇంకా ప్రాముఖ్యంగా, ఆధ్యాత్మికత కలిగివుండే సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు అనేకులకు సహాయపడ్డాడు. ఆవిధంగా వారు అమిత ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందగలిగారు, మీరు కూడా పొందవచ్చు.—లూకా 4:16-21; 19:47,48; యోహాను 7:46.
2 నజరేతుకు చెందిన ఈయేసు, రోములోను ఏథెన్సులోను అలెగ్జాండ్రియాలోను కొందరు ఆర్జించిన లోకవిద్యాభ్యాసం చేత నడిపించబడలేదు. అయినప్పటికీ, ఆయన బోధలు ప్రఖ్యాతిగాంచాయి. మన భూమిని విజయవంతంగా పరిపాలించే దేవుని ప్రభుత్వమే ఆయన బోధల ముఖ్యాంశము. ప్రాథమిక జీవిత సూత్రాలను కూడా యేసు వివరించి చెప్పాడు. ఆయన చెప్పిన ఆసూత్రాలు ఇప్పటికీ నిజంగా విలువైనవే. యేసు బోధించినవాటిని నేర్చుకుని ఆచరణలో పెట్టేవారు వెంటనే ప్రయోజనాలను పొందుతారు. ఒత్తిడి నుండి ఉపశమనాన్ని కూడా పొందుతారు. మీరు దానిని పొందడానికి ఆనందించరా?
3. యేసు ఎలాంటి గొప్ప ఆహ్వానాన్ని ఇస్తున్నాడు?
3 మీకు సందేహాలుండవచ్చు. ‘ఎంతో కాలం పూర్వం జీవించిన వ్యక్తి ఇప్పుడు నా జీవితంపై ప్రభావం చూపగలడా?’ అని మీరనుకుంటుండవచ్చు. సరే, యేసు చెప్పిన ఆనందకరమైన మాటలను వినండి: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.” (మత్తయి 11:28-30) ఆయన మాటల భావమేమిటి? ఆయన మాటలను ఇంకొంచెం విశదంగా పరిశీలించి, అవి క్రుంగదీసేంతటి ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికెలా సహాయపడతాయో చూద్దాం.
4. యేసు ఎవరితో మాట్లాడాడు, ఆయన శ్రోతలకు మతనాయకులు కోరినవి చేయడం ఎందుకు కష్టంగా ఉంది?
4 చట్టబద్ధమైనవి చేయడానికి హృదయపూర్వకంగా ప్రయత్నిస్తున్నవారితో యేసు మాట్లాడాడు. వాళ్ళు అంతగా ప్రయత్నిస్తున్నా, యూదా మత నాయకులు మతాన్ని మోయశక్యము కానిదిగా చేసినందువల్ల “భారము”తో ఉన్నారు. (మత్తయి 23:4) ఆనాయకులు జీవితంలోని దాదాపు అన్ని రంగాలపై పెట్టబడిన అంతులేని నియమాలపైనే శ్రద్ధ నిలిపారు. ఎవరైనా ఇది “చెయ్యవద్దు,” అది “చెయ్యవద్దు” అని మీతో తరచూ అంటూ ఉంటే ఒత్తిడికి లోనైనట్లు మీకనిపించదా? దానికి భిన్నంగా, యేసు సత్యంవైపుకు, నీతి వైపుకు, తను చెప్పేది వినడం ద్వారా మెరుగైన జీవితంవైపుకు రమ్మని ఆహ్వానించాడు. అవును, సత్య దేవుడ్ని తెలుసుకునే మార్గంలో, యేసుక్రీస్తు చెబుతున్నదానికి చెవియొగ్గడం చేరివుంది. ఎందుకంటే, యెహోవా ఎలా ఉంటాడో మానవులు చూడగలిగింది, చూడగలిగేది యేసులోనే. అందుకే యేసు “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు” అని అన్నాడు.—యోహాను 14:9.
మీ జీవితం అమిత ఒత్తిళ్ళతో నిండివుందా?
5, 6. మన కాలంతో పోల్చితే, యేసు కాలం నాటి పనివాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, కూలి ఎంత ఉండేది?
5 అమిత ఒత్తిడి మీ చింతకు కారణమవ్వవచ్చు, ఎందుకంటే, మీ ఉద్యోగం లేదా కుటుంబ పరిస్థితి మీరు మోయలేనంత భారంగా ఉండవచ్చు. లేదా ఇతర బాధ్యతలు మోయలేనివిగా అనిపిస్తుండవచ్చు. అలాగైతే, మీరు కూడా, యేసుకు తారసపడి, ఆయన సహాయాన్ని పొందిన యథార్థవంతులవంటివారే. ఉదాహరణకు, జీవనోపాధిని సంపాదించుకోవడమనే సమస్యనే తీసుకోండి. నేడు అనేక మంది దాని కోసం చాలా కష్టపడుతున్నారు. యేసు కాలంలోని అనేకులు కూడా అలాగే కష్టపడ్డారు.
6 అప్పట్లో, ఒక కూలిపనివాడు, రోజుకు 12 గంటల చొప్పున, వారానికి 6 రోజులు కష్టపడేవాడు, సాధారణంగా ఒక రోజంతా కష్టపడితే ఒక్క దేనారం మాత్రమే లభించేది. (మత్తయి 20:2-10) దాన్ని మీకూలితో, లేదా మీస్నేహితుల కూలితో ఎలా పోల్చవచ్చు? ప్రాచీనకాలపు కూలిని ఆధునిక కాలపు కూలితో పోల్చడం సవాలుగా ఉండవచ్చు. కొనుగోలు శక్తిని, అంటే ఆడబ్బుతో ఏమి కొనవచ్చన్నదాన్ని లెక్కలోకి తీసుకోవడమే ఒక మార్గం. యేసు కాలంలో, నాలుగు కప్పుల గోధుమ పిండితో తయారు చేసిన ఒక రొట్టెకు అయ్యే ఖరీదు ఒక గంట పని చేస్తే వచ్చే కూలి అని ఒక పండితుడు చెబుతున్నాడు. ఒక కప్పు మంచి ద్రాక్షారసానికి అయ్యే ఖరీదు రెండు గంటలు పనిచేస్తే వచ్చే కూలి అని మరో పండితుడు చెబుతున్నాడు. ఇలాంటి వివరాలు, ఆకాలంలోని ప్రజలు చాలా గంటలు శ్రమపడాల్సి వచ్చేదని, జీవనాన్ని సాగించడం చాలా కష్టంగా ఉండేదని చూపిస్తున్నాయి. నేడు మనకు ఉపశమనమూ, సేదదీర్పూ అవసరమున్నట్లే, ఆనాటి ప్రజలకూ అవసరమయ్యాయి. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే, ఎక్కువ పనిచేయాలని ఒత్తిడి చేయబడుతుండవచ్చు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సమయం లేకపోవచ్చు. మీరు ఉపశమనం కావాలని ఎంతగానో కోరుకుంటున్నారని మీరు ఒప్పుకుంటుండవచ్చు.
7. యేసు సందేశానికి ఎలాంటి ప్రతిస్పందన వచ్చింది?
7 “ప్రయాసపడి భారము మోసికొనుచున్న”వారందరికి యేసు ఇచ్చిన ఆహ్వానం, అప్పట్లో ఆయన శ్రోతలను ఎంతగానో ఆకట్టుకునివుండవచ్చు. (మత్తయి 4:25; మార్కు 3:7,8) “నేను మీకు విశ్రాంతి కలుగజేతును” అని యేసు చేసిన వాగ్దానాన్ని గుర్తుచేసుకోండి. ఆవాగ్దానం ఇప్పటికీ అమలులో ఉంది. మనం కూడా “ప్రయాసపడి భారము మోసికొనుచున్న”వారమైతే, అది మనకు కూడా వర్తించగలదు. అది అలాంటి పరిస్థితిలో ఉన్న మన ప్రియమైనవారికి కూడా వర్తించగలదు.
8. పిల్లల పెంపకమూ, వార్ధక్యమూ ఒత్తిళ్ళను ఎలా పెంచుతాయి?
8 ప్రజలకు భారంగావున్న వేరే విషయాలు కూడా ఉన్నాయి. పిల్లలను పెంచడం ఒక పెద్ద సవాలు. అంతెందుకు పిల్లవాడిగా ఉండడం కూడా ఒక సవాలుగా ఉండగలదు. అన్ని వయస్సుల్లోనివారు మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఈసమస్యలను ఎదుర్కొంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజలు ఒకవేళ మునుపటికన్నా ఎక్కువ కాలం జీవిస్తున్నా, వైద్యరంగంలో పురోగతులున్నా వృద్ధులు ఎదుర్కోవలసిన ప్రత్యేక సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి.—కాడి క్రింద
9, 10. ప్రాచీన కాలాల్లో, కాడి దేనిని సూచించేది, తన కాడిని ఎత్తుకోమని ప్రజలను యేసు ఎందుకు ఆహ్వానించాడు?
9మత్తయి 11:28, 29 నుండి తీసుకున్న మాటలను మీరు గమనించారా? “నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి” అని యేసు అన్నాడు. అప్పట్లో, సామాన్యులు తాము ఒక కాడి క్రింద పనిచేస్తున్నట్లు భావించివుంటారు. ప్రాచీన కాలాల నుండి, కాడి అన్న మాట, బానిసత్వానికి, లేదా దాస్యానికి సూచనగా ఉపయోగించబడుతోంది. (ఆదికాండము 27:40; లేవీయకాండము 26:13; ద్వితీయోపదేశకాండము 28:48) యేసుకు తారసపడిన కూలిపనివాళ్ళలో చాలా మంది నిజమైన కాడిని తమ భుజాలపై పెట్టుకుని చాలా బరువైన భారాలను మోయవలసి ఉండేది. కాడులు నిర్మించబడిన తీరును బట్టి అవి మెడకు భుజాలకు సౌకర్యంగానైనా ఉండేవి, లేదా ఒరచుకుపోయే విధంగానైనా ఉండేవి. వడ్రంగిగా యేసు కాడులను తయారు చేసివుండవచ్చు, “సుళువుగా” ఉండేవిధంగా తయారు చేయడం ఆయనకు తెలిసేవుంటుంది. కాడి సాధ్యమైనంత సౌకర్యవంతంగా ఉండేందుకు, మెడకు భుజాలకు కాడి తగిలే భాగాన్ని తోలుతో లేదా బట్టతో ఆయన బహుశా చుట్టేవాడేమో.
10 ‘మీమీద నా కాడి ఎత్తుకోండి’ అని యేసు చెప్పినప్పుడు, పనివాడి మెడకు భుజాలకు “సుళువుగా” ఉండేలా చక్కగా తయారుచేయబడిన కాడులను ఇచ్చిన వ్యక్తితో తనను తాను పోల్చుకునివుండవచ్చు. కాబట్టి, “నా భారము తేలికగా” ఉన్నది అని కూడా యేసు అన్నాడు. ఆకాడిని ఉపయోగించడం అసంతోషకరమైన పని కాదని, ఆపని బానిస పని కాదని అది సూచిస్తుంది. నిజానికి, తన కాడిని ఎత్తుకోమని ఆహ్వానించడం ద్వారా, అప్పట్లో ఉన్న అణచివేసే అన్ని పరిస్థితుల నుండి వెంటనే ఉపశమనాన్ని కలిగిస్తానని యేసు చెప్పడం లేదు. అయినప్పటికీ, వారి ముందు ఆయన ఉంచిన క్రొత్త దృక్పథం వారిని ఎంతో సేదదీర్చివుంటుంది. వాళ్ళ జీవనశైలిలోను, కార్యనిర్వహణా విధానంలోను కొన్ని సవరింపులు చేసుకోవడం కూడా వారికి ఉపశమనాన్ని కలుగజేసివుంటుంది. అంత కన్నా ముఖ్యంగా, స్పష్టమైన గట్టిదైన నిరీక్షణ, జీవితం అంత ఒత్తిళ్ళమయం కాదని గ్రహించేందుకు వారికి సహాయపడి ఉంటుంది.
మీరూ సేదదీర్చుకోగలరు
11. కాడులను మార్చుకోమని యేసు సూచించటం లేదని ఎలా చెప్పవచ్చు?
11 ప్రజలు తమ కాడులను పరస్పరం మార్చుకుంటారని యేసు చెప్పలేదని గమనించండి. నేడు క్రైస్తవులు నివసిస్తున్న ప్రాంతాల్లో ఇతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నట్లే, ఆదేశాన్ని రోమా ప్రభుత్వమే ఏలుతోంది. మొదటి శతాబ్దపు రోమా పన్ను విధానం అలాగే కొనసాగుతోంది. ఆరోగ్య ఆర్థిక సమస్యలు అలాగే ఉన్నాయి. అపరిపూర్ణతా, పాపమూ ప్రజలపై దుష్ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ, వారు యేసు బోధలను అవలంబించడం ద్వారా సేదదీర్చుకోగలిగేవారు. నేడు మనమూ అలాగే సేదదీర్చుకోవచ్చు.
12, 13. ఏది సేదదీరుస్తుందని యేసు నొక్కిచెప్పాడు, కొందరు దానికెలా ప్రతిస్పందించారు?
12 యేసు కాడిని ఉపయోగించి చెప్పిన ఉపమానపు ముఖ్యమైన అన్వయింపు, శిష్యులను చేసే పనికి వర్తిస్తుందని స్పష్టమవుతుంది. యేసు ముఖ్య కార్యకలాపం, దేవుని రాజ్యాన్ని నొక్కిచెబుతూ ఇతరులకు బోధించడమే అనడంలో సందేహం లేదు. (మత్తయి 4:23) ‘మీమీద నా కాడి ఎత్తుకోండి’ అని ఆయన చెప్పినప్పుడు, ఆపనిలో ఆయనను అనుసరించడం నిశ్చయంగా ఇమిడివుంది. అనేకులకు జీవితంలో ఉండే ప్రముఖ చింత తమ వృత్తి గురించే. అలాంటిది, యథార్థహృదయులైనవారు తమ వృత్తిని కూడా మార్చుకునేలా యేసు వారిని కదిలించాడని సువార్తలు చూపిస్తున్నాయి. “నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెద”నని పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానులకు యేసు ఇచ్చిన పిలుపును గుర్తు చేసుకోండి. (మార్కు 1:16-20) యేసు తన జీవితంలో ఏపనికైతే ప్రముఖ స్థానాన్నిచ్చాడో ఆపనిని తన నడిపింపు క్రింద, తన సహాయంతో చేస్తే, ఎంత సంతృప్తికరంగా ఉంటుందో ఆజాలరులకు చూపించాడు.
13 ఆయన మాటలు విన్న కొందరు యూదులు ఆయన చెప్పింది గ్రహించి, ఆచరణలో పెట్టారు. లూకా 5:1-11 చదివి, సముద్రతీరంలోని ఆసన్నివేశాన్ని ఒకసారి ఊహించుకుని చూడండి. నలుగురు జాలరులు రాత్రంతా కష్టపడినా, చేపలు దొరకలేదు. కానీ అకస్మాత్తుగా, వాళ్ళ వలలు నిండిపోయాయి. అదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు; యేసు జోక్యం చేసుకోవడం వల్ల జరిగింది. వాళ్ళు సముద్రతీరంవైపుకు చూసినప్పుడు, జనసమూహాలు యేసు బోధలను జాగ్రత్తగా ఆలకించడం చూశారు. ‘ఇప్పటినుండి మీరు మనుష్యులను పట్టువారై ఉంటారు’ అని యేసు ఆనలుగురికి చెప్పిన దాని భావం స్పష్టంగా అర్థమయ్యేందుకు అది సహాయపడింది. దానికి వారెలా ప్రతిస్పందించారు? “వారు దోనెలను దరికిచేర్చి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.”
14. (ఎ) నేడు మనమెలా సేదదీర్చుకోవచ్చు? (బి)సేదదీర్చే ఏ సువార్తను యేసు ప్రకటించాడు?
14 నిజానికి, మీరు కూడా అలా ప్రతిస్పందించవచ్చు. ప్రజలకు బైబిలు సత్యాన్ని బోధించే పని ఇప్పటికీ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60లక్షలమంది యెహోవాసాక్షులు, ‘మీమీద నా కాడిని ఎత్తుకోండి’ అన్న యేసు ఆహ్వానాన్ని అంగీకరించారు; వారు ‘మనుష్యులను పట్టే జాలరులుగా’ మారారు. (మత్తయి 4:19) కొందరు దానిని పూర్తికాల వృత్తిగా చేసుకున్నారు; మరి కొందరు తమకు చేతనైనంత మేరకు భాగిక కాలం చేస్తున్నారు. అది సేదదీర్చేదిగా ఉందని వారందరూ కనుగొన్నారు కనుక, వాళ్ళ జీవితం తక్కువ ఒత్తిళ్ళతో ఉంది. అందులో, ఇతరులకు మంచివార్తను, అంటే “రాజ్యమును గూర్చిన సువార్త”ను తెలియజేస్తూ, తాము ఆనందించే పనిని చేయడం ఇమిడివుంది. (మత్తయి 4:23) ఒక మంచివార్తను గురించి, ప్రత్యేకించి ఈసువార్తను గురించి మాట్లాడడం ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్కువ ఒత్తిళ్ళు లేకుండా జీవితాన్ని గడపవచ్చని అనేకులను ఒప్పించేందుకు అవసరమైన ప్రాథమిక సమాచారం బైబిలులో ఉంది.—2 తిమోతి 3:16,17.
15. జీవితానికి సంబంధించిన యేసు బోధల నుండి మీరెలా ప్రయోజనం పొందగలరు?
15 ఈమధ్యే దేవుని వాక్యాన్ని గురించి నేర్చుకోవడం మొదలుపెట్టిన వ్యక్తులు సహితం, జీవించడమెలాగో చూపించే యేసు బోధల నుండి కొంతమేరకు ప్రయోజనం పొందుతున్నారు. యేసు బోధలు తమను సేదదీర్చాయనీ, తమ జీవితాలను పూర్తిగా మార్చుకోవడానికి సహాయపడ్డాయని చాలా మంది నిజాయితీగా చెప్పగలరు. మీవిషయంలో కూడా అలా
జరిగిందని నిర్ధారించుకోవడానికి, యేసు జీవితము, పరిచర్యలను గురించిన వృత్తాంతాల్లో, ముఖ్యంగా మత్తయి మార్కు లూకా సువార్తల్లో పేర్కొనబడిన జీవిత సూత్రాల్లో కొన్నింటిని పరిశీలించండి.సేదదీర్చుకునే ఒక మార్గం
16, 17. (ఎ) యేసు చేసిన ప్రముఖమైన బోధల్లో కొన్నింటిని మీరు ఎక్కడ కనుగొనగలరు? (బి)యేసు బోధలను అన్వయించుకోవడం ద్వారా సేదదీర్చుకోవడానికి ఏమి అవసరం?
16 సా.శ. 31వ సంవత్సరం, వసంత ఋతువులో యేసు ఇచ్చిన ఒక ప్రసంగం ఇప్పటికీ సుప్రసిద్ధమైనదే. మామూలుగా దానిని కొండమీది ప్రసంగం అంటారు. మత్తయి 5 నుండి 7 అధ్యాయాల్లోను, లూకా 6వ అధ్యాయంలోను అది వ్రాయబడింది, అది ఆయన చేసిన అనేక బోధలను సంగ్రహంగా చెబుతుంది. యేసు చేసిన ఇతర బోధలను సువార్తల్లోని ఇతర భాగాల్లో కూడా చూడవచ్చు. ఆయన చేసిన బోధల్లో అనేకం వివరంగా ఉన్నాయి. అయితే వాటిని ఆచరణలో పెట్టడం అంత సులభంగా ఉండకపోవచ్చు. ఆఅధ్యాయాలను జాగ్రత్తగా ఆలోచిస్తూ ఎందుకు చదవకూడదు? ఆయన ఆలోచనల బలం మీఆలోచనా విధానంపైనా మీదృక్పథంపైనా ప్రభావం చూపనివ్వండి.
17 యేసు బోధలను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చన్నది స్పష్టం. ఆయన చేసిన ప్రముఖ బోధలను ఒక కోవకు చేరుద్దాము. మీరు వాటిని ఆచరణలోపెట్టాలన్న లక్ష్యంతో ఒక నెలలో రోజుకొకదాన్ని ప్రయత్నించవచ్చు. ఎలా? వాటిని అలా చూసి వదిలేయకండి. “నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలె”నని యేసుక్రీస్తునడిగిన ధనికుడైన ఒక అధికారిని గుర్తుచేసుకోండి. దేవుని ధర్మశాస్త్రం ముఖ్యంగా కోరే విషయాలను యేసు సమీక్షించినప్పుడు, తాను వాటిని అప్పటికే చేస్తున్నట్లు ఆవ్యక్తి సమాధానమిచ్చాడు. అయినప్పటికీ తానింకా ఎక్కువగా చేయవలసివుందని ఆయన గ్రహించాడు. దైవిక సూత్రాలను నిజజీవితంలో ఆచరించేందుకు లూకా 18:18-23) కాబట్టి, నేడు యేసు బోధలను నేర్చుకోవాలని కోరుకునే వ్యక్తి, వాటితో ఏకీభవించడానికీ, వాటిని క్రియాశీలంగా అవలంబిస్తూ తద్వారా ఒత్తిళ్ళను తగ్గించుకోవడానికీ తేడా ఉందని గుర్తుంచుకోవడం అవసరం.
ఇంకా ఎక్కువ ప్రయత్నించాలని, క్రియాశీలుడైన శిష్యుడవ్వాలని యేసు ఆయనను కోరాడు. కానీ, ఆమేరకు చేయడానికి ఆవ్యక్తి సిద్ధం కాలేదని స్పష్టమవుతుంది. (18. ఇవ్వబడిన బాక్సు మీకు ప్రయోజనాన్ని చేకూర్చేలా మీరు దానినెలా ఉపయోగించవచ్చో సోదాహరణంగా చెప్పండి.
18 యేసు బోధలను పరిశీలించి, వాటిని ఆచరించనారంభించేందుకు, ఇక్కడ ఇవ్వబడిన బాక్సులోని 1వ పాయింటు చూడండి. అది మత్తయి 5:3-9ని సూచిస్తుంది. నిజం చెప్పాలంటే, మనమెవరమైనా సరే ఆవచనాల్లో ఇవ్వబడిన చక్కని ఉపదేశాన్ని ధ్యానించడానికి చాలా సమయాన్ని తీసుకోవచ్చు. మొత్తమ్మీద వాటన్నింటిని చూసినప్పుడు మీరు మీదృక్పథాన్ని గురించి ఏ నిర్ధారణకు వస్తారు? మీరు మీజీవితంలో అమిత ఒత్తిళ్ళ ప్రభావాన్ని అధిగమించాలని నిజంగా కోరుకుంటే, మీకు ఏమి సహాయపడుతుంది? మీరు ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ అవధానమిస్తూ, మీఆలోచనలు ఎక్కువగా వాటి చుట్టే తిరగడానికి అనుమతిస్తే, మీపరిస్థితి ఎలా మెరుగుపడగలదు? ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ శ్రద్ధ ఇచ్చేలా, మీజీవితంలో తక్కువ ప్రాధాన్యతనివ్వవలసిన విషయమేదైనా ఉందా? మీరు అలా చేస్తున్నట్లయితే, మీసంతోషం అధికమవుతుంది.
19. అదనపు అంతర్దృష్టినీ, గ్రహింపునూ పొందేందుకు మీరేమి చేయగలరు?
19 మీరు ఇంకొక పనిని కూడా చేయవచ్చు. మీరు ఆవచనాలను మరో దేవుని సేవకునితో, బహుశా మీవివాహ జతతో, దగ్గరి బంధువుతో, లేదా స్నేహితునితో చర్చించవచ్చు కదా? (సామెతలు 18:24; 20:5) ధనికుడైన అధికారి లేఖన సంబంధిత విషయాన్ని గురించి మరొకరిని, అదే యేసుని, అడిగాడని గుర్తుంచుకోండి. ఆయన యేసు చెప్పినదానికి ప్రతిస్పందించివుంటే, సంతోషం, శాశ్వత జీవితం గురించిన నిరీక్షణ ఆయనకు పెరిగేది. మీరు ఆవచనాలను చర్చించే తోటి ఆరాధకుడు యేసుకు సమానం కాకపోయినప్పటికీ, యేసు బోధలను గురించిన సంభాషణ ఇరువురికీ ప్రయోజనకరంగా ఉంటుంది. అతి త్వరగా చర్చించడానికి ప్రయత్నించండి.
20, 21. యేసు బోధలను నేర్చుకోవడానికి మీరు ఏ పద్ధతిని అనుసరించవచ్చు, మీరు మీపురోగతిని ఎలా మదింపు చేసుకోవచ్చు?
20 “మీకు సహాయపడే బోధలు” అనే బాక్సును మరొకసారి చూడండి. మీరు రోజూ పరిశీలించడానికి, రోజుకు కనీసం ఒక బోధవుండేలా, ఈబోధలు వర్గీకరించబడ్డాయి. ఇక్కడ సూచించబడిన వచనాల్లో యేసు ఏమి చెప్పాడో మొదట చదవండి. తర్వాత ఆయన చెప్పిన మాటలను గురించి ఆలోచించండి. మీరు వాటిని ఎలా ఆచరణలో పెట్టాలో ధ్యానించండి. మీరు ఇప్పటికే వాటిని ఆచరిస్తున్నట్లయితే, ఆదైవిక బోధ అనుసారంగా జీవించేందుకు ఇంకా ఎక్కువ ఏమి చేయవచ్చో ధ్యానించండి. ఆరోజంతా మీరు ఆబోధను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. దానిని అర్థం చేసుకోవడం మీకు చాలా కష్టంగా ఉంటే, లేదా దానిని ఆచరణలో పెట్టడమెలాగో అర్థం కాకపోతే, మరుసటి రోజు కూడా ప్రయత్నం చేయండి. అయితే, మీరు దాని మీద పట్టు సాధించాకే మరొక దాని వైపుకు వెళ్ళాలనే నియమేమీ లేదని గుర్తుంచుకోండి. ఆమరుసటి రోజు మీరు మరొక బోధను గురించి ఆలోచించవచ్చు. వారాంతానికి వచ్చేసరికి, మీరు యేసు బోధల్లో నాలుగు లేదా ఐదింటిని అభ్యసించడంలో ఎంత సఫలులయ్యారో ఆలోచించుకోవచ్చు. రెండవ వారం, మరి కొన్నింటిని ఒక్కో రోజు ఒక్కొక్కటి ప్రయత్నించవచ్చు. మీరు ఏదైనా ఒక బోధను ఆచరణలో పెట్టలేకపోతే, నిరుత్సాహపడకండి. ప్రతి క్రైస్తవునికీ అలాంటి అనుభవం కలుగుతుంది. (2 దినవృత్తాంతములు 6:36; కీర్తన 130:3; ప్రసంగి 7:20; యాకోబు 3:8) మూడవ వారము నాలుగవ వారము అలాగే చేయండి.
21 ఒక నెల గడిచే సరికి, లేక మరికొన్ని రోజులు గడిచే సరికి, మీరు 31 పాయింట్లనూ ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించివుంటారు. అలా చేయడం మూలంగా మీకేమనిపిస్తుంది? మీరు మునుపటికన్నా ఎక్కువ సంతోషంగా ఉన్నట్లు, బహుశా మనస్సు ఇంకా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించదా? ఒకవేళ మీరు ఏదో కొంచెమే మెరుగుపడినా కూడా, మీకు ఒత్తిడి తగ్గినట్లు ఉండవచ్చు, లేదా ఒత్తిళ్ళలో ఉన్నప్పడు ఇంకాస్త మెరుగ్గా ప్రవర్తిస్తుండవచ్చు, మీరు ఇదే విధంగా కొనసాగే ఒక పద్ధతిని గుర్తించివుండవచ్చు. యేసు బోధించిన ఫిలిప్పీయులు 3:16.
ఇంకా అనేకమైన చక్కని పాయింట్లు ఈలిస్టులో లేవన్న విషయం మర్చిపోకండి. వాటిలో కొన్నింటిని వెదకి పట్టుకుని, ఆచరణలో పెట్టడానికి ఎందుకు ప్రయత్నించకూడదు?—22. యేసు బోధలను అనుకరించడం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుండవచ్చు, మనం ఇంకా ఏ అదనపు విషయాన్ని అధ్యయనం చేయవలసి ఉంది?
22 యేసు కాడి పూర్తిగా బరువు లేనిది కాకపోయినా సుళువైనదని కూడా మీరు గ్రహిస్తారు. ఆయన బోధలు, ఆయన శిష్యరికము భారమైనవి కావు. యేసు ప్రియ స్నేహితుడైన అపొస్తలుడైన యోహాను, “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” అని 60సంవత్సరాల కన్నా ఎక్కువ అనుభవంతో అన్నాడు. (1 యోహాను 5:3) మీరూ అలాంటి నమ్మకాన్ని కలిగివుండగలరు. యేసు బోధలను ఎంత ఎక్కువగా ఆచరణలో పెడితే, నేడు అనేకుల జీవితాలను ఒత్తిళ్ళమయం చేసే విషయాలు మీకు అంత మానసిక ఒత్తిడిని కలిగించడం లేదని మీరు గ్రహిస్తారు. మీరు ఎంతో ఉపశమనాన్ని పొందినట్లు గమనిస్తారు. (కీర్తన 34:8) అయితే, సుళువైన యేసు కాడిని గురించిన మరొక విషయాన్ని మీరు పరిగణనలోకి తీసుకోవలసి ఉంది. “నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను” అని కూడా యేసు పేర్కొన్నాడు. దానికీ, మనం ఆయన నుండి నేర్చుకొంటూ ఆయనను అనుకరించడానికీ ఏమిటి సంబంధం? తర్వాతి ఆర్టికల్లో, మనమది పరిశీలిస్తాము.—మత్తయి 11:29.
మీరేమని జవాబిస్తారు?
• మనం అమిత ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు యేసు వైపుకు ఎందుకు చూడాలి?
• కాడి దేనికి సూచన, ఎందుకు?
• తన కాడిని తీసుకోమని యేసు ప్రజలను ఎందుకు ఆహ్వానించాడు?
• మీరు ఆధ్యాత్మికంగా ఎలా సేదదీర్చుకోవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
[14వ పేజీలోని బ్లర్బ్]
2002వ సంవత్సరానికి యెహోవాసాక్షుల వార్షిక వచనం, “నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.”—మత్తయి 11:28.
[12, 13వ పేజీలోని బాక్సు/చిత్రం]
మీకు సహాయపడే బోధలు
మత్తయి 5 నుండి 7 అధ్యాయాల్లో మీరెలాంటి మంచి విషయాలను కనుగొనగలరు? ఈఅధ్యాయాల్లో గలిలయ కొండపై గొప్ప బోధకుడైన యేసు చేసిన బోధలు కనిపిస్తాయి. దయచేసి మీసొంత బైబిలును తీసుకుని, ఈక్రింద ప్రస్తావించబడిన వచనాలు చదివి వాటికి సంబంధించిన ప్రశ్నలను మీకు మీరే వేసుకోండి.
1. 5:3-9 ఇది సాధారణంగా నాకుండే దృక్పథం గురించి ఏమని చెబుతుంది? నేనింకా ఎక్కువ సంతోషంగా ఉండడానికెలా కృషి చేయగలను? నా ఆధ్యాత్మిక అవసరాలపై ఇంకా ఎక్కువ శ్రద్ధనెలా చూపగలను?
2. 5:25,26 అనేకులకున్న దెబ్బలాడే స్వభావాన్ని అనుకరించకుండా ఏమి చేయడం ఉత్తమం?—లూకా 12:58, 59.
3. 5:27-30 మానసిక వ్యభిచారానికి విరుద్ధంగా యేసు చెప్పిన మాటలు దేన్ని నొక్కి చెబుతున్నాయి? నేను దాన్ని విడనాడటం, నేను సంతోషంగాను మనశ్శాంతితోను ఉండేందుకు ఎలా దోహదపడగలదు?
4. 5:38-42 కయ్యానికి కాలుదువ్వే స్వభావానికి ఆధునిక సమాజం గొప్ప విలువిస్తున్నట్లు నేను ఇవ్వకుండా ఉండడానికి ఎందుకు శ్రమించాలి?
5. 5:43-48 నేను బహుశా శత్రువులుగా భావించిన సహచరులతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం ద్వారా ఎలా ప్రయోజనం పొందగలను? మానసిక సంఘర్షణను తగ్గించుకోవడానికి గానీ దాన్ని లేకుండా చేసుకోవడానికి గానీ ఇదెలా సహాయపడగలదు?
6. 6:14,15 నేను కొన్నిసార్లు క్షమించడానికి విముఖత చూపిస్తున్నానా, అలాగైతే, దానికి ప్రథమ కారణం అసూయా లేక కోపమా? నేను దాన్నెలా మార్చుకోగలను?
7. 6:16-18 నేను నా అంతరంగానికన్నా బాహ్యరూపాన్నే ఎక్కువ పట్టించుకుంటున్నానా? నేను దేని గురించి ఎక్కువ స్పృహ కలిగివుండాలి?
8. 6:19-32 నేను డబ్బు గురించి ఆస్తుల గురించీ అతిగా చింతిస్తున్నట్లయితే దాని ఫలితమెలా ఉంటుంది? నేనీ విషయంలో సమతుల్యతను కలిగి ఉండడానికి నేను దేని గురించి ఆలోచించడం సహాయకరంగా ఉండగలదు?
9. 7:1-5 నా చుట్టూ, ఇతరులను తీర్పు తీర్చేవాళ్ళూ విమర్శించేవాళ్ళూ ఎప్పుడూ తప్పు పట్టేవాళ్ళూ ఉంటే నాకెలా అనిపిస్తుంది? నేనలా ఉండకుండా ఉండటమెందుకంత ప్రాముఖ్యం?
10. 7:7-11 దేవునికి విజ్ఞాపనలు చేయడంలో పట్టుదలగా ఉండడం మంచిదైతే, జీవితంలోని ఇతర రంగాల్లో పట్టుదలగా ఉండడం గురించి ఏమిటి?—లూకా 11:5-13.
11. 7:12 నాకు బంగారు సూత్రం తెలిసినా, నేను ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఎంత తరచుగా దాన్ని ఆచరణలో పెడుతున్నాను?
12. 7:24-27 నేను నా జీవితాన్ని ఏ దిశలో నడిపించుకుంటానన్న దానికి నేనే బాధ్యుడను కనుక, కష్టాలు వరదలాగాను, ఇబ్బందులు ప్రవాహంలాగాను వచ్చి నన్ను ముంచెత్తే సమయం కోసం ఎలా సిద్ధపడగలను? నేను దీని గురించి ఇప్పుడెందుకు ఆలోచించాలి?—లూకా 6:46-49.
నేను పరిశీలించగల అదనపు బోధలు:
13. 8:2,3 దయనీయమైన స్థితిలో ఉన్నవారిపై యేసు తరచూ సానుభూతిని చూపినట్లు, నేనెలా చూపగలను?
14. 9:9-38 నా జీవితంలో కరుణకెలాంటి పాత్రవుంది? నేను దాన్ని ఇంకా ఎక్కువగా ఎలా చూపగలను?
15. 12:19 యేసును గురించిన ప్రవచనం నుండి పాఠం నేర్చుకొని, దెబ్బలాటలకు దారితీసే వివాదాలను పెట్టుకోకుండా ఉండేందుకు ఎలా శ్రమించగలను?
16. 12:20,21 నా మాటలతో గానీ చేతలతో గానీ ఇతరులను అణచివేయకుండా ఉండడం ద్వారా నేనెలాంటి మంచిని చేయగలను?
17. 12:34-37 నేను ఎక్కువ సమయం దేని గురించి మాట్లాడుతుంటాను? నేను బత్తాయిని పిండితే, బత్తాయి రసమే వస్తుందని నాకు తెలుసు, మరి అలాగయితే నా అంతరంగంలో, నా హృదయంలో ఏమి ఉందో నేను ఆలోచించుకోవల్సిన అవసరమేమిటి?—మార్కు 7:20-23.
18. 15:4-6 పెద్దవయస్కులను ప్రేమపూర్వకంగా చూసుకోవడం గురించి యేసు చేసిన వ్యాఖ్యానాల నుండి నేనేమి గ్రహిస్తున్నాను?
19. 19:13-15 నేనేమి చేయడానికి సమయం తీసుకోవాలి?
20. 20:25-28 అధికారం చెలాయించడం కోసం అధికారాన్ని ఉపయోగించడం ఎందుకు లాభకరం కాదు? ఈవిషయంలో నేను యేసునెలా అనుకరించగలను?
మార్కు వ్రాసిన అదనపు ఆలోచనలు:
21. 4:24,25 నేను ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నానన్నది ఎందుకంత ప్రాముఖ్యం?
22. 9:50 మనమేది చెప్పినా ఏది చేసినా వివేచనతో చేయడం వల్ల ఎలాంటి మంచి ఫలితాలు రావచ్చు?
చివరిగా, లూకా వ్రాసిన కొన్ని బోధలు:
23. 8:11, 14 చింత, సంపద, సుఖానుభవము నా జీవితాన్ని శాసించడానికి అనుమతిస్తే, ఫలితమేమై ఉంటుంది?
24. 9:1-6 రోగగ్రస్థులను స్వస్థపరిచే శక్తి యేసుకున్నప్పటికీ, ఆయన దేనికి మొదటి స్థానమిచ్చాడు?
25. 9:52-56 నేను త్వరగా నొచ్చుకుంటానా? ప్రతీకారం చేసే ధోరణిని వదిలిపెడతానా?
26. 9:62 దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడాల్సిన నా బాధ్యతను నేనెలా దృష్టిస్తాను?
27. 10:29-37 నేను పొరుగువాడ్నే కానీ అపరిచితుడను కానని ఎలా నిరూపించుకోగలను?
28. 11:33-36 నా జీవితాన్ని మరింత సరళీకృతం చేసుకునేందుకు నేను ఇంకా ఏ మార్పులు చేసుకోవాలి?
29. 12:15 జీవానికీ, ఆస్తులకూ ఎలాంటి సంబంధముంది?
30. 14:28-30 నేను విషయాలను జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడానికి సమయం తీసుకుంటే, వేటిని నివారించుకుంటాను, దానివల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి?
31. 16:10-12 నమ్మకంగా ఉండడం ద్వారా నేను ఎలాంటి ప్రయోజనాలు పొందగలను?
[10వ పేజీలోని చిత్రాలు]
జీవాన్ని కాపాడే పని యేసు కాడి క్రింద ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది