మంచి సందేశం వల్ల వచ్చే ఆశీర్వాదాలు
మంచి సందేశం వల్ల వచ్చే ఆశీర్వాదాలు
“దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును . . . దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును . . . ఆయన నన్ను పంపియున్నాడు.”—యెషయా 61:1-3.
1, 2.(ఎ)తానెవరని యేసు వెల్లడి చేశాడు, ఎలా వెల్లడి చేశాడు? (బి) యేసు ప్రకటించిన మంచి సందేశం తీసుకువచ్చే ఆశీర్వాదాలు ఏవి?
యేసు పరిచర్య ప్రారంభించిన క్రొత్తలో, ఒక విశ్రాంతిదినాన నజరేతులోని సమాజమందిరంలో ఉన్నాడు. లిఖిత వృత్తాంతం ప్రకారం, అప్పుడు “ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతి కియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా— ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను” అని వ్రాయబడిన చోటు ఆయనకు కనిపించింది. యేసు ఆ ప్రవచన సందేశంలోని మిగతా భాగాన్ని కూడా చదివి కూర్చున్నాడు. ఆ తర్వాత, ‘నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది’ అని వారితో చెప్పాడు.—లూకా 4:16-21.
2 ఆ విధంగా, ఆ ప్రవచనంలోని సువార్తికుడు, మంచి సందేశాన్ని ప్రకటించే వాడు, ఓదార్పునిచ్చేవాడు తానేనని యేసు వెల్లడి చేశాడు. (మత్తయి 4:23) యేసు ప్రకటిస్తున్నది నిజంగా ఎంత మంచి సందేశం! ఆయన, ‘నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండును’ అని తన శ్రోతలకు తెలియజేశాడు. (యోహాను 8:12) ‘మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును’ అని కూడా ఆయన చెప్పాడు. (యోహాను 8:31, 32) అవును, యేసు దగ్గర ‘నిత్యజీవపు మాటలు [ఉన్నాయి].’ (యోహాను 6:68, 69) వెలుగు, జీవము, స్వాతంత్ర్యము అనే ఆశీర్వాదాలు నిజంగా ఎంతో అమూల్యమైనవి!
3.యేసు శిష్యులు ప్రకటించిన మంచి సందేశం ఏమిటి?
3మత్తయి 24:14; అపొస్తలుల కార్యములు 15:7; రోమీయులు 1:16) దానికి స్పందించినవారు యెహోవా దేవుణ్ణి తెలుసుకోగలిగారు. వారు మతసంబంధమైన బానిసత్వం నుండి విముక్తులై, క్రొత్త ఆధ్యాత్మిక జనాంగమైన “దేవుని ఇశ్రాయేలు”లో భాగమయ్యారు. దానిలోని సభ్యులకు తమ ప్రభువైన యేసుక్రీస్తుతోపాటు పరలోకంలో ఎల్లకాలము పరిపాలించే ఉత్తరాపేక్ష ఉంది. (గలతీయులు 5:1; 6:16; ఎఫెసీయులు 3:5-7; కొలొస్సయులు 1:4, 5; ప్రకటన 22:5) అవి నిజంగా ప్రశస్తమైన ఆశీర్వాదాలే!
సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత, యేసు శిష్యులు మంచి సందేశాన్ని ప్రకటించడంలో కొనసాగారు. వాళ్ళు ఇశ్రాయేలీయులకు ఇతర జనులకు “రాజ్య సువార్త”ను ప్రకటించారు. (నేడు, మంచి సందేశాన్ని ప్రకటించడం
4.సువార్తను ప్రకటించమన్న ఆదేశం నేడు ఏ విధంగా నెరవేర్చబడుతోంది?
4 మొదట యేసుకు ఇవ్వబడిన ప్రవచనానుసారమైన ఆదేశాన్ని, నేడు అభిషిక్త క్రైస్తవులు, అంతకంతకూ సంఖ్యలో పెరుగుతున్న “వేరే గొఱ్ఱెల”కు చెందిన “గొప్ప సమూహము” మద్దతుతో నెరవేరుస్తున్నారు. (ప్రకటన 7:9; యోహాను 10:16) దాని ఫలితంగా, మంచి సందేశం మునుపటికన్నా నేడు విస్తృతంగా ప్రకటించబడుతోంది. 235 దేశాల్లోను, టెరిటరీల్లోను, యెహోవాసాక్షులు “దీనులకు సువర్తమానము ప్రకటించుటకు . . . నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును” బయలుదేరారు. (యెషయా 61:1, 2) అలా, క్రైస్తవ ప్రకటనా పని అనేకులకు ఆశీర్వాదాలను తీసుకువస్తూ “ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను” యథార్థంగా ఓదారుస్తూ కొనసాగుతోంది.—2 కొరింథీయులు 1:3, 4.
5.సువార్తను ప్రకటించే విషయంలో, యెహోవాసాక్షులు క్రైస్తవ మతసామ్రాజ్యపు చర్చీల నుండి ఎలా భిన్నంగా ఉన్నారు?
5 క్రైస్తవ మత సామ్రాజ్యానికి చెందిన చర్చీలు సువార్తను వివిధ మార్గాల్లో వ్యాపింపజేయడానికి మద్దతునిస్తున్నాయి అన్నది నిజమే. ఇతర దేశాల్లో ప్రచారం చేయటానికి అనేక చర్చీలు మిషనరీలను పంపిస్తున్నాయి. ఉదాహరణకు, మడగాస్కర్, ఆఫ్రికాలోని దక్షిణ దేశాల్లో, టాంజానియా, జింబాబ్వే దేశాల్లో ఆర్థడాక్స్ మిషనరీల కార్యకలాపాలను గురించి ది ఆర్థడాక్స్ క్రిస్టియన్ మిషన్ సెంటర్ మ్యాగజైన్ నివేదిస్తోంది. అయినప్పటికీ, క్రైస్తవ మత సామ్రాజ్యానికి చెందిన ఇతర చర్చీల్లాగే, ఆర్థడాక్స్ చర్చి సభ్యుల్లో అత్యధిక సంఖ్యాకులు అలాంటి పనిలో భాగం వహించడం లేదు. దానికి భిన్నంగా, సమర్పిత యెహోవాసాక్షులందరూ, సువార్తను ప్రకటించే పనిలో పాల్గొనడానికి తీవ్రంగా కృషి చేస్తారు. ఆ మంచి సందేశాన్ని ప్రకటించడం, యథార్థమైన తమ విశ్వాసానికి నిదర్శనమని వారు గ్రహించారు. “నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును” అని పౌలు అన్నాడు. ఒక వ్యక్తికున్న విశ్వాసము క్రియాశీలుడుగా అయ్యేందుకు ఆయనను కదిలించకపోతే, అది మృతమైనదవుతుంది.—రోమీయులు 10:10; యాకోబు 2:17.
శాశ్వతమైన ఆశీర్వాదాలను తెచ్చే మంచి సందేశం
6.నేడు ప్రకటించబడుతున్న మంచి సందేశం ఏమిటి?
6 యెహోవాసాక్షులు సర్వోన్నతమైన సందేశాన్ని ప్రకటిస్తున్నారు. ఆ సందేశాన్ని అంగీకరించేవారికి బైబిలు తెరిచి, మానవాళి దేవుణ్ణి సమీపించే మార్గాన్ని తెరిచేందుకు, వారికి పాప క్షమాపణ లభించేందుకు, నిత్యజీవ నిరీక్షణనిచ్చేందుకు యేసు తన జీవాన్ని బలిగా అర్పించాడన్న విషయాన్ని సాక్షులు చూపిస్తారు. (యోహాను 3:16; 2 కొరింథీయులు 5:18, 19) అభిషిక్త రాజైన యేసుక్రీస్తు అధికారంలో దేవుని రాజ్యము పరలోకంలో స్థాపించబడిందని, త్వరలోనే అది భూమి మీది నుండి దుష్టత్వాన్ని తీసివేసి, పరదైసు పునఃస్థాపించబడేలా పర్యవేక్షిస్తుందని వారు ప్రకటిస్తారు. (ప్రకటన 11:15; 21:3, 4) యెషయా ప్రవచన నెరవేర్పుగా, “యెహోవా హితవత్సరము” ఇదేనని, మానవాళి ఇప్పటికీ ఆ మంచి సందేశానికి స్పందించవచ్చని తమ పొరుగువారికి తెలియజేస్తారు. “మన దేవుని ప్రతిదండన దినము” త్వరలో రాబోతుందని, పశ్చాత్తాపం చూపని తప్పిదస్థులను యెహోవా ఆ దినమున అంతం చేస్తాడని వారు హెచ్చరిస్తారు.—కీర్తన 37:9-11.
7.యెహోవాసాక్షుల మధ్యవున్న ఐక్యతను ఏ అనుభవం చూపిస్తుంది, వాళ్ళ మధ్య ఎందుకలాంటి ఐక్యత ఉంది?
7 దుర్ఘటనలకు విపత్తులకు విపరీతంగా గురవుతున్న లోకంలో, కేవలం ఇది మాత్రమే శాశ్వత ప్రయోజనాలున్న మంచి సందేశం. దాన్ని అంగీకరించేవారు, ఐక్యతగల ప్రపంచవ్యాప్త క్రైస్తవ సహోదర సమాజంలో భాగమవుతారు. ఆ సమాజంలోనివారు జాతీయ, వర్గీయ లేదా ఆర్థిక తేడాలు తమ మధ్య విభేదాలు కలిగించడాన్ని అనుమతించరు. వారు ‘పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొన్నారు.’ (కొలొస్సయులు 3:14; యోహాను 15:) గత సంవత్సరం ఆఫ్రికాలోని ఒక దేశంలో ఇది స్పష్టమయ్యింది. ఒక రోజు ఉదయం ఆ దేశపు రాజధాని నగరం, తుపాకి కాల్పులతో నిద్రలేచింది. అప్పట్లో అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం జరుగుతోంది. ఆ సంఘటనలు జాతి వివాదాలకు దారితీసినప్పుడు ఒక సాక్షి కుటుంబం వేరే జాతికి చెందిన తోటి సాక్షులకు ఆశ్రయమిచ్చినందుకు విమర్శలకు గురైంది. అప్పుడు ఆ కుటుంబం, “మా ఇంట్లో యెహోవాసాక్షులు మాత్రమే ఉన్నారు” అని జవాబిచ్చింది. వారికి జాతి వ్యత్యాసాలు ముఖ్యం కాదు; అవసరాల్లో ఉన్న వారిని ఆదరిస్తూ క్రైస్తవ ప్రేమ చూపడమే ముఖ్యం. సాక్షికాని వారి బంధువు ఒకామె, “అన్ని మతాలవారు తమ తోటి ఆరాధకులకు నమ్మకద్రోహం చేశారు. యెహోవాసాక్షులు మాత్రమే అలా చేయలేదు” అని అంది. అంతఃకలహాలతో చీలిపోయిన దేశాల్లో జరిగిన అటువంటి అనేక సంఘటనల గురించిన నివేదికలు, యెహోవాసాక్షులు నిజంగా ‘సహోదరులను ప్రేమిస్తారు’ అని చూపిస్తున్నాయి.— 121 పేతురు 2:17.
మంచి సందేశం ప్రజలను మారుస్తుంది
8, 9.(ఎ)మంచి సందేశాన్ని అంగీకరించేవారు ఎలాంటి మార్పులను చేసుకుంటారు? (బి) ఏ అనుభవాలు మంచి సందేశపు శక్తిని చూపిస్తున్నాయి?
8 ఆ మంచి సందేశం, పౌలు చెప్పిన “ప్రస్తుత జీవితం”తోను “రానున్న జీవితం”తోను ముడిపడివుంది. (1 తిమోతి 4:8, ఈజీ-టు-రీడ్ వర్షన్) అది భవిష్యత్తును గురించిన అద్భుతమైన, నిశ్చయమైన నిరీక్షణనివ్వడమే కాక, ‘ప్రస్తుత జీవితము’ను కూడా మెరుగుపరుస్తుంది. యెహోవాసాక్షులు దేవుని చిత్తానికి పొందికగా తమ జీవితాలను మలచుకునేందుకు వ్యక్తిగతంగా దేవుని వాక్యమైన బైబిలును అనుసరిస్తారు. (కీర్తన 119:101) నీతి, యథార్థమైన భక్తి అనే గుణాలు అలవరచుకోవడం ద్వారా వాళ్ళ వ్యక్తిత్వాలు నూతనపరచబడతాయి.—ఎఫెసీయులు 4:24.
9 ఫ్రాంకో ఉదాహరణను తీసుకోండి. ఆయనకు కోపం ఒక సమస్యగా ఉండేది. తాననుకున్నట్లు జరగనప్పుడు, కోపోద్రేకంతో, వస్తువులను పగులగొట్టేవాడు. ఆయన భార్య యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేసింది. తాను మారవలసిన అవసరముందని గ్రహించేందుకు సాక్షుల క్రైస్తవ మాదిరి ఫ్రాంకోకు నెమ్మదిగా సహాయపడింది. ఆయన వాళ్ళతో బైబిలు అధ్యయనం చేసి, సమాధానము, ఆత్మ నిగ్రహము అనే ఆత్మ ఫలాలను చివరికి కనబరచగలిగాడు. (గలతీయులు 5:22, 23) బెల్జియంలో 2001 సేవా సంవత్సరంలో బాప్తిస్మం తీసుకున్న 492 మందిలో ఆయన ఒకరు. ఆలేహాండ్రో విషయం కూడా తీసుకోండి. ఆ అబ్బాయి, మాదకద్రవ్యాలకు బానిసై ఎంతగా దిగజారిపోయాడంటే, తన జీవితావసరాలకు, అలాగే మాదకద్రవ్యాలను కొనుక్కునేందుకు కావలసిన డబ్బు కోసం చెత్త కుండీల్లో దొరికే వస్తువులను అమ్ముకునేవాడు. ఆయనకు 22 ఏండ్లున్నప్పుడు, బైబిలు అధ్యయనం చేయమని యెహోవాసాక్షులు ఆయనను ఆహ్వానించారు. ఆయన దానికి అంగీకరించాడు. ఆయన ప్రతి రోజు బైబిలు చదివేవాడు, క్రైస్తవ కూటాలకు హాజరయ్యేవాడు. ఆయన ఎంత వేగంగా తన జీవితాన్ని శుద్ధిచేసుకున్నాడంటే, కేవలం ఆరు నెలలలోపే మంచి సందేశాన్ని ప్రకటించడంలో పాల్గొనగలిగాడు. గత సంవత్సరం పనామాలో మంచి సందేశాన్ని ప్రకటించిన 10,115 మందిలో ఆయన ఒకరు.
మంచి సందేశం—దీనులకు ఒక ఆశీర్వాదము
10.మంచి సందేశానికి ఎవరు స్పందిస్తారు, వారి దృక్పథమెలా మారుతుంది?
10 దీనులకు సువార్త ప్రకటించబడుతుందని యెషయా ప్రవచించాడు. ఎవరు ఈ దీనులు? అపొస్తలుల కార్యములు పుస్తకం వర్ణిస్తున్నట్లు ‘నిత్యజీవమునకు నిర్ణయించబడే’వారే ఆ దీనులు. (అపొస్తలుల కార్యములు 13:48) వారు సత్యపు సందేశానికి స్పందించే హృదయంగల వినయస్థులు. సమాజంలోని అన్ని స్థాయిలవారిలోను అలాంటి వ్యక్తులు కనిపిస్తారు. దేవుని చిత్తాన్ని చేయడం ఈ లోకంలో ఏదీ ఇవ్వలేనంతటి ప్రశస్తమైన ఆశీర్వాదాలను తెస్తుందని వారు తెలుసుకుంటారు. (1 యోహాను 2:15-17) ఇంతకూ, యెహోవాసాక్షులు మంచి సందేశాన్ని ప్రకటించే పనిలో ప్రజల హృదయాలను ఎలా చేరుకుంటారు?
11.పౌలు వ్రాసినదాని ప్రకారం, మంచి సందేశాన్ని ఎలా ప్రకటించాలి?
11 సరే, అపొస్తలుడైన పౌలు ఉదాహరణే తీసుకుందాం. “సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను. నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని” అని ఆయన కొరింథీయులకు వ్రాశాడు. (1 కొరింథీయులు 2:1, 2) పౌలు తన పరిజ్ఞానముతో శ్రోతలను ముగ్ధులను చేయాలని ప్రయత్నించలేదు. దేవుడు హామీ ఇచ్చిన వాస్తవమైన విషయాలను, నేడు బైబిలులో కనిపిస్తున్న వాస్తవాలను తప్ప మరి వేటినీ ఆయన బోధించలేదు. “వాక్యమును ప్రకటించుము; . . . ప్రయాసపడుము” అని ఆయన తన తోటి సువార్తికుడైన తిమోతికిచ్చిన ప్రోత్సాహాన్ని కూడా గమనించండి. (2 తిమోతి 4:2) తిమోతి, “వాక్యమును” అంటే దేవుని సందేశాన్ని ప్రకటించవలసి ఉండింది. “దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము” అని కూడా పౌలు తిమోతికి వ్రాశాడు.—2 తిమోతి 2:15.
12.యెహోవాసాక్షులు పౌలు మాటలను మాదిరిని నేడు ఎలా అనుసరిస్తారు?
12 యెహోవాసాక్షులు పౌలు మాదిరిని, అలాగే ఆయన తిమోతికి వ్రాసిన మాటలను దృష్టిలో ఉంచుకుంటారు. వారు దేవుని వాక్యానికున్న శక్తిని గ్రహించి, నిరీక్షణను ఓదార్పును ఇచ్చే సముచితమైన మాటలను పొరుగువారికి చూపించే ప్రయత్నంలో బైబిలును చక్కగా ఉపయోగిస్తారు. (కీర్తన 119:52; 2 తిమోతి 3:16, 17; హెబ్రీయులు 4:12) ఆసక్తిగలవారు తమ తీరిక సమయాల్లో మరెక్కువగా బైబిలు పరిజ్ఞానాన్ని సంపాదించుకునేందుకు యెహోవాసాక్షులు బైబిలు సాహిత్యాన్ని కూడా చక్కగా ఉపయోగిస్తారు. కానీ వారు లేఖనాల్లోని మాటలను ప్రజలకు చూపించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు. వినయస్థుల హృదయాలను దేవుని ప్రేరేపిత వాక్యం కదిలించగలదని వారికి తెలుసు. ఈ విధంగా వాక్యాన్ని ఉపయోగించడం, వారి సొంత విశ్వాసాన్ని కూడా బలపరుస్తుంది.
‘దుఃఖాక్రాంతులందరిని ఓదార్చండి’
13.దేశవ్యాప్తంగా, దుఃఖాక్రాంతులను ఓదార్చవలసిన అవసరతను ఏర్పరచిన ఏ సంఘటనలు 2001వ సంవత్సరంలో జరిగాయి?
13 ఆకస్మిక విపత్తులను 2001వ సంవత్సరం కూడా చవిచూసింది. దాని ఫలితంగా, అనేకమందికి ఓదార్పు అవసరమయ్యింది. గత సెప్టెంబరులో, అమెరికాలోని న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద, వాషింగ్‌టన్ డి.సి.కి సమీపానవున్న పెంటగాన్ మీద తీవ్రవాదులు జరిపిన దాడులు అందుకు ఉదాహరణ. ఆ దాడులకు దేశమంతా విభ్రాంతికి గురైంది! అలాంటి సంఘటనలు జరిగినప్పుడు, ‘దుఃఖాక్రాంతులందరిని ఓదార్చ’మని తమకివ్వబడిన ఆదేశాన్ని నెరవేర్చేందుకు యెహోవాసాక్షులు శ్రమిస్తారు. వాళ్ళు ఎలా నెరవేరుస్తారన్నది కొన్ని అనుభవాలు సోదాహరణంగా చెబుతాయి.
14, 15.దుఃఖిస్తున్నవారిని ఓదార్చడానికి రెండు విభిన్నమైన సందర్భాల్లో సాక్షులు లేఖనాలను ఎలా ఫలవంతంగా ఉపయోగించగలిగారు?
14 పూర్తికాల సువార్తికురాలైన ఒక యెహోవాసాక్షి, కాలిబాటన వెళ్తున్న ఒక మహిళ దగ్గరకు వెళ్ళి, ఈ మధ్య జరిగిన తీవ్రవాదుల దాడుల గురించి ఏమనుకుంటున్నారు అని అడిగింది. ఆ మహిళ ఏడ్వడం మొదలుపెట్టింది. తనకు ఎంతో విచారం కలిగిందని తాను ఏ విధంగానైనా సహాయపడగలిగితే బాగుండునని కోరుకున్నానని ఆమె చెప్పింది. ప్రతి ఒక్కరు దుఃఖితులై ఉన్నారని కూడా ఆమె అంది. ఆ సాక్షి, దేవునికి మనందరి మీద శ్రద్ధ ఉందని చెప్పి, యెషయా 61:1, 2 చదివింది. దైవ ప్రేరేపితమైన ఆ మాటలు ఆ మహిళకు ఎంతో అర్థవంతంగా అనిపించాయి. ఆమె ఒక కరపత్రాన్ని స్వీకరించి, తన ఇంటికి రమ్మని ఆ సాక్షిని కోరింది.
15 మంచి సందేశాన్ని ప్రకటించడంలో నిమగ్నమైవున్న ఇద్దరు సాక్షులు, తన షెడ్డులో పనిచేసుకుంటున్న ఒక వ్యక్తిని కలిశారు. ఈ మధ్యే వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కి జరిగిన దుర్ఘటన దృష్ట్యా లేఖనాల నుండి ఓదార్పుకరమైన మాటలను చూపిస్తామని వాళ్ళు ఆయనకు చెప్పారు. ఆయన 2 కొరింథీయులు 1:3-7 చదివారు. అందులో “క్రీస్తుద్వారా ఆదరణ . . . విస్తరించుచున్నది” అని ఉంది. సాక్షులైన తన పొరుగువారు ఓదార్పుకరమైన సందేశాన్ని ఇతరులతో పంచుకుంటున్నారని గ్రహించిన ఆ వ్యక్తి, “మీరు చేస్తున్న గొప్ప పనికి దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక” అని అన్నాడు.
సమ్మతితో వాళ్ళు16, 17.దుర్ఘటనల మూలంగా విచారంతో లేదా కలతతో ఉన్న వ్యక్తులకు సహాయపడే శక్తి బైబిలుకుందని చూపించే రెండు అనుభవాలు ఏవి?
16 ఆసక్తిగల వారిని పునర్దర్శించడానికి వెళ్తున్న ఒక సాక్షి, మునుపు ఆసక్తి చూపిన ఒక స్త్రీ కుమారుడ్ని కలిశాడు. ఇటీవలి దుర్ఘటన తర్వాత పొరుగువాళ్ళు ఎలా ఉన్నారో ఏమో అని బాధపడుతున్నానని ఆ సాక్షి అతనితో చెప్పాడు. ప్రజలను సందర్శించి వారి యోగక్షేమాలను తెలుసుకోవడానికి ఆ సాక్షి తన సొంత సమయాన్ని వెచ్చించడం చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఆ దాడి జరిగినప్పుడు తాను వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కి చాలా దగ్గర్లో ఉన్నానని, దానిని పూర్తిగా చూశానని ఆయన చెప్పాడు. దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడని ఆయన అడిగినప్పుడు, ఆ సాక్షి “యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము” అని చెబుతున్న కీర్తన 37:39తో పాటు మరితర వచనాలను బైబిలు నుండి చదివి వినిపించాడు. మీరూ మీ కుటుంబమూ ఎలా ఉన్నారు అని ఆ వ్యక్తి సాక్షిని దయాపూర్వకంగా అడిగాడు, తన దగ్గరికి మళ్ళీ రమ్మని చెప్పాడు, తనను సందర్శించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు.
17 సాక్షులు తమ పొరుగువారిని సందర్శిస్తున్నప్పుడు కలిసిన ఒక మహిళ, తీవ్రవాదుల దాడులు జరిగిన తర్వాతి రోజుల్లో యెహోవాసాక్షులు ఓదార్చిన దుఃఖాక్రాంతులైన వేల మందిలో మరొక వ్యక్తి. జరిగిన వాటిని బట్టి ఆమె చాలా కలత చెందింది. “దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును” అని చెబుతున్న కీర్తన 72:12-14 చదివినప్పుడు ఆమె శ్రద్ధగా విన్నది. ఎంత అర్థవంతంగా ఉన్నాయి ఆ మాటలు! ఆ వచనాలను మళ్ళీ చదవమని ఆ మహిళ ఆ సాక్షులను అడిగి, చర్చను కొనసాగించేందుకు వారిని తన ఇంట్లోకి రమ్మని ఆహ్వానించింది. ఆ సంభాషణ అలా కొనసాగి చివరికి బైబిలు అధ్యయనం ప్రారంభించబడింది.
18.తమ తరపున ప్రార్థించమని తనను ఆహ్వానించినప్పుడు, ఒక సాక్షి తన పొరుగువారికి ఎలా సహాయం చేశాడు?
18 ధనవంతులు ఉండే ఒక ప్రాంతంలోని రెస్టారెంటులో ఒక సాక్షి పనిచేస్తున్నాడు. అక్కడి ప్రజలు మునుపు
రాజ్య సందేశం పట్ల ఎక్కువ ఆసక్తి చూపించేవారు కాదు. తీవ్రవాదుల దాడుల తర్వాత, ఆ ప్రాంతంలోనివారు భయకంపితులైనట్లుంది. ఆ దాడి జరిగిన తర్వాతి శుక్రవారం సాయంకాలం, రెస్టారెంట్‌లోని వారందరు బయటకు వెళ్ళి, దాడిలో చనిపోయినవారిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ క్రొవ్వొత్తులను పట్టుకుని కొంచెం సేపు మౌనం పాటించాలని ఆ రెస్టారెంట్ మేనేజరు కోరింది. వాళ్ళ భావాలను గౌరవిస్తూ, ఆ సాక్షి కూడా బయటికి వెళ్ళి, కాలిబాటలో మౌనంగా నిలబడ్డాడు. ఆయన యెహోవాసాక్షుల పరిచారకుల్లో ఒకరని ఆ మేనేజరుకు తెలుసు. కాబట్టి, ఒక్క నిమిషం మౌనం పాటించిన తర్వాత, అందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ ప్రార్థించమని ఆయనను కోరింది. అందుకు ఆ సాక్షి అంగీకరించాడు. విస్తృతంగా అలుముకుపోయిన దుఃఖాన్ని గురించి ఆయన తన ప్రార్థనలో పేర్కొన్నాడు, అయితే, విలపిస్తున్నవారు నిరీక్షణ లేకుండా దుఃఖించనవసరం లేదని కూడా పేర్కొన్నాడు. ఇక మీదట అలాంటి ఘోరకృత్యాలు జరగకుండా ఉండే సమయాన్ని గురించి చెప్పి, బైబిలులోని ఖచ్చితమైన పరిజ్ఞానం ద్వారా ఆదరణకు తండ్రియైన దేవునికి అందరూ మరింత సన్నిహితులు కావచ్చని అన్నాడు. “ఆమెన్” అన్న తర్వాత, ఆ రెస్టారెంట్ బయట నిలబడివున్న 60 కన్నా ఎక్కువమందితోపాటు ఆ మేనేజరు ఆయన దగ్గరికి వచ్చి, ఆయనకు కృతజ్ఞతలు తెలిపి, ఆయనను కౌగిలించుకుని, తాను విన్న ప్రార్థనల్లో కెల్లా అతి శ్రేష్ఠమైన ప్రార్థన అదేనని మెచ్చుకుంది.సమాజానికి ఒక ఆశీర్వాదము
19.యెహోవాసాక్షుల ఉన్నత ప్రమాణాలను కొందరు గుర్తిస్తారని చూపించిన అనుభవం ఏది?
19 అనేకమంది అన్నట్లు, ముఖ్యంగా ఈ రోజుల్లో, ఏ సమాజాల్లో అయితే యెహోవాసాక్షులు క్రియాశీలంగా ఉన్నారో ఆ సమాజాలు వారి సాన్నిధ్యాన్ని బట్టి ప్రయోజనం పొందుతాయి. శాంతిని, నిజాయితీని, నైతిక సూత్రాలను ప్రోద్బలపరిచే ప్రజలు మంచికి ప్రేరకం కాకుండా ఎలా ఉండగలరు? మధ్య ఆసియాలోని ఒక దేశంలో, మునుపు స్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఒక ఆఫీసరుని సాక్షులు కలిశారు. వివిధ మతసంబంధమైన సంస్థలను గురించి పరిశోధించడానికి తానొకసారి నియమించబడ్డానని ఆయన చెప్పాడు. ఆయన యెహోవాసాక్షుల గురించి పరిశీలించినప్పుడు, వారి నిజాయితీ, సత్ప్రవర్తనలకు ఆయన ముగ్ధుడనయ్యానన్నాడు. ఆయన వారి దృఢమైన విశ్వాసాన్ని, వారి బోధలు లేఖనాలపై ఆధారపడివుంటాయన్న వాస్తవాన్ని అభినందించాడు. ఆ వ్యక్తి బైబిలు అధ్యయనానికి ఒప్పుకున్నాడు.
20.(ఎ)గత సంవత్సరం నివేదించబడిన యెహోవాసాక్షుల కార్యకలాపం ఏమి సూచిస్తుంది? (బి) ఇంకా ఎంతో చేయవలసి ఉందని ఏది సూచిస్తుంది, మంచి సందేశాన్ని ప్రకటించే పనిని చేసే మన ఆధిక్యతను మనమెలా దృష్టిస్తాము?
20 ఇంకా వేలాది అనుభవాలు చెప్పవచ్చు, ఈ ఆర్టికల్‌లో ప్రస్తావించిన అనుభవాలు మచ్చుకు కొన్ని మాత్రమే. యెహోవాసాక్షులు 2001 సేవా సంవత్సరంలో చాలా బిజీగా ఉన్నారని స్పష్టమవుతుంది. * వారు లక్షలాది మందితో మాట్లాడారు, దుఃఖిస్తున్న అనేకులను ఓదార్చారు, వారు చేసే మంచి సందేశం ప్రకటించే పని ఆశీర్వదించబడింది. 2,63,431 మంది బాప్తిస్మం తీసుకోవడం ద్వారా తమ సమర్పణను తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా, సువార్తికుల సంఖ్య 1.7 శాతం పెరిగింది. 1,53,74,986 మంది యేసు మరణ వార్షిక జ్ఞాపకార్థానికి హాజరయ్యారన్న వాస్తవం ఇంకా చాలా పని జరగాల్సి ఉందని చూపిస్తుంది. (1 కొరింథీయులు 11:23-26) మంచి సందేశానికి స్పందించే వినయస్థుల కోసం వెదకడాన్ని మనం కొనసాగిద్దాం. యెహోవా హితవత్సరం కొనసాగినంత కాలం, “దుఃఖాక్రాంతులను” ఓదార్చడంలో కొనసాగుదాం. మనకున్నది ఎంత ఆశీర్వాదకరమైన ఆధిక్యత! “యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది” అన్న యెషయా మాటలను మనమందరమూ పునరుచ్చరిద్దాం. (యెషయా 61:10) “నిశ్చయముగా సమస్త జనముల యెదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును” అన్న ప్రవచన మాటలను నెరవేర్చడానికి యెహోవా మనలను ఉపయోగించుకోవడంలో కొనసాగును గాక.—యెషయా 61:11.
[అధస్సూచి]
^ పేరా 20 19 నుండి 22 వరకున్న పేజీల్లోని చార్టు, 2001 సేవా సంవత్సరంలో యెహోవాసాక్షుల కార్యకలాపాన్ని నివేదిస్తుంది.
మీకు జ్ఞాపకముందా?
• వినయస్థులు యేసు ప్రకటించిన మంచి సందేశం ద్వారా ఎలా ఆశీర్వదించబడ్డారు?
• మొదటి శతాబ్దంలోని యేసు శిష్యులు ప్రకటించిన మంచి సందేశానికి స్పందించినవారికి ఏ ఆశీర్వాదాలు కలిగాయి?
• నేడు మంచి సందేశాన్ని స్వీకరించేవారు దాని చేత ఎలా ఆశీర్వదించబడుతున్నారు?
• సువార్తికులుగా ఉండే మన ఆధిక్యతను మనమెలా దృష్టిస్తాము?
[అధ్యయన ప్రశ్నలు]
[19-22వ పేజీలోని చార్టు]
ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 2001 సేవా సంవత్సరపు నివేదిక
(బౌండ్ వాల్యూమ్ చూడండి)
[15వ పేజీలోని చిత్రాలు]
యెహోవాసాక్షులు మంచి సందేశాన్ని అందించవలసిన తమ బాధ్యతను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు
[17వ పేజీలోని చిత్రాలు]
మంచి సందేశానికి స్పందించేవారు, ఐక్యత గల ప్రపంచవ్యాప్త సహోదర సమాజంలో భాగమవుతారు