దైవిక సూత్రాలు మీకు ప్రయోజనాన్ని చేకూర్చగలవు
దైవిక సూత్రాలు మీకు ప్రయోజనాన్ని చేకూర్చగలవు
జంతువులు వాటి సహజసిద్ధ జ్ఞానం ద్వారా నియంత్రించబడతాయని మీకు తెలిసే ఉంటుంది. చాలా యంత్రాలు సూచనలను పాటించి పనిచేసే విధంగా రూపొందించబడతాయి. కానీ మానవులు మాత్రం సూత్రాల చేత నడిపించబడటానికి సృష్టించబడ్డారు. అది నిజమని మీరెలా నమ్మవచ్చు? సమస్త నైతిక సూత్రాలకు మూలకర్త అయిన యెహోవా, మొదటి మానవులను సృష్టించినప్పుడు, “మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము” అని ప్రకటించాడు. సృష్టికర్త ఒక ఆత్మ; ఆయనకు మనలాంటి భౌతిక శరీరము లేదు, కాబట్టి మనము ఆయన “పోలికె చొప్పున” ఉన్నామంటె, మనము ఆయనకున్న చక్కని లక్షణాలను కొంతమేరకు కనబరుస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించవచ్చని దాని అర్థం. సూత్రాలకు అనుగుణంగా, అంటే సరైన చర్య గైకొనడానికి అనుసరించవలసిన వ్యక్తిగత ప్రవర్తనా నియమావళి అని వేటినైతే మానవులు నమ్ముతారో వాటికి అనుగుణంగా తమ జీవితాలను మలుచుకునే సామర్థ్యము వారికి ఉంది. ఈ సూత్రాల్లో చాలావాటిని యెహోవా తన వాక్యమందు వ్రాయించాడు.—ఆదికాండము 1:26; యోహాను 4:24; 17:17.
‘కాని బైబిలులో వందలాది సూత్రాలు ఉన్నాయి. వాటన్నింటిని తెలుసుకోవడం నాకు అసాధ్యము’ అని ఒకరు అనవచ్చు. మత్తయి 22:37-39 వచనాల్లో చూడవచ్చు, అక్కడ యేసు, మోషే ధర్మశాస్త్రంలోని ఆజ్ఞల్లోను వాటికి సంబంధించిన సూత్రాల్లోను కొన్ని, వేరే వాటికన్నా ఎక్కువ ప్రాముఖ్యతను కలిగివున్నాయని చూపించాడు.
నిజమే. కాని ఈ వాస్తవాన్ని పరిశీలించండి: అన్ని దైవిక సూత్రాలూ ప్రయోజనకరమైనవే అయినప్పటికీ, కొన్ని ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఆ విషయాన్ని మీరుఎక్కువ ప్రాముఖ్యతను కలిగివున్న సూత్రాలు ఏవి? బైబిలు నందున్న సూత్రాలలో, మనకు యెహోవాతో ఉన్న సంబంధంపై సూటిగా ప్రభావం చూపే సూత్రాలు కీలకమైనవి. ఈ సూత్రాలను మనం పాటిస్తే, మన నైతిక దిక్సూచిపై సృష్టికర్త ప్రధానంగా ప్రభావం చూపుతాడు. వాటికి తోడు, ఇతరులతో మనకున్న సంబంధాలను ప్రభావితం చేసే సూత్రాలు కూడా ఉన్నాయి. వీటిని అన్వయించుకోవడం, నేనే-ముందు అనే వైఖరి ఏవిధంగా పేర్కొనబడుతున్నప్పటికీ, దాన్ని వ్యతిరేకించడానికి మనకు సహాయం చేస్తుంది.
బైబిలులోని అతి ప్రాముఖ్యమైన సత్యాల్లో ఒకదానితో మనం మొదలుపెడదాము. ఆ సత్యము ఏమిటి, అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
‘సర్వలోకములో మహోన్నతుడు’
యెహోవా మన మహా సృష్టికర్త అని, సర్వశక్తిగల దేవుడని పరిశుద్ధ లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయనకు సమానులు ఎవ్వరూ లేరు, ఆయన స్థానాన్ని మరెవ్వరూ తీసుకోలేరు. ఇది బైబిలులో నమోదు చేయబడిన ప్రాముఖ్యమైన సత్యము.—ఆదికాండము 17:1; ప్రసంగి 12:1.
కీర్తనల గ్రంథాన్ని వ్రాసిన రచయితల్లో ఒకరు యెహోవా గురించి ఇలా అన్నాడు: ‘నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు.’ ప్రాచీన రాజైన దావీదు ఇలా అన్నాడు: “యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.” మరియు పేరుగాంచిన ప్రవక్తయైన యిర్మీయా ఇలా వ్రాయడానికి కదిలింపబడ్డాడు: “యెహోవా, నిన్ను పోలినవాడెవడును లేడు, నీవు మహాత్మ్యము గలవాడవు, నీ శౌర్యమునుబట్టి నీ నామము ఘనమైనదాయెను.”—కీర్తన 83:18; 1 దినవృత్తాంతములు 29:11; యిర్మీయా 10:6.
దేవుని గురించిన ఈ సత్యాలను మనము మన దైనందిన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి?
మన సృష్టికర్త మరియు జీవదాత మన జీవితాల్లో విశేష స్థానాన్ని కలిగి ఉండాలని స్పష్టమవుతుంది. మరి అలాంటప్పుడు మన వైపుకు అవధానాన్ని మళ్ళించుకోవాలనే ధోరణిని ఎదిరించడం తగినది కాదంటారా? ఇలాంటి ధోరణి కొందరిలో ఇతరులకంటే ఎక్కువగా ఉండవచ్చు. కానీ, ‘సమస్తమును దేవుని మహిమకొరకు చేయడం’ అన్నది జ్ఞానయుక్తమైన మార్గదర్శక సూత్రము. (1 కొరింథీయులు 10:31) ఈ విషయంలో ప్రవక్తయైన దానియేలు చక్కని మాదిరిని ఉంచాడు.
బబులోను రాజైన నెబుకద్నెజరు తనకొచ్చిన స్వప్నము గురించి కలతచెంది, దాని భావము తెలియజేయమని అధికారంతో అడిగాడని చారిత్రక వృత్తాంతం చెబుతోంది. మిగతా వాళ్ళు చెప్పలేకపోయారు గానీ దానియేలు మాత్రం రాజు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నాడో ఖచ్చితంగా అదే చెప్పాడు. దానికి దానియేలు ఘనతను తనకు ఆపాదించుకున్నాడా? లేదు, ‘మర్మములను బయలుపరచగల, పరలోకమందున్న దేవునికే’ ఘనతనిచ్చాడు. “ఇతర మనుష్యులకందరికంటె నాకు విశేష జ్ఞానముండుటవలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు” అని కూడా ఆయన అన్నాడు. దానియేలు సూత్రాలకు అనుగుణంగా జీవించే వ్యక్తి. కాబట్టి దానియేలు పుస్తకంలో, దేవుని దృష్టిలో ‘బహు ప్రియుడు’ అని ఆయన మూడుసార్లు వర్ణించబడటంలో ఆశ్చర్యం లేదు.—దానియేలు 2:28, 30; 9:23; 10:11, 18, 19.
మీరు దానియేలును అనుకరిస్తే ప్రయోజనం పొందుతారు. దానియేలు మాదిరిని అనుకరించడంలో నిర్ణాయకమైన అంశం, సరైన ఉద్దేశం కలిగి ఉండడం. మీరు చేసే పనులకు ఘనత ఎవరికి చెందాలి? మీ పరిస్థితి ఏదైనప్పటికీ, యెహోవాయే సర్వోన్నత ప్రభువు అన్న అతిప్రాముఖ్యమైన బైబిలు సూత్రానికి అనుగుణంగా ప్రవర్తించే సామర్థ్యము మీకు ఉంది. మీరలా చేస్తే దేవుని దృష్టిలో ‘బహు ప్రియులుగా’ ఉంటారు.
మానవ సంబంధాల విషయంలో మనకు నడిపింపు నివ్వగల రెండు ప్రాథమిక సూత్రాలను మనము ఇప్పుడు పరిశీలిద్దాము. కేవలం తమ గురించే ఆలోచించే స్వభావము నేడు ప్రబలంగా ఉంది గనుక, జీవితంలోని ఈ రంగం నిజంగా సవాలుదాయకమైనదే.
“వినయమైన మనస్సుగలవారై”
తమకు తాము ప్రాధాన్యతనిచ్చుకునేవారు ఎన్నటికీ తృప్తి పొందరు. చాలా మందికి ఎంతో మంచి జీవితం కావాలి, అది వారికి ఇప్పుడే కావాలి. అటువంటివారు వినయాన్ని ఒక విధమైన బలహీనతగా భావిస్తారు. సహనం అనేది కేవలం ఇతరులు కనపర్చవలసిన విషయంగా భావిస్తారు. కానీ వారు జీవితంలో విజయం సాధించే విషయానికి వచ్చే సరికి వారు ఏమైనా చేస్తారు. వీరిలా కాకుండా వేరే విధంగా ప్రవర్తించే అవకాశం మీకుందని మీరనుకుంటున్నారా?
దేవుని సేవకులు ఇటువంటి స్వభావాన్ని రోజూ ఎదుర్కుంటున్నారు, కానీ అది వారిని ప్రభావితం చేయకూడదు. “ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడుకాడు” అన్న సూత్రాన్ని పరిణతి చెందిన క్రైస్తవులు అంగీకరిస్తారు.—2 కొరింథీయులు 10:18.
ఫిలిప్పీయులు 2:3, 4 నందున్న సూత్రాన్ని అన్వయించుకోవడం మనకు సహాయం చేస్తుంది. “కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచ”మని ఆ లేఖనాలు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. అలా చేయడం ద్వారా మీరు మీ ‘సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూసేవారిగా’ ఉంటారు.
ప్రాచీన హెబ్రీయుల న్యాయాధిపతియైన గిద్యోను తనగురించి తాను సరైన మనోభావము కలిగి ఉండి, తన సొంత విలువను సరిగ్గా మదింపు చేసుకున్నాడు. ఆయన ఇశ్రాయేలుకు నాయకుడవ్వడానికి ప్రయత్నించలేదు. అయితే, ఆ పాత్రను నిర్వహించే నియామకం ఆయనకు ఇవ్వబడినప్పుడు, గిద్యోను తన అయోగ్యత గురించి పేర్కొన్నాడు. “నా కుటుంబము న్యాయాధిపతులు 6:12-16.
మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని” ఆయన వివరించాడు.—అంతేకాకుండా, యెహోవా గిద్యోనుకు విజయాన్నిచ్చిన తరువాత, ఎఫ్రాయిమీయులు అతనితో గొడవకు దిగారు. గిద్యోను ఎలా ప్రతిస్పందించాడు? లభించిన విజయాన్ని బట్టి ఆయన తాను ఘనుడనన్నట్లు భావించాడా? లేదు. మృదువుగా సమాధానమివ్వడం ద్వారా ఆయన రానున్న ముప్పును తప్పించాడు. “మీరు చేసినదెక్కడ నేను చేసినదెక్కడ?” అన్నప్పుడు గిద్యోను వినయ మనస్సును కనబర్చాడు.—న్యాయాధిపతులు 8:1-3.
నిజమే, గిద్యోనుకు సంబంధించిన సంఘటనలు చాలా కాలం క్రితం సంభవించాయి. అయినప్పటికీ, ఆ వృత్తాంతాన్ని పరిశీలించడం ప్రయోజనకరంగా ఉంటుంది. నేడు సర్వసాధారణమైపోయిన దృక్పథానికి పూర్తి భిన్నమైన దృక్పథం గిద్యోనుకు ఉండేది, ఆయన దానికి అనుగుణంగా జీవించాడు, అది ఆయనకు ప్రయోజనం చేకూర్చింది.
తమ మీదే అవధానాన్ని నిలపడం అనే ధోరణి ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తుంది, అది మన విలువ గురించి మనకున్న దృక్పథాన్ని పాడు చేయగలదు. అలాంటి తప్పు ఆలోచనను బైబిలు సూత్రాలు సరిచేస్తాయి, మన సృష్టికర్తకు, ఇతరులకు సంబంధించి మనకున్న అసలైన విలువను అవి మనకు బోధిస్తాయి.
బైబిలు సూత్రాలను లక్ష్యపెట్టడం ద్వారా మనము నేడు సర్వసాధారణమైయున్న నేనే-ముందు అనే వైఖరిని అధిగమించగలుగుతాము. మనమిక భావాలవల్ల లేక వ్యక్తిత్వాలవల్ల ఏమాత్రము ప్రభావితం కాము. మనము నైతిక సూత్రాల గురించి ఎంత ఎక్కువగా నేర్చుకుంటే వాటి మూలకర్తను అంత ఎక్కువగా తెలుసుకుంటాము. అవును, బైబిలు చదువుతున్నప్పుడు దైవిక సూత్రాలను ప్రత్యేకంగా పరిశీలించడం ఖచ్చితంగా శ్రమకు తగ్గ ఫలితాన్నిస్తుంది.—బాక్స్ చూడండి.
యెహోవా, ప్రాథమికంగా తమ సహజసిద్ధ జ్ఞానం ద్వారా నడిపించబడే జంతువులకన్నా మానవులను ఉన్నతులుగా చేశాడు. దేవుని చిత్తాన్ని అనుసరించడంలో దైవిక సూత్రాలను అన్వయించుకోవడం ఇమిడి ఉంది. అలా మనం, మన నైతిక దిక్సూచిని, అంటే దేవుడు తీసుకువచ్చే నూతన విధానంలోకి మనల్ని నడిపించే దిక్సూచిని సరైన స్థితిలో ఉంచుకోగల్గుతాము. త్వరలోనే “నీతి నివసించు” భూవ్యాప్త క్రొత్త విధానం వస్తుందని ఎదురుచూసేందుకు బైబిలు మనకు కారణాన్ని ఇస్తుంది.—2 పేతురు 3:13.
[6వ పేజీలోని బాక్సు/చిత్రం]
కొన్ని సహాయకరమైన బైబిలు సూత్రాలు
కుటుంబంలో:
“ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.”—1 కొరింథీయులు 10:24.
“ప్రేమ . . . స్వప్రయోజనమును విచారించుకొనదు.”—1 కొరింథీయులు 13:4, 5.
“మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను.”—ఎఫెసీయులు 5:33.
“భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి.”—కొలొస్సయులు 3:18.
“నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.”—సామెతలు 23:22.
పాఠశాలలో, పని స్థలంలో లేక వ్యాపారంలో:
“దొంగత్రాసు . . . హేయము . . . భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును.”—సామెతలు 11:1, 18.
“దొంగిలువాడు ఇకమీదట దొంగిలక . . . తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.”—ఎఫెసీయులు 4:27, 28.
‘ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదు.’—2 థెస్సలొనీకయులు 3:10.
“మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.”—కొలొస్సయులు 3:23.
‘మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచున్నాము.’—హెబ్రీయులు 13:18.
ధనము విషయంలో కలిగివుండవలసిన దృక్పథం:
“ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందక పోడు.”—సామెతలు 28:20.
“ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తినొందడు.”—ప్రసంగి 5:10.
తమ స్వంత విలువను మదింపు చేసుకోవడం:
“సొంత గౌరవాన్ని పరిశోధించడం గౌరవనీయం కాదు.”—సామెతలు 25:27 పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.
“నీ నోరు కాదు అన్యుడే . . . నిన్ను పొగడదగును.”—సామెతలు 27:2.
‘తన్ను తాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనవద్దని . . . మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.’—రోమీయులు 12:3.
“ఎవడైనను వట్టివాడైయుండి తాను ఎన్నికైన వాడనని యెంచుకొనినయెడల తన్ను తానే మోసపరచుకొనును.”—గలతీయులు 6:3.
[5వ పేజీలోని చిత్రం]
దానియేలు దేవునికి చెందవలసిన ఘనతను దేవునికి ఇచ్చాడు
[7వ పేజీలోని చిత్రం]
ఇతరులతో వ్యవహరించేటప్పుడు దైవిక సూత్రాలను అనుసరించడం, ఆహ్లాదకరమైన సంబంధాలకు, సంతోషానికి దోహదపడుతుంది
[7వ పేజీలోని చిత్రసౌజన్యం]
U.S. Fish & Wildlife Service, Washington, D.C./Robert Bridges