ఒక లోకమంతా నాశనం చేయబడింది!
ఒక లోకమంతా నాశనం చేయబడింది!
మీ చుట్టూ ఉన్న లోకాన్ని ఒకసారి చూడండి. నగరాలు, సంస్కృతి, వైజ్ఞానిక సాఫల్యాలు, కోటానుకోట్ల జనాభాతో పైకి సుస్థిరంగా కనిపిస్తున్న దాన్ని చూసి ప్రభావితం కావడం చాలా సులభం, కాదంటారా? ఇదే లోకం ఏదో ఒక రోజున పూర్తిగా అదృశ్యమైపోగలదని మీరు అనుకుంటున్నారా? అలా ఊహించుకోవడం కష్టం కావచ్చు. అయితే, ఎంతో విశ్వసనీయమైన ఒక మూలం తెలియజేస్తున్న దాని ప్రకారం, దీనికి ముందు ఒక లోకం ఉనికిలో ఉండిందనీ, అది పూర్తిగా నాశనం చేయబడిందనీ మీకు తెలుసా?
మేము, ఆదిమ తెగలకు చెందిన ఒక లోకం గురించి మాట్లాడడం లేదు. నాశనమైన ఆ లోకం నగరాలు, కళా సాఫల్యాలు, వైజ్ఞానిక పరిజ్ఞానము గల ఒక నాగరిక లోకం. అయినప్పటికీ, పితరుడైన అబ్రాహాము జన్మించడానికి 352 సంవత్సరాల ముందు, రెండవ నెల 17వ దినాన, లోకాన్నంతటినీ తుడిచిపెట్టిన జలప్రళయం హఠాత్తుగా ప్రారంభమైందని బైబిలు వృత్తాంతం మనకు చెబుతోంది. *
ఆ వృత్తాంతం సరైనదేనా? అలాంటి సంఘటన నిజంగా సంభవించిందా? ప్రస్తుతం ఉన్న లోకానికి ముందు, ఎంతగానో వర్ధిల్లి ఆ తర్వాత నాశనం చేయబడిన ఒక ప్రాచీన లోకం నిజంగా ఉండిందా? అలాగైతే, అది ఎందుకు అంతమయ్యింది? ఏ సమస్య తలెత్తింది? దాని నాశనం నుండి మనం నేర్చుకోగల గుణపాఠం ఏమైనా ఉందా?
ఒక ప్రాచీన లోకం నిజంగా నాశనం చేయబడిందా?
అంత అసాధారణ నాశనం నిజంగా సంభవించి ఉంటే, దాన్ని పూర్తిగా మరచిపోవడం ఎప్పటికీ జరుగదు. అందుకే, అనేక దేశాల్లో ఆ నాశనానికి సంబంధించిన జ్ఞాపికలు ఉన్నాయి. ఉదాహరణకు, లేఖనాల్లో వ్రాయబడి ఉన్న ఖచ్చితమైన తేదీని పరిశీలించండి. ప్రాచీన క్యాలెండర్‌లోని రెండవ నెల, ఇప్పుడు మనం అక్టోబరు అని పిలుస్తున్న నెల మధ్య భాగంలో ప్రారంభమై నవంబరు నెల మధ్య భాగంలో ముగిసేది. కాబట్టి 17వ దినం దాదాపు నవంబరు ఒకటిన వస్తుంది. కాబట్టి, అనేక దేశాల్లో మృతుల కోసం జరుపుకునే పండుగలు సంవత్సరంలోని ఆ సమయంలో జరుపుకోబడడమన్నది కేవలం యాదృచ్ఛికం కాకపోవచ్చు.
జలప్రళయానికి సంబంధించిన ఇతర నిదర్శనాలు మానవజాతి యొక్క సాంప్రదాయాల్లో మిగిలివున్నాయి. తమ పూర్వీకులు భూగోళవ్యాప్త జలప్రళయాన్ని తప్పించుకుని జీవించడాన్ని గురించి తెలియజేసే పురాణగాధలు దాదాపు ప్రాచీన ప్రజలందరికీ ఉన్నాయి. ఆఫ్రికాకు చెందిన పిగ్మీలకు, దక్షిణ అమెరికాకు చెందిన ఇన్‌కాలకు, యూరప్‌కు చెందిన సెల్ట్‌లకు, అలాగే అలాస్కా, ఆస్ట్రేలియా, ఇండియా, ఉత్తర అమెరికాలోని కొన్ని భాగాలు, చైనా, న్యూజీలాండ్, మెక్సికో, మైక్రోనేషియా, లిథువానియాలలోని ప్రజలందరికీ ఒకేలాంటి పురాణగాధలు ఉన్నాయి, ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే.
అయితే, సమయం గడుస్తుండగా ఆ పురాణగాధలకు ఇతర కల్పనలు చేర్చబడ్డాయి, కానీ వాటన్నిటిలోనూ ఒకే మూల కథను సూచిస్తూ ఇలాంటి వివిధ వివరణలు ఉన్నాయి: దేవుడు మానవజాతి దుష్టత్వాన్ని బట్టి ఆగ్రహించాడు. ఆయన ఒక పెద్ద జలప్రళయాన్ని రప్పించాడు. మానవజాతి మొత్తంగా నాశనం చేయబడింది. అయితే కొంతమంది నీతిమంతులు కాపాడబడ్డారు. వీరు ఒక ఓడను నిర్మించారు, దానిలో మానవులతోపాటు జంతువులు కాపాడబడ్డాయి. కొంతకాలానికి, ఎండిన నేలను వెదకడానికి పక్షులు పంపబడ్డాయి. చివరికి, ఓడ ఒక పర్వతంపై నిలిచింది. తప్పించుకుని జీవించినవారు ఓడలో నుండి వెలుపలికి వచ్చిన తర్వాత బలి అర్పించారు.
ఇది ఏమి నిరూపిస్తుంది? వివిధ వర్ణనలలో ఉన్న సారూప్యతలు కేవలం యాదృచ్ఛికం అయ్యుండడం అసాధ్యం. ఈ పురాణాల సమష్టి సాక్ష్యాధారం, ఒక మానవ లోకాన్ని నాశనం చేసిన జలప్రళయాన్ని తప్పించుకుని జీవించిన వారి నుండే మానవులందరూ ఉద్భవించారని బైబిలు ఇస్తున్న ప్రాచీన సాక్ష్యాన్ని ధృవీకరిస్తుంది. కాబట్టి, ఏమి జరిగిందో తెలుసుకోవడానికి మనం పురాణగాధలపై లేదా కల్పనాకథలపై ఆధారపడవలసిన అవసరం లేదు. బైబిలులోని హీబ్రూ లేఖనాల్లో జాగ్రత్తగా భద్రపరచబడిన వృత్తాంతం మనకు ఉంది.—ఆదికాండము, 6-8 అధ్యాయాలు.
జీవారంభం నుండి వ్రాయబడివున్న చరిత్ర యొక్క ప్రేరేపిత వృత్తాంతం బైబిలులో ఉంది. అయితే అది కేవలం చరిత్ర
కంటే ఎక్కువేనని సాక్ష్యాధారాలు రుజువు చేస్తున్నాయి. బైబిలులో ఉన్న విశ్వసనీయమైన ప్రవచనము, లోతైన జ్ఞానము, అది తాను చెప్పుకుంటున్నట్లుగా, దేవుడు మానవజాతికి ఇచ్చిన సందేశమే అని చూపిస్తాయి. కల్పిత కథల్లా కాకుండా బైబిలు తాను తెలియజేస్తున్న చారిత్రక వృత్తాంతాల్లో పేర్లు, తేదీలు అలాగే వంశానుక్రమ, భౌగోళిక వివరణలు ఇస్తుంది. జలప్రళయానికి ముందు జీవితం ఎలా ఉండేదో అది చిత్రీకరిస్తుంది, ఆ మొత్తం లోకం ఎందుకు హఠాత్తుగా అంతమయ్యిందో అది తెలియజేస్తుంది.జలప్రళయానికి పూర్వపు కాలానికి చెందిన ఆ సమాజంలో ఏ తప్పు జరిగింది? తర్వాతి ఆర్టికల్ ఆ ప్రశ్నను పరిశీలిస్తుంది. మన ప్రస్తుత నాగరికత యొక్క భవిష్యత్తు ఎంత సురక్షితంగా ఉందా అని ఆలోచించేవారికి అది ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నే.
[అధస్సూచి]
[4వ పేజీలోని చార్టు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
జలప్రళయాన్ని గురించిన ప్రపంచవ్యాప్త పురాణగాధలు
దేశం అనురూపతలు 1 2 3 4 5 6 7 8 9 10
గ్రీస్ 7 ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
రోము 6 ◆ ◆ ◆ ◆ ◆ ◆
లిథువానియా 6 ◆ ◆ ◆ ◆ ◆ ◆
అస్సీరియా 9 ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
టాంజానియా 7 ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
ఇండియా - హిందూ 6 ◆ ◆ ◆ ◆ ◆ ◆
న్యూజీలాండ్ - మవోరి 5 ◆ ◆ ◆ ◆ ◆
మైక్రోనేషియా 7 ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
వాషింగ్టన్ అమెరికా - యకిమా 7 ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
మిస్సిసిపి అమెరికా - చొక్టావ్ 7 ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
మెక్సికో - మిచోకాన్ 5 ◆ ◆ ◆ ◆ ◆
దక్షిణ అమెరికా - క్వెచువా 4 ◆ ◆ ◆ ◆
బొలీవియా - చిరిగానో 5 ◆ ◆ ◆ ◆ ◆
గయానా - అరవక్ 6 ◆ ◆ ◆ ◆ ◆ ◆
1:దుష్టత్వాన్ని బట్టి దేవుడు ఆగ్రహించాడు
2:జలప్రళయం ద్వారా నాశనం
3:దేవునిచే ఆజ్ఞాపించబడింది
4:దైవిక హెచ్చరిక ఇవ్వబడింది
5:మానవజాతిలో కొందరు తప్పించుకుని జీవించారు
6:ఒక ఓడలో రక్షించబడ్డారు
7:జంతువులు కాపాడబడ్డాయి
8:పక్షి లేదా మరో జీవి బయటికి పంపబడింది
9:ఓడ చివరకు ఒక పర్వతంపై నిలుస్తుంది
10:బలి అర్పించబడింది