కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రభువు రాత్రి భోజనం మీకు ఏ భావాన్నిస్తుంది?

ప్రభువు రాత్రి భోజనం మీకు ఏ భావాన్నిస్తుంది?

ప్రభువు రాత్రి భోజనం మీకు ఏ భావాన్నిస్తుంది?

“యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును.”​—⁠1 కొరింథీయులు 11:27.

రెండువేల మూడవ సంవత్సరానికి ప్రణాళిక వేయబడిన అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టం ఏప్రిల్‌ 16వ తేదీన సూర్యాస్తమయం తర్వాత జరుగుతుంది. యెహోవాసాక్షులు అప్పుడు యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకోవడానికి సమకూడతారు. దీని ముందరి ఆర్టికల్‌లో చూపించినట్లుగా, యేసు తన అపొస్తలులతో కలిసి సా.శ. 33వ సంవత్సరం నీసాను 14న పస్కా పండుగ జరుపుకున్న తర్వాత ఈ ఆచరణను ప్రారంభించాడు, ఇది ప్రభువు రాత్రి భోజనం అని కూడా పిలువబడుతోంది. జ్ఞాపకార్థ చిహ్నాలైన పులియని రొట్టె, ఎర్రని ద్రాక్షారసం పాపరహితమైన యేసు శరీరాన్ని, ఆయన చిందించిన రక్తాన్ని​—⁠వారసత్వంగా వచ్చిన పాపమరణాల నుండి మానవాళిని విడిపించగల ఏకైక బలిని​—⁠సూచిస్తున్నాయి.​—⁠రోమీయులు 5:​12; 6:​23.

2 జ్ఞాపకార్థ చిహ్నాలను తీసుకునేవారు యోగ్యులై ఉండాలి. అపొస్తలుడైన పౌలు ప్రాచీన కొరింథులోని క్రైస్తవులకు వ్రాసినప్పుడు ఆ విషయాన్ని స్పష్టం చేశాడు, అక్కడ ప్రభువు రాత్రి భోజనం సరైన విధంగా ఆచరించబడడం లేదు. (1 కొరింథీయులు 11:​20-22) పౌలు ఇలా వ్రాశాడు: “యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును.” (1 కొరింథీయులు 11:​27) ఆ మాటల భావం ఏమిటి?

కొందరు దాన్ని అయోగ్యమైన రీతిలో ఆచరించారు

3 కొరింథులోని చాలామంది క్రైస్తవులు జ్ఞాపకార్థ ఆచరణలో అయోగ్యంగా పాలుపంచుకునేవారు. వారిలో విభాగాలు ఉండేవి, కొందరైతే కొంతకాలం వరకు తమ రాత్రి భోజనాన్ని తెచ్చుకొని కూటమికి ముందు లేదా మధ్యలోనే తినేవారు, తరచుగా తినడం, తాగడం అధికంగా ఉండేది. వాళ్ళు మానసికంగాను ఆధ్యాత్మికంగాను అప్రమత్తంగా ఉండేవారు కాదు. అది వాళ్ళను “ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరా[ధులుగా]” చేసింది. రాత్రి భోజనం తిననివారు ఆకలితో పరధ్యానంలో పడేవారు. అవును చాలామంది ఆ సందర్భం పట్ల ఎలాంటి గౌరవం లేకుండా, దాని గురించిన పూర్తి అవగాహన లేకుండా పాలుపంచుకునేవారు. వాళ్ళు స్వయంగా తమపైకి తీర్పు తెచ్చుకున్నారంటే అందులో ఆశ్చర్యం లేదు!​—⁠1 కొరింథీయులు 11:​27-34.

4 ప్రతి సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణ సమీపిస్తుండగా, అలవాటుగా చిహ్నాలను తీసుకునేవారు ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఆ సహవాస భోజనంలో సరిగ్గా పాలుపంచుకోవాలంటే, వారు ఆధ్యాత్మికంగా మంచి స్థితిలో ఉండాలి. ఎవరైనా యేసు బలి పట్ల అమర్యాదను చూపించినా దాన్ని అలక్ష్యం చేసినా, ఒక ఇశ్రాయేలీయుడు అపవిత్ర స్థితిలో ఉన్నప్పుడు సహవాస భోజనములో పాల్గొంటే ‘దేవుని ప్రజలలోనుండి కొట్టివేయబడిన’ విధంగానే వారు కొట్టి వేయబడే ప్రమాదం ఉంది.​—⁠లేవీయకాండము 7:​20; హెబ్రీయులు 10:​28-31.

5 పౌలు జ్ఞాపకార్థ ఆచరణను ప్రాచీన ఇశ్రాయేలులో జరిగే సహవాస భోజనముతో పోల్చాడు. ఆయన క్రీస్తుతో కలిసి పాలుపంచుకునే భాగస్థుల గురించి చెప్పిన తర్వాత, “మీరు ప్రభువు [“యెహోవా,” NW] పాత్ర లోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు [“యెహోవా,” NW] బల్లమీద ఉన్న దానిలోను దయ్యముల బల్లమీద ఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు” అని అన్నాడు. (1 కొరింథీయులు 10:​16-21) జ్ఞాపకార్థ చిహ్నాల్లో సాధారణంగా పాలుపంచుకొంటున్న ఒక వ్యక్తి గంభీరమైన పాపం చేసినట్లయితే, ఆ విషయాన్ని ఆయన యెహోవా ఎదుట ఒప్పుకొని సంఘ పెద్దల నుండి ఆధ్యాత్మిక సహాయాన్ని కోరాలి. (సామెతలు 28:​13; యాకోబు 5:​13-16) ఆయన నిజంగా పశ్చాత్తాపం చెంది దానికి అనుగుణంగా తన ప్రవర్తనను మార్చుకున్నట్లయితే, ఆయన అయోగ్యంగా పాలుపంచుకోవడంలేదు.​—⁠లూకా 3:⁠8.

గౌరవంతో గమనించేవారిగా హాజరుకావడం

6 క్రీస్తు సహోదరులైన 1,44,000లోని శేషించినవారికి ఇప్పుడు మంచి చేస్తున్నవారు ప్రభువు రాత్రి భోజనంలో పాల్గొనవచ్చా? (మత్తయి 25:​31-40; ప్రకటన 14:⁠1) లేదు. దేవుడు ఆ ఆధిక్యతను “క్రీస్తుతోడి వారసు[లుగా]” ఉండేందుకని తన పరిశుద్ధాత్మతో అభిషేకం చేసినవారి కోసం పరిమితం చేశాడు. (రోమీయులు 8:​14-18; 1 యోహాను 2:​20) అలాంటప్పుడు రాజ్య పరిపాలన క్రింద విశ్వవ్యాప్త పరదైసులో నిరంతరం జీవించాలని నిరీక్షించేవారి స్థానం ఏమిటి? (లూకా 23:​43; ప్రకటన 21:​3, 4) వారు పరలోక నిరీక్షణగల యేసు తోటి వారసులు కాదు కాబట్టి, వారు గౌరవంతో గమనించేవారిగా జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవుతారు.​—⁠రోమీయులు 6:​3-5.

7 మొదటి శతాబ్దంలోని నిజ క్రైస్తవులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డారు. వారిలో చాలామంది అన్యభాషలలో మాట్లాడడం వంటి ఆత్మ యొక్క అద్భుత వరాలలో ఒకదాన్ని లేదా అంతకంటే ఎక్కువ వరాలను ఉపయోగించుకోగలిగేవారు. కాబట్టి అలాంటి వారికి తాము ఆత్మాభిషిక్తులయ్యామని, జ్ఞాపకార్థపు చిహ్నాల్లో తాము పాలుపంచుకోవాలని తెలుసుకోవడానికి కష్టమేమీ కాకపోయి ఉండవచ్చు. అయితే మన కాలంలో ఒక వ్యక్తి ఆత్మాభిషిక్తుడయ్యాడా లేదా అనే విషయం, ప్రేరేపితమైన ఈ మాటల ఆధారంగా నిర్ధారించుకోవచ్చు: “దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము​—⁠అబ్బా తండ్రీ అని మొఱ్ఱ పెట్టుచున్నాము.”​—⁠రోమీయులు 8:​14, 15.

8 నిజమైన అభిషిక్త క్రైస్తవులు శతాబ్దాల నుండి, “గురుగుల” లేదా అబద్ధ క్రైస్తవుల పొలములో “గోధుమల” లాగే పెరుగుతున్నారు. (మత్తయి 13:​24-30, 36-43) 1870 నుండి ‘గోధుమలు’ మరింత స్పష్టంగా కనబడుతున్నాయి, కొన్ని సంవత్సరాల తర్వాత అభిషిక్త క్రైస్తవ పైవిచారణకర్తలకు ఇలా చెప్పబడింది: “[జ్ఞాపకార్థ ఆచరణ కోసం] సమకూడే వారి ఎదుట పెద్దలు ఈ నియమ నిబంధనలను పెట్టాలి,​—⁠(1) [క్రీస్తు] రక్తంలో విశ్వాసముంచాలి; (2) చివరికి మరణం వరకు, ప్రభువుకు ఆయన సేవకు తమను తాము సమర్పించుకోవాలి. అలా విశ్వాసం ఉన్నవారందరినీ, అలా సమర్పించుకున్న వారందరినీ వారప్పుడు ప్రభువు మరణ సంఘటనను ప్రస్తుతించడంలో పాల్గొనేందుకు ఆహ్వానించాలి.”​—⁠లేఖనాల్లో అధ్యయనాలు (ఆంగ్లం), VIవ భాగం, నూతన సృష్టి, 473వ పేజీ. *

“వేరే గొఱ్ఱె[ల]” కోసం అన్వేషణ

9 యెహోవా సంస్థ కాల క్రమేణా క్రీస్తు అభిషిక్త అనుచరులపైనే గాక ఇతరులపై కూడా అవధానాన్ని కేంద్రీకరించడం ప్రారంభించింది. ఈ విషయంలో ఒక విశేషమైన అభివృద్ధి 1930వ దశాబ్దపు మధ్యభాగంలో జరిగింది. దేవుని ప్రజలు అప్పటివరకు ప్రకటన 7:9వ వచనంలోని “గొప్ప సమూహము”ను రెండవ ఆధ్యాత్మిక తరగతిగా, పునరుత్థానులైన 1,44,000 మంది అభిషిక్తులతో కలిసి పరలోకంలో​—⁠క్రీస్తు పెండ్లికుమార్తె యొక్క తోడి పెండ్లికుమార్తెల వలే లేదా చెలికత్తెల వలే సహవసించేవారిగా దృష్టించేవారు. (కీర్తన 45:​14, 15; ప్రకటన 7:⁠4; 21:​2, 9) కానీ 1935, మే 31న అమెరికాలోని వాషింగ్టన్‌, డి.సి.లో జరిగిన యెహోవాసాక్షుల సమావేశంలో ఒక ప్రసంగం ఇవ్వబడింది, అందులో “గొప్ప సమూహము” (“గొప్ప జన సమూహము,” కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌) అంత్యకాలములో జీవించే “వేరే గొఱ్ఱె[లను]” సూచిస్తోందని బైబిలు నుండి వివరించబడింది. (యోహాను 10:​16) అంతకు ముందు వరకు జ్ఞాపకార్థ చిహ్నాలలో పాలుపంచుకున్న అనేకమంది ఆ సమావేశం తర్వాత మానేశారు, ఎందుకంటే వారు తమది పరలోక నిరీక్షణ కాదు భూనిరీక్షణ అని గ్రహించారు.

10 ప్రత్యేకించి 1935 నుండి, విమోచన క్రయధనంపై విశ్వాసంతో దేవునికి సమర్పించుకొని, రాజ్య ప్రకటనా కార్యకలాపాల్లో ‘చిన్నమందకు’ మద్దతునిస్తూ “వేరే గొఱ్ఱెలు”గా ఉండేవారి కోసం అన్వేషణ మొదలైంది. (లూకా 12:​32) భూమిపై నిరంతరం జీవించాలన్నదే ఈ వేరే గొఱ్ఱెల నిరీక్షణ, కానీ మిగతా అన్ని విషయాలకు సంబంధించి వారు ప్రస్తుత దినంలోని రాజ్య వారసుల శేషమును పోలివుంటారు. యెహోవాను ఆరాధిస్తూ ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న ప్రాచీన ఇశ్రాయేలులోని పరదేశులవలే, నేటి వేరే గొఱ్ఱెలు ఆధ్యాత్మిక ఇశ్రాయేలు సభ్యులతోపాటు సువార్తను ప్రకటించడం వంటి క్రైస్తవ బాధ్యతలను స్వీకరిస్తారు. (గలతీయులు 6:​16) అయితే ఏ పరదేశీ కూడా ఇశ్రాయేలుకు రాజు గానీ యాజకుడు గానీ కాలేనట్లే, ఈ వేరే గొఱ్ఱెల్లోని ఏ ఒక్కరూ పరలోక రాజ్యంలో పరిపాలించలేరు యాజకులుగాను సేవ చేయలేరు.​—⁠ద్వితీయోపదేశకాండము 17:​15.

11 అప్పట్లో 1930వ దశాబ్దంలో, పరలోక తరగతి మొత్తం ఎంపిక చేసుకోబడిందనే విషయం స్పష్టమవుతూ వచ్చింది. ఇప్పటికి దశాబ్దాలుగా, భూనిరీక్షణ గల వేరే గొఱ్ఱెల కోసం అన్వేషణ జరుగుతోంది. ఒక అభిషిక్తుడు అవిశ్వాసిగా రుజువైనట్లయితే, వేరే గొఱ్ఱెల్లో దీర్ఘకాలం నుండి నమ్మకంగా సేవ చేస్తున్న వ్యక్తికి 1,44,000లలో కలిగిన ఆ ఖాళీని భర్తీ చేయడానికి పిలుపు వచ్చే అవకాశముంది.

తప్పుగా ఎందుకు ఊహించుకుంటారు?

12 తమకు పరలోక పిలుపు ఉందని అభిషిక్త క్రైస్తవులకు ఖచ్చితంగా తెలుసు. కానీ ఆ పిలుపు లేని కొందరు జ్ఞాపకార్థ చిహ్నాలలో పాలుపంచుకొంటున్నట్లయితే ఎలా? తమకు పరలోకపు పిలుపు ఎన్నడూ రాలేదని ఇప్పుడు గ్రహించినవారి మనస్సాక్షి అలా పాలుపంచుకోకుండా వారిని తప్పకుండా ఆపుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి తనకు పరలోకంలో రాజుగా, యాజకుడిగా ఉండే పిలుపు నిజంగా లేదని తెలిసి కూడా అలాంటి పిలుపు వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నట్లయితే దేవుడు ఆయనను అనుగ్రహంతో చూడడు. (రోమీయులు 9:16; ప్రకటన 20:⁠6) లేవీయుడైన కోరహు అహరోను యాజకత్వం కోసం దురహంకారంతో ప్రయత్నించినందుకు యెహోవా ఆయనకు మరణదండన విధించాడు. (నిర్గమకాండము 28:⁠1; సంఖ్యాకాండము 16:​4-11, 31-35) ఏ క్రైస్తవుడైనా తాను జ్ఞాపకార్థ చిహ్నాలలో పొరపాటున పాలుపంచుకున్నానని గ్రహించినట్లయితే ఆయన లేక ఆమె అలా పాలుపంచుకోవడాన్ని ఆపి క్షమార్పణ కోసం యెహోవాకు నమ్రతతో ప్రార్థించాలి.​—⁠కీర్తన 19:​13.

13 తమకు పరలోక పిలుపు ఉందని కొందరు పొరపాటుగా ఎందుకు ఊహించుకుంటుండవచ్చు? జీవిత భాగస్వామి మరణం లేదా ఏదైనా విషాద ఘటన వారికి భూమ్మీది జీవితంపై విరక్తి కలిగేలా చేస్తుండవచ్చు. లేదా తనను తాను అభిషిక్త క్రైస్తవునిగా వెల్లడిచేసుకున్న వ్యక్తికి సన్నిహిత స్నేహితుడిగా తానూ అదే నిరీక్షణ కలిగి ఉండాలని ఒకరు కోరుకోవచ్చు. అయితే ఈ ఆధిక్యత కోసం ఇతరులను ప్రోత్సహించేందుకు దేవుడు ఎవరినీ నియమించలేదన్నది నిస్సంశయం. అంతేకాదు రాజ్య పాలకులకు తమ అభిషేకాన్ని నిర్ధారించుకునే సందేశ స్వరాలను వినిపించడం ద్వారా ఆయన వారిని అభిషేకించడు.

14 మంచివాళ్ళందరూ పరలోకానికి వెళ్తారనే అబద్ధ మత తలంపు కూడా కొందరు తమకు పరలోక పిలుపు ఉందని భావించుకునేలా చేయవచ్చు. కాబట్టి మనం గతంలోని తప్పుడు దృక్కోణాల ద్వారా గానీ ఇతర కారకాల ద్వారా గానీ ప్రభావితం కాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు కొందరు ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను నా భావోద్వేగాలను ప్రభావితం చేసే మందులనేమైనా వాడుతున్నానా? నేను అభిషిక్తుడనని పొరపాటుగా ఊహించుకునేంత తీవ్రమైన భావోద్వేగాలు గల వ్యక్తినా?’

15 కొందరు ఇలా కూడా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను ప్రాముఖ్యతను కోరుకుంటున్నానా? నేను ప్రస్తుతం అధికారంలో ఉండాలని లేదా భవిష్యత్తులో క్రీస్తు తోడి వారసునిగా ఉండాలని కాంక్షతో ఉన్నానా?’ మొదటి శతాబ్దంలో రాజ్య వారసులు పిలువబడినప్పుడు వారందరూ సంఘాల్లో బాధ్యతాయుతమైన స్థానాల్లో లేరు. పరలోక పిలుపు ఉన్న వ్యక్తులు ప్రాముఖ్యతను కోరుకోరు లేదా అభిషిక్తులైనందుకు గొప్పలు చెప్పుకోరు. వారు “క్రీస్తు మనస్సు” గలవారిలో ఉండాల్సిన నమ్రతను కనబరుస్తారు.​—⁠1 కొరింథీయులు 2:16.

16 కొందరు తమకు విశేషమైన బైబిలు పరిజ్ఞానం ఉంది కాబట్టి తమకు కూడా పరలోక పిలుపు ఉందని భావించుకోవచ్చు. కానీ ఆత్మాభిషేకం వల్ల అసాధారణమైన అవగాహనేమీ కలుగదు, ఎందుకంటే పౌలు కొందరు అభిషిక్తులను మందలించాల్సి వచ్చింది, వారికి ఉపదేశించాల్సి వచ్చింది. (1 కొరింథీయులు 3:​1-3; హెబ్రీయులు 5:​11-14) దేవుడు తన ప్రజలందరికీ ఆధ్యాత్మిక ఆహారం అందించబడే ఒక ఏర్పాటును చేశాడు. (మత్తయి 24:​45-47) కాబట్టి ఒక అభిషిక్త క్రైస్తవుడిగా తనకు భూలోక నిరీక్షణ గలవారికంటే ఉన్నతమైన జ్ఞానం ఇవ్వబడుతుందని ఎవ్వరూ అనుకోకూడదు. ఆత్మాభిషేకం అనేది లేఖనాధార ప్రశ్నలకు సమాధానమివ్వడంలో, సాక్ష్యమివ్వడంలో, బైబిలు ప్రసంగాలివ్వడంలో చూపించే సామర్థ్యాన్ని బట్టి సూచించబడదు. భూలోక నిరీక్షణ గల క్రైస్తవుల్లో కూడా ఈ రంగాల్లో మంచి యోగ్యత గలవారున్నారు.

17 తోటి విశ్వాసి ఒకాయన పరలోక పిలుపు గురించి విచారణ చేస్తే, ఒక పెద్దగానీ లేక పరిణతి చెందిన ఒక క్రైస్తవుడు గానీ ఆ విషయంపై ఆయనతో చర్చించవచ్చు. అయితే ఈ విషయంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తి తరఫున నిర్ణయం తీసుకోలేడు. ఒక వ్యక్తికి నిజంగానే ఈ పిలుపు ఉన్నట్లయితే ఆయన తనకు అలాంటి నిరీక్షణ ఉందా లేదా అని ఇతరులను అడగాల్సిన అవసరముండదు. అభిషిక్తులు “క్షయబీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవునివాక్య మూలముగా అక్షయబీజమునుండి పుట్టింపబడినవారు.” (1 పేతురు 1:​22, 23) దేవుడు ఆయా వ్యక్తులను పరలోక నిరీక్షణతో “నూతన సృష్టి”గా చేసే “బీజము”ను తన ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా వారిలో నాటుతాడు. (2 కొరింథీయులు 5:​17) యెహోవాయే ఎంపిక చేస్తాడు. అభిషేకించడమనేది “పొందగోరువాని వలననైనను, ప్రయాసపడువాని వలనవైనను కాదు గాని, కరుణించు దేవునివలననే అగును.” (రోమీయులు 9:​16) అలాగైతే ఒక వ్యక్తి తనకు పరలోక పిలుపు ఉందని ఎలా నిర్ధారించుకోవచ్చు?

వారికి ఆ నమ్మకం ఎందువల్ల కలుగుతుంది?

18 దేవుని ఆత్మ సాక్ష్యమే అభిషిక్త క్రైస్తవులకు పరలోక నిరీక్షణ ఉందనే నమ్మకాన్ని కలిగిస్తుంది. పౌలు ఇలా వ్రాశాడు: “మీరు . . . దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము​—⁠అబ్బా తండ్రీ అని మొఱ్ఱ పెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము.” (రోమీయులు 8:​15-17) పరిశుద్ధాత్మ ప్రభావంతో, యెహోవా ఆధ్యాత్మిక పిల్లల గురించి లేఖనాలు చెబుతున్నవాటిని అన్వయించుకునేలా అభిషిక్తుల ఆత్మ లేదా ప్రబలమైన వైఖరి వారిని పురికొల్పుతుంది. (1 యోహాను 3:⁠2) దేవుని ఆత్మ వారిలో దేవుని పట్ల పుత్ర భావాన్ని, ఒక విశిష్టమైన నిరీక్షణను కలిగింపజేస్తుంది. (గలతీయులు 4:​6, 7) కుటుంబ సభ్యుల మధ్య స్నేహితుల మధ్య పరిపూర్ణ మానవులుగా భూమిపై నిరంతరం జీవించే నిరీక్షణ అద్భుతంగానే ఉంటుంది, కానీ వారికి దేవుడిచ్చిన నిరీక్షణ అది కాదు. దేవుడు తన ఆత్మ ద్వారా వారిలో ఎంతటి బలమైన పరలోక నిరీక్షణను కలిగించాడంటే, వారు భూలోకపు అనుబంధాలనూ, అపేక్షలనూ అన్నింటినీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.​—⁠2 కొరింథీయులు 5:​1-5, 8; 2 పేతురు 1:​13, 14.

19 అభిషిక్తులకు తమ పరలోక నిరీక్షణ విషయంలో, తాము ఒక క్రొత్త నిబంధనలోకి తీసుకోబడ్డామన్న విషయంలో నిశ్చయత ఉంది. యేసు జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించినప్పుడు దీన్ని ప్రస్తావించి ఇలా అన్నాడు: “ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన.” (లూకా 22:​20) దేవుడు, అభిషిక్తులే ఆ క్రొత్త నిబంధనలోని ఇరువర్గాలు. (యిర్మీయా 31:​31-34; హెబ్రీయులు 12:​22-24) యేసు మధ్యవర్తి. ఆయన చిందించిన రక్తంతో క్రొత్త నిబంధన ఆచరణలోకి వచ్చింది కాబట్టి, అది కేవలం యూదులలో నుండే కాక అన్యదేశాల ప్రజలలో నుండి కూడా యెహోవా నామము కోసం ప్రజలను తీసుకొని వారిని అబ్రాహాము “సంతానం[]”లో భాగమయ్యేలా చేసింది. (గలతీయులు 3:​26-29; అపొస్తలుల కార్యములు 15:​14) ఈ “నిత్యమైన నిబంధన” ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులందరూ పరలోకంలో అమర్త్య జీవితానికి పునరుత్థానులయ్యేలా చేస్తుంది.​—⁠హెబ్రీయులు 13:​20.

20 అభిషిక్తులు తమ నిరీక్షణ విషయంలో నిశ్చయత కలిగి ఉన్నారు. వారు మరొక నిబంధన అయిన రాజ్య నిబంధనలోకి కూడా తీసుకోబడ్డారు. వారు క్రీస్తుతో భాగం వహించే విషయంలో యేసు ఇలా అన్నాడు: “నా శోధనలలో నాతో కూడ నిలిచి యున్నవారు మీరే; గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా . . . నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను.” (లూకా 22:​28-30) క్రీస్తుకు, ఆయనతోపాటు పరిపాలించే రాజులకు మధ్య ఉన్న ఈ నిబంధన నిరంతరం ఉంటుంది.​—⁠ప్రకటన 22:⁠5.

జ్ఞాపకార్థ ఆచరణ కాలం ఆనందకరమైన సమయం

21 జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఎన్నో ఆనందకరమైన సందర్భాలు తారసపడతాయి. మనం ఈ సందర్భం కోసం పట్టిక వేయబడిన బైబిలు భాగాన్ని చదవడం ద్వారా ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇది ప్రార్థన చేయడానికి, యేసు భూజీవితం గురించి ఆయన మరణం గురించి ధ్యానించడానికి, రాజ్య ప్రకటనా పనిలో పాల్గొనడానికి కూడా చాలా చక్కని సమయం. (కీర్తన 77:​12; ఫిలిప్పీయులు 4:​6, 7) దాని ఆచరణ సహితం యేసు విమోచన క్రయధన బలి ద్వారా దేవుడు, క్రీస్తు చూపించిన ప్రేమను మనకు జ్ఞాపకం చేస్తుంది. (మత్తయి 20:​28; యోహాను 3:​16) ఈ ఏర్పాటు మనకు నిరీక్షణను, ఓదార్పును ఇస్తుంది అంతేకాక అది క్రీస్తు జీవించిన జీవనశైలిలో సాగేందుకు మన నమ్మకాన్ని బలపరచాలి. (నిర్గమకాండము 34:⁠6; హెబ్రీయులు 12:⁠3) దేవుని సేవకులుగా మనం చేసుకున్న సమర్పణకు అనుగుణంగా జీవించేందుకు, ఆయన ప్రియ కుమారుని విశ్వసనీయ అనుచరులుగా నడుచుకునేందుకు కూడా జ్ఞాపకార్థ ఆచరణ మనల్ని బలపరచాలి.

22 యెహోవా మనకిచ్చే బహుమతులు ఎంత గొప్పవో కదా! (యాకోబు 1:​17) మనకు ఆయన వాక్యపు మార్గనిర్దేశం ఉంది, ఆయన ఆత్మ సహాయం ఉంది, నిత్యజీవ నిరీక్షణ ఉంది. దేవుడిచ్చిన అత్యంత గొప్ప బహుమతి ఏమిటంటే అభిషిక్తుల పాపాల కోసం, విశ్వాసముంచే మిగతా వారందరి పాపాల కోసం ఇవ్వబడిన యేసు బలి. (1 యోహాను 2:​1, 2) దీన్ని బట్టి యేసు మరణం మీకు ఎంత విలువైనది? 2003, ఏప్రిల్‌ 16న సూర్యాస్తమయం తర్వాత ప్రభువు రాత్రి భోజనాన్ని ఆచరించేందుకు సమకూడడం ద్వారా కృతజ్ఞతను చూపే వారితోపాటు మీరు కూడా ఉంటారా?

[అధస్సూచి]

^ పేరా 12 యెహోవాసాక్షులు ప్రచురించినది కానీ ప్రస్తుతం ముద్రించడం లేదు.

మీ జవాబులు ఏమిటి?

• జ్ఞాపకార్థ చిహ్నాలలో ఎవరు పాలుపంచుకోవాలి?

• “వేరే గొఱ్ఱెలు” ప్రభువు రాత్రి భోజనాన్ని గౌరవంతో ఆచరించేవారిగా మాత్రమే ఎందుకు హాజరవుతారు?

• తాము క్రీస్తు మరణ జ్ఞాపకార్థ రొట్టెలో, ద్రాక్షారసములో పాలుపంచుకోవాలని అభిషిక్త క్రైస్తవులకు ఎలా తెలుస్తుంది?

• జ్ఞాపకార్థ ఆచరణ కాలం దేనికి మంచి సమయం?

[అధ్యయన ప్రశ్నలు]

1. రెండువేల మూడవ సంవత్సరానికి ప్రణాళిక వేయబడిన అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టం ఏమిటి, అది ఎప్పుడు ఆరంభించబడింది?

2. మొదటి కొరింథీయులు 11:27వ వచనంలో ఏ హెచ్చరిక గ్రంథస్తం చేయబడింది?

3. కొరింథులోని చాలామంది క్రైస్తవులు ప్రభువు రాత్రి భోజనపు ఆచరణ విషయంలో ఎలా ప్రవర్తించేవారు?

4, 5. జ్ఞాపకార్థపు చిహ్నాలలో అలవాటుగా పాలుపంచుకునేవారు ఆత్మ పరిశీలన చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

6. ప్రభువు రాత్రి భోజనంలో పాల్గొనే ఆధిక్యతను దేవుడు ఎవరి కోసం పరిమితం చేశాడు?

7. జ్ఞాపకార్థ చిహ్నాల్లో పాలుపంచుకోవాలని మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు ఎలా తెలుసు?

8. మత్తయి 13వ అధ్యాయంలో ప్రస్తావించబడిన ‘గోధుమలు,’ “గురుగులు” ఎవరికి ప్రతిరూపంగా ఉన్నాయి?

9. “గొప్ప సమూహము” గుర్తింపు 1935లో ఎలా స్పష్టం చేయబడింది, అది అంతకుముందు వరకు జ్ఞాపకార్థ చిహ్నాలలో పాలుపంచుకుంటున్న కొందరిపై ఎలాంటి ప్రభావం చూపింది?

10. ప్రస్తుత కాలపు “వేరే గొఱ్ఱెల” నిరీక్షణను, బాధ్యతలను మీరెలా వర్ణిస్తారు?

11. ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకున్న తేదీ, ఆయన నిరీక్షణను ఎందుకు ప్రభావితం చేయగలదు?

12. ఒక వ్యక్తి జ్ఞాపకార్థ చిహ్నాలలో పాలుపంచుకోవడాన్ని ఎలాంటి పరిస్థితుల్లో మానివేయాలి, ఎందుకు మానివేయాలి?

13, 14. తమకు పరలోక పిలుపు ఉందని కొందరు పొరపాటుగా ఎందుకు ఊహించుకోవచ్చు?

15, 16. తాము అభిషిక్తులమని కొందరు పొరపాటుగా ఎందుకు భావిస్తుండవచ్చు?

17. ఆత్మాభిషేకం దేని మీద ఆధారపడి జరుగుతుంది, ఎవరిమీద ఆధారపడి జరుగుతుంది?

18. అభిషిక్తుల ఆత్మతో దేవుని ఆత్మ సాక్ష్యమెలా ఇస్తుంది?

19. ఒక అభిషిక్త క్రైస్తవుని జీవితంలో క్రొత్త నిబంధన ఏ పాత్ర వహిస్తుంది?

20. అభిషిక్తులు క్రీస్తుతో ఎలాంటి నిబంధనలోకి తీసుకోబడ్డారు?

21. మనం జ్ఞాపకార్థ కాలం నుండి గొప్ప ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చు?

22. దేవుడు మానవాళికిచ్చిన అత్యంత గొప్ప బహుమతి ఏమిటి, దానికి కృతజ్ఞతను చూపే ఒక మార్గం ఏమిటి?

[18వ పేజీలోని గ్రాఫు/చిత్రాలు]

జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవారి సంఖ్య

లక్షల్లో

15,597,746

15

14

13,147,201

13

12

11

10

9

8

7

6

5

4,925,643

4

3

2

1

878,303

63,146

1935 1955 1975 1995 2002

[18వ పేజీలోని చిత్రం]

మీరు ఈ సంవత్సరపు ప్రభువు రాత్రి భోజన ఆచరణకు హాజరవుతారా?

[21వ పేజీలోని చిత్రం]

రాజ్య ప్రకటనా పనిని, బైబిలు చదవడాన్ని విస్తృతం చేసుకోవడానికి జ్ఞాపకార్థ ఆచరణ కాలం సరైన సమయం