నిత్యజీవాన్ని ఎంపిక చేసుకోండి
నిత్యజీవాన్ని ఎంపిక చేసుకోండి
ఎంపిక చేసుకోవడానికి ఇన్ని విస్తృతమైన అవకాశాలు చాలామందికి ఇంతకుముందెన్నడూ లభ్యంకాలేదు. ఉదాహరణకు మనం ధరించే దుస్తులు, తినే ఆహారము, పని స్థలము, నివాస స్థలము తరచుగా ఎంపిక చేసుకునేవే. ప్రపంచంలోని అనేక భాగాల్లో తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం కూడా సాధారణమే. అయితే బైబిలు వీటన్నింటినీ మించిన ఒక ఎంపిక గురించి తెలియజేస్తోంది, అది పూర్తి మానవాళికి అందుబాటులో ఉంది.
బైబిలు ఇలా చెబుతోంది: “యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును.” (సామెతలు 11:19) అంతేకాక యేసుక్రీస్తు ఇలా తెలియజేశాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”—యోహాను 17:3.
అవును నిత్యజీవానికి నడిపించే జీవనశైలిని ఎంపిక చేసుకునే సదవకాశాన్ని మన సృష్టికర్త మనకు ఇచ్చాడు! నిత్యజీవం పొందాలంటే మనమేమి చేయాలి?
బైబిలు చెబుతున్న ప్రకారం, “నీతిమార్గమునందు జీవము కలదు.” (సామెతలు 12:28) నిత్యజీవానికి వెళ్ళే మార్గంలో నడుస్తున్న నీతిమంతులతో మనం కూడా ఉండవచ్చు. ఎలా? మన జీవితాలను దేవుని చిత్తానికి, ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా మలచుకోవడం ద్వారా. (మత్తయి 7:13, 14) కాబట్టి మనం సరైన ఎంపిక చేసుకుని, దేవుని కృపావరమైన నిత్యజీవాన్ని పొందుదాము.—రోమీయులు 6:23.