మీకు జ్ఞాపకమున్నాయా?
మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? అయితే, ఈ క్రింది ప్రశ్నలకు మీరు సమాధానమివ్వగలరేమో చూడండి:
• రూతు మంచి మాదిరుంచిన కొన్ని విషయాలేమిటి?
యెహోవాపట్ల తన ప్రేమ విషయంలో, నయోమి యెడల యథార్థమైన ప్రేమ చూపడంలో, పరిశ్రమించడంలో, వినయంలో ఆమె మంచి మాదిరి ఉంచింది. మంచి కారణంతోనే ప్రజలామెను ‘యోగ్యురాలని’ దృష్టించారు. (రూతు 3:11)—4/15, 23-6 పేజీలు.
• సాధారణ ప్రజలపై యెహోవా శ్రద్ధ చూపిస్తాడని మనకెలా తెలుసు?
ఐగుప్తులో క్రూరంగా బాధలుపడిన ఇశ్రాయేలీయులకు ఆయన పేదలను బాధపెట్టవద్దని చెప్పాడు. (నిర్గమకాండము 22:21-24) తన తండ్రిని అనుకరించిన యేసు సామాన్య ప్రజలయెడల నిజమైన ఆసక్తి చూపించాడు, “విద్యలేని పామరులను” తన అపొస్తలులుగా ఎన్నుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 4:13; మత్తయి 9:36) యౌవనులవంటి ఇతర ప్రజలయెడల శ్రద్ధచూపడం ద్వారా మనం దేవుని అనుకరించవచ్చు.—4/15, 28-31 పేజీలు.
• మనంచేసే పనులు యెహోవా గమనిస్తాడని నమ్మేందుకు మనకే కారణముంది?
మానవులు చేసే పనులు యెహోవా గమనిస్తాడని బైబిలు వృత్తాంతాలు చూపిస్తున్నాయి. ఆయన హేబెలు అర్పించిన బలిని గమనించాడు, మన ‘స్తుతియాగమగు జిహ్వఫలమును’ ఆయన గమనిస్తాడు. (హెబ్రీయులు 13:15) పరిశుభ్రమైన, నైతిక జీవనం జీవిస్తూ తనను ప్రీతిపర్చేందుకు హనోకు చేసిన కృషి ఆయనకు తెలుసు. తనకున్న కొద్దిలోనే ప్రవక్తయైన ఏలియాకు భాగంపంచిన సారెపతులోని యూదురాలుకాని విధవరాలిని దేవుడు గమనించాడు. మన విశ్వాస క్రియలను సహితం యెహోవా గమనిస్తాడు.—5/1, 28-31 పేజీలు.
• సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత, క్రైస్తవులుగా మారిన యూదులు దేవునికి వ్యక్తిగత సమర్పణ చేసుకోవాలని ఎందుకు చెప్పవచ్చు?
సా.శ.పూ. 1513లో ప్రాచీన ఇశ్రాయేలీయులు యెహోవాతో సమర్పిత సంబంధంలోకి వచ్చారు. (నిర్గమకాండము 19:3-8) దాని తర్వాత, యూదులు ధర్మశాస్త్ర నిబంధన క్రిందగల ఆ సమర్పిత జనాంగంలో జన్మించారు. అయితే సా.శ. 33లో క్రీస్తు మరణం ద్వారా యెహోవా ఆ ధర్మశాస్త్ర నిబంధనను తొలగించాడు. (కొలొస్సయులు 2:14) ఆ పిమ్మట దేవునికి అంగీకృతంగా సేవచేయాలని కోరుకొనే యూదులు ఆయనకు సమర్పించుకొని యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందవలసియున్నారు.—5/15, 30-1 పేజీలు.
• ధూపం వేయడానికి నేడు సత్యారాధనలో స్థానముందా?
ప్రాచీన ఇశ్రాయేలునందు సత్యారాధనలో ధూపంవేయడం ఒక భాగంగా ఉండేది. (నిర్గమకాండము 30:37, 38; లేవీయకాండము 16:12, 13) అయితే, క్రీస్తు మరణంతో ధూపం వేయడంతోసహా ధర్మశాస్త్ర నిబంధన ముగిసింది. మతేతర ఉద్దేశంతో ధూపం ఉపయోగించాలా వద్దా అనేది క్రైస్తవులు తమకుతామే నిర్ణయించుకోవచ్చు, అయితే నేడది సత్యారాధనలో ఒక భాగంకాదు. ఇతరులకు అభ్యంతరం కలుగజేయకుండా ఉండడానికి వారి భావాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.—6/1, 28-30 పేజీలు.
• యేసు నిజంగా భూమిపై జీవించాడని మరియెక్కువ ఆలోచింపజేసేలా ఇటీవల ఏ వార్తావిశేషం అనేకమందిని పురికొల్పింది?
ఇశ్రాయేలులో లభ్యమైన సున్నపు రాయితో చేయబడిన ఒక అస్థికల పేటిక బహు ప్రాచుర్యం పొందింది. అది మొదటి శతాబ్దపు నాటిదిగా అనిపిస్తుంది, దానిపై, “యోసేపు కుమారుడును, యేసు సోదరుడైన యాకోబు” అనే అక్షరాలు శిలాలిఖితమై ఉన్నాయి. దీనిని కొందరు యేసు ఉనికిలో ఉన్నాడనడానికి “యేసు గురించి బైబిలు వెలుపల లభ్యమైన అతి పురాతన పురావస్తు రుజువు.”—6/15, 3-4 పేజీలు.
• ఒక మానవుడు ప్రేమించడమెలా నేర్చుకుంటాడు?
మానవులు తమ తల్లిదండ్రుల మాదిరి, శిక్షణనుండి మొదట ప్రేమించడం నేర్చుకుంటారు. భార్యాభర్తలిరువురు పరస్పరం ప్రేమాగౌరవాలను చూపించుకున్నప్పుడు, పిల్లలు ప్రేమించడం నేర్చుకోగలరు. (ఎఫెసీయులు 5:28; తీతు 2:3, 4) ఒకవ్యక్తి ప్రేమగల కుటుంబంనుండి రాకపోయినా, తండ్రిలాంటి యెహోవా నడిపింపును అంగీకరించి, పరిశుద్ధాత్మ సహాయం పొందడం ద్వారా, క్రైస్తవ సహోదరత్వ స్నేహపూర్వక మద్దతునుండి ప్రయోజనం పొందడం ద్వారా అతడు ప్రేమించడం నేర్చుకోవచ్చు.—7/1, 4-7 పేజీలు.
• యుసేబియస్ ఎవరు, ఆయన జీవితంనుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు?
యుసేబియస్ తొలికాలపు చరిత్రకారుడు, ఆయన సా.శ. 324లో క్రైస్తవ చర్చి చరిత్ర (ఆంగ్లం) అనే పది సంపుటల గ్రంథం రచించాడు. కుమారునికంటే ముందే తండ్రి ఉనికిలో ఉన్నాడని యుసేబియస్ నమ్మినా, ఆయన నైసియాలోని సమాలోచన సభలో భిన్న దృక్కోణం అంగీకరించాడు. తన శిష్యులు “లోకసంబంధులు” కాకూడదని కోరిన యేసు మాటలను ఆయన నిర్లక్ష్యంచేశాడని స్పష్టమవుతోంది. (యోహాను 17:16)—7/15, 29-31 పేజీలు.
• బహుభార్యత్వం విషయంలో యెహోవా తన దృక్కోణం మార్చుకున్నాడా?
లేదు, బహుభార్యత్వం విషయంలో యెహోవా తన దృక్కోణం మార్చుకోలేదు. (మలాకీ 3:6) మొదటి మానవుని విషయంలో అతడు తన ‘భార్యను హత్తుకొని’ తన భార్యతో ఏక శరీరమై ఉండడమే దేవుని ఏర్పాటు. (ఆదికాండము 2:24) వ్యభిచార కారణం లేకుండా విడాకులు తీసుకొని, తిరిగి వివాహంచేసుకుంటే ఆ వ్యక్తి వ్యభిచారి అవుతాడని యేసు చెప్పాడు. (మత్తయి 19:4-6, 9) క్రైస్తవ సంఘ స్థాపనతో బహుభార్యత్వాన్ని యెహోవా సహించడం ముగిసింది.—8/1, 28వ పేజీ.