కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేరంలేని లోకం ముందుంది

నేరంలేని లోకం ముందుంది

నేరంలేని లోకం ముందుంది

సాధ్యమైతే, నేరస్థులులేని లోకాన్ని ఊహించుకోండి! అప్పుడు పోలీసుల అవసరం గాని, జైళ్ళ అవసరం గాని, ఖరీదైన మరియు సంక్లిష్టమైన న్యాయ వ్యవస్థల అవసరం గాని ఉండదు. ప్రతి వ్యక్తి ఇతరుల ప్రాణాలను, వారి ఆస్తిని గౌరవిస్తాడు. అలా జరగడం అసంభవమనిపిస్తోందా? మీకలా అనిపించవచ్చు, కానీ ఈ అద్భుతమైన మార్పు తప్పకుండా వస్తుందని బైబిలు వాగ్దానం చేస్తోంది. నేరం గురించి, ఈ భూమిపై జరుగుతున్న ఇతర చెడు పనుల గురించి లేఖనాలు ఏమని ప్రవచిస్తున్నాయో ఎందుకు పరిశీలించకూడదు?

కీర్తనల పుస్తకంలో మనమిలా చదువుతాము: “చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూరవలెనే వాడిపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.” (కీర్తన 37:​1, 2, 11) నిజమే ఈ వాగ్దానాన్ని, ప్రోత్సాహకరమైన ఇతర వాగ్దానాలను నెరవేర్చకుండా దేవుణ్ణి ఎవ్వరూ ఆపలేరు.

దేవుడు ఈ ఆశీర్వాదాలను తన రాజ్యం ద్వారా తీసుకువస్తాడు. ప్రభువు ప్రార్థనలో, ఈ రాజ్యం రావాలని, దేవుని చిత్తం “పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును” నెరవేరాలని ప్రార్థించమని యేసుక్రీస్తు తన అనుచరులకు నేర్పించాడు. (మత్తయి 6:​9, 10) త్వరలోనే, ఆ రాజ్యం క్రింద పేదరికం, అణచివేత, లేదా స్వార్థం కారణంగా ఎవ్వరూ నేరం చేయడానికి ప్రేరేపించబడరు. దానికి బదులు దేవుని వాక్యం ఇలా నివేదిస్తోంది: “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.” (కీర్తన 72:​16) అవును యెహోవా దేవుడు భూమిపైనున్న వారందరికీ మంచివాటిని సమృద్ధిగా దయచేస్తాడు. మరింత ప్రాముఖ్యంగా, మానవ సమాజం దేవునిపట్ల, పొరుగువారిపట్ల ఉండే ప్రేమపై ఆధారపడివుంటుంది కాబట్టి నేరం మరెన్నటికీ లోకాన్ని కలతపెట్టదు.