‘వేసవి శీతకాలములు ఉండక మానవు’
యెహోవా సృష్టి వైభవాలు
‘వేసవి శీతకాలములు ఉండక మానవు’
భగ భగ మండే సూర్యుడు ఎడారి ప్రాంతంలో సెగలు కక్కుతున్నాడు. భూమండలానికి మరోవైపున్న ఇతర ప్రాంతాల్లో చల్లని శీతాకాలం తర్వాతి వెచ్చదనాన్ని ఇస్తున్నాడు. నిజానికి శీతోష్ణస్థితుల, ఋతువుల మార్పుకు ప్రధాన కారణాల్లో ఒకటి సూర్యరశ్మి.
శీతోష్ణస్థితిగతులు భూవ్యాప్తంగా వేరువేరుగా ఉంటాయి. అయితే ఈ ఋతువులు మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయి? వసంతకాలంలో చెట్లు, పూలు వికసిస్తున్నప్పుడు చైతన్యాన్నిచ్చే తాజాదనం చూసి మీరు ఆనందిస్తారా? వేసవికాలంలోని సమశీతోష్ణమైన సాయంత్రాలను చూడడం మీకెలాంటి అనుభూతినిస్తుంది? ఉత్తేజాన్నిచ్చే శరత్కాలం మారే ఆకుల రంగుల హంగులతో అలంకరించుకోవడాన్ని మీరు ఆస్వాదిస్తారా? మీరు మంచుతో ముస్తాబైన అడవిని చూసినప్పుడు ప్రశాంతమైన అనుభూతిని పొందుతారా?
ఋతువులు ఎలా ఏర్పడతాయి? క్లుప్తంగా చెప్పాలంటే, భూమి ఏటవాలుగా వంగి ఉండడం వల్లనే ఏర్పడతాయి. అది తన అక్షంపై 23.5 డిగ్రీల కోణంతో ప్రదక్షిణం చేస్తూ, సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. భూమి అక్షం అలా ఏటవాలుగా లేనట్లయితే ఋతువులే ఉండవు. శీతోష్ణస్థితి ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. అది మొక్కలను, పంటపొలాల చక్రాన్ని ప్రభావితం చేస్తుంది.
ఋతువుల అనుక్రమం వెనుక సృష్టికర్త హస్తాన్ని చూడవచ్చు. యెహోవా దేవుణ్ణి సంబోధిస్తూ కీర్తనకర్త సరిగ్గానే ఇలా అన్నాడు: “భూమికి సరిహద్దులను నియమించినవాడవు నీవే. వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి.” (ఇటాలిక్కులు మావి.)—కీర్తన 74:17. a
భూమిపై నుండి చూసే ఒక వ్యక్తికి, ఆకాశంలోని సూర్యచంద్రనక్షత్రాలు కాలాల గురించి చెప్పే ఖచ్చితమైన సూచికలుగా ఉంటాయి. మన సౌర కుటుంబాన్ని సృష్టించేటప్పుడు దేవుడిలా ప్రకటించాడు: “ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాక . . . అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాక.” (ఆదికాండము 1:14) భూమి తన కక్ష్యలో తిరుగుతూ ఒక సంవత్సర కాలంలో రెండు అక్షాంశాలను చేరుకుంటుంది, అక్కడ మధ్యాహ్నపు సూర్యుడు సరిగ్గా భూమధ్యరేఖకు పైగా ఉంటాడు. ఆ సందర్భాలను విషువములు అంటారు, అనేక ప్రాంతాల్లో దాన్ని వసంతకాలానికి, శరత్కాలానికి ఆరంభసూచనగా పరిగణిస్తారు. విషువముల కాలములో భూమి అంతటా పగలు, రాత్రి దాదాపు సమానంగా ఉంటాయి.
ఋతువులు ఏర్పడడానికి అవి ఒకదాని తర్వాత ఒకటిగా కొనసాగడానికి కేవలం ఖగోళ చలనాలు మాత్రమే కారణం కాదు. ఋతువులు, శీతోష్ణస్థితి, వాతావరణం అన్నీ జీవకోటిని పోషించే సంయుక్త వ్యవస్థలో అనుసంధానమై ఉన్నాయి. క్రైస్తవ అపొస్తలుడైన పౌలు ఆయన సహచరుడు బర్నబా, ఆసియా మైనరులో నివసిస్తున్న ప్రజలతో మాట్లాడుతూ, దేవుడే “ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను” నింపుచున్నాడని పేర్కొన్నారు. ఆ ప్రజల్లో చాలామందికి వ్యవసాయం గురించి, ఆహార ఉత్పత్తి గురించి బాగా తెలుసు.—అపొస్తలుల కార్యములు 14:14-17.
కిరణజన్య సంయోగక్రియ యొక్క అద్భుతమైన ప్రక్రియ భూమిపైనున్న వృక్షజీవానికి, సముద్రాల్లోని వృక్షప్లవకాలు అని పిలువబడే, స్వేచ్ఛగా తేలియాడే, సూక్ష్మాతి సూక్ష్మమైన వృక్ష సముదాయానికి దోహదపడుతుంది. దీని కారణంగా ప్రస్తుత ఆహారపు గొలుసు, జీవవైవిధ్య వ్యవస్థలు వాతావరణానికి, శీతోష్ణస్థితికి సంక్లిష్టమైన రీతుల్లో మార్పుచెందుతాయి. వీటన్నింటి వెనక యెహోవా హస్తముందని సూచిస్తూ పౌలు సరిగ్గానే ఇలా అన్నాడు: “భూమి తనమీద తరుచుగా కురియు వర్షమును త్రాగి, యెవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును.”—హెబ్రీయులు 6:7.
మీరు కాస్త ఆగి, వసంతకాలం సామరస్యమైన ఉష్ణోగ్రతలను, నిడివైన పగటిసమయాలను, అధికమైన సూర్యకాంతిని, ఆహ్లాదకరమైన వానజల్లులను తీసుకువచ్చే ప్రాంతాల్లో పరమగీతము 2:12, 13) ఇది వేసవి కాలానికి చివరి దశలో లేదా శరత్కాలములో పంట కోతకు వేదికను సిద్ధం చేస్తుంది.—నిర్గమకాండము 23:16.
ఏమి జరుగుతుందో ఆలోచించినట్లయితే “ఆశీర్వచనము” అనే పదం నూతన భావాన్ని సంతరించుకుంటుంది. పంటపొలాల పరాగసంపర్కానికి సిద్ధంగా పుష్పాలు వికసిస్తాయి, కీటకాలు తమ శీతాకాలపు నివాస స్థలాలను వదిలి బయటకు వస్తాయి. మీరిక్కడ చూస్తున్న బ్లూ జే అనే పాలపిట్ట వంటి పక్షులు, అడవిని రంగులతో, పాటలతో నింపుతాయి, ప్రకృతి చైతన్యవంతంగా మారుతుంది. జీవపు స్పందనం వేగాన్ని పుంజుకొంటుంది, జీవులు జననం, పునరుజ్జీవనం, పెరుగుదల వంటి తమ జీవిత చక్రాలను కొనసాగిస్తాయి. (యెహోవా భూమిని నిలిపిన విధానాన్ని బట్టి ఆయన కార్యములు అద్భుతమైన రీతిలో వ్యక్తమవుతున్నాయి, అది మనకు రాత్రింబగళ్ళను, ఋతువులను, విత్తుకాలమును, కోతకాలమును ఇస్తోంది. శీతాకాలం తర్వాత వేసవికాలం తప్పక వస్తుందని మనకు తెలుసు. నిజానికి, “భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీతకాలములును రాత్రింబగళ్లును ఉండక మానవు” అని వాగ్దానం చేసింది ఆ దేవుడే.—ఆదికాండము 8:22.
[అధస్సూచి]
a యెహోవాసాక్షుల క్యాలెండర్ 2004 జూలై/ఆగస్టు చూడండి.
[9వ పేజీలోని బాక్సు/చిత్రం]
జీవానికి ప్రాముఖ్యమైన ఒక ఉపగ్రహం
యుగయుగాలుగా చంద్రుడు మానవులను పురికొల్పుతున్నాడు, అబ్బురపరుస్తున్నాడు. అయినా చంద్రుడు ఋతువులను ప్రభావితం చేస్తాడని మీకు తెలుసా? చంద్రుని ఉనికి భూగమనాన్ని క్రమపరిచేందుకు అంటే భూమి తన వృత్తపరిధిలో ఏటవాలుగా తిరిగేందుకు దోహదపడుతుంది. అది “భూమిపై జీవకోటిని పోషించగల పరిస్థితులను ఉత్పత్తి చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది” అని విజ్ఞానశాస్త్ర రచయిత ఆండ్రూ హిల్ పేర్కొన్నాడు. ఒకవేళ మన భూగ్రహపు అక్షీయ కోణాన్ని క్రమపరిచేందుకు సహజమైన పెద్ద ఉపగ్రహం లేనట్లయితే, ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి, భూమిపై జీవ మనుగడ అసాధ్యం అవుతుంది. అందుకే ఖగోళ శాస్త్రజ్ఞుల బృందమొకటి ఈ నిర్ధారణకు వచ్చింది: “చంద్రుడ్ని భూమిపై ఉష్ణోగ్రతను క్రమపరిచే శక్తిగా పరిగణించవచ్చు.”—కీర్తన 104:19.
[చిత్రసౌజన్యం]
చందమామ: U.S. Fish & Wildlife Service, Washington, D.C./Bart O’Gara
[9వ పేజీలోని చిత్రం]
ఒంటెలు, ఉత్తర ఆఫ్రికా మరియు అరేబియన్ ద్వీపకల్పం