కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు చరిత్ర ఎంత ఖచ్చితమైనది?

బైబిలు చరిత్ర ఎంత ఖచ్చితమైనది?

బైబిలు చరిత్ర ఎంత ఖచ్చితమైనది?

ఇస్రాయెల్‌ మాజీ అధ్యక్షుడైన కైమ్‌ హెర్జోగ్‌, టెల్‌ అవీవ్‌ విశ్వవిద్యాలయంలో పురావస్తుశాస్త్ర పండితుడైన మొర్దేకై గీకోన్‌ కలిసి వ్రాసిన బాటిల్స్‌ ఆఫ్‌ ద బైబిల్‌ అనే పుస్తకం ఈ విషయాన్ని తెలియజేసింది:

“బైబిలులోని యుద్ధతంత్ర వివరణను . . . కేవలం కల్పించి చెప్పడానికి వీలవదు. ఉదాహరణకు, న్యాయాధిపతులు 6-8 అధ్యాయాల్లో వివరించబడినట్లుగా, గిద్యోను మిద్యానీయులతోనూ వారి మిత్ర దేశాలతోనూ చేసిన యుద్ధాన్ని హోమర్‌ తన ఇలియడ్‌లో వర్ణించిన గ్రీకుల యుద్ధ పోరాటాలకు పోల్చి చూడడమే దానికి తగిన రుజువుగా ఉంటుంది. హోమర్‌ రచనల విషయానికివస్తే గ్రీకుల యుద్ధాలకు, సమీపించగల సముద్ర తీరం, దగ్గర్లో ప్రాకారాలున్న పట్టణం ఉంటే చాలు. . . . కానీ గిద్యోను చేసిన పోరాటానికి సంబంధించిన బైబిలు వృత్తాంతం అలా లేదు. యుద్ధ తంత్ర కదలికల వివరాలను, నిర్దిష్టమైన భౌతిక లక్షణాలకు, స్నేహితుల శత్రువుల చర్యలకు మధ్య జరిగిన పరస్పర ప్రతిచర్య ఆధారిత పోరాటాలను, దాదాపు అరవై కిలోమీటర్ల ఆ రణరంగ స్థలాన్ని మరొక రకంగా ఇంకెక్కడా తిరిగి చెప్పడం సాధ్యం కాదు. . . . కాబట్టి బైబిల్లో వర్ణించబడిన పోరాటాల యుద్ధతంత్ర వివరణ యొక్క నిజత్వాన్ని మనం అంగీకరించక తప్పదు.”

మంచి దేశమును చూడండి” అనే అట్లాసు వంటి బ్రోషుర్‌లోని 18, 19 పేజీల్లో ఉన్న మ్యాపును ఉపయోగిస్తూ గిద్యోను దాడిని మీరు అధ్యయనం చేయవచ్చు. * “మిద్యానీయులందరును అమాలేకీయులందరును తూర్పు వారందరును కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానములో” దిగిన వైనంతో ఆ వృత్తాంతం మొదలవుతుంది. గిద్యోను దగ్గరలోవున్న తెగలవారిని సహాయం చేయమని కోరాడు. హరోదు బావి మొదలుకొని మోరే కొండ వరకు, అక్కడి నుండి యొర్దాను లోయవరకు ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. శత్రువులను యొర్దాను నది అవతలి వరకు తరిమిన తర్వాత గిద్యోను వారిపై విజయం సాధించాడు.​—⁠న్యాయాధిపతులు 6:33-8:​12.

“మంచి దేశమును చూడండి” అనే ఆ బ్రోషుర్‌లోని మ్యాపు, పై వృత్తాంతంలో ప్రస్తావించబడిన ప్రముఖ స్థలాలను, దానిలో ఇమిడివున్న భూ స్వరూపాలను చూపిస్తుంది. మరో మ్యాపు (15వ పేజీ) ఇశ్రాయేలు గోత్రాల ప్రాంతాలను చూపిస్తుంది. బైబిలు వృత్తాంతపు ఖచ్చితత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆ రెండు మ్యాపులు మీకు సహాయం చేయగలవు.

ఇది, కీర్తిశేషుడైన ప్రొఫెసర్‌ యోహానన్‌ అహరోనీ చేసిన ఈ వ్యాఖ్యను ఉదాహరిస్తుంది: “బైబిలు సంబంధిత దేశంలో, భౌతికశాస్త్రం, చరిత్ర ఎంతగా సమ్మిళితమై ఉన్నాయంటే ఒకదాని సహాయం లేకుండా మరోదాన్ని నిజంగా అర్థం చేసుకోలేము.”

[అధస్సూచి]

^ పేరా 4 యెహోవాసాక్షులు ప్రచురించినది.

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

నేపథ్యపు మ్యాపు: Based on maps copyrighted by Pictorial Archive (Near Eastern History) Est. and Survey of Israel.