అకస్మాత్తుగా విషాదం అలుముకోవడం
అకస్మాత్తుగా విషాదం అలుముకోవడం
రెండేళ్ల ఓయెన్ ఇంట్లో స్నానాల గదిలో ఆడుకుంటున్నాడు. ఆ పిల్లవాడికి మెడిసిన్ బాక్సు (మందులపెట్టె) అందదులే అని అతని తల్లిదండ్రులు అనుకున్నా ఆ పిల్లవాడు ఎలాగోలా అందుకోగలిగాడు. అందులో ఒక సీసా ఆ పిల్లవాడి దృష్టిని ఆకర్షించింది. దానితో అతను దానిని తెరిచి దానిలోని ద్రవాన్ని త్రాగేశాడు. ఆ సంఘటనతో అకస్మాత్తుగా ఆ ఇంట్లో విషాదం అలుముకుంది.
ఆ సీసాలో విషపూరిత ద్రవం ఉంది, విషాదకరంగా, రెండేళ్ల ఓయెన్ చనిపోయాడు. ఆ పిల్లవాని తల్లిదండ్రులు దుఃఖంలో మునిగిపోయారు. ఆ పిల్లవాడి తండ్రి పెర్సి తన చర్చి ఫాదిరి నుండి ఓదార్పును ఆశించాడు. “ఇలా ఎందుకు జరిగింది?” అని ఆయన ఫాదిరిని అడిగాడు. దానికి ఆ ఫాదిరి “పరలోకంలో మరో చిన్న దేవదూత కావాలని దేవుడు కోరుకున్నాడు” అని జవాబిచ్చాడు. దుఃఖభారంతో కృంగిపోయిన ఆ తండ్రికి అది చాలా అన్యాయం అనిపించింది. అలాంటి విషాదం చోటు చేసుకోవాలని దేవుడు నిజంగా ఉద్దేశించాడా? నిరుత్సాహపడిన పెర్సి, ఇక చర్చికి వెళ్ళను అని నిర్ణయించుకున్నాడు.
జరిగింది తలచుకుంటూ, ‘మా అబ్బాయి ఇంకా అవస్థపడుతూనే ఉన్నాడా? వాణ్ణి నేను మళ్లీ ఎప్పుడైనా చూస్తానా?’ అని పెర్సి ఆలోచించేవాడు.
చనిపోయినప్పుడు ఏమి జరుగుతుంది, మరణించిన ప్రియమైన వారిని భవిష్యత్తులో తిరిగి కలుసుకోవడం సాధ్యమవుతుందా అని మీరు కూడా ఆలోచించి ఉంటారు. ఈ ప్రశ్నలకు దేవుని వాక్యమైన బైబిలు జవాబులు ఇస్తుంది. ఇలాంటి విషాదాలు ఎదుర్కొన్న ప్రతీ ఒక్కరి కోసం దానిలో స్పష్టమైన, ఓదార్పుకరమైన జవాబులు ఉన్నాయి. అంతేకాక, దేవుడు వాగ్దానం చేసిన అద్భుతమైన ఉత్తరాపేక్షను అంటే పునరుత్థానాన్ని గురించి అది వెల్లడిచేస్తోంది.
ఈ అద్భుతమైన నిరీక్షణ గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి తర్వాతి ఆర్టికల్ చదవండి.