యెహోవా ఓర్పును అనుకరించండి
యెహోవా ఓర్పును అనుకరించండి
“[యెహోవా] తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని . . . మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.”—2 పేతురు 3:9.
ఇతరులెవ్వరూ మనకు ఇవ్వలేని దానిని యెహోవా మనకు ఇచ్చాడు. అది అత్యంత ఆకర్షణీయమైనదీ, ప్రశస్తమైనదే కాక, అది కొనలేనిదీ లేక సంపాదించుకోలేనిదీ. అదే ఆయనిస్తున్న నిత్యజీవమనే బహుమానం. మనలో చాలామందికి అది పరదైసు భూమిపై నిరంతర జీవితం. (యోహాను 3:16) అదెంత ఆనందకరమో కదా! తగవులు, దౌర్జన్యం, బీదరికం, నేరం, అనారోగ్యం, చివరకు మరణం వంటి తీరని దుఃఖానికి కారణమయ్యేవి గతించిపోతాయి. దేవుని రాజ్య ప్రేమపూర్వక పరిపాలన క్రింద ప్రజలు పరిపూర్ణ శాంతి, ఐక్యతలతో జీవిస్తారు. ఆ పరదైసును మనమెంతగా కోరుకుంటామో కదా!—యెషయా 9:6, 7; ప్రకటన 21:4, 5.
2 భూమిని పరదైసుగా స్థిరపరిచే కాలం కోసం యెహోవా కూడా ఎదురుచూస్తున్నాడు. అవును ఆయన నీతిని, న్యాయాన్ని ప్రేమిస్తాడు. (కీర్తన 33:5) తన నీతి సూత్రాలపట్ల ఉదాసీనంగా లేదా విరోధంగా ఉండడమే కాక, తన అధికారాన్ని ద్వేషంతో తిరస్కరిస్తూ, తన ప్రజల్ని హింసించే లోకాన్ని చూడడం ఆయనకిష్టం లేదు. అయితే సాతాను దుష్ట విధానాన్ని ఆయనింకా నిర్మూలించకుండా ఉండడానికి తగిన కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ఆయన సర్వాధిపత్యానికి సంబంధించిన నైతిక వివాదాలు ఇమిడివున్నాయి. ఈ వివాదాంశాలను పరిష్కరించడంలో యెహోవా ప్రత్యేకంగా ఆకర్షణీయమైన లక్షణాన్ని, నేడు చాలామందిలో కనిపించని లక్షణాన్ని అంటే ఓర్పును ఆయన ప్రదర్శిస్తున్నాడు.
3 అక్షరార్థంగా “దీర్ఘమైన ఆత్మ” అనే అర్థమున్న గ్రీకు పదం, పరిశుద్ధ గ్రంథములో “ఓర్పు,” “దీర్ఘశాంతము,” “ఓపిక” అని అనువదించబడింది. గ్రీకు, హీబ్రూ భాషల్లో ఈ పదానికి సహనం, కోపించుటకు నిదానించుట అనే అర్థాలు కూడా ఉన్నాయి. యెహోవా ఓర్పు మనకెలా ప్రయోజనం చేకూరుస్తుంది? యెహోవా, ఆయన నమ్మకమైన సేవకులు చూపించిన ఓర్పు, సహనం నుండి మనమే పాఠాలు నేర్చుకోవచ్చు? యెహోవా ఓర్పుకు హద్దులున్నాయని మనకెలా తెలుసు? మనమీ విషయాల్ని పరిశీలిద్దాం.
యెహోవా ఓర్పును తలంచుకోండి
4 యెహోవా ఓర్పు గురించి అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు [యెహోవా] తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై [‘ఓర్పుగలవాడై,’ NW]యున్నాడు.” (2 పేతురు 3:8, 9) యెహోవా ఓర్పును అర్థం చేసుకునేందుకు మనకు సహాయపడగల, ఇక్కడ ప్రస్తావించబడిన రెండు అంశాలను దయచేసి గమనించండి.
5 మొదటి అంశం, యెహోవా కాలాన్ని మనం చూసినట్లు చూడడు. నిత్యం జీవించే దేవునికి వెయ్యి సంవత్సరాలు ఒక దినంలా ఉన్నాయి. కాలం ఆయనను అదుపులో ఉంచలేదు లేదా ఆయనపై ఒత్తిడి తీసుకురాలేదు, అలాగని ఆయన ఆలస్యంగా చర్య తీసుకోడు. అందరి ప్రయోజనార్థం ఖచ్చితంగా ఎప్పుడు చర్య తీసుకోవడం మంచిదో అపరిమిత జ్ఞానంగల యెహోవాకు తెలియడమే కాక, ఆ సమయం కోసం ఆయన ఓర్పుతో వేచి చూస్తున్నాడు. అయితే, ఆయన వేచియున్న కాలంలో తన సేవకులు అనుభవించే బాధను యెహోవా పట్టించుకోడనే నిర్ధారణకు మనం రాకూడదు. ఆయన ‘కరుణామయుడును,’ లూకా 1:75; 1 యోహాను 4:8) తాత్కాలికంగా అనుమతించబడిన బాధ కలిగించే ఎలాంటి హానినైనా ఆయన పూర్తిగా, శాశ్వతంగా తొలగించగలడు.—కీర్తన 37:10.
ప్రేమాస్వరూపియైన దేవుడు. (6 నిజమే, ఒకవ్యక్తి తాను కోరుకునే దానికోసం వేచివుండడం అంత సులభం కాదు. (సామెతలు 13:12) అందుకే ప్రజలు తాము చేసిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చకపోతే, ఇతరులు వారికా ఉద్దేశమే లేదనే నిర్ధారణకు రావచ్చు. దేవుని విషయంలో అలా తలంచడం ఎంత అజ్ఞానమో కదా! దేవుని ఓర్పును మనం జాప్యమని తప్పుగా అర్థం చేసుకుంటే, గడిచేకాలం మనల్ని సులభంగా సందేహానికీ, నిరాశకు లోనయ్యేలా చేయడమే కాక, మనం ఆధ్యాత్మిక నిద్రలోకి జారుకునే ప్రమాదంలో పడతాం. అంతకంటే ఘోరంగా, పేతురు అంతకుముందు హెచ్చరించిన విధంగా విశ్వాసరహిత అపహాసకులచేత మోసగించబడవచ్చు. అలాంటివారు హేళనగా, “ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే” అంటారు.—2 పేతురు 3:4.
7 పేతురు మాటల నుండి మనం నేర్చుకోగల రెండవ అంశమేమిటంటే, అందరూ మారుమనస్సు పొందాలని యెహోవా కోరుకుంటున్నాడు కాబట్టే ఆయన ఓర్పు వహిస్తున్నాడు. తమ దుర్మార్గత నుండి మరలడానికి మూర్ఖంగా తిరస్కరించేవారికి యెహోవా మరణశిక్ష విధిస్తాడు. అయితే దుష్టుడు మరణించడంలో దేవునికి సంతోషం లేదు. బదులుగా, ప్రజలు మారుమనస్సు పొంది తమ దుర్మార్గత నుండి మరలి బ్రతకడం చూసి ఆయన ఆనందిస్తాడు. (యెహెజ్కేలు 33:11) అందువల్లే ఆయన ఓర్పును ప్రదర్శిస్తూ, బ్రతికే అవకాశం ప్రజలందరికీ లభించాలనే ఉద్దేశంతో భూమియంతటా సువార్తను ప్రకటింపజేస్తున్నాడు.
8 ప్రాచీన ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు వ్యవహరించిన తీరులో కూడా ఆయన ఓర్పును మనం చూడవచ్చు. వారి అవిధేయతను ఆయన శతాబ్దాలపాటు భరించాడు. ఆయన తన ప్రవక్తల ద్వారా పదేపదే వారినిలా పురికొల్పాడు: “మీ దుర్మార్గములను విడిచిపెట్టి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు, నా సేవకులగు ప్రవక్తలద్వారా మీకప్పగించినట్టియు ధర్మశాస్త్రమునుబట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడి.” దాని ఫలితమేమిటి? విచారకరంగా, ఆ ప్రజలు ‘వినలేదు.’—2 రాజులు 17:13, 14.
9 చివరకు యెహోవా తన కుమారుణ్ణి పంపించినప్పుడు, ఆయన కూడా యూదులను దేవునితో సమాధానపడమని మత్తయి 23:37) వాడియైన ఆ మాటలు శిక్షించడానికి ఆత్రపడే నిర్దయుడైన న్యాయాధిపతి పలికిన మాటలు కాదుగానీ, ప్రజలపట్ల ఓర్పు ప్రదర్శించే ఒక స్నేహితుడు పలికిన మాటలే. యేసు పరలోకంలోని తన తండ్రిలాగే, ప్రజలు పశ్చాత్తాపపడి కఠిన తీర్పును తప్పించుకోవాలని కోరుకున్నాడు. యేసు ఇచ్చిన హెచ్చరికకు కొందరు అనుకూలంగా ప్రతిస్పందించి, సా.శ. 70లో యెరూషలేముపైకి వచ్చిన భయంకరమైన తీర్పును తప్పించుకున్నారు.—లూకా 21:20-22.
నిర్విరామంగా వేడుకున్నాడు. యేసు చూపించిన ఓర్పు ఆయన తండ్రి ఓర్పును పరిపూర్ణంగా ప్రతిబింబించింది. త్వరలోనే తాను చంపబడతాననే పూర్తి అవగాహనతో యేసు ఇలా విచారం వెలిబుచ్చాడు: “యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింది కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.” (10 దేవుని ఓర్పు నిజంగా అద్భుతమైనది కాదా? మానవులు ఎంత అవిధేయత చూపించినప్పటికీ, యెహోవా తనను తెలుసుకొని రక్షణార్థమైన నిరీక్షణను హత్తుకునేందుకు లక్షలాదిమందితోపాటు మనలో ప్రతీ ఒక్కరినీ అనుమతించాడు. “మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి” అని తోటి క్రైస్తవులకు పేతురు వ్రాశాడు. (2 పేతురు 3:15) యెహోవా ఓర్పు మనకు రక్షణ మార్గాన్ని తెరిచినందుకు మనం కృతజ్ఞులమై ఉండమా? మనం ప్రతీదినం యెహోవాను సేవిస్తుండగా ఆయన ఎడతెగక మనపట్ల ఓర్పు వహించాలని మనం ప్రార్థించమా?—మత్తయి 6:12.
11 యెహోవా ఎందుకు ఓర్పు వహిస్తున్నాడో మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆయన తన వాగ్దానాలను నెరవేర్చే విషయంలో జాప్యం చేస్తున్నాడనే ముగింపుకు ఎన్నటికీ రాకుండా, ఆయన తీసుకొచ్చే రక్షణ కోసం ఓర్పుతో ఎదురుచూడడానికి సహాయం పొందుతాం. (విలాపవాక్యములు 3:26) దేవుని రాజ్యం రావాలని ప్రార్థిస్తూనే, ఆ ప్రార్థనకు జవాబిచ్చే సరైన సమయం దేవునికి తెలుసని మనం నమ్ముతాం. అంతేకాక, మన సహోదరులపట్ల, మనం ప్రకటించేవారిపట్ల మన వ్యవహారాల్లో దైవిక ఓర్పును ప్రదర్శించడం ద్వారా యెహోవాను అనుకరించేలా పురికొల్పబడతాం. మనం కూడా, ఎవరూ నాశనం కావాలని కోరుకోము గానీ అందరూ పశ్చాత్తాపపడి మనలాగే నిత్యజీవ నిరీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటాం.—1 తిమోతి 2:3, 4.
ప్రవక్తల ఓర్పును తలంచండి
12 యెహోవా ఓర్పును తలంచడం ద్వారా ఆ లక్షణాన్ని అమూల్యమైనదిగా పరిగణించేందుకూ, దాన్ని అలవరచుకునేందుకూ మనం సహాయం పొందుతాం. అపరిపూర్ణ మానవులకు ఓర్పును అలవరచుకోవడం అంత సులభం కాకపోయినా, అది అసాధ్యమేమీ కాదు. మనమీ విషయాన్ని దేవుని ప్రాచీనకాల సేవకుల నుండి తెలుసుకోవచ్చు. శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “నా సహోదరులారా, [యెహోవా] నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి.” (యాకోబు 5:10) మనమెదుర్కొంటున్న పరిస్థితినే ఇతరులు విజయవంతంగా ఎదుర్కొన్నారని తెలుసుకోవడం ఓదార్పుకరమే కాక, ప్రోత్సాహకరం కూడా.
13 ఉదాహరణకు, ప్రవక్తయైన యెషయాకు తన నియామకంలో ఖచ్చితంగా ఓర్పు అవసరమైంది. యెహోవా ఆ విషయాన్ని సూచిస్తూ ఆయనకిలా చెప్పాడు: “నీవు పోయి యీ జనులతో ఇట్లనుము—మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుము.” (యెషయా 6:9, 10) ప్రజలు స్పందించకపోయినా, యెషయా ఓపికగా దాదాపు 46 సంవత్సరాలపాటు యెహోవా హెచ్చరికా సందేశాలను ప్రకటించాడు. అదేవిధంగా, చాలామంది స్పందించకపోయినప్పటికీ, మన సువార్త ప్రకటనా పనిలో సహనంతో కొనసాగేలా ఓర్పు మనకు సహాయం చేస్తుంది.
14 నిజమే, ప్రవక్తలు తమ పరిచర్యను కొనసాగిస్తుండగా వారు కేవలం స్పందన లేకపోవడాన్ని మాత్రమే ఎదుర్కోలేదు, హింసనూ అనుభవించారు. యిర్మీయా యిర్మీయా 20:2; 37:15; 38:6) ఆయన ఎవరికైతే సహాయం చేయాలనుకున్నాడో వారి చేతుల్లోనే ఆ హింసంతా అనుభవించాడు. అయినప్పటికీ, యిర్మీయా మనస్సులో కోపం పెట్టుకోలేదు లేదా పగతీర్చుకోలేదు. ఆయన దశాబ్దాలపాటు ఓపికగా సహించాడు.
బొండలో వేయబడ్డాడు, ‘బందీగృహములో’ నిర్బంధించబడ్డాడు, గోతిలోకి విసిరి వేయబడ్డాడు. (15 హింస, అపహాస్యం యిర్మీయాను కట్టడి చేయలేదు, నేడు మనల్నీ కట్టడి చేయలేవు. నిజమే మనం కొన్నిసార్లు నిరుత్సాహపడవచ్చు. యిర్మీయా కూడా నిరుత్సాహానికి గురయ్యాడు. “దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను, అని నేననుకొంటిని” అని ఆయన వ్రాశాడు. కానీ ఏమి జరిగింది? యిర్మీయా ప్రకటించడం మానేశాడా? ఆయన ఇంకా ఇలా అన్నాడు: “[దేవుని వాక్యము] నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడి యున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు.” (యిర్మీయా 20:8, 9) ఆయన అపహాసకుల మాటలు పట్టించుకున్నప్పుడు, తన ఆనందాన్ని పోగొట్టుకున్నాడని గమనించండి. కానీ సందేశానికున్న మాధుర్యం మీదికి, ప్రాముఖ్యత మీదికి తన అవధానం మళ్లించినప్పుడు ఆయన ఆనందం తిరిగి జ్వలించింది. అంతేకాక, యెహోవా “పరాక్రమముగల శూరునివలె” యిర్మీయాకు తోడుగావుండి, దేవుని వాక్యాన్ని మరింత ఉత్సాహంగా, ధైర్యంగా ప్రకటించేలా ఆయనను బలపరిచాడు.—యిర్మీయా 20:11.
16 యిర్మీయా ప్రవక్త తన పనిలో ఆనందాన్ని కనుగొన్నాడా? కనుగొన్నాడు! ఆయన యెహోవాతో ఇలా అన్నాడు: “నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; . . . యెహోవా . . . నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి.” (యిర్మీయా 15:16) సత్యదేవునికి ప్రాతినిథ్యం వహిస్తూ, ఆయన వాక్యాన్ని ప్రకటించే తన ఆధిక్యతలో యిర్మీయా ఆనందించాడు. మనం కూడా ఆనందించవచ్చు. అంతకంటే ఎక్కువగా, ప్రపంచవ్యాప్తంగా రాజ్యసందేశాన్ని అనేకులు అంగీకరించి, పశ్చాత్తాపపడుతూ నిత్యజీవ మార్గంపైకి రావడం చూసి పరలోకంలోని దేవదూతలు ఆనందించినట్లే మనమూ ఆనందిస్తాం.—లూకా 15:10.
“యోబుయొక్క సహనము”
17 పూర్వకాల ప్రవక్తల గురించి వ్యాఖ్యానించిన తర్వాత, శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “మీరు యోబుయొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన [యెహోవా] ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు.” (యాకోబు 5:11) ఇక్కడ “సహనము” అని అనువదించబడిన గ్రీకు పదానికీ, యాకోబు అంతకుముందు వచనంలో “ఓపిక” అనే పదం కోసం ఉపయోగించిన పదానికీ అర్థంలో సారూప్యత ఉంది. ఈ రెండు పదాల మధ్యగల తారతమ్యాన్ని సూచిస్తూ ఒక విద్వాంసుడు ఇలా వ్రాశాడు: “మొదటిది వ్యక్తులు మనతో చెడ్డగా వ్యవహరించినప్పుడు చూపించే ఓపిక, తర్వాతది మనం కష్టాలు అనుభవించేటప్పుడు ప్రదర్శించే నిబ్బరమైన పట్టుదల.”
18 యోబు తీవ్రమైన కష్టాలు అనుభవించాడు. ఆయన ఆర్థిక వినాశనాన్ని అనుభవించాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, బాధాకరమైన వ్యాధికి గురయ్యాడు. యెహోవా ఆయనను శిక్షిస్తున్నాడనే అబద్ధ ఆరోపణలనూ ఆయన ఎదుర్కొన్నాడు. యోబు మౌనంగా ఆ బాధలు అనుభవించలేదు; యోబు 35:2) అయితే, ఆయన ఎన్నడూ తన విశ్వాసాన్ని కోల్పోలేదు, లేదా తన యథార్థతను విడిచిపెట్టలేదు. సాతాను ఆరోపించినట్లుగా ఆయన దేవుణ్ణి దూషించలేదు. (యోబు 1:11, 21) ఫలితం? యెహోవా, “యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను.” (యోబు 42:12) యెహోవా, యోబు ఆరోగ్యాన్ని పునరుద్ధరించి, ఆయన సంపదను రెట్టింపుచేసి, తన ప్రియమైనవారితో పరిపూర్ణమైన, సంతోషభరితమైన జీవితాన్ని అనుగ్రహించాడు. యోబు నమ్మకంగా సహించడం ఆయన యెహోవాను మరింత పూర్తిగా అర్థం చేసుకోవడానికి కూడా సహాయం చేసింది.
ఆయన తన పరిస్థితినిబట్టి విలపించడమే కాక, తాను దేవునికన్నా నీతిమంతుడనన్నట్లు మాట్లాడాడు. (19 యోబు సహనంతో చూపిన ఓర్పు నుండి మనమేమి నేర్చుకుంటాం? యోబులాగే మనమూ అనారోగ్యాన్ని, ఇతర కష్టాలను అనుభవించవచ్చు. ఫలాని పరీక్షను ఎదుర్కొనేందుకు యెహోవా మనల్ని ఎందుకు అనుమతిస్తున్నాడో మనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. అయినా మనమీ విషయంలో నిశ్చయతతో ఉండవచ్చు: మనం నమ్మకంగా ఉంటే ఆశీర్వదించబడతాం. తనను వెదికేవారికి యెహోవా తప్పక ప్రతిఫలమిస్తాడు. (హెబ్రీయులు 11:6) యేసు ఇలా అన్నాడు: “అంతమువరకును సహించిన వాడు రక్షింపబడును.”—మత్తయి 10:22; 24:13.
‘యెహోవా దినము వస్తుంది’
20 యెహోవా ఓర్పు వహిస్తున్నా, ఆయన న్యాయవంతుడు కూడా, ఆయన దుష్టత్వాన్ని నిరంతరం సహించడు. ఆయన ఓర్పుకు హద్దులున్నాయి. పేతురు ఇలా వ్రాశాడు: “[దేవుడు] పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్ట[లేదు].” నోవహు, ఆయన కుటుంబం సజీవంగా రక్షించబడగా, ఆ భక్తిహీన లోకం జలప్రళయంలో నాశనమైంది. యెహోవా సొదొమ గొమొఱ్ఱాలకూ తీర్పు విధించి వాటిని భస్మం చేశాడు. ఈ తీర్పులు ‘ముందుకు భక్తిహీనులగువారికి దృష్టాంతముగా’ ఉన్నాయి. కాబట్టి ‘యెహోవా దినము వచ్చును’ అని మనం నిశ్చయతతో ఉండవచ్చు.—2 పేతురు 2:5, 6; 3:10.
21 కాబట్టి, రక్షించబడేలా మారుమనస్సు పొందడానికి ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనం యెహోవా ఓర్పును అనుకరిద్దాం. మనం ఎవరికైతే ప్రకటిస్తున్నామో వారు స్పందించకపోయినా ఓర్పుతో సువార్త ప్రకటిస్తూ ప్రవక్తలను కూడా అనుకరిద్దాం. అంతేకాక, యోబులా మనం పరీక్షలను సహిస్తూ, మన యథార్థతను కాపాడుకుంటే యెహోవా మనల్ని మెండుగా ఆశీర్వదిస్తాడని మనం నిశ్చయతతో ఉండవచ్చు. భూవ్యాప్తంగా సువార్త ప్రకటించాలనే తన ప్రజల ప్రయత్నాలను యెహోవా ఎలా మెండుగా ఆశీర్వదించాడో గమనించినప్పుడు మన పరిచర్యలో ఆనందించేందుకు మనకు ప్రతీ కారణం ఉంటుంది. దీనిని మనం తర్వాతి ఆర్టికల్లో చూస్తాం.
మీకు జ్ఞాపకమున్నాయా?
• యెహోవా ఎందుకు ఓర్పు ప్రదర్శిస్తాడు?
• ప్రవక్తలు ప్రదర్శించిన ఓర్పు నుండి మనమేమి నేర్చుకుంటాం?
• యోబు ఎలా సహనం చూపించాడు, దాని ఫలితమేమిటి?
• యెహోవా ఓర్పుకు హద్దులున్నాయని మనకెలా తెలుసు?
[అధ్యయన ప్రశ్నలు]
1. మానవులకు యెహోవా ఎలాంటి సాటిలేని బహుమానాన్ని ఇచ్చాడు?
2. సాతాను విధానాన్ని యెహోవా ఇంకా ఎందుకు నిర్మూలించలేదు?
3. (ఎ) పరిశుద్ధ గ్రంథములో “ఓర్పు” అని అనువదించబడిన హీబ్రూ, గ్రీకు పదాల భావమేమిటి? (బి) ఇప్పుడు మనమే ప్రశ్నలు పరిశీలిస్తాం?
4. యెహోవా ఓర్పు గురించి అపొస్తలుడైన పేతురు ఏమని వ్రాశాడు?
5. కాలం విషయంలో యెహోవా దృక్కోణం ఆయన చర్యలను ఎలా ప్రభావితం చేస్తుంది?
6. దేవుని విషయంలో మనమే నిర్ధారణకు రాకూడదు, ఎందుకు?
7. ప్రజలు మారుమనస్సు పొందాలనే యెహోవా కోరికకు, ఆయన ఓర్పుకు ఎలాంటి సంబంధముంది?
8. ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు వ్యవహరించిన తీరులో ఆయన ఓర్పు ఎలా వ్యక్తమైంది?
9. యేసు చూపించిన ఓర్పు, ఆయన తండ్రి ఓర్పును ఎలా ప్రతిబింబించింది?
10. దేవుని ఓర్పు ఏ విధంగా మనకు ప్రయోజనం చేకూర్చింది?
11. యెహోవా ఓర్పును అర్థం చేసుకోవడం ఏమి చేయడానికి మనల్ని పురికొల్పుతుంది?
12, 13. యాకోబు 5:10కి అనుగుణంగా ప్రవక్తయైన యెషయా ఓర్పును ఎలా విజయవంతంగా ప్రదర్శించాడు?
14, 15. విపత్తులను, నిరుత్సాహాన్ని ఎదుర్కొనేందుకు యిర్మీయాకు ఏది సహాయం చేసింది?
16. మన సువార్త ప్రకటనా పనిలో ఆనందాన్ని మనమెలా కాపాడుకోవచ్చు?
17, 18. యోబు ఏ విధంగా సహించాడు, దాని ఫలితమేమిటి?
19. యోబు సహనంతో చూపిన ఓర్పు నుండి మనమేమి నేర్చుకుంటాం?
20. యెహోవా దినము వస్తుందని మనమెందుకు నిశ్చయతతో ఉండవచ్చు?
21. మన ఓర్పును, సహనాన్ని మనమెలా ప్రదర్శించవచ్చు, తర్వాతి ఆర్టికల్లో మనమే విషయం పరిశీలిస్తాం?
[18వ పేజీలోని చిత్రం]
యేసు చూపించిన ఓర్పు ఆయన తండ్రి ఓర్పును పరిపూర్ణంగా ప్రతిబింబించింది
[20వ పేజీలోని చిత్రాలు]
యిర్మీయా ప్రదర్శించిన ఓర్పుకు యెహోవా ఎలా ప్రతిఫలమిచ్చాడు?
[21వ పేజీలోని చిత్రాలు]
యోబు చూపించిన సహనానికి యెహోవా ఎలా ప్రతిఫలమిచ్చాడు?