‘మీరు వెళ్లి వారికి బాప్తిస్మమిస్తూ, శిష్యులనుగా చేయుడి’
‘మీరు వెళ్లి వారికి బాప్తిస్మమిస్తూ, శిష్యులనుగా చేయుడి’
“కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి . . . వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.”—మత్తయి 28:19, 20.
దాదాపు 3,500 సంవత్సరాల క్రితం, ఓ జనాంగమంతా కలిసి దేవునికి ఒక ప్రమాణం చేసింది. సీనాయి పర్వతం దగ్గర సమావేశమైన ఇశ్రాయేలీయులు బహిరంగంగా ఇలా ప్రకటించారు: “యెహోవా చెప్పినదంతయు చేసెదము.” అప్పటినుండి ఇశ్రాయేలు, దేవునికి సమర్పించుకున్న ప్రజగా, ఆయన ‘స్వకీయ సంపాద్యమైంది.’ (నిర్గమకాండము 19:5, 8; 24:3) ఆయనిచ్చే కాపుదలను పొందాలనీ, “పాలు తేనెలు ప్రవహించు” దేశములో తరతరాలు జీవించాలనీ వారు ఎదురుచూశారు.—లేవీయకాండము 20:24.
2 అయితే కీర్తనకర్తయైన ఆసాపు ఒప్పుకున్నట్లుగా, ఇశ్రాయేలీయులు “దేవుని నిబంధనను గైకొనకపోయిరి. ఆయన ధర్మశాస్త్రము ననుసరింపనొల్లకపోయిరి.” (కీర్తన 78:10) యెహోవాతో తమ పితరులు చేసిన ప్రమాణాన్ని వారు నిలబెట్టుకోలేదు. చివరకు ఆ జనాంగం దేవునితోవున్న ఆ గొప్ప సంబంధాన్ని కోల్పోయింది. (ప్రసంగి 5:4; మత్తయి 23:37, 38) కాబట్టి, “అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొ[న్నాడు].” (అపొస్తలుల కార్యములు 15:14) అలాగే ఆయన ఈ అంత్యదినాల్లో “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహమును” సమకూరుస్తున్నాడు. ఆ సమూహం, “సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని” ఆనందంగా ఒప్పుకుంటోంది.—ప్రకటన 7:9, 10.
3 దేవునితో అలాంటి ప్రశస్తమైన సంబంధాన్ని ఆనందించేవారిలో భాగంగా ఉండాలంటే ఒక వ్యక్తి యెహోవాకు సమర్పించుకొని, ఆ సమర్పణను నీటి మత్తయి 28:19, 20) ఇశ్రాయేలీయులు “నిబంధన గ్రంథము” చదవబడడం విన్నారు. (నిర్గమకాండము 24:3, 7, 8) ఆ విధంగా వారు యెహోవాపట్ల తమకున్న బాధ్యతను అర్థం చేసుకున్నారు. అదేవిధంగా నేడు, బాప్తిస్మం తీసుకునేముందు దేవుని వాక్యమైన బైబిల్లోవున్న ఆయన చిత్తానికి సంబంధించిన ప్రామాణిక జ్ఞానం పొందడం అత్యంత ప్రాముఖ్యం.
బాప్తిస్మం ద్వారా బహిరంగంగా సూచించాలి. ఇలా చేయడమంటే, యేసు తన శిష్యులకు నేరుగా ఇచ్చిన ఈ ఆజ్ఞకు విధేయులవడమే: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.” (4 తన శిష్యులు బాప్తిస్మం తీసుకోవడానికి ముందు వారికి బలమైన పునాది ఉండాలని యేసు ఉద్దేశించాడనేది స్పష్టం. ఆయన తన అనుచరులకు మీరు వెళ్లి, శిష్యులను చేయుడని ఆదేశించడమే కాక, ‘తాను ఏ యే సంగతులు ఆజ్ఞాపించాడో వాటినన్నిటిని గైకొనాలని’ వారికి బోధించాలని కూడా చెప్పాడు. (మత్తయి 7:24, 25; ఎఫెసీయులు 3:17-19) కాబట్టి, బాప్తిస్మానికి అర్హులయ్యేవారు సాధారణంగా కొన్ని నెలలుగా లేదా ఒకటి రెండు సంవత్సరాలుగా బైబిలు అధ్యయనంచేసి ఉంటారు కాబట్టి, వారి నిర్ణయం తొందరపడో లేక సరిగా తెలియకో తీసుకున్నది కాదు. బాప్తిస్మమప్పుడు కూడా, అభ్యర్థులు రెండు కీలక ప్రశ్నలకు అవును అని జవాబు చెప్పాల్సివుంటుంది. ‘మన అవును అవునుగా, మన కాదు కాదుగా’ ఉండాలని యేసు నొక్కిచెప్పాడు కాబట్టి, ఈ రెండు బాప్తిస్మపు ప్రశ్నల ప్రాముఖ్యతను జాగ్రత్తగా సమీక్షించడం మనందరికి సహాయకరంగా ఉంటుంది.—మత్తయి 5:37.
పశ్చాత్తాపం, సమర్పణ
5 బాప్తిస్మపు మొదటి ప్రశ్న, అభ్యర్థి తన గతజీవిత విధానం విషయంలో పశ్చాత్తాపపడి, యెహోవా చిత్తం చేయడానికి అతను తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడా అని ఆ వ్యక్తిని ప్రశ్నిస్తుంది. బాప్తిస్మానికి ముందు తీసుకోవలసిన రెండు ప్రాముఖ్యమైన చర్యలను అంటే పశ్చాత్తాపాన్ని, సమర్పణను ఈ ప్రశ్న నొక్కిచెబుతుంది.
6 ఒకవ్యక్తి బాప్తిస్మం తీసుకునేముందు ఎందుకు పశ్చాత్తాపపడాలి? అపొస్తలుడైన పౌలు ఇలా వివరిస్తున్నాడు: ‘మనమందరము మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించాము.’ (ఎఫెసీయులు 2:3) దేవుని చిత్తానికి సంబంధించిన ప్రామాణిక జ్ఞానాన్ని పొందడానికి ముందు, మనం లోకానుసారంగా దాని విలువలకు, ప్రమాణాలకు అనుగుణంగా జీవించాం. మన జీవన విధానం ఈ విధాన దేవతయైన సాతాను అధీనంలో ఉంది. (2 కొరింథీయులు 4:4) అయితే దేవుని చిత్తం తెలుసుకున్న తర్వాత, మనం “మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగా” జీవించడానికే తీర్మానించుకుంటాం.—1 పేతురు 4:2.
7 ఈ క్రొత్త జీవనశైలి అనేక ప్రయోజనాలను తీసుకొస్తుంది. అన్నింటికన్నా ప్రాముఖ్యంగా అది యెహోవాతో ప్రశస్తమైన సంబంధం కలిగివుండేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది. ఆ సంబంధాన్ని దావీదు దేవుని “గుడారము”లోకి, “పరిశుద్ధ పర్వతము” మీదికి ప్రవేశించడానికి కీర్తన 15:1) యెహోవా ఎవరినిబడితే వారిని కాదుగానీ, “యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకు” వారిని మాత్రమే ఆహ్వానిస్తాడని నమ్మడం సహేతుకం. (కీర్తన 15:2) ఆ ఆహ్వానాన్ని అందుకునేందుకు మనం, సత్యం నేర్చుకోవడానికి ముందు మన పరిస్థితులనుబట్టి మన ప్రవర్తనలో, మన వ్యక్తిత్వంలో వివిధ మార్పులు చేసుకోవలసి ఉండవచ్చు. (1 కొరింథీయులు 6:9-11; కొలొస్సయులు 3:5-10) అలాంటి మార్పులకు పశ్చాత్తాపమే అంటే మన గత జీవనశైలి విషయంలో తీవ్రమైన దుఃఖం, యెహోవాను సంతోషపెట్టాలనే బలమైన తీర్మానమే ప్రేరణనిస్తుంది. ఇది సంపూర్ణమైన మార్పుకు అంటే స్వార్థపూరితమైన, లోకసంబంధమైన జీవన విధానాన్ని విసర్జించి, దేవుణ్ణి సంతోషపెట్టే విధానాన్ని అనుసరించేందుకు దారితీస్తుంది.—అపొస్తలుల కార్యములు 3:19.
ఇవ్వబడే ఆహ్వానంతో పోల్చాడు, నిజంగానే అదెంతో గొప్ప ఆధిక్యత. (8 బాప్తిస్మం తీసుకునేవారిని అడిగే మొదటి ప్రశ్నలోని రెండవభాగం వారు యెహోవా చిత్తం చేసేందుకు తమనుతాము ఆయనకు సమర్పించుకున్నారా అనేది. సమర్పణ అనేది బాప్తిస్మానికి ముందు తీసుకోవలసిన ఓ ఆవశ్యకమైన చర్య. అది ప్రార్థన ద్వారా చేయబడుతుంది, ఆ ప్రార్థనలో మనం మన జీవితాన్ని క్రీస్తుద్వారా యెహోవాకు సమర్పించుకునేందుకు ఇష్టపడుతున్నామని చెబుతాం. (రోమీయులు 14:7, 8; 2 కొరింథీయులు 5:15) అప్పుడు యెహోవా మన అధిపతి, యజమాని అవుతాడు, మనం యేసులాగే దేవుని చిత్తం చేసేందుకు ఆనందిస్తాం. (కీర్తన 40:8; ఎఫెసీయులు 6:6) యెహోవాకు చేసే ఈ గంభీరమైన వాగ్దానం కేవలం ఒక్కసారి మాత్రమే చేయబడుతుంది. అయితే మనం ఏకాంతంలో ఈ సమర్పణ చేసుకుంటాం కాబట్టి, బాప్తిస్మం తీసుకునే రోజున బహిరంగంగా నోటితో ఒప్పుకోవడం మనం మన పరలోకపు తండ్రికి సమర్పించుకున్నామని ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేస్తుంది.—రోమీయులు 10:10.
9 దేవుని చిత్తం చేయడానికి యేసు మాదిరిని అనుసరించడంలో ఏమి ఇమిడివుంది? యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని [‘హింసాకొయ్యనెత్తుకొని,’ NW] నన్ను వెంబడింపవలెను.” (మత్తయి 16:24) ఆయనిక్కడ మనం తీసుకోవలసిన మూడు చర్యలను పేర్కొన్నాడు. మొదట, మనల్ని మనం ‘ఉపేక్షించుకోవాలి.’ మరోవిధంగా చెప్పాలంటే, మన స్వార్థపూరిత, అపరిపూర్ణ అభీష్టాలను త్యజించి, దేవుని ఉపదేశానికీ, నిర్దేశానికీ తలొగ్గాలి. రెండవది, మనం ‘హింసాకొయ్యనెత్తుకోవాలి.’ యేసు కాలంలో హింసాకొయ్య అవమానానికీ, బాధకూ చిహ్నంగా ఉండేది. క్రైస్తవులుగా మనం సువార్త నిమిత్తం కొన్నిసార్లు బాధననుభవించవలసి వస్తుందనే విషయాన్ని అంగీకరిస్తాం. (2 తిమోతి 1:8) లోకం మనల్ని అపహసించినా లేక అవమానించినా క్రీస్తులాగే మనం కూడా దేవుణ్ణి సంతోషపరుస్తున్నామనే ఆనందాన్నిబట్టి ‘అవమానమును నిర్లక్ష్యపెడతాం.’ (హెబ్రీయులు 12:1-2) చివరగా, మనం యేసును నిరంతరం “వెంబడిస్తాం.”—కీర్తన 73:26; 119:44; 145:2.
10 ఆసక్తికరమైన విషయమేమిటంటే, వ్యతిరేకుల్లో కొందరు సహితం, బేషరతుగా సేవ చేస్తామని యెహోవాసాక్షులు దేవునికి చేసుకున్న సమర్పణను గుర్తిస్తారు. ఉదాహరణకు, నాజీ జర్మనీలోని, బుచెన్వాల్డ్ నిర్బంధ శిబిరంలో తమ విశ్వాసాన్ని త్యజించని సాక్షులు ఈ విధమైన ముద్రిత ప్రకటనపై సంతకం చేయాలి: “నేనింకా అంకితభావంగల బైబిలు విద్యార్థిగానే ఉన్నాను, యెహోవాకు నేను చేసిన ప్రమాణాన్ని ఎన్నటికీ ఉల్లంఘించను.” నిశ్చయంగా ఇది దేవునికి సమర్పించుకున్న నమ్మకమైన సేవకుల అపొస్తలుల కార్యములు 5:32.
మనోవైఖరిని చక్కగా వ్యక్తపరుస్తుంది.—యెహోవాసాక్షుల్లో ఒకరిగా గుర్తించబడడం
11 మొదటిగా అభ్యర్థి, తన బాప్తిస్మం తనకు యెహోవాసాక్షుల్లో ఒకరిగా గుర్తింపునిస్తుందన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడా అని రెండవ ప్రశ్న అతణ్ణి అడుగుతుంది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ఆయన యెహోవా నామం ధరించిన నియమిత పరిచారకుడవుతాడు. ఇదొక గొప్ప ఆధిక్యతే కాక, గంభీరమైన బాధ్యత కూడా. అంతేకాక ఇది, బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి యెహోవాపట్ల నమ్మకంగా ఉన్నప్పుడు, అతనికి నిత్యరక్షణా ఉత్తరాపేక్షను కూడా ఇస్తుంది.—మత్తయి 24:13.
12 సర్వశక్తిగల యెహోవా దేవుని నామం ధరించడం నిశ్చయంగా ఒక అపూర్వమైన గౌరవం. ప్రవక్తయైన మీకా ఇలా అన్నాడు: “సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.” (మీకా 4:5) అయితే, ఈ గౌరవంతోపాటు ఓ బాధ్యత కూడా వస్తుంది. మనం ధరించిన నామానికి ఘనత లభించేలా జీవించడానికి మనం కృషిచేయాలి. రోమాలోని క్రైస్తవులకు పౌలు గుర్తుచేసినట్లుగా, ఒక వ్యక్తి తాను ప్రకటించే దాని ప్రకారం నడవకపోతే, దేవుని నామం ‘దూషించబడుతుంది’ లేదా అవమానపర్చబడుతుంది.—రోమీయులు 2:21-24.
13 ఒక వ్యక్తి యెహోవాసాక్షిగా మారినప్పుడు, ఆయన దేవుని గురించి మాట్లాడే బాధ్యతను కూడా అంగీకరిస్తున్నాడు. యెహోవా తన శాశ్వత దైవత్వం గురించి సాక్ష్యమిచ్చేందుకు తన సాక్షులుగా ఉండడానికి సమర్పిత ఇశ్రాయేలు జనాంగాన్ని ఆహ్వానించాడు. (యెషయా 43:10-12, 21) అయితే ఆ జనాంగం ఈ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమై చివరకు యెహోవా అనుగ్రహాన్ని పూర్తిగా కోల్పోయింది. నేడు యెహోవాకు సాక్ష్యమిచ్చే ఆధిక్యత తమకు ఉన్నందుకు నిజ క్రైస్తవులు అతిశయిస్తున్నారు. ఆయనను ప్రేమిస్తూ, ఆయన నామం పరిశుద్ధపర్చబడాలని కోరుకుంటున్నాం కాబట్టే మనమలా అతిశయిస్తున్నాం. మన పరలోకపు తండ్రి గురించి, ఆయన సంకల్పాల గురించి తెలిసిన మనం మౌనంగా ఎలా ఉండగలం? అపొస్తలుడైన పౌలు భావించినట్లే మనమూ భావిస్తాం. ఆయనిలా అన్నాడు: “సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.”—1 కొరింథీయులు 9:16.
14 యెహోవా ఆత్మ నిర్దేశిత సంస్థతోపాటు కలిసి పనిచేయవలసిన తన బాధ్యతను కూడా రెండవ ప్రశ్న అభ్యర్థికి గుర్తుచేస్తుంది. దేవుని సేవలో మనం ఒంటరిగా కొనసాగలేం, మనకు “సహోదరుల” సహాయం, మద్దతు, ప్రోత్సాహం అవసరం. (1 పేతురు 2:17; 1 కొరింథీయులు 12:12, 13) మన ఆధ్యాత్మిక ప్రగతిలో దేవుని సంస్థ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ప్రామాణిక జ్ఞానంలో ఎదిగేలా, సమస్యలు ఎదురైనప్పుడు జ్ఞానయుక్తంగా ప్రవర్తించేలా, దేవునితో సన్నిహిత సంబంధం పెంపొందించుకునేలా మనకు సహాయపడే బైబిలు సాహిత్యాలను అది సమృద్ధిగా అందజేస్తుంది. తన బిడ్డను చక్కగా పోషిస్తూ, శ్రద్ధగా చూసుకునే తల్లిలాగే, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” మన ఆధ్యాత్మిక పురోగతికి అవసరమైన సమయానుకూల ఆధ్యాత్మిక ఆహారాన్ని సమృద్ధిగా అందజేస్తున్నాడు.—మత్తయి 24:45-47; 1 థెస్సలొనీకయులు 2:7, 8.
15 వారంలో జరిగే కూటాల్లో, యెహోవా ప్రజలు యెహోవాకు నమ్మకమైన సాక్షులుగా ఉండేందుకు అవసరమైన శిక్షణను, ప్రోత్సాహాన్ని పొందుతారు. (హెబ్రీయులు 10:24, 25) దైవపరిపాలనా పరిచర్య పాఠశాల బహిరంగంగా మాట్లాడడమెలాగో నేర్పిస్తే, సేవా కూటం మన సందేశాన్ని సమర్థంగా అందించేందుకు మనకు శిక్షణనిస్తుంది. మన కూటాల్లో, బైబిలు సాహిత్యాల వ్యక్తిగత పఠనం ద్వారా మనం యెహోవా ఆత్మ పనిచేసే విధానాన్ని, ఆయన సంస్థ ఇచ్చే నిర్దేశాన్ని చూడవచ్చు. ఈ క్రమమైన ఏర్పాట్ల ద్వారా దేవుడు, ప్రమాదాల విషయంలో మనల్ని అప్రమత్తుల్ని చేస్తూ, సమర్థమైన ప్రచారకులుగా ఉండేందుకు మనకు శిక్షణనిస్తూ, ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండేందుకు మనకు సహాయం చేస్తున్నాడు.—కీర్తన 19:7, 8, 11; 1 థెస్సలొనీకయులు 5:6, 11; 1 తిమోతి 4:13.
నిర్ణయం వెనుకున్న ఉద్దేశం
16 ఆ విధంగా, బాప్తిస్మానికి సంబంధించిన రెండు ప్రశ్నలు అభ్యర్థులకు నీటి బాప్తిస్మపు ప్రాముఖ్యతను, అది తీసుకొచ్చే బాధ్యతలను గుర్తుచేస్తాయి. అయితే బాప్తిస్మం తీసుకోవాలనే వారి నిర్ణయాన్ని ఏది ప్రేరేపించాలి? ఎవరో మనల్ని బలవంతం చేస్తే కాదుగానీ యెహోవా మనల్ని ‘ఆకర్షిస్తేనే’ మనం బాప్తిస్మం తీసుకున్న శిష్యులమవుతాం. (యోహాను 6:44) “దేవుడు ప్రేమాస్వరూపి” కాబట్టి ఆయన బలప్రయోగంతో కాక, ప్రేమతోనే విశ్వాన్ని పరిపాలిస్తున్నాడు. (1 యోహాను 4:8) యెహోవా దయగల లక్షణాలనుబట్టి, ఆయన మనతో వ్యవహరించిన విధానాన్నిబట్టి మనమాయనవైపు ఆకర్షించబడతాం. యెహోవా మనకోసం తన అద్వితీయ కుమారుణ్ణిచ్చి, మనకు శ్రేష్ఠమైన భవిష్యత్తును అందిస్తున్నాడు. (యోహాను 3:16) అందుకు బదులుగా ఆయనకు మన జీవితాన్నే ఇచ్చేందుకు, అంటే సమర్పించుకునేందుకు పురికొల్పబడతాం.—సామెతలు 3:9; 2 కొరింథీయులు 5:14, 15.
17 మనల్నిమనం ఏదోక తలంపుకో లేక పనికో కాదుగానీ యెహోవాకే సమర్పించుకుంటాం. దేవుడు తన ప్రజలకు అప్పగించే పని మారవచ్చు గానీ, ఆయనకు వారుచేసుకున్న సమర్పణ మారదు. ఉదాహరణకు, ఆయన అబ్రాహాముకు అప్పగించిన పనికీ, యిర్మీయాకు అప్పగించిన పనికీ చాలా తేడావుంది. (ఆదికాండము 13:17, 18; యిర్మీయా 1:6, 7) అయినప్పటికీ, వారిద్దరూ దేవుడు తమకప్పగించిన ఆ ప్రత్యేక పనిని నెరవేర్చారు, ఎందుకంటే వారు యెహోవాను ప్రేమించి, నమ్మకంగా ఆయన చిత్తాన్ని చేసేందుకు ఇష్టపడ్డారు. ఈ యుగాంతంలో బాప్తిస్మం తీసుకున్న క్రీస్తు అనుచరులందరూ రాజ్యసువార్త ప్రకటిస్తూ, శిష్యులను చేయమని క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చేందుకు కృషిచేస్తారు. (మత్తయి 24:14; 28:19, 20) ఆ పనిని పూర్ణహృదయంతో చేయడం, మనం మన పరలోకపు తండ్రిని ప్రేమిస్తున్నామనీ, ఆయనకు నిజంగా సమర్పించుకున్నామనీ చూపించేందుకు ఓ చక్కని మార్గమైయుంది.—1 యోహాను 5:3.
18 నిస్సందేహంగా బాప్తిస్మం అనేక ఆశీర్వాదాలకు మార్గం తెరుస్తుంది, అయితే ఇది తేలికగా పరిగణించవలసిన చర్య కాదు. (లూకా 14:26-33) ఇంతకుమించిన ప్రధాన బాధ్యత మరొకటి లేదనే తీర్మానాన్ని అది వ్యక్తపరుస్తుంది. (లూకా 9:62) మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు, మనం వాస్తవానికి ఈ బహిరంగ ప్రకటన చేస్తున్నాం: “ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును.”—కీర్తన 48:14.
19 తర్వాతి ఆర్టికల్, నీటి బాప్తిస్మం సంబంధంగా తలెత్తగల మరికొన్ని ప్రశ్నల్ని చర్చిస్తుంది. ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకోకుండా ఉండేందుకు కారణాలు ఉండవచ్చా? వయసు ప్రాముఖ్యమా? బాప్తిస్మపు సందర్భాన్ని గౌరవప్రదంగా ఉంచేందుకు అందరూ ఎలా దోహదపడవచ్చు?
మీరు వివరించగలరా?
• ప్రతీ క్రైస్తవుడు బాప్తిస్మానికి ముందు ఎందుకు పశ్చాత్తాపపడాలి?
• దేవునికి చేసుకునే సమర్పణలో ఏమి ఇమిడివుంది?
• యెహోవా నామం ధరించే గౌరవంతోపాటు ఏ బాధ్యతలు కూడా వస్తాయి?
• బాప్తిస్మం తీసుకోవాలని నిర్ణయించుకునేందుకు ఏది మనల్ని ప్రేరేపించాలి?
[అధ్యయన ప్రశ్నలు]
1. సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలు జనాంగం ఏ నిర్ణయం తీసుకుంది?
2. ప్రజలు నేడు దేవునితో ఎలాంటి సంబంధాన్ని కలిగివుండవచ్చు?
3. దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగివుండేందుకు ఒక వ్యక్తి ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
4. బాప్తిస్మానికి అర్హుడయ్యేందుకు ఒక వ్యక్తి ఏమిచేయాలి? (పైనున్న బాక్సును చేర్చండి.)
5. బాప్తిస్మపు మొదటి ప్రశ్న ఏ రెండు ప్రాథమిక చర్యలను నొక్కిచెబుతుంది?
6, 7. (ఎ) బాప్తిస్మం తీసుకోబోయే సభ్యులందరూ పశ్చాత్తాపపడడం ఎందుకు అవసరం? (బి) పశ్చాత్తాపపడిన తర్వాత ఒక వ్యక్తి ఎలాంటి మార్పులు చేసుకోవాలి?
8. మనమెలా సమర్పించుకుంటాం, దీనికీ బాప్తిస్మానికీ ఎలాంటి సంబంధముంది?
9, 10. (ఎ) దేవుని చిత్తం చేయడంలో ఏమి ఇమిడివుంది? (బి) నాజీ అధికారులు సహితం మన సమర్పణను ఎలా గుర్తించారు?
11. బాప్తిస్మం తీసుకున్న వ్యక్తికి ఎలాంటి ఆధిక్యత లభిస్తుంది?
12. యెహోవా నామం ధరించే గౌరవంతోపాటు ఏ బాధ్యతకూడా వస్తుంది?
13. యెహోవా సమర్పిత సేవకులకు దేవుని గురించి సాక్ష్యమిచ్చే బాధ్యత ఎందుకుంది?
14, 15. (ఎ) మన ఆధ్యాత్మిక పురోగతిలో యెహోవా సంస్థ ఏ పాత్ర పోషిస్తోంది? (బి) ఆధ్యాత్మికంగా మనకు సహాయం చేసేందుకు ఎలాంటి ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి?
16. యెహోవాకు సమర్పించుకునేందుకు మనల్ని ఏది పురికొల్పుతుంది?
17. మనం దేనికి మనల్నిమనం సమర్పించుకోలేదు?
18, 19. (ఎ) మన బాప్తిస్మం మూలంగా మనమెలాంటి బహిరంగ ప్రకటన చేస్తాం? (బి) తర్వాతి ఆర్టికల్లో ఏమి పరిశీలించబడుతుంది?
[22వ పేజీలోని బాక్సు/చిత్రం]
బాప్తిస్మానికి సంబంధించిన రెండు ప్రశ్నలు
యేసుక్రీస్తు బలి ఆధారంగా మీరు మీ పాపముల విషయంలో పశ్చాత్తాపపడి, యెహోవా చిత్తం చేయడానికి మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకున్నారా?
మీ సమర్పణ, బాప్తిస్మం దేవుని ఆత్మచేత నిర్దేశించబడుతున్న సంస్థతో సహవసించే యెహోవాసాక్షుల్లో ఒకరిగా మీకు గుర్తింపునిస్తాయని మీరు అర్థం చేసుకున్నారా?
[23వ పేజీలోని చిత్రం]
సమర్పణ అనేది ప్రార్థనలో యెహోవాకు చేసే పవిత్రమైన ఒక వాగ్దానం
[25వ పేజీలోని చిత్రం]
మన ప్రకటనా పని దేవునికి మనం చేసుకున్న సమర్పణను ప్రదర్శిస్తుంది