యెహోవా తన భక్తులను విడువడు
యెహోవా తన భక్తులను విడువడు
“ఆయన [యెహోవా] తన భక్తులను విడువడు వారెన్నటెన్నటికి కాపాడబడుదురు.”—కీర్త. 37:28.
అది సా.శ.పూ. పదవ శతాబ్దం. అప్పుడు ఇశ్రాయేలీయులు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికే కోపంతో ఉన్న ఇశ్రాయేలీయుల పది గోత్రాలవారికి ప్రత్యేక రాజ్యం స్థాపించుకునేందుకు యెహోవా కొంతమేరకు స్వేచ్ఛనివ్వడంతో అంతర్యుద్ధం ఆఖరినిమిషంలో ఆగిపోయింది. వారిపై క్రొత్తగా నియమితుడైన యరొబాము తన రాజ్యంలో ఒక క్రొత్త మతాన్ని స్థాపించడం ద్వారా తన అధికారాన్ని సుస్థిరపరచుకునేందుకు వెంటనే చర్యలు తీసుకున్నాడు. తన రాజ్యంలోని ప్రజలు పూర్తిగా తన చెప్పుచేతల్లో ఉండాలని ఆయన ఆజ్ఞాపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో యెహోవా నమ్మకమైన సేవకులు ఏమి చేశారు? వారు తాము ఆరాధించే దేవునికి యథార్థంగా ఉన్నారా? వేలాదిమంది ఉన్నారు, వారలా ఉన్నప్పుడు యెహోవా వారిని సంరక్షించాడు.—1 రాజు. 12:1-33; 2 దిన. 11:13, 14.
2 మన కాలంలోనూ దేవుని సేవకుల యథార్థత పరీక్షించబడుతోంది. “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు” అని బైబిలు హెచ్చరిస్తోంది. ‘విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించడంలో’ మనం విజయం సాధించగలమా? (1 పేతు. 5:8, 9) సా.శ.పూ. 997లో యరొబాము రాజుగా నియమించబడినప్పుడున్న పరిస్థితులను పరిశీలించి వాటి నుండి మనమేమి నేర్చుకోవచ్చో చూద్దాం. అపాయకరమైన ఆ కాలంలో, యెహోవా నమ్మకమైన సేవకులు అణచివేయబడ్డారు. వారు కష్టమైన నియామకాలను నిర్వర్తించాల్సివచ్చింది. వారలా నిర్వర్తిస్తుండగా మతభ్రష్టులు వారిని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారు. అలా జరిగిన ప్రతీసారి యెహోవా వారిని విడువలేదు, ఇప్పుడు కూడా ఆయన మనల్ని విడువడు.—కీర్త. 37:28.
అణచివేయబడినప్పుడు
3 మనం ముందుగా యరొబాము ఎలాంటి పరిస్థితుల్లో రాజయ్యాడో పరిశీలిద్దాం. “దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు” అని సామెతలు 29:2 చెబుతోంది. ప్రాచీన ఇశ్రాయేలులో దావీదు రాజు పరిపాలిస్తున్నప్పుడు ప్రజలు నిట్టూర్చలేదు. దావీదు పరిపూర్ణుడు కాకపోయినా దేవునిపట్ల యథార్థతను, నమ్మకాన్ని కనబరిచాడు. దావీదు పరిపాలనలో ప్రజలు అణచివేయబడలేదు. యెహోవా దావీదుతో “నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును” అని నిబంధన చేశాడు.—2 సమూ. 7:16.
4 దావీదు కుమారుడైన సొలొమోను పరిపాలన ప్రారంభంలో ప్రజలు ఎంతో శాంతిభద్రతలతో జీవించారు, సిరిసంపదలను అనుభవించారు. అందుకే అది భవిష్యత్తులో క్రీస్తుయేసు చేయబోయే వెయ్యేండ్ల పరిపాలనకు చక్కని నిదర్శనంగా ఉంది. (కీర్త. 72:1, 17) ఆ కాలంలో ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఏ ఒక్క గోత్రానికి కూడా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఏర్పడలేదు. అయితే, సొలొమోను, ఆయన ప్రజలు యెహోవా ఆశీర్వాదాలను అనుభవించాలంటే ఆయన చెప్పినట్లు నడుచుకోవాల్సివచ్చింది. యెహోవా సొలొమోనుకు ఇలా ఆజ్ఞాపించాడు: “నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు, నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనిన యెడల నీ తండ్రియైన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను; నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారిమధ్య నివాసము చేసెదను.”—1 రాజు. 6:11-13.
1 రాజు. 11:4-6) సొలొమోను క్రమేణా యెహోవా నియమాలను పాటించడం మానేసి తన ప్రజలను అంతకంతకూ అణచివేయడం మొదలుపెట్టాడు. ఆయన వారిని ఎంతగా అణచివేశాడంటే ఆయన మరణానంతరం ప్రజలు ఆయన వారసుడైన రెహబాముకు ఆయన గురించి ఫిర్యాదు చేస్తూ తమ భారం తగ్గించమని అభ్యర్థించారు. (1 రాజు. 12:4) సొలొమోను విశ్వాసఘాతకుడైనప్పుడు యెహోవా ఏమి చేశాడు?
5 సొలొమోను ముసలితనంలో యెహోవాకు విశ్వాసఘాతకుడై అబద్ధారాధన చేయడం మొదలుపెట్టాడు. (6 బైబిలు ఇలా చెబుతోంది: ‘సొలొమోను హృదయము తనకు రెండు మారులు ప్రత్యక్షమైన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నుండి తొలగిపోయింది కాబట్టి యెహోవా అతనిమీద కోపగించుకున్నాడు.’ అప్పుడు యెహోవా సొలొమోనుతో ఇలా అన్నాడు: ‘నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరించలేదు కాబట్టి ఈ రాజ్యము నీకుండ కుండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను.’—1 రాజు. 11:9-11.
7 సొలొమోను అణచివేతనుండి ప్రజలను రక్షించేలా ఒక కొత్త రాజుని అభిషేకించడానికి యెహోవా అహీయా అనే ప్రవక్తను పంపించాడు. ఆ వ్యక్తి సొలొమోను క్రింద పనిచేసిన సమర్థుడైన యరొబామే. యెహోవా దావీదుతో తాను చేసిన రాజ్యనిబంధనకు కట్టుబడివున్నా, 12 గోత్రాలు రెండుగా విడిపోవడాన్ని ఆయన ఆమోదించాడు. పది గోత్రాలు యరొబాముకు ఇవ్వబడ్డాయి. రెండు గోత్రాలు దావీదు వంశ ప్రతినిధియైన రెహబాముతో ఉండిపోయాయి. (1 రాజు. 11:29-37; 12:16, 17, 21) యెహోవా యరొబాముతో ఇలా చెప్పాడు: “నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని, నా మార్గములననుసరించి నడచుచు, నా దృష్టికి అనుకూలమైనదానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనినయెడల, నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచినట్లు నిన్నును స్థిరపరచి ఇశ్రాయేలువారిని నీకు అప్పగించెదను.” (1 రాజు. 11:38) యెహోవా తన ప్రజల కోసం చర్య తీసుకొని వారిని అణచివేత నుండి రక్షించే ఏర్పాటు చేశాడు.
8 నేడు అణచివేత, అన్యాయం ఎంతగానో పెరిగిపోయాయి. ‘ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకుంటున్నాడు’ అని ప్రసంగి 8:9 చెబుతోంది. స్వార్థపూరిత వ్యాపారులు, అవినీతిపరులైన పరిపాలకులవల్ల ఆర్థిక పరిస్థితులు దిగజారిపోవచ్చు. నైతిక విషయాల్లో కూడా ప్రభుత్వ నేతలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, మత నాయకులు తరచూ చెడ్డ మాదిరినుంచారు. అందుకే, నీతిమంతుడైన లోతులాగే నేడు దేవుని సేవకులు ‘దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహుగా బాధపడుతున్నారు.’ (2 పేతు. 2:7) అంతేకాక, మనం ఇతరులకు హాని తలపెట్టకుండా ప్రశాంతంగా దేవుని ప్రమాణాలకు అనుగుణంగా జీవిస్తున్నా గర్విష్ఠులైన పరిపాలకుల దౌర్జన్యానికి గురవుతున్నాం.—2 తిమో. 3:1-5, 12.
9 అయితే, యెహోవా తన భక్తులను విడువడన్న అతి ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం నమ్మవచ్చు! లోకంలోని అవినీతిపరులైన పరిపాలకులను తీసివేయడానికి ఆయన ఇప్పటికే తీసుకున్న చర్యల గురించి ఆలోచించండి. క్రీస్తుయేసు నాయకత్వంలో దేవుని మెస్సీయ రాజ్యం ఇప్పటికే స్థాపించబడింది. సుమారు వంద సంవత్సరాలుగా యేసుక్రీస్తు పరలోకంలో రాజుగా పరిపాలిస్తున్నాడు. దేవుని నామానికి భయపడేవారికి ఆయన త్వరలోనే పూర్తి ఉపశమనాన్ని తీసుకొస్తాడు. (ప్రకటన 11:15-18 చదవండి.) యేసు మరణంవరకు దేవునికి నమ్మకంగా ఉండి తన యథార్థతను ఇప్పటికే నిరూపించుకున్నాడు. సొలొమోనులా ఆయన తన ప్రజలను ఎప్పుడూ నిరాశపరచడు.—హెబ్రీ. 7:26; 1 పేతు. 2:6.
10 దేవుని రాజ్యం నిజమైనది, అది అన్నిరకాల అణచివేతలను రూపుమాపుతుంది. మనం యెహోవా దేవునికి, ఆయన రాజ్యానికే లోబడతాం. రాజ్యంపట్ల పూర్తి నమ్మకంతో మనం లోక భక్తిహీనతను విడిచిపెట్టి ఉత్సాహంగా సత్క్రియలను చేస్తాం. (తీతు 2:12-14) ఈ లోకమాలిన్యం మనకంటకుండా ఉండేందుకు కృషిచేస్తాం. (2 పేతు. 3:14) మనం ప్రస్తుతం ఎలాంటి శ్రమలను ఎదుర్కొంటున్నా యెహోవా మనకు ఆధ్యాత్మిక హాని జరగకుండా చూస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. (కీర్తనలు 97:10 చదవండి.) అంతేకాక, ‘తన భక్తుల మరణము యెహోవా దృష్టికి విలువగలది’ అనే హామీని కీర్తనలు 116:15 మనకు ఇస్తోంది. యెహోవా తన సేవకులను ఎంత అమూల్యమైనవారిగా పరిగణిస్తాడంటే, వారిని ఒక గుంపుగా నాశనం కానివ్వడు.
మతభ్రష్టులు తప్పుదారిపట్టించడానికి ప్రయత్నించినప్పుడు
11 యరొబాము రాజు తన పరిపాలనలో దేవుని ప్రజలకు కొంత ఉపశమనం తీసుకొచ్చి ఉండాల్సింది. బదులుగా ఆయన చేసిన పనులు దేవునిపట్ల వారికున్న యథార్థతను మరింత పరీక్షించాయి. రాజుగా పరిపాలించేందుకు తనకివ్వబడిన అవకాశంతో సంతృప్తి చెందని యరొబాము తన స్థానాన్ని సుస్థిరపరచుకునే మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టాడు. “ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కి పోవుచుండినయెడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానునితట్టు తిరుగును; అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామునొద్ద మరల చేరుదురు” అని ఆయన అనుకున్నాడు. కాబట్టి యరొబాము రెండు బంగారపు దూడలు చేయించి ఒక కొత్త మతాన్ని స్థాపించాడు. ఆ తర్వాత ఆయన ఆ బంగారు దూడల్లో “ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను. దానువరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి, లేవీయులు కాని సాధారణమైనవారిలో కొందరిని యాజకులుగా నియమించెను.” యరొబాము తనకు తోచినట్లు “ఇశ్రాయేలువారికి ఒక ఉత్సవమును” నిర్ణయించి “ధూపము వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను.”—1 రాజు. 12:26-33.
12 ఉత్తర రాజ్యంలోని దేవుని సేవకులు అప్పుడు ఏమి చేశారు? ఉత్తర రాజ్యంలో తమకివ్వబడిన పురాల్లో జీవిస్తున్న లేవీయులు, నమ్మకమైన తమ పూర్వీకుల్లాగే వెంటనే చర్య తీసుకున్నారు. (నిర్గ. 32:26-28; సంఖ్యా. 35:6-8; ద్వితీ. 33:8, 9) వారు స్వేచ్ఛగా యెహోవాను ఆరాధించగలిగేలా తమ స్వాస్థ్యాలను విడిచి తమ కుటుంబాలతోపాటు దక్షిణానవున్న యూదా రాజ్యానికి తరలివెళ్లారు. (2 దిన. 11:13, 14) యూదాలో తాత్కాలికంగా నివసిస్తున్న ఇశ్రాయేలీయుల్లో మరికొందరు తమ స్వస్థలానికి తిరిగివచ్చే బదులు అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. (2 దిన. 10:17) తర్వాతి తరాల్లో ఉత్తర రాజ్యంలోని మరికొందరు దూడ ఆరాధనను విడిచి సత్యారాధనను చేపట్టేలా యూదాకు వచ్చేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉండేలా యెహోవా చూశాడు.—2 దిన. 15:9-15.
13 నేడు కూడ తప్పుదారి పట్టించేందుకు మతభ్రష్టులు చేస్తున్న ప్రయత్నాలకు దేవుని ప్రజలు లొంగిపోయే ప్రమాదముంది. కొంతమంది పరిపాలకులు తమకు తోచినట్లు రాష్ట్రమతాలను స్థాపించి ప్రజలు దాన్ని 1 పేతు. 2:9; ప్రక. 14:1-5.
అంగీకరించేలా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించారు. క్రైస్తవ మత పాదిరీలతోపాటు గర్విష్ఠులైన మరికొందరు ఆధ్యాత్మిక ఆలయంలో తామే యాజకులమని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. అయితే, నిజక్రైస్తవుల్లోనే ‘రాజులైన యాజకసమూహంగా’ ఏర్పడే నిజమైన అభిషిక్తులు ఉంటారు.—14 సా.శ.పూ. పదవ శతాబ్దంలోని నమ్మకమైన లేవీయుల్లాగే నేడు దేవుని సేవకులు మతభ్రష్ట ఆలోచనలకు మోసపోరు. అభిషిక్తులు, వారి క్రైస్తవ సహవాసులు అలాంటి మతభ్రష్ట ఆలోచనలకు దూరంగా ఉంటూ వాటిని వెంటనే తిరస్కరిస్తారు. (రోమీయులు 16:17 చదవండి.) మనం లౌకిక విషయాల్లో ప్రభుత్వ అధికారులకు ఇష్టపూర్వకంగా విధేయులుగా ఉంటూ లోకసంబంధ పోరాటాల్లో తటస్థంగా ఉన్నా మనం దేవుని రాజ్యానికి మాత్రమే యథార్థంగా ఉంటాం. (యోహా. 18:36; రోమా. 13:1-8) తాము దేవుణ్ణి సేవిస్తున్నామని చెప్పుకుంటూనే తమ ప్రవర్తన ద్వారా ఆయనను అవమానించేవారి అబద్ధ వాదనలను మనం తిరస్కరిస్తాం.—తీతు 1:16.
15 యథార్థహృదయులు ఈ దుష్టలోకం నుండి అలంకారార్థంగా బయటికి వచ్చి తాను సృష్టించిన ఆధ్యాత్మిక పరదైసులోకి ప్రవేశించే ఏర్పాటు యెహోవా చేశాడనే విషయం గురించి కూడా ఆలోచించండి. (2 కొరిం. 12:1-4) మనం కృతజ్ఞతతో నిండిన హృదయంతో ‘యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు మనపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ తరగతికి సన్నిహితంగా ఉంటాం. క్రీస్తు ఈ దాసుణ్ణి “తన యావదాస్తిమీద” నియమించాడు. (మత్త. 24:45-47) కాబట్టి, దాసుని తరగతి తెలియజేసే విషయాలు మనకు పూర్తిగా అర్థంకాకపోయినా, మనం వాటిని తిరస్కరించాల్సిన లేదా సాతాను లోకానికి తిరిగిపోవాల్సిన అవనసరంలేదు. మనం యథార్థవంతులమైతే, వినయంతో మనకు అర్థంకాని విషయాన్ని యెహోవా స్పష్టపరిచేదాక వేచివుంటాం.
దేవుడిచ్చిన నియామకాలను నిర్వర్తిస్తున్నప్పుడు
16 యరొబాము మతభ్రష్టుడైనందుకు యెహోవా ఆయనను తీర్పుతీర్చాడు. బేతేలుకు ఉత్తర దిశగా వెళ్లి బలపీఠం దగ్గర ఉన్న యరొబామును కలుసుకోమని యెహోవా యూదాదేశపు ప్రవక్తకు చెప్పాడు. ఆ ప్రవక్త యరొబాముకు ఒక కఠినమైన తీర్పుసందేశాన్ని చెప్పాల్సి వచ్చింది. నిస్సందేహంగా, అది కష్టమైన నియామకమే.—1 రాజు. 13:1-3.
17 యెహోవా తీర్పుసందేశాన్ని విన్నప్పుడు యరొబాముకు చాలా కోపం వచ్చింది. ఆయన దేవుని ప్రతినిధిని చూపిస్తూ దగ్గర్లోవున్నవారితో, “వానిని పట్టుకొనుము” అని బిగ్గరగా అరిచాడు. అయితే వారు ఏమీ చేయకముందే “అతడు చాపిన చెయ్యి యెండి పోయెను; దానిని వెనుకకు తీసికొనుటకు అతనికి శక్తిలేక పోయెను . . . బలిపీఠము బద్దలుకాగా బుగ్గి దానిమీదనుండి ఒలికిపోయెను.” ఎండిపోయిన తన చెయ్యి బాగయ్యేలా యెహోవాను వేడుకోమని ఆ ప్రవక్తను బతిమాలక తప్పలేదు. ఆ ప్రవక్త యెహోవాకు ప్రార్థించినప్పుడు రాజు చెయ్యి బాగైంది. అలా యెహోవా తన సందేశకునికి ఏ హాని జరగకుండా కాపాడాడు.—1 రాజు. 13:4-6.
18 మనం రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో నమ్మకంగా కొనసాగుతుండగా కొన్నిసార్లు ప్రజలు కటువుగా, శత్రువుల్లా ప్రవర్తిస్తారు. (మత్త. 24:14; 28:19, 20) ప్రజలు తిరస్కరిస్తారనే భయంతో పరిచర్యలో మన ఉత్సాహం ఎన్నటికీ తగ్గకుండా చూసుకోవాలి. యరొబాము కాలంలోని ప్రవక్తలాగే నమ్మకంగా ‘నిర్భయంగా, యెహోవాను పరిశుద్ధముగా సేవించే’ అవకాశం మనకుంది. * (లూకా 1:74, 75) శ్రమలు ఎదురైనప్పుడు యెహోవా అద్భుతరీతిలో జోక్యం చేసుకుంటాడని మనం ఆశించం. అయినా మనం ఆయన సాక్షులం కాబట్టి నేడు కూడా ఆయన మనల్ని తన పరిశుద్ధాత్మ ద్వారా, దేవదూతల ద్వారా సంరక్షిస్తున్నాడు. (యోహాను 14:15-17; ప్రకటన 14:6 చదవండి.) తన వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించేవారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు.—ఫిలి. 1:14, 28.
యెహోవా తన భక్తులను సంరక్షిస్తాడు
19 యెహోవా నమ్మదగినవాడు. (1 కొరిం. 10:13) ఆయన ‘తన క్రియలన్నిటిలో నమ్మదగినవాడు.’ (కీర్త. 145:17, NW) అంతేకాక, బైబిలు మనకు ఈ హామీనిస్తోంది: “తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును.” (సామె. 2:8) శ్రమలు ఎదురైనప్పుడు, మతభ్రష్టులు తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించినప్పుడు, కష్టమైన నియామకాల్ని నిర్వర్తిస్తున్నప్పుడు యెహోవా నిర్దేశాన్ని, మద్దతునిస్తాడని దేవుని యథార్థ సేవకులు నమ్మవచ్చు.
20 అయితే, మనం వ్యక్తిగతంగా ఈ విషయాల గురించి ఆలోచించాలి: శ్రమలు, శోధనలు ఎదురైనా యెహోవాకు ఎల్లప్పుడూ యథార్థంగా ఉండేందుకు నాకు ఏది సహాయం చేస్తుంది? మరో మాటలో చెప్పాలంటే, దేవునిపట్ల నాకున్న యథార్థతను నేనెలా బలపర్చుకోగలను?
[అధస్సూచి]
^ పేరా 23 ప్రవక్త ఆ తర్వాత కూడా యెహోవాకు విధేయునిగా ఉన్నాడో లేదో, ఆయనకు ఏమైందో తర్వాతి ఆర్టికల్‌లో చర్చించబడుతుంది.
మీరెలా జవాబిస్తారు?
• తన భక్తులు అణచివేయబడినప్పుడు తాను వారిని విడిచిపెట్టనని యెహోవా ఎలా చూపించాడు?
• మతభ్రష్టులూ వారి ఆలోచనలూ మనల్ని తప్పుదారిపట్టించడానికి ప్రయత్నించినప్పుడు మనం ఏమి చేయాలి?
• యథార్థవంతులైన తన సేవకులు క్రైస్తవ పరిచర్యలో పాల్గొంటుండగా యెహోవా వారిని ఎలా సంరక్షిస్తాడు?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. (ఎ) సా.శ.పూ. పదవ శతాబ్దంలో ఎలాంటి పరిస్థితులు దేవుని సేవకుల యథార్థతను పరీక్షించాయి? (బి) ఏ మూడు పరిస్థితుల్లో యెహోవా తన సేవకులను సంరక్షించాడు?
3. దావీదు పరిపాలనలో ప్రజలు అణచివేయబడలేదని ఎలా చెప్పవచ్చు?
4. సొలొమోను పరిపాలనలో ఆశీర్వాదాలు అనుభవించాలంటే ఆయనా, ఆయన ప్రజలు ఏమి చేయాల్సివచ్చింది?
5, 6. సొలొమోను దేవునికి విశ్వాసఘాతకుడైనప్పుడు ఏమి జరిగింది?
7. యెహోవా సొలొమోనును తిరస్కరించినా తన భక్తులను ఎలా రక్షించాడు?
8. నేడు ఎలాంటి శ్రమలు దేవుని ప్రజలను అణచివేస్తున్నాయి?
9. (ఎ) యెహోవా తన ప్రజలను రక్షించడానికి ఇప్పటికే ఏమి చేశాడు? (బి) యేసు దేవునికి ఎల్లప్పుడూ యథార్థంగా ఉంటాడని మనమెందుకు నమ్మవచ్చు?
10. (ఎ) మనం దేవుని రాజ్యాన్ని విలువైనదిగా ఎంచుతున్నామని ఎలా చూపించవచ్చు? (బి) శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?
11. యరొబాము ఏమి చేసి విశ్వాసఘాతకుడయ్యాడు?
12. యరొబాము ఇశ్రాయేలులో దూడ ఆరాధన స్థాపించినప్పుడు ఉత్తర రాజ్యంలోని దేవుని సేవకులు ఏమి చేశారు?
13. నేడు మతభ్రష్టులు చేస్తున్న ప్రయత్నాలు దేవుని ప్రజలను ఎలా పరీక్షిస్తున్నాయి?
14. మతభ్రష్ట ఆలోచనల విషయంలో మనం ఏమి చేయాలి?
15. “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని”కి మనం ఎందుకు యథార్థంగా ఉండాలి?
16. యూదాదేశపు ప్రవక్తకు ఏ నియామకం ఇవ్వబడింది?
17. యెహోవా తన సందేశకుణ్ణి ఎలా కాపాడాడు?
18. మనం యెహోవాకు ధైర్యంగా పరిశుద్ధ సేవ చేస్తున్నప్పుడు ఆయన మనల్ని ఎలా సంరక్షిస్తాడు?
19, 20. (ఎ) యెహోవా మనల్ని ఎన్నడూ విడువడని మనం ఎందుకు నమ్మవచ్చు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నలను చర్చించబోతున్నాం?
[5వ పేజీలోని మ్యాపు/చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
ఉత్తర రాజ్యం (యరొబాము)
దాను
షెకెము
బేతేలు
దక్షిణ రాజ్యం (రెహబాము)
యెరూషలేము
[చిత్రం]
యరొబాము దూడ ఆరాధనను మొదలుపెట్టినప్పుడు యెహోవా యథార్థవంతులైన తన సేవకులను విడువలేదు
[3వ పేజీలోని చిత్రం]
సొలొమోను, ఆయన ప్రజలు యెహోవా చెప్పినట్లు నడుచుకుంటేనే ఆశీర్వాదాలను అనుభవిస్తారు