ఉదారంగా ‘ఇచ్చే’ చక్కని అవకాశాన్ని బట్టి సంతోషిస్తున్నారా?
ఉదారంగా ‘ఇచ్చే’ చక్కని అవకాశాన్ని బట్టి సంతోషిస్తున్నారా?
ఫిలిప్పీలోని తొలి క్రైస్తవులు సత్యారాధనకు ఉదారంగా మద్దతునిచ్చేవాళ్ళు. అపొస్తలుడైన పౌలు వాళ్ళకు రాసిన ప్రేరేపిత పత్రికలో ఇలా అన్నాడు, ‘మొదటి దినమునుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి, మీ అందరి నిమిత్తము నేను ఎల్లప్పుడు సంతోషముతో ప్రార్థనచేయుచు, నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్ల నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.’ (ఫిలి. 1:3-5) లూదియ, ఆమె ఇంటివాళ్ళు బాప్తిస్మం తీసుకున్న తర్వాత పౌలును ఆయనతోపాటు ఉన్న వాళ్ళను తన ఇంటిలో ఉండమని ఆమె వేడుకున్న విషయం కూడా పౌలుకు బాగా గుర్తుంది.—అపొ. 16:14, 15.
ఆ తర్వాత కొంతకాలానికే, ఫిలిప్పీలో కొత్తగా స్థాపించబడిన సంఘం, అక్కడికి దాదాపు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న థెస్సలొనీకలో పౌలు తన తోటి విశ్వాసులతో కలిసి కొన్ని వారాలపాటు ఉన్నప్పుడు ఆయనకు అవసరమైన వాటిని రెండుసార్లు పంపించింది. (ఫిలి. 4:15, 16) కొన్ని సంవత్సరాల తర్వాత ఫిలిప్పీలో, మాసిదోనియలో ఉన్న సహోదరులు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ‘నిరుపేదలుగా’ ఉన్నప్పటికీ యెరూషలేములో హింసలు అనుభవిస్తున్న క్రైస్తవుల అవసరం గురించి విన్నప్పుడు వాళ్ళకు సహాయం చేయాలనుకున్నారు. వాళ్ళు నిజంగా తమ “సామర్థ్యముకంటె ఎక్కువగా” ఇవ్వడమే కాక ఉదారంగా ‘ఇచ్చే’ చక్కని అవకాశం తమకు కావాలని ‘మనఃపూర్వకముగా వేడుకొన్నారు’ అని ఆయన రాశాడు.—2 కొరిం. 8:1-4; రోమా. 15:26.
ఫిలిప్పీయులు క్రైస్తవులుగా మారి దాదాపు 10 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా అలాంటి ఉదారతనే చూపిస్తూ వచ్చారు. పౌలు రోమాలో బంధీగా ఉన్నాడని విన్నప్పుడు వాళ్ళు ఆయనకు అవసరమైన వాటిని ఇచ్చి ఎపఫ్రొదితును ఆయన దగ్గరకు పంపించారు. ఎపఫ్రొదితు నేల మార్గాన, సముద్ర మార్గాన మొత్తం 1,287 కిలోమీటర్లు ప్రయాణించి ఆయన దగ్గరకు వెళ్ళాడు. పౌలు బంధీగా ఉన్న ఆ సమయంలో కూడా సహోదరులను బలపర్చడానికి, ప్రకటనాపని చేయడానికి వీలుగా ఆయనకు అవసరమైనవాటిని పంపించాలని ఫిలిప్పీయులు అనుకున్నట్లు స్పష్టమౌతోంది.—ఫిలి. 1:12-14; 2:25-30; 4:18.
నేడు నిజక్రైస్తవులు రాజ్య ప్రకటనాపనికి, శిష్యులను చేసే పనికి మద్దతు ఇవ్వడాన్ని చక్కని అవకాశంగా పరిగణిస్తారు. (మత్త. 28:19, 20) వాళ్ళు రాజ్య సంబంధమైన విషయాల కోసం తమ సమయాన్ని, శక్తిని, డబ్బును వెచ్చిస్తారు. దేవుడు ఇచ్చిన ఈ పనికి మీరు ఏయే విధాలుగా మద్దతు ఇవ్వవచ్చో 22-23 పేజీల్లోవున్న బాక్సులో ఉంది.
[22, 23 పేజీల్లోని బాక్సు]
కొందరు ఈ పద్ధతుల్లో విరాళాలిస్తారు . . .
ప్రపంచవ్యాప్త పని కోసం విరాళాలు
చాలామంది కొంత మొత్తాన్ని పక్కనపెట్టి, “ప్రపంచవ్యాప్త పని” అని రాసివున్న బాక్సుల్లో వేస్తారు.
ప్రతీనెల సంఘాలు ఆ విరాళాల్ని తమ దేశంలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి పంపిస్తాయి. డబ్బు రూపంలో పంపించే విరాళాలను నేరుగా మీ దేశంలోని బ్రాంచి కార్యాలయానికి పంపించవచ్చు. (క్రింద ప్రత్యేకంగా పేర్కొనబడిన వాటికి సంబంధించిన స్వచ్ఛంద విరాళాలను కూడా మీ దేశంలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి పంపించవచ్చు.) అలా పంపించే చెక్కులను “Watch Tower” a పేరున రాయాలి. ఆభరణాలను లేదా ఇతర విలువైన వస్తువులను కూడా విరాళంగా ఇవ్వవచ్చు. అలాంటి వస్తువులను పంపిస్తున్నప్పుడు మీరే వాటిని బేషరతుగా బహుమతి రూపంలో పంపిస్తున్నట్లు తెలిపే ఉత్తరాన్ని జతచేయాలి.
షరతుపై విరాళమిచ్చే ట్రస్టు ఏర్పాటు b
మీ విరాళాలను ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించడానికి వాచ్‌టవర్ ట్రస్టులో జమచేయవచ్చు. అయితే మీరు కావాలనుకున్నప్పుడు డబ్బు తిరిగి తీసుకోవచ్చు. మరింత సమాచారం కోసం, మీ దేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.
దానధర్మ ప్రణాళిక c
ప్రపంచవ్యాప్త రాజ్య సేవ కోసం డబ్బు రూపంలోనేకాక ఇతర పద్ధతుల్లో కూడా విరాళాలు ఇవ్వవచ్చు. ఆ పద్ధతులు ఏమిటంటే:
భీమా: జీవిత భీమా పాలసీకి లేదా రిటైర్‌మెంట్/పెన్షన్ పథకానికి లబ్ధిదారుగా Watch Tower పేరును సూచించవచ్చు.
బ్యాంకు ఖాతాలు: స్థానిక బ్యాంకు నియమాల ప్రకారం బ్యాంకు ఖాతాలకు, డిపాజిట్ సర్టిఫికెట్లకు లేదా వ్యక్తిగత రిటైర్‌మెంట్ ఖాతాలకు లబ్ధిదారుగా Watch Tower పేరును సూచించవచ్చు లేదా మరణం తర్వాత Watch Towerకు అందేలా ఏర్పాట్లు చేయవచ్చు.
షేర్లు, బాండ్లు: షేర్లను, బాండ్లను Watch Towerకు విరాళంగా ఇవ్వవచ్చు లేదా చట్టబద్ధంగా రాయబడిన వీలునామాలో లబ్ధిదారుగా Watch Tower పేరును సూచించవచ్చు.
స్థిరాస్తులు: అమ్మడానికి వీలయ్యే స్థిరాస్తులను విరాళంగా ఇవ్వవచ్చు. అవి నివాస స్థలాలైతే ఆయన/ఆమె జీవించినంత కాలం ఆ స్థలంలోనే నివసించి వారి తదనంతరం అవి విరాళంగా ఇవ్వబడే ఏర్పాటు చేయవచ్చు. ఇలాంటి వాటికి సంబంధించిన ఆధారపత్రాలు రాసేముందు మీ దేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.
వార్షికభత్య ఏర్పాటుతో విరాళం: వార్షికభత్య విరాళమనే ఏర్పాటు కింద ఒక వ్యక్తి డబ్బును లేదా సెక్యూరిటీలను యెహోవాసాక్షులు ఉపయోగిస్తున్న ఒక నిర్దిష్ట కార్పోరేషన్‌కు బదిలీ చేయవచ్చు. ఈ పద్ధతిలో ఆ దాత లేదా ఆ దాత నియమించిన వ్యక్తి జీవించి ఉన్నంత కాలం ప్రతీ సంవత్సరం నిర్దిష్టమైన వార్షికభత్యాన్ని పొందుతాడు. దాత వార్షికభత్య విరాళం ఏర్పాటు చేసిన సంవత్సరంలో ఆయనకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది.
వీలునామాలు, ట్రస్టులు: ఆస్తిని లేదా డబ్బును Watch Tower పేరున చట్టబద్ధంగా వీలునామా రాయవచ్చు, లేదా ఒక ట్రస్టు అగ్రిమెంటులో Watch Towerను d లబ్ధిదారుగా సూచించవచ్చు. మతపరమైన సంస్థకు ప్రయోజనం చేకూర్చే ట్రస్ట్‌వల్ల పన్ను చెల్లింపులో కొన్ని రాయితీలు పొందవచ్చు.
“దానధర్మ ప్రణాళిక” అనే పదబంధం సూచిస్తున్నట్లుగా, ఇలా విరాళాలు ఇవ్వాలంటే దాత ముందుగా ప్రణాళిక వేసుకోవాలి. దానధర్మ ప్రణాళిక ఏర్పాటు ద్వారా యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పనికి మద్దతునివ్వాలని కోరుకునేవాళ్ళ సహాయం కోసం ప్రపంచవ్యాప్త రాజ్య సేవ ప్రయోజనార్థం దానధర్మ ప్రణాళిక e అనే బ్రోషురు ఆంగ్లంలోను, స్పానిష్‌లోను రూపొందించబడింది. బ్రతికుండగా లేదా మరణం తర్వాత వీలునామా ద్వారా విరాళాలు ఇవ్వగల అనేక పద్ధతుల గురించి ఆ బ్రోషురు వివరిస్తుంది. చాలామంది ఆ బ్రోషురును చదివి, తమ లాయర్లను లేదా పన్ను సలహాదారులను సంప్రదించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనం మతపరంగానూ, మానవతా దృష్టితోనూ చేస్తున్న పనికి మద్దతునివ్వగలిగారు. అదే సమయంలో అధిక మొత్తంలో పన్ను మినహాయింపు పొందగలిగారు.
మరింత సమాచారం కోసం కింద ఇవ్వబడిన నంబరుకు ఫోన్‌చేసి లేదా కింద ఇవ్వబడిన చిరునామాకు ఉత్తరం రాసి యెహోవాసాక్షులను సంప్రదించవచ్చు. లేదా మీ దేశంలోని యెహోవాసాక్షుల కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
[అధస్సూచీలు]
a ఇండియాలోనైతే చెక్కులను “The Watch Tower Bible and Tract Society of India” పేరున రాయాలి.
b ఇది ఇండియాకు వర్తించదు
c గమనిక: పన్ను నిబంధనలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. పన్ను నిబంధనల గురించి, ప్రణాళికల గురించి తెలుసుకోవడానికి మీ అకౌంటెంట్‌ను లేక లాయర్‌ను సంప్రదించండి. తుది నిర్ణయం తీసుకునే ముందు స్థానిక బ్రాంచి కార్యాలయాన్ని కూడా సంప్రదించండి.
d ఇండియాలోనైతే, “The Watch Tower Bible and Tract Society of India” పేరున రాయాలి.
e ఇండియాలో లభించదు
Jehovah’s Witnesses of India,
Post Box 6440,
Yelahanka,
Bangalore 560 064,
Karnataka.
Telephone: (080) 28468072