కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసుతోపాటు మ్రాను మీద వేలాడదీయబడిన వాళ్లు చేసిన నేరం ఏమిటి?

యేసుతోపాటు మ్రాను మీద వేలాడదీయబడిన వాళ్లు చేసిన నేరం ఏమిటి?

మీకిది తెలుసా?

యేసుతోపాటు మ్రాను మీద వేలాడదీయబడిన వాళ్లు చేసిన నేరం ఏమిటి?

బైబిలు ఆ నేరస్తుల గురించి మాట్లాడుతూ “బందిపోటు దొంగలు” అని చెప్తోంది. (మత్తయి 27:38; మార్కు 15:27) వివిధ రకాల నేరస్తుల గురించి చెప్పడానికి లేఖనాలు వివిధ పదాలను ఉపయోగిస్తున్నాయని కొన్ని బైబిలు నిఘంటువులు చెప్తున్నాయి. పట్టుబడకుండా తప్పించుకోవడానికి రహస్యంగా దొంగతనం చేసే దొంగను సూచించేందుకు క్లెప్టీస్‌ అనే గ్రీకు పదాన్ని ఉపయోగిస్తారు. శిష్యుల డబ్బు సంచిలోనుండి రహస్యంగా దొంగతనం చేసిన ఇస్కరియోతు యూదా గురించి చెప్పేటప్పుడు బైబిలు ఆ పదాన్నే ఉపయోగించింది. (యోహాను 12:6) అయితే దౌర్జన్యం చేసి దోచుకునే వాళ్లను సూచించడానికి సాధారణంగా లీస్టీస్‌ అనే పదాన్ని ఉపయోగిస్తారు. విప్లవకారులను, తిరుగుబాటుదారులను, గెరిల్లాలను సూచించడానికి కూడా ఆ పదాన్నే ఉపయోగిస్తారు. యేసుతోపాటు వేలాడదీయబడిన వాళ్లు ఇలాంటి నేరస్తులే. నిజానికి వాళ్లలో ఒకడు, “మనము చేసినవాటికి తగిన ఫలము పొందుచున్నాము” అన్నాడని బైబిలు చెప్తోంది. (లూకా 23:41) కాబట్టి వాళ్లు దొంగతనమే కాక ఇతర నేరాలు కూడా చేశారని తెలుస్తోంది.

బైబిలు ఆ ఇద్దరు దొంగల గురించి చెప్పడానికి ఉపయోగించిన లీస్టీస్‌ అనే పదాన్నే బరబ్బకు కూడా ఉపయోగిస్తోంది. (యోహాను 18:40) బరబ్బ, “పట్టణములో జరిగించిన యొక అల్లరి నిమిత్తమును, నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు” అని లూకా 23:19 చెప్తోంది కాబట్టి అతడు మామూలు దొంగ కాదని స్పష్టమవుతోంది.

దాన్ని బట్టి, యేసుతోపాటు మ్రాను మీద వేలాడదీయబడిన నేరస్తులు దొంగతనం చేయడమేకాక ప్రభుత్వానికి ఎదురు తిరిగివుంటారని, చివరికి హత్యలు కూడా చేసి ఉంటారని తెలుస్తోంది. విషయం ఏదైనప్పటికీ, వాళ్లు చేసిన నేరానికి శిక్షగా రోమా అధిపతియైన పొంతి పిలాతు వాళ్లను మ్రాను మీద వేలాడదీయించాడు. (w12-E 02/01)