కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దయ చూపిస్తే కఠినులైనా మారతారు

దయ చూపిస్తే కఠినులైనా మారతారు

దయ చూపిస్తే కఠినులైనా మారతారు

నె దర్లాండ్స్‌లో జార్జ, మానోన్‌ అనే ఇద్దరు సాక్షులు రాజ్య సువార్త ప్రకటిస్తూ రీయ అనే ఒక వృద్ధురాలిని కలిసినప్పుడు ఆమె వాళ్లతో కాస్త కటువుగా మాట్లాడింది. ఆమె తీవ్రమైన కీళ్లనొప్పులతో బాధపడుతోందనీ ఆమె ఇద్దరు భర్తలు, ఒక కొడుకు చనిపోయారనీ వాళ్లకు తెలిసింది. సంభాషణ మొదలైన కాసేపటికి ఆమె కాస్త శాంతించినా, స్నేహపూరితంగా మాత్రం మాట్లాడలేదు.

అయినా ఆమె ఒంటరిగా, నిరుత్సాహంగా ఉన్నట్టు కనిపించడం వల్ల ఒక పూలబొకే తీసుకొని వెళ్లి ఆమెను మళ్లీ కలుద్దామని మానోన్‌తో జార్జ అన్నాడు. వాళ్లు బొకే తీసుకెళ్లి ఆమెను కలిసినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. కానీ ఆ రోజు ఆమె ఖాళీగా లేకపోవడంతో మరో రోజు కలుసుకునే ఏర్పాటు చేసుకున్నారు. జార్జ, మానోన్‌ ఆమె చెప్పిన సమయానికి ఆమె ఇంటికి వెళ్లారు కానీ ఆమె లేదు. వాళ్లు ఎన్నిసార్లు వెళ్లినా ఆమెను కలవలేకపోయారు. తమను కలవడం ఆమెకు ఇష్టం లేదేమో అని వాళ్లు అనుకున్నారు.

చివరికి ఒకరోజు, జార్జ ఆమెను కలిశాడు. తాను హాస్పిటల్‌ పాలైనందువల్ల చెప్పిన సమయానికి ఇంట్లో ఉండలేకపోయానని వివరించి ఆమె క్షమాపణ కోరింది. ఆమె ఇలా అంది, “మీరు వెళ్లిపోయిన తర్వాత నేనేం చేశానో మీరస్సలు ఊహించలేరు. నేను బైబిలు చదవడం మొదలుపెట్టాను.” దాంతో ఆహ్లాదకరమైన చర్చ జరిగి, బైబిలు అధ్యయనం మొదలైంది.

పరిస్థితుల వల్ల కఠినంగా తయారైన రీయ, బైబిలు అధ్యయనం వల్ల సంతోషంగల, దయగల స్త్రీగా మారింది. ఆమె ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చినా, తనను చూడడానికి వచ్చిన వాళ్లతో తన విశ్వాసాన్ని పంచుకోవడం మొదలుపెట్టింది. ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆమె కూటాలకు క్రమంగా హాజరవ్వలేకపోయేది. అయినా, సహోదర సహోదరీలు తనను సందర్శించడాన్ని ఆమె ఇష్టపడేది. 82వ ఏట అడుగుపెట్టిన రోజే, దేవునికి తాను చేసుకున్న సమర్పణకు సూచనగా ప్రాంతీయ సమావేశంలో ఆమె బాప్తిస్మం తీసుకుంది.

అయితే కొన్ని నెలలకే ఆమె చనిపోయింది. అప్పుడు, ఆమె చనిపోకముందు రాసిన ఒక కవిత దొరికింది. వృద్ధాప్యంలో ఒంటరిగా ఉండడం ఎంత దుర్భరంగా ఉంటుందో, దయ చూపించడం ఎంత ప్రాముఖ్యమైనదో ఆ కవితలో ఆమె వర్ణించింది. దాన్ని చదివిన మానోన్‌, “ఆ కవిత నా హృదయాన్ని స్పృశించింది. ఆమె పట్ల దయ చూపించడానికి యెహోవా మాకు సహాయం చేసినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను” అంది.

యెహోవాను మాదిరిగా తీసుకుంటే అలాంటి ప్రేమ, దయ చూపించాలనే ప్రేరణ మనకు కలుగుతుంది. (ఎఫె. 5:1, 2) “దయ” చూపిస్తూ ‘దేవుని పరిచారకులమని’ మనల్ని మనం ‘మెప్పించుకొనుచుండగా’ పరిచర్యలో చక్కని ఫలితాలు పొందుతాం.—2 కొరిం. 6:6, 8.