కావలికోట—అధ్యయన ప్రతి ఏప్రిల్ 2014

మోషేకు ఉన్నంత విశ్వాసం మనమెలా చూపించవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. మన కుటుంబ బాధ్యతల విషయంలో యెహోవా అభిప్రాయం ఏమిటి? వాటిని నిర్వర్తించడానికి మనకు ఆయనెలా సహాయం చేస్తాడు?

మోషే విశ్వాసాన్ని అనుకరించండి

శరీర కోరికలను తిరస్కరించి, పరిశుద్ధ సేవావకాశాలను అమూల్యంగా ఎంచేలా మోషేను విశ్వాసం ఎలా పురికొల్పింది? మోషే, “ప్రతిఫలముగా కలుగబోవు బహుమానం” మీద ఎందుకు దృష్టి పెట్టాడు?

మీరు “అదృశ్యుడైనవానిని” చూస్తున్నారా?

దేవుని మీద మోషేకున్న విశ్వాసం ఆయనను మనుషుల భయం నుండి ఎలా కాపాడింది? దేవుని వాగ్దానాలు నెరవేరతాయని నమ్మేలా ఎలా సహాయం చేసింది? మీకు సహాయం చేయాలని ఎంతగానో కోరుకునే ఒక నిజమైన వ్యక్తిగా యెహోవాను చూసేలా మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి.

జీవిత కథ

పూర్తికాల సేవ​—⁠నన్ను ఎంతోదూరం తీసుకెళ్లింది

65 ఏళ్ల పూర్తికాల పరిచర్యను తలుచుకుంటూ, రాబర్ట్‌ వాలన్‌ తన జీవితం ఎంతో ఫలవంతగా, అర్థవంతగా ఉందని ఎందుకు చెబుతున్నాడో తెలుసుకోండి.

ఎవ్వరూ, ఇద్దరు యజమానులను సేవించలేరు

కొంతమంది ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి విదేశాలకు వెళ్లారు. ఉద్యోగం కోసం దూరంగా జీవించడం దాంపత్య జీవితంపై, పిల్లలపై, యెహోవాతో మనకున్న సంబంధంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

‘మంచి ధైర్యంతో ఉండండి’​—⁠యెహోవాయే మీకు సహాయం చేస్తాడు!

ఉద్యోగం కోసం తన కుటుంబానికి దూరంగా ఉన్న ఓ తండ్రి తర్వాత తన కుటుంబాన్ని ఎలా బాగుచేసుకున్నాడు? అంతంత మాత్రంగా ఉన్న ఆర్థికస్థితిలో కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆయనకు యెహోవా ఎలా సహాయం చేశాడు?

యెహోవా మనల్ని శ్రద్ధగా ఎందుకు గమనిస్తున్నాడో అర్థంచేసుకున్నారా?

దేవుడు మనపట్ల ప్రేమపూర్వక శ్రద్ధ చూపించే 5 విధానాల గురించి, ఆయన చూపించే వ్యక్తిగత శ్రద్ధ నుండి మనం పొందే ప్రయోజనం గురించి పరిశీలించండి.

మీకిది తెలుసా?

బైబిలు కాలాల్లో, ప్రజలు కావాలనే తమ బట్టలు చింపుకోవడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?