కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబాలు ఆయన నుండి ఏమి నేర్చుకోవచ్చు?

కుటుంబాలు ఆయన నుండి ఏమి నేర్చుకోవచ్చు?

యేసు నుండి మనం నేర్చుకోగల అంశాలు

కుటుంబాలు ఆయన నుండి ఏమి నేర్చుకోవచ్చు?

భార్యాభర్తలకు వివాహబంధం గురించి ఎలాంటి అభిప్రాయముంటే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి?

వివాహబంధం పవిత్రమైనది. ‘విడాకులు తీసుకోవచ్చా’ అని యేసును అడిగినప్పుడు ఆయనిలా అన్నాడు, ‘మొదట్లో సృష్టికర్త పురుషుణ్ణి, స్త్రీని సృష్టించి ఇలా అన్నాడు: “పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి తన భార్యతో ఏకమౌతాడు. వాళ్లిద్దరూ కలసి ఒకే శరీరంగా జీవిస్తారు!” ఇది మీరు చదవలేదా? ఆ కారణంగా వాళ్లనిక మీదట ఇరువురిగా కాకుండా ఒకరిగా పరిగణించాలి! దేవుడు ఏకం చేసినవాళ్లను మానవుడు వేరు చేయరాదు! అవినీతిపరురాలు కాని తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహమాడిన వాడు వ్యభిచారిగా పరిగణించబడతాడు.’ (మత్తయి 19:4-6, 9, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) భార్యాభర్తలు యేసు ఇచ్చిన సలహాను పాటిస్తూ, ఒకరికొకరు నమ్మకంగా ఉంటే, కుటుంబ సభ్యులందరిలో భద్రతాభావం ఉంటుంది, అందరూ సంతోషంగా ఉంటారు.

దేవుని మీద ప్రేముంటే కుటుంబాలు ఎందుకు సంతోషంగా ఉంటాయి?

‘నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇది ముఖ్యమైనది, మొదటిది అయిన ఆజ్ఞ’ అని యేసు చెప్పాడు. ముఖ్యమైన రెండవ ఆజ్ఞ ఏమిటి? దానికి ఆయనే ఇలా చెప్పాడు, ‘నిన్నువలే నీ పొరుగువానిని [మీకు సన్నిహితంగా ఉండేవారిని, అంటే మీ కుటుంబ సభ్యులను] ప్రేమించాలి అనే రెండవ ఆజ్ఞ కూడా దానివంటిదే.’ (మత్తయి 22:37-39) కాబట్టి, కుటుంబం సంతోషంగా ఉండాలంటే, దేవునితో మంచి సంబంధం ఉండాలి. ఎందుకంటే ఆయన మీద ప్రేముంటే ఇతరులను కూడా ప్రేమిస్తాము.

భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే, వాళ్లు ఒకరి కోసం ఒకరు ఏమిచేయాలి?

భర్తలు యేసును ఆదర్శంగా తీసుకుంటే వారి భార్యలు సంతోషంగా ఉంటారు. యేసు తన భార్యలాంటి సంఘాన్ని నిస్వార్థంగా ప్రేమించాడు. (ఎఫెసీయులు 5:25) “మనుష్య కుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు. సేవ చెయ్యటానికి వచ్చాడు” అని యేసు చెప్పాడు. (మత్తయి 20:28, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) యేసు తన శిష్యుల మీద అధికారం చెలాయించలేదు, వారితో కఠినంగా ప్రవర్తించలేదు. ఆయనతో ఉన్నప్పుడు వారెంతో సేదదీర్పు పొందారు. (మత్తయి 11:28) కాబట్టి భర్తలు తమ కుటుంబాన్ని దయగా నడిపించినప్పుడు కుటుంబంలో అందరూ ప్రయోజనం పొందుతారు.

భార్యలు కూడా యేసును ఆదర్శంగా తీసుకుంటే ప్రయోజనం పొందుతారు. బైబిలు ‘క్రీస్తుకు శిరస్సు దేవుడని’ చెబుతోంది. అంతేకాదు ‘స్త్రీకి శిరస్సు పురుషుడు’ అని కూడా చెబుతోంది. (1 కొరింథీయులు 11:3) దేవునికి లోబడివుండడం చిన్నతనమని యేసు ఎప్పుడూ అనుకోలేదు. ఆయనకు తన తండ్రి అంటే ఎంతో గౌరవం. ‘నేను అన్నివేళలా ఆయనకు ఇష్టమైనవే చేస్తాను’ అని యేసు చెప్పాడు. (యోహాను 8:29, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) దేవుని మీద ఉన్న ప్రేమాగౌరవాలతో తన భర్త అధికారానికి లోబడే భార్య తన కుటుంబం సంతోషంగా ఉండడానికి ఎంతో దోహదపడుతుంది.

పిల్లలపై యేసుకున్న అభిప్రాయం నుండి తల్లిదండ్రులు ఏమి నేర్చుకోవచ్చు?

యేసు పిల్లలతో సమయం గడిపాడు, వారి ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకోవడంలో ఆసక్తి చూపించాడు. ‘యేసు చిన్నపిల్లల్ని తన దగ్గరకు పిలుస్తూ, చిన్నపిల్లల్ని నా దగ్గరకు రానివ్వండని అన్నాడు’ అని బైబిలు చెబుతోంది. (లూకా 18:15, 16, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఒక సందర్బంలో యేసు మీద తమకున్న విశ్వాసాన్ని చాటుతున్న చిన్నపిల్లల్ని కొంతమంది తప్పుపట్టారు. కానీ యేసు ఆ పిల్లల్ని మెచ్చుకుంటూ అలా తప్పుపట్టిన వారితో, ‘బాలుర, చంటిపిల్లల నోట స్తోత్రం సిద్ధింపజేశావు అనే మాట మీరెన్నడూ చదవలేదా?’ అన్నాడు.—మత్తయి 21:15, 16.

యేసు నుండి పిల్లలు ఏమి నేర్చుకోవచ్చు?

దేవుని విషయాల్లో ఎలాంటి ఆసక్తి ఉండాలో యేసు పిల్లలకు చూపించాడు. ఆయన పన్నెండేళ్ల వయస్సులో, ‘దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుని, వారి మాటల్ని ఆలకిస్తూ వారిని ప్రశ్నలు అడిగాడు.’ అప్పుడేమి జరిగింది? ‘ఆయన మాటలు విన్నవారంతా ఆయన ప్రజ్ఞకు, ప్రత్యుత్తరాలకు విస్మయమొందారు.’ (లూకా 2:42, 46, 47) అయితే యేసు తనకున్న జ్ఞానాన్నిబట్టి అహంకారిగా తయారవలేదు కానీ తన తల్లిదండ్రులను గౌరవించాడు. ‘ఆయన వారికి లోబడియున్నాడు’ అని బైబిలు ఆయన గురించి చెబుతుంది.—లూకా 2:51. (w09-E 11/01)

మరింత సమాచారం కోసం, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 14వ అధ్యాయాన్ని చూడండి. a

[అధస్సూచి]

a యెహోవాసాక్షులు ప్రచురించారు.