కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

యేసు మరణాన్ని మనమెందుకు జ్ఞాపకం చేసుకోవాలి?

యేసు చేసిన ప్రాణ త్యాగం వల్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది?—యెషయా 25:8; 33:24

చరిత్రలో యేసు మరణం చాలా ముఖ్యమైనది. మనుషులు పోగొట్టుకున్న జీవితాన్ని తిరిగి తీసుకురావడానికి ఆయన చనిపోయాడు. మొదట్లో మనుషుల్లో చెడు స్వభావం లేదు, జబ్బులు లేవు, చావు లేదు. (ఆదికాండము 1:31) అయితే, మొదటి మానవుడైన ఆదాము నుండి మనుషులందరికీ పాపం వచ్చింది. పాపం, మరణం నుండి మనల్ని కాపాడడానికి యేసు తన ప్రాణం ఇచ్చాడు.—మత్తయి 20:28; రోమీయులు 6:23 చదవండి.

మన కోసం చనిపోవడానికి తన కుమారున్ని ఈ భూమ్మీదకు పంపించి దేవుడు చాలా గొప్ప ప్రేమను చూపించాడు. (1 యోహాను 4:9, 10) రొట్టె, ద్రాక్షారసం ఉన్న ఆచారంతో తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని యేసు తన అనుచరులకు చెప్పాడు. మనం ప్రతీ సంవత్సరం ఈ ఆచారాన్ని పాటించి దేవుని పట్ల, యేసు పట్ల కృతజ్ఞతను చూపించవచ్చు.—లూకా 22:19, 20 చదవండి.

రొట్టె, ద్రాక్షారసం ఎవరు తీసుకుంటారు?

తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని యేసు తన శిష్యులకు చెప్పినప్పుడు ఒక నిబంధన లేదా ఒప్పందం గురించి మాట్లాడాడు. (మత్తయి 26:26-28) ఈ ఒప్పందం వల్ల ఆ శిష్యులకు, ఇంకొందరికి యేసుతో పాటు పరలోకంలో రాజులు, యాజకులు అయ్యే అవకాశం దొరికింది. యేసు మరణాన్ని లక్షలమంది జ్ఞాపకం చేసుకుంటారు కానీ, ఎవరైతే ఈ ఒప్పందంలో ఉన్నారో వాళ్లు మాత్రమే రొట్టె, ద్రాక్షారసం తీసుకుంటారు.—ప్రకటన 5:9, 10 చదవండి.

సుమారు 2000 సంవత్సరాల నుండి రాజులయ్యే వాళ్లను యెహోవా ఎన్నుకుంటున్నాడు. (లూకా 12:32) భూమ్మీద నిత్యం జీవించే వాళ్లతో పోలిస్తే రాజులయ్యే వాళ్లు తక్కువమంది మాత్రమే ఉంటారు.—ప్రకటన 7:4, 9, 17 చదవండి. (w15-E 03/01)