కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

6వ పాఠం

జీవం ఎలా వచ్చింది?

జీవం ఎలా వచ్చింది?

దేవుని దగ్గర “జీవపు ఊట ఉంది” అని బైబిలు చెప్తుంది. (కీర్తన 36:9) మీరు ఆ మాట నమ్ముతారా? జీవం అనుకోకుండా దానంతట అదే వచ్చిందని కొంతమంది అంటారు. వాళ్లు చెప్పేదే నిజమైతే మనిషి పుట్టుకకు ఏ కారణం లేనట్టే. కానీ ఒకవేళ దేవుడు మనల్ని సృష్టించి ఉంటే, ఖచ్చితంగా దానికి ఒక మంచి కారణం ఉంటుంది. a జీవం ఎలా వచ్చిందని బైబిలు చెప్తుందో, బైబిలు చెప్పేది ఎందుకు నమ్మవచ్చో గమనించండి.

1. విశ్వం ఎలా వచ్చింది?

బైబిలు ఇలా చెప్తుంది: “మొదట్లో దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు.” (ఆదికాండం 1:1) ఈ విశ్వానికి ఒక ఆరంభం ఉందని చాలామంది సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు. దేవుడు విశ్వాన్ని ఎలా సృష్టించాడు? ఆయన తన ‘చురుకైన శక్తిని,’ అంటే పవిత్రశక్తిని ఉపయోగించి ఈ విశ్వాన్ని, అందులో ఉన్న నక్షత్ర వీధుల్ని, నక్షత్రాల్ని, గ్రహాల్ని ఇలా అన్నిటినీ సృష్టించాడు.—ఆదికాండం 1:2.

2. దేవుడు భూమిని ఎందుకు చేశాడు?

యెహోవా “భూమిని ఊరికే చేయలేదు, అది నివాస స్థలంగా ఉండేలా చేశాడు.” (యెషయా 45:18) ఆయన భూమిని అందమైన ఇల్లులా చేశాడు, మనుషులు ఎప్పటికీ జీవించడానికి కావల్సినవన్నీ అందులో పెట్టాడు. (యెషయా 40:28; 42:5 చదవండి.) ఈ విశ్వంలో భూమి లాంటి గ్రహం ఇంకొకటి లేదని, మనుషులు జీవించడానికి కావల్సినవి భూమ్మీద మాత్రమే ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు.

3. మనుషులకు, జంతువులకు తేడా ఏంటి?

యెహోవా భూమిని చేశాక మొక్కల్ని, జంతువుల్ని సృష్టించాడు. తర్వాత, ఆయన “మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు.” (ఆదికాండం 1:27 చదవండి.) మనుషులకు, జంతువులకు తేడా అదే. దేవుడు మనల్ని తనలా సృష్టించాడు కాబట్టి మనం ఆయనకున్న ప్రేమ, న్యాయం వంటి లక్షణాల్ని చూపించగలం. అంతేకాదు మనం వేర్వేరు భాషలు నేర్చుకోగలం, సృష్టిలోని అందాలు చూసి సంతోషించగలం, సంగీతం విని ఆనందించగలం. అన్నిటికన్నా ముఖ్యంగా, మనం సృష్టికర్తను ఆరాధించగలం. ఇవేవీ జంతువులు చేయలేవు.

ఎక్కువ తెలుసుకోండి

జీవం ఎలా వచ్చిందో, సృష్టి గురించి బైబిలు చెప్పే విషయాలు ఎందుకు సరైనవో కొన్ని రుజువులు పరిశీలించండి. మనుషుల్లో ఉన్న లక్షణాలు దేవుని గురించి ఏం నేర్పిస్తున్నాయో తెలుసుకోండి.

4. జీవం దానంతట అదే రాలేదు

సృష్టిలో ఉన్న వాటిని చూసి వస్తువుల్ని తయారు చేసినందుకు మనుషుల్ని మెచ్చుకుంటాం. మరి సృష్టిని చేసినందుకు ఎవర్ని మెచ్చుకోవాలి? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • సృష్టిని చూసి మనుషులు ఏమేం తయారు చేశారు?

ప్రతీ ఇంటిని ఎవరో ఒకరు కడతారు, మరి సృష్టిలో ఉన్న వాటిని ఎవరు తయారు చేశారు? హెబ్రీయులు 3:4 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • సృష్టిలో మీకు బాగా నచ్చింది ఏంటి?

  • ఈ విశ్వాన్ని, అందులో ఉన్న వాటన్నిటినీ ఎవరో ఒకరు తయారు చేశారని మీరు నమ్ముతున్నారా? ఎందుకు?

మీకు తెలుసా?

ఈ అంశానికి సంబంధించిన ఆర్టికల్స్‌, వీడియోలు jw.orgలోని “సృష్టిలో అద్భుతాలు” అలాగే “జీవారంభం గురించి అభిప్రాయాలు” అనే సెక్షన్ల కింద ఉన్నాయి.

“నిజమే, ప్రతీ ఇంటిని ఎవరో ఒకరు కడతారు; అయితే అన్నిటినీ కట్టింది దేవుడే”

5. సృష్టి గురించి బైబిలు చెప్పే విషయాల్ని మనం నమ్మవచ్చు

ఆదికాండం 1వ అధ్యాయంలో భూమి, అందులో ఉన్న జీవులు ఎలా వచ్చాయో బైబిలు వివరిస్తుంది. బైబిలు చెప్పేది నిజమా లేక కట్టుకథా? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • భూమి, అందులోని జీవులు ఆరు రోజుల్లో సృష్టించబడ్డాయి అని బైబిలు చెప్తుంది. అవి 24 గంటలు గల రోజులా?

  • సృష్టి గురించి బైబిలు చెప్తున్న విషయాల్ని నమ్మవచ్చని మీకు అనిపిస్తుందా? ఎందుకు?

ఆదికాండం 1:1 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • విశ్వానికి ఒక ఆరంభం లేదా మొదలు ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. ఆ విషయం, ఇప్పుడు మీరు బైబిల్లో చదివినదానితో ఎలా సరిపోతుంది?

దేవుడు పరిణామాన్ని ఉపయోగించి జీవుల్ని చేశాడని కొంతమంది అనుకుంటారు. అంటే, దేవుడు ఒక మామూలు జీవ కణాన్ని చేస్తే, దాన్నుండి రకరకాల జీవులు పుట్టుకొచ్చాయని వాళ్లు నమ్ముతారు. ఆదికాండం 1:21, 25, 27 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • దేవుడు పరిణామాన్ని ఉపయోగించి చేపల్ని, జంతువుల్ని, మనుషుల్ని చేశాడని బైబిలు చెప్తుందా? లేక ఆయన జీవుల్ని వాటివాటి “జాతుల” ప్రకారం సృష్టించాడు అని చెప్తుందా?

6. దేవుడు చేసిన సృష్టిలో మనుషులు ప్రత్యేకమైన వాళ్లు

మనుషులు జంతువుల కన్నా చాలా ప్రత్యేకమైన వాళ్లు. ఆదికాండం 1:26 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • ఈ వచనం చెప్తున్నట్టు దేవుడు మనల్ని తన స్వరూపంలో చేశాడు. కాబట్టి మనలో ప్రేమ, కనికరం వంటి లక్షణాలు ఉన్నాయంటే, దేవునిలో కూడా ఏం ఉన్నట్టు?

కొంతమంది ఇలా అంటారు: “సృష్టి గురించి బైబిలు చెప్పేది ఒక కట్టుకథ.”

  • మీరేమంటారు? ఎందుకు?

ఒక్కమాటలో

యెహోవా ఈ విశ్వాన్ని, జీవులన్నిటినీ సృష్టించాడు.

మీరేం నేర్చుకున్నారు?

  • ఈ విశ్వం ఎలా వచ్చిందని బైబిలు చెప్తుంది?

  • దేవుడు ఒక మామూలు జీవ కణాన్ని చేస్తే, దాన్నుండి అన్ని జాతుల జీవులు పరిణామం చెందాయా? లేక ఆయనే వాటన్నిటినీ సృష్టించాడా?

  • మనుషులు ఎందుకు ప్రత్యేకమైన వాళ్లు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

సృష్టికర్త ఉన్నాడని ప్రకృతి ఎలా చూపిస్తుందో కొన్ని ఉదాహరణలు గమనించండి.

“ప్రకృతి ఏమి బోధిస్తోంది?” (తేజరిల్లు! అక్టోబరు-డిసెంబరు 2006)

సృష్టి గురించి బైబిలు చెప్పే విషయాల్ని తల్లిదండ్రులు పిల్లలకు ఎలా వివరించవచ్చో చూడండి.

యెహోవా అన్నిటిని తయారు చేశాడు (2:37)

పరిణామానికి, బైబిలు చెప్పేవాటికి మధ్య ఉన్న తేడాను తెలుసుకోండి.

“దేవుడు రకరకాల జీవుల్ని, మొక్కల్ని సృష్టించడానికి పరిణామాన్ని ఉపయోగించాడా?” (jw.org ఆర్టికల్‌)

a దేవుడు మనుషుల్ని ఎందుకు సృష్టించాడో 25వ పాఠంలో తెలుసుకుంటాం.