29వ అధ్యాయం
మనం ఎలాంటి పార్టీలకు వెళ్లినా దేవునికి నచ్చుతుందా?
పార్టీలు చేసుకోవడం మీకు ఇష్టమేనా?— అవి చాలా సరదాగా ఉంటాయి. మనం పార్టీలకు వెళ్లడం మన గొప్ప బోధకునికి ఇష్టమేనా?— ఆయనే ఒక పెళ్లి విందుకు వెళ్లాడు. అది పార్టీలాంటిదే. అప్పుడు ఆయనతోపాటు కొంతమంది శిష్యులు కూడా ఉన్నారు. యెహోవా సంతోషంగా ఉండే దేవుడు, అందుకే మనం మంచి పార్టీలు చేసుకుని, సంతోషంగా ఉండడం ఆయనకు ఇష్టమే.—యోహాను 2:1-11.
ఇశ్రాయేలీయులు దాటి వెళ్లడానికి వీలుగా యెహోవా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడని 29వ పేజీలో ఉంది. మీకు అది చదివినట్లు గుర్తుందా?— ఆ తర్వాత ఇశ్రాయేలీయులు యెహోవాకు కృతజ్ఞతలు చెప్తూ పాటలు పాడి, నాట్యం చేశారు. అది ఒక పార్టీలాంటిదే. వాళ్లు అప్పుడు ఎంతో సంతోషించారు, దేవుడు కూడా సంతోషించాడని ఖచ్చితంగా చెప్పవచ్చు.—నిర్గమకాండము 15:1, 20, 21.
దాదాపు 40 సంవత్సరాల తర్వాత, ఇశ్రాయేలీయులు మరో పెద్ద పార్టీకి వెళ్లారు. ఈ పార్టీకి వాళ్లను పిలిచినవాళ్లు యెహోవాను ఆరాధించే ప్రజలు కాదు. వాళ్లు వేరే దేవుళ్లను ఆరాధించేవాళ్లు. అంతేకాకుండా, వాళ్లలో భార్యాభర్తలు కానివాళ్లు లైంగిక సంబంధాలు పెట్టుకునేవాళ్లు. అలాంటి పార్టీకి వెళ్లవచ్చా?— యెహోవా దేవునికి మాత్రం అది నచ్చలేదు, సంఖ్యాకాండము 25:1-9; 1 కొరింథీయులు 10:8.
అందుకే ఆయన ఇశ్రాయేలీయులను శిక్షించాడు.—బైబిలు రెండు పుట్టినరోజు పార్టీల గురించి కూడా చెప్తోంది. వాటిలో ఒకటి మన గొప్ప బోధకుని పుట్టినరోజు పార్టీనా?— కాదు. ఈ రెండు పుట్టినరోజు పార్టీలు యెహోవాను సేవించనివాళ్లే జరుపుకున్నారు. వాటిలో ఒకటి రాజైన హేరోదు అంతిప పుట్టినరోజు పార్టీ. అతను యేసు జీవించిన రోజుల్లో గలిలయ ప్రాంతాన్ని పరిపాలించేవాడు.
హేరోదు రాజు ఎన్నో చెడ్డ పనులు చేశాడు. అతను తన సహోదరుని భార్యను పెళ్లిచేసుకున్నాడు. ఆమె పేరు హేరోదియ. అలా చేయడం తప్పని దేవుని సేవకుడైన బాప్తిస్మమిచ్చే యోహాను హేరోదుకు చెప్పాడు. హేరోదుకు అది నచ్చలేదు. అందుకే, ఆయన యోహానును చెరసాలలో వేయించాడు.—లూకా 3:19, 20.
యోహాను చెరసాలలో ఉన్నప్పుడు హేరోదు పుట్టినరోజు వచ్చింది. అప్పుడు హేరోదు ఒక పెద్ద పార్టీ ఇచ్చాడు. అతను చాలామంది ముఖ్యమైన వాళ్లను ఆ పార్టీకి పిలిచాడు. వాళ్లంతా తిని, తాగి చాలా సంతోషిస్తున్నప్పుడు, హేరోదియ కూతురు వచ్చి వాళ్లను ఆనందపెట్టడానికి నాట్యం చేసింది. ఆ అమ్మాయి నాట్యం చూసి అందరూ ఎంతో ఆనందించారు, దాంతో హేరోదు రాజు ఆమెకు
ఏదైనా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకున్నాడు. అతను ఆమెతో, ‘నువ్వు నా రాజ్యంలో సగం వరకు ఏది అడిగినా నీకు ఇస్తాను’ అన్నాడు.ఆమె ఏమి అడిగింది? డబ్బులా? చక్కని బట్టలా? ఒక భవనమా? ఏమి అడగాలో ఆమెకు తెలీలేదు. అందుకే, ఆమె వాళ్లమ్మ దగ్గరకు వెళ్లి ఏమి అడగాలో చెప్పమంది.
హేరోదియ బాప్తిస్మమిచ్చే యోహానును ఎంతో ద్వేషించేది. అందుకే యోహాను తలను అడగమని హేరోదియ తన కూతురుకు చెప్పింది. ఆ అమ్మాయి తిరిగి రాజు దగ్గరకు వెళ్లి, ‘బాప్తిస్మమిచ్చే యోహాను తల ఒక పళ్లెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించాలని కోరుతున్నాను’ అని అడిగింది.
కానీ హేరోదు రాజుకు యోహానును చంపడం ఇష్టంలేదు. ఎందుకంటే, యోహాను మంచివాడని అతనికి తెలుసు. కానీ, హేరోదు అప్పటికే మాటిచ్చాడు, ఒకవేళ తను మాట మారుస్తే పార్టీకి వచ్చినవాళ్లు ఏమనుకుంటారోనని భయపడ్డాడు. అందుకే, చెరసాలలో ఉన్న యోహాను తల నరికి తీసుకురావడానికి ఒక సేవకుణ్ణి పంపించాడు. ఆ సేవకుడు వెంటనే యోహాను తలను ఒక పళ్లెంలో పెట్టి తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు. అప్పుడు ఆ అమ్మాయి దాన్ని వాళ్ల అమ్మకు ఇచ్చింది.—మార్కు 6:17-29.
బైబిల్లో రాయబడివున్న మరో పుట్టినరోజు పార్టీలో కూడా అలాంటి ఘోరమే ఆదికాండము 40:19-22) ఈ రెండు పార్టీలను దేవుడు ఇష్టపడ్డాడని అనుకుంటున్నారా?— మీరు ఆ పార్టీలకు వెళ్లడానికి ఇష్టపడివుండేవాళ్లా?—
జరిగింది. అది ఐగుప్తు రాజు పుట్టినరోజు పార్టీ. ఆ పార్టీలో కూడా రాజు ఒకరి తలను నరికించాడు. ఆ తర్వాత, అతని శవాన్ని పక్షులు పీక్కు తినేలా వేలాడదీయించాడు. (దేవుడు, కారణం లేకుండా బైబిల్లో ఏదీ రాయించలేదని మనకు తెలుసు. అందులో రెండు పుట్టినరోజు పార్టీల గురించి మాత్రమే ఉంది. ఆ రెండు పార్టీల్లో చెడ్డ పనులే జరిగాయి. కాబట్టి, దేవుడు పుట్టినరోజు పార్టీల గురించి ఏమి చెప్తున్నాడని మీకు అనిపిస్తుంది? మనం పుట్టినరోజు పార్టీలు జరుపుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడా?—
ఈ రోజుల్లో జరుగుతున్న అలాంటి పార్టీల్లో ప్రజలు ఎవరి తలా నరికించరని మనకు తెలుసు. కానీ, అసలు పుట్టినరోజు జరుపుకోవడం మొదలుపెట్టిందే నిజమైన దేవుణ్ణి ఆరాధించని ప్రజలు. ద క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా, బైబిల్లోవున్న పుట్టినరోజు పార్టీల గురించి చెప్తూ “కేవలం పాపులే . . . తాము పుట్టిన రోజును ఘనంగా జరుపుకునేవాళ్లు” అని వివరిస్తోంది. మనం వాళ్లలా ఉండాలనుకుంటామా?—
మన గొప్ప బోధకుని విషయమేమిటి? ఆయన తన పుట్టినరోజు జరుపుకున్నాడా?— లేదు, యేసు పుట్టినరోజు పార్టీ జరిగినట్లు బైబిల్లో ఎక్కడా లేదు. మొదటి శతాబ్దంలోని యేసు శిష్యులు కూడా ఆయన పుట్టినరోజు చేయలేదు. కానీ, ఆ తర్వాత్తర్వాత ప్రజలు యేసు పుట్టినరోజును డిసెంబరు 25న చేయడం ఎలా మొదలైందో మీకు తెలుసా?—
ఆ రోజును ఎందుకు ఎంచుకున్నారో వివరిస్తూ ద వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా, “అప్పటికే రోమ్ ప్రజలు ఆ రోజున, సూర్యుని పుట్టినరోజు వేడుకగా, సాటర్న్ పండుగను జరుపుకునేవాళ్లు” అని వివరిస్తోంది. కాబట్టి, అప్పటికే అన్యులు పండుగ చేసుకుంటున్న రోజున యేసు పుట్టినరోజు చేయాలని ప్రజలు ఎంచుకున్నారు!
యేసు డిసెంబరులో పుట్టి ఉండకపోవచ్చని ఎందుకు చెప్పగలమో తెలుసా?— ఎందుకంటే, యేసు పుట్టిన రాత్రి గొర్రెల కాపరులు ఇంకా పొలాల్లోనే ఉన్నారని బైబిలు చెప్తోంది. (లూకా 2:8-12) బాగా వర్షాలుపడుతూ, చాలా చల్లగావుండే డిసెంబరు నెలలో వాళ్లు అలా బయట ఉండేవాళ్లు కాదు.
ప్రజలు క్రిస్మస్ జరుపుకుంటున్న రోజున యేసు పుట్టలేదని చాలామందికి తెలుసు. ఒకప్పుడు అన్యులు ఆ రోజున దేవునికి ఇష్టంలేని పండుగ జరుపుకునేవాళ్లని కూడా వాళ్లకు తెలుసు. అయినా చాలామంది క్రిస్మస్ జరుపుకుంటారు. వాళ్లకు దేవుడు దాని గురించి ఏమి అనుకుంటున్నాడో తెలుసుకోవడం కన్నా ఒక పార్టీ జరుపుకోవడమే ముఖ్యం. కానీ మనం యెహోవాను సంతోషపెట్టాలనుకుంటాం, అవునా?—
కాబట్టి మనం యెహోవాకు నచ్చేలాంటి పార్టీలే జరుపుకోవాలి. మనం సంవత్సరంలో ఎప్పుడైనా పార్టీలు చేసుకోవచ్చు. ఒక ప్రత్యేకమైన రోజు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కావాలనుకున్నప్పుడు ఏవైనా ప్రత్యేకమైన వంటలు చేసుకుని, సరదా ఆటలు ఆడుకోవచ్చు. మీకు అలా చేయడం ఇష్టమేనా?— మీరు మీ అమ్మానాన్నలతో మాట్లాడి, వాళ్ల సహాయంతో ఒక పార్టీ చేసుకోవచ్చు. అలా చేస్తే చాలా బావుంటుంది, అవునా?— కానీ పార్టీ చేసుకోవడానికి ఆలోచించే ముందు అది దేవునికి నచ్చేలా ఉండాలని గుర్తుంచుకోవాలి.
ఎప్పుడూ దేవునికి నచ్చేవే చేయడం ఎందుకు ప్రాముఖ్యమో, సామెతలు 12:2; యోహాను 8:29; రోమీయులు 12:2; 1 యోహాను 3:22 వచనాల్లో కూడా ఉంది.