32వ అధ్యాయం
యేసును యెహోవా ఎలా కాపాడాడు?
యెహోవా కొన్నిసార్లు చిన్నపిల్లల్ని, తమను తాము కాపాడుకోలేని వాళ్లను ఆశ్చర్యం అనిపించే విధంగా కాపాడతాడు. మీరు ఏదైనా ఒక పల్లెటూరులో నడుచుకుంటూ వెళ్తుంటే, యెహోవా చేసిన అలాంటి ఒక ఏర్పాటును చూడవచ్చు. మొదట్లో అసలు ఏమి జరుగుతోందో మీకు అర్థం కాకపోవచ్చు.
ఒక పక్షి వచ్చి మీకు దగ్గర్లో నేల మీద వాలుతుంది. అది దెబ్బతగిలినట్లు కనిపిస్తుంది. అది ఒకవైపు రెక్క ఈడ్చుకుంటూ నడుస్తుంది, మీరు దగ్గరకు వెళ్లే కొద్దీ ముందుకు ముందుకు వెళ్తుంది. మీరు దాని వెనక వెళ్తున్నప్పుడు అది మీకు అందకుండా ముందుకు నడుస్తుంటుంది. అప్పుడు ఒక్కసారిగా అది తుర్రుమని ఎగిరిపోతుంది. దాని రెక్కకు ఏమీ కాలేదు! మరి ఆ పక్షి ఎందుకలా చేస్తుందో మీకు తెలుసా?—
ఎందుకంటే మీ ముందు అది వచ్చిన వాలిన చోటుకు దగ్గర్లోని పొదల్లో అది దాని పిల్లల్ని దాచిపెట్టింది. మీరు ఆ పిల్లలను చూసి వాటిని ఏమైనా చేస్తారేమోనని తల్లి పక్షి భయపడింది. అందుకే అది తనకు దెబ్బ తగిలినట్లు నటిస్తూ మిమ్మల్ని అక్కడ నుండి దూరంగా తీసుకెళ్లింది. తల్లి పక్షి తన పిల్లల్ని కాపాడినట్లు మనల్ని ఎవరు కాపాడగలరో తెలుసా?— యెహోవా దేవుడు తన ద్వితీయోపదేశకాండము 32:11, 12.
పిల్లలకు సహాయం చేసే పక్షిరాజులాంటివాడని బైబిల్లో ఉంది.—యెహోవాకు అందరికన్నా అపురూపమైన కుమారుడు, ఆయన ప్రియ కుమారుడైన యేసు. యేసు పరలోకంలో ఉన్నప్పుడు తన తండ్రిలాగే శక్తిమంతమైన ఆత్మప్రాణి. అప్పుడు ఆయన తనను తాను కాపాడుకోగలిగేవాడు. కానీ ఆయన భూమ్మీద చిన్నబాబులా పుట్టినప్పుడు, తనను తాను రక్షించుకునే స్థితిలో లేడు. ఆయనను వేరేవాళ్లు కాపాడాల్సిన స్థితిలో ఉన్నాడు.
యేసు భూమ్మీద దేవుని చిత్తం చేయాలంటే, పెరిగి పెద్దవాడై, పరిపూర్ణ మనిషి అవ్వాలి. కానీ అవన్నీ జరగడానికి ముందే యేసును చంపేయడానికి సాతాను ప్రయత్నించాడు. యేసును చంపడానికి జరిగిన ప్రయత్నాల గురించి, అప్పుడు ఆయనను కాపాడడానికి యెహోవా చేసిన ఏర్పాట్ల గురించి తెలిపే కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీకు ఆ కథ చెప్పనా?—
యేసు పుట్టిన కొంతకాలానికి సాతాను తూర్పున ఆకాశంలో నక్షత్రంలాంటిది మెరుస్తూ కనబడేలా చేశాడు. జ్ఞానులు లేదా జ్యోతిష్కులు అంటే నక్షత్రాలను పరిశీలించేవాళ్లు, ఎన్నో వందల కిలోమీటర్ల దూరంలో ఆ నక్షత్రాన్ని చూసి దాని వెంటే వెళ్తూ యెరూషలేముకు చేరుకున్నారు. అక్కడ వాళ్లు, యూదులకు రాజు కాబోయేవాడు మత్తయి 2:1-6.
ఎక్కడ పుడతాడని అడిగి తెలుసుకున్నారు. దాని గురించి బైబిలు ఏంచెప్తుందో తెలిసినవాళ్లు, “బేత్లెహేములో” అని చెప్పారు.—తర్వాత అక్కడున్న హేరోదు అనే చెడ్డ రాజు, దగ్గర్లోని బేత్లెహేము పట్టణంలో ఆ మధ్యే పుట్టిన ఈ కొత్త రాజు గురించి విన్నాడు. అప్పుడు అతను జ్ఞానులతో, ‘ఆ బిడ్డ గురించి జాగ్రత్తగా వెదికి, తెలుసుకుని తిరిగి వచ్చి నాకు చెప్పండి’ అన్నాడు. యేసు ఎక్కడ ఉన్నది హేరోదు ఎందుకు తెలుసుకోవాలనుకున్నాడో తెలుసా?— ఎందుకంటే యేసు గురించి విన్న హేరోదు అసూయపడి, ఆయనను చంపాలనుకున్నాడు!
దేవుడు తన కుమారుణ్ణి ఎలా కాపాడాడు?— యేసు ఎక్కడున్నాడో తెలుసుకున్న జ్ఞానులు ఆయనకు బహుమతులు ఇచ్చారు. వాళ్లు తిరిగి హేరోదు దగ్గరకు వెళ్లకూడదని దేవుడు వాళ్లను ఆ తర్వాత కలలో హెచ్చరించాడు. కాబట్టి వాళ్లు యెరూషలేముకు తిరిగి రాకుండా వేరే దారిలో ఇంటికి వెళ్లిపోయారు. జ్ఞానులు వెళ్లిపోయారని తెలుసుకున్నప్పుడు హేరోదుకు చాలా కోపం వచ్చింది. హేరోదు యేసును చంపాలని, బేత్లెహేములోవున్న రెండు సంవత్సరాలలోపు మగపిల్లలందరినీ చంపించేశాడు! కానీ అప్పటికే యేసు అక్కడ లేడు.
యేసు ఎలా తప్పించుకున్నాడో తెలుసా?— జ్ఞానులు బేత్లెహేము నుండి తమ ఇళ్లకు బయలుదేరిన తర్వాత, దేవుడు మరియ భర్తయిన యోసేపుకు, వెంటనే బయలుదేరి దూరంలోవున్న ఐగుప్తుకు పారిపొమ్మని చెప్పాడు. అక్కడ యేసు చెడ్డవాడైన హేరోదుకు దూరంగా సురక్షితంగా ఉన్నాడు. కొన్ని సంవత్సరాలకు మరియ, యోసేపు యేసును తీసుకొని ఐగుప్తు నుండి తిరిగి వచ్చారు. అప్పుడు దేవుడు యోసేపుకు మరో హెచ్చరిక ఇచ్చాడు. నజరేతుకు వెళ్లమని దేవుడు యోసేపుకు కలలో చెప్పాడు, అక్కడ యేసు క్షేమంగా ఉంటాడు.—మత్తయి 2:7-23.
యెహోవా తన కుమారుణ్ణి ఎలా కాపాడాడో చూశారా?— తల్లి పక్షి పొదల్లో దాచిన పక్షి పిల్లలా ఎవరున్నారు? యేసు చిన్నప్పుడు ఉన్న స్థితిలో ఇప్పుడు ఎవరున్నారు? మీరు అలాగే ఉన్నారు కదా?— మీకు చెడు చేయాలని అనుకునేవాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు ఎవరో మీకు తెలుసా?—
సాతాను గర్జిస్తున్న సింహంలా మనల్ని తినేయాలని చూస్తున్నట్లు బైబిలు చెప్తోంది. సింహాలు సాధారణంగా చిన్న జంతువుల్ని పట్టుకోవడానికి చూస్తాయి. అలాగే సాతాను, అతని దయ్యాలు కూడా సాధారణంగా చిన్నపిల్లల్ని ప్రమాదంలో పడేయాలని చూస్తారు. (1 పేతురు 5:8) కానీ యెహోవా సాతానుకన్నా శక్తిమంతుడు. యెహోవా తన పిల్లల్ని కాపాడగలడు, సాతాను వల్ల కలిగిన గాయాలన్నిటినీ పూర్తిగా తీసేయగలడు.
సాతాను, అతని దయ్యాలు మనతో ఏమి చేయించాలని చూస్తున్నారో 10వ అధ్యాయంలో తెలుసుకున్నాం, గుర్తుందా?— అవును, దేవుడు తప్పని చెప్తున్నలాంటి లైంగిక సంబంధాలు మనం పెట్టుకునేలా చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ లైంగిక సంబంధం ఎవరి మధ్య మాత్రమే ఉండాలి?— సరిగ్గా చెప్పారు, పెళ్లి చేసుకున్న స్త్రీకి పురుషునికి మధ్య మాత్రమే అలాంటి సంబంధం ఉండాలి.
కానీ, ఘోరమైన విషయమేమిటంటే, కొంతమంది పెద్దవాళ్లు పిల్లలతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడతారు. వాళ్లలా చేసినప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఆ చెడ్డ పనులు చేయడం నేర్చుకుంటారు. ఈ పిల్లలు తమ జననాంగాలను వాడకూడని విధంగా వాడడం మొదలుపెడతారు. చాలాకాలం క్రితం సొదొమ అనే పట్టణంలో అదే జరిగింది. అక్కడి ప్రజల్లోని ‘బాలురు వృద్ధులు’ లోతు ఇంటికి వచ్చినవాళ్లతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించారని బైబిలు చెప్తోంది.—ఆదికాండము 19:4, 5.
కాబట్టి యేసుకు రక్షణ అవసరమైనట్లే, మీతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నించే పెద్దవాళ్ల నుండి, ఇంకా వేరే పిల్లల నుండి మీకు కూడా రక్షణ అవసరం. సాధారణంగా అలాంటి వాళ్లు మీ స్నేహితులమన్నట్లు నటిస్తారు. వాళ్లు మీతో చేయాలనుకుంటున్న దానిగురించి ఎవరితో చెప్పకుండా ఉంటానంటే ఏదైనా ఇస్తామని ఆశ కూడా చూపించవచ్చు. కానీ వాళ్లు సాతాను, అతని దయ్యాల్లా స్వార్థపరులు, వాళ్లకు తమ ఆనందమే ముఖ్యం. వాళ్లు పిల్లలతో లైంగిక సంబంధం పెట్టుకుని ఆ ఆనందం పొందాలని ప్రయత్నిస్తుంటారు. అది చాలా తప్పు!
వాళ్లు తమ ఆనందం కోసం ఎలాంటి పనులు చేయడానికి ప్రయత్నించవచ్చో
తెలుసా?— వాళ్లు మీ జననాంగాలను నిమరడానికి ప్రయత్నించవచ్చు. లేదా వాళ్లు తమ జననాంగాలను, మీ జననాంగాలపై రుద్దుతారు. కానీ ఎప్పుడూ, ఎవర్నీ మీ జననాంగాలతో ఆడుకోనివ్వకండి. చివరకు, మీ సొంత అన్న, అక్క, అమ్మ, నాన్న కూడా అలా చేయడానికి ఒప్పుకోకండి.అలాంటి చెడ్డ పనులు చేసేవాళ్ల నుండి మీరు మీ శరీరాన్ని ఎలా కాపాడుకోవచ్చు?— మొదటిగా, మీ జననాంగాలతో ఎవ్వరినీ ఆడుకోనివ్వకండి. ఎవరైనా అలా చేయాలని ప్రయత్నిస్తుంటే, “ముట్టుకోవద్దు! అలా చేశావంటే నీ మీద చెప్తా!” అని ధైర్యంగా, గట్టిగా అరవాలి. ఒకవేళ వాళ్లు, తప్పంతా మీదే అంటే, అస్సలు నమ్మకండి. అది అబద్ధం. అలా చేసింది ఎవరైనా సరే, వెంటనే వాళ్ల గురించి చెప్పండి! మీ ఇద్దరూ చేస్తున్న పని మీ మధ్యే ఉండాల్సిన రహస్యమని వాళ్లు చెప్పినా సరే, మీరు మాత్రం వాళ్ల గురించి చెప్పండి. వాళ్లు మీకు మంచి బహుమతులు ఇస్తామని చెప్పినా సరే లేదా మిమ్మల్ని భయపెట్టాలని చూసినా సరే మీరు మాత్రం వాళ్ల దగ్గర నుండి తప్పించుకుని, వాళ్ల గురించి చెప్పండి.
మీరు భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది దగ్గరకు లేదా కొన్నిచోట్లకు వెళ్లడం ప్రమాదమని మీ అమ్మానాన్నలు చెప్తే, వాళ్ల మాట వినండి. వాళ్లు చెప్పింది వింటే, చెడ్డ పనులు చేసే వాళ్ల బారిన పడకుండా తప్పించుకోగలుగుతారు.
లైంగిక సంబంధమైన చెడ్డ పనుల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకోవడానికి, ఆదికాండము 39:7-12; సామెతలు 4:14-16; 14:15, 16; 1 కొరింథీయులు 6:18; 2 పేతురు 2:14 వచనాలు చదవండి.